అనంతపురం జిల్లాలో ఆయిల్ సంక్షోభం నెలకొంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గుంతకల్లో ఆయిల్ సిబ్బంది సమ్మెకు దిగారు. దాంతో గుంతకల్ నుంచి ఆయిల్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని అనంతపురం, ధర్మవరం, కదిరి,గుంతకల్, పుట్టపర్తి పట్టణాలోని పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి.
దాంతో జిల్లాలోని ఆయిల్ అక్రమ వ్యాపారులు చెలరేగిపోయారు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అధిక ధరకు ఆయిల్ను విక్రయిస్తున్నారు. విభజనకు నిరసనగా జిల్లాలో ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ ఉద్యోగుల చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. దాదాపు 70 రోజులుగా వెయ్యికిపైగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. అనంతపురం రీజియన్లో ఆర్టీసికి రూ. 60 కోట్ల నష్టం వాటిల్లిందని ఆ సంస్థ అధికారులు మంగళవారం వెల్లడించారు.