సౌదీ యువరాజు అరెస్ట్‌ | Saudi prince arrested after videos appear to show abuse | Sakshi
Sakshi News home page

సౌదీ యువరాజు అరెస్ట్‌

Published Thu, Jul 20 2017 5:50 PM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM

సౌదీ యువరాజు అరెస్ట్‌ - Sakshi

సౌదీ యువరాజు అరెస్ట్‌

దుబాయి: యూట్యూబ్‌లో వైరల్‌ అయిన వీడియో సౌదీ యువరాజు అరెస్ట్‌కు దారి తీసింది. యువరాజు  ఓ వ్యక్తిపై వేధింపులకు పాల్పడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో సౌదీ రాజు సల్మాన్‌ ఆదేశాల మేరకు యువరాజును అరెస్ట్‌ చేసినట్లు ప్రభుత్వ టీవీ పేర్కొంది. అధికారులు వెంటనే ఆ యువరాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఈ వివాదానికి కారణమైన వీడియోలో.. యువరాజు ఓ వ్యక్తి కణత వద్ద తుపాకీ ఉంచి బెదిరిస్తున్నట్లు ఉంది. అంతేకాదు, తలకు తీవ్రగాయాలై రక్తమోడుతుండగా ఆ వ్యక్తి యువరాజును వేడుకుంటున్నట్లుగా ఉంది. ఆపక్కనే ఉన్న టేబుల్‌పై 18 విదేశీ మద్యం బాటిళ్లతోపాటు, పెద్ద మొత్తంలో కరెన్సీ ఉంది. ఈ వీడియో హల్‌చల్‌ చేయటంతో రాజు స్పందించారు. ప్రస్తుతం యువరాజును విచారిస్తున్నారు. సౌదీలో మద్యం విక్రయం, తాగటం నేరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement