సౌదీ రాజుగా బిన్‌ సల్మాన్‌కు పట్టాభిషేకం‌!? | Saudi Arabia's King Salman to hand over crown to his son | Sakshi
Sakshi News home page

సౌదీ రాజుగా బిన్‌ సల్మాన్‌కు పట్టాభిషేకం‌!?

Published Fri, Nov 17 2017 4:12 PM | Last Updated on Fri, Nov 17 2017 4:12 PM

Saudi Arabia's King Salman to hand over crown to his son - Sakshi

రియద్‌ : వచ్చేవారంలో సౌదీ రాజుగా మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ను పట్టాభిషేకం జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సౌదీ రాజుగా వ్యవహరిస్తున్న కింగ్‌ సల్మాన్‌ పదవి నుంచి దిగిపోయి కుమారుడు, ప్రస్తుత యువరాజుగా వ్యవహరిస్తున్న మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు పట్టంకడుతున్నట్లు బ్రిటన్‌ న్యూస్‌ ఏజెన్సీలు ప్రకటించాయి.

బ్రిటన్‌ న్యూస్‌ ఏజెన్సీల ప్రకారం.. వచ్చేవారంలో 81 ఏళ్ల కింగ్‌ సల్మాన్‌.. పదవి నుంచి దిగిపోయి కుమారుడికి సింహాసనాన్ని అప్పగించనున్నారు. అయితే సింహాసనాన్ని కుమారుడికి వదులుకున్నా.. ‘మసీదుల సంరక్షకుడు’ అనే హోదాతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాలో రాజు మరణించాకే యువరాజుకు పట్టం కట్టే సంప్రదాయాన్ని కింగ్‌ సల్మాన్‌ పక్కనపెట్టారు.

సౌదీ అరేబియాలో అధికారమార్పు గురించి కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌదీలో సుమారు 40 మంది రాజకుటుంబ సభ్యుల మూకుమ్మడి అరెస్ట్‌లు జరిగాయనే వాదన వినిపిస్తోంది. మమమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అధికారంలోకి వస్తే మధ్యప్రాచ్యంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారిపోయే అవకాశముందని నిపుణుల అంచనా వేస్తున్నారు. మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌.. ఇరాన్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయిల్‌తో కలిసి పనిచేసే అవకాశముందని తెలుస్తోంది. కాబోయో సౌదీ అరేబియా రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభినందనలు తెలపడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement