oil shortage
-
ఈవీల్లోకి మారండి.. ఇంధన ఖర్చులు తగ్గించుకోండి!
ఇంధన ఖర్చులు అగ్రరాజ్యాన్ని వణికిస్తున్నాయి. దాన్ని భరించటం అక్కడి వారికీ కష్టంగా ఉంటోంది. విద్యుత్ వాహనాలను (ఎలక్ట్రిక్ వెహికల్స్ ..ఈవీ) ఉపయోగించండి. ఖర్చులు తగ్గించుకోండి అన్న ప్రచారం ఊపందుకుంటోంది. ప్రభుత్వం నుంచి ఇతోధికంగా ప్రోత్సాహకాలను ప్రకటిస్తున్నారు. నిపుణుల అధ్యయనాలు కూడా దీనికి తోడవుతున్నాయి. ఈవీలను ఉపయోగిస్తే, అమెరికాలోని 90శాతం మంది గృహయజమానులు ఇంధన ఖర్చుల నుంచి బయటపడొచ్చని యూనివర్సిటీ ఆఫ్ మిచ్ గాన్ అధ్యయనం చెబుతోంది. కొన్ని ప్రాంతాల్లోనయితే, వార్షిక ఇంధన ఖర్చులు సగటున 600 డాలర్లకు తగ్గించుకోవచ్చని పేర్కొంది. తక్కువ ఆదాయం గలవారికి ఇబ్బందే ఈవీలోకి మారినా తక్కువ ఆదాయంగల ఇళ్లవారికి ట్రాన్స్ పోర్టేషన్ ఖర్చయినా అధికంగానేఉంటుందని అధ్యయనం స్పష్టం చేసింది. తక్కువ ఆదాయం గల వారిలో సగానికిపైగా అంటే 8.3మిలియన్ల హౌస్ హోల్డ్స్ ఈ భారాన్ని మోయవలసి వస్తుందని పేర్కొంది. యూఎస్ వాసులు సగటున 10,961 డాలర్లు ఖర్చు చేస్తున్నారని రవాణాశాఖ అంచనాలుచెబుతున్నాయి. సంపన్నులతో పోలిస్తే తక్కువ ఆదాయం గల వేతన జీవులకు ట్రాన్స్ పోర్టేషన్భారం ఎక్కువగా ఉంది. పన్ను చెల్లించిన తర్వాత లభించే వేతనంలో 10.4 శాతం ధనవంతులు వెచ్చిస్తే, పేదలకు అది 27.4 శాతంగా ఉంది. ఈవీల్లో పొదుపుకు దోహదం చేసే అంశాలు బ్యాటరీ పనితీరుపైన ప్రభావం చూపే శీతల వాతావరణం, శిలాజ ఇంధనాలతో పనిచేసే విద్యుత్, గ్రిడ్లు, విద్యుత్ ఛార్జీలు వంటివి ఈవీల ద్వారా ధర తగ్గించుకోవటానికి దోహదం చేస్తాయి. భవిష్యత్తులో గ్రిడ్ డీకార్బనైజేషన్, ఇంధన ధరలు, ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులోకి రావటం వంటి అంశాలు కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. ఈవీలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అధ్యయనంలో విద్యుత్ వాహనాల కొనుగోలు అంశాన్ని చేర్చలేదు. ఈవీలు సాధారణమైన గ్యాసొలీన్ తో నడిచే వాహనాల కంటే ఖరీదయినవి. ప్రస్తుతం అమెరికన్ కాంగ్రెస్ 7,500 డాలర్ల ఈవీ టాక్స్ క్రెడిట్ ను, అలాగే ఉపయోగించిన కార్లకు 4వేల డాలర్ల ఈవీ టాక్స్ క్రెడిట్ ను ఇచ్చేందుకు ఆమోదించింది. దానితో పాటు కొన్ని నిబంధనలను కూడా విధించింది. దీనిపై యూఎస్ ఎనర్జీ సెక్రటరీ జెన్నిఫర్ గ్రాన్ హ్లోమ్ మాట్లాడుతూ, బైడన్ ప్రభుత్వం ఇంధన ఖర్చులు తగ్గించటానికి తన వంతు ప్రయత్నం చేస్తోందని చెప్పారు. సాంప్రదాయబద్దంగా గ్యాస్ ట్యాక్ నింపటంతో పోలిస్తే, ఈవీల రీఛార్జి చేసేందుకు సగటున 35 డాలర్లు పొదుపు చేయగలుగుతున్నారని తెలిపారు. 7,500 డాలర్ల టాక్స్ క్రెడిట్ ఇస్తున్నప్పుడు, 26,500 డాలర్ల ఖరీదు చేసే జనరల్ మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయటం పెద్ద కష్టమేమీ కాదని ఆమె చెబుతున్నారు. -
చేతులెత్తేసిన శ్రీలంక కొత్త ప్రధాని!
కొలంబో: తీవ్ర సంక్షోభం దరిమిలా శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే దాదాపు చేతులెత్తేశారు. ఇప్పటికే దివాలా తీసిన దేశంలో రాబోయే రోజుల్లో.. మరిన్ని కష్టాలు తప్పవని లంక పౌరులకు ముందస్తు సంకేతాలు పంపించారు. ‘‘వాస్తవాల్ని దాచిపెట్టే ఉద్దేశం నాకు లేదు. అబద్ధాలతో లంక ప్రజలను మభ్యపెట్టే పరిస్థితి అంతకన్నా లేదు’’ అంటూ ఆయన సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘పెట్రో నిల్వలు దాదాపుగా నిండుకున్నాయి. ప్రస్తుతం కేవలం ఒక్కరోజుకు సరిపడా మాత్రమే నిల్వ ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. దిగుమతులు చేసుకునేందుకు సైతం డాలర్లు కొరత నెలకొందని సంక్షోభ తాలుకా తీవ్రతను ప్రజలను వివరించే ప్రయత్నం చేశారు. కొలంబో హార్బర్ బయట మూడు షిప్పుల్లో ఆయిల్ ఎదురు చూస్తోంది. కానీ, డాలర్లు చెల్లించే స్తోమత ప్రభుత్వం దగ్గర లేకుండా పోయింది. 1.4 మిలియన్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉంది. డబ్బు ముద్రించడమే ఇక మనకు ఉన్న ఆఖరి వనరు అని సోమవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రాబోయే నెలల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. తీవ్ర సంక్షోభంతో 22 మిలియన్ల మంది అష్టకష్టాలు పడుతున్నారని, పరిస్థితిని చక్కదిద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. పోయిన గురువారం ఆయన ప్రధాని పదవి చేపట్టారు. ఫ్యూయల్, విద్యుత్ ఛార్జీలు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని, నష్టాలను తగ్గించుకునేందుకు ప్రభుత్వం ముందున్న మార్గాలన్నింటిని ఉపయోగించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే చెప్పుకొచ్చారు. చదవండి: రష్యాకు మరో షాక్! నాటోలో చేరనున్న మరోదేశం -
చమురు ఉత్పత్తి పెంచనున్న సౌదీ
వాషింగ్టన్: ఇరాన్‌పై ఆంక్షల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడకుండా సౌదీ అరేబియా ఉత్పత్తిని పెంచనుంది. ఈ దిశగా తను చేసిన విజ్ఞప్తిని సౌదీ అరేబియా రాజు సల్మాన్ అంగీకరించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ‘ఇప్పుడే సౌదీ రాజు సల్మాన్‌తో మాట్లాడాను. పరిస్థితిని ఆయనకు వివరించాను. వెనిజులా, ఇరాన్లలో నెలకొన్న పరిస్థితుల ఆధారంగా కొరతను తట్టుకునేలా ఉత్పత్తి పెంచాలని కోరాను. ఈ కొరత దాదాపు 20 లక్షల డాలర్లు ఉండొచ్చు. ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నా.. రాజు అంగీకారం తెలిపారు’ అని ట్రంప్ వెల్లడించారు. ఇటీవల.. చమురు ఉత్పత్తి ధరలు పెంచేందుకు ఒపెక్ దేశాలు నిర్ణయం తీసుకోవడంతోపాటు ఉత్పత్తిని పెంచాలని కూడా నిర్ణయించాయి. ఒపెకేతర దేశమైన రష్యా కూడా ఉత్పత్తిని పెంచేందుకు అంగీకరించింది. ‘ఒపెక్ దేశాల నిర్ణయంతో పెరగనున్న డిమాండ్‌కు సరైన ఉత్పత్తి ఉంటుందని భావిస్తున్నాం’ అని సౌదీ ఇంధన మంత్రి ఖలీద్ అల్ ఫలే పేర్కొన్నారు. -
అనంతపురంలో ఆయిల్ సంక్షోభం
అనంతపురం జిల్లాలో ఆయిల్ సంక్షోభం నెలకొంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గుంతకల్‌లో ఆయిల్ సిబ్బంది సమ్మెకు దిగారు. దాంతో గుంతకల్ నుంచి ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని అనంతపురం, ధర్మవరం, కదిరి,గుంతకల్, పుట్టపర్తి పట్టణాలోని పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దాంతో జిల్లాలోని ఆయిల్ అక్రమ వ్యాపారులు చెలరేగిపోయారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అధిక ధరకు ఆయిల్‌ను విక్రయిస్తున్నారు. విభజనకు నిరసనగా జిల్లాలో ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ ఉద్యోగుల చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. దాదాపు 70 రోజులుగా వెయ్యికిపైగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. అనంతపురం రీజియన్‌లో ఆర్టీసికి రూ. 60 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ సంస్థ అధికారులు మంగళవారం వెల్లడించారు.