ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ధరలను అదుపులోకి తెచ్చేందుకు ఎలన్‌మస్క్ చేసిన సూచన అందరినీ ఆకట్టుకుంటోంది. నిత్యం విచిత్ర కామెంట్లతో స్వార్థానికి నిలువెత్తు రూపంగా కనిపించే ఎలన్ మస్క్ తన తీరుకి భిన్నంగా స్పందించాడేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. యుద్ధం ఎంటి వారినైనా మారుస్తుంది అనేందుకు మరో ఉదాహరణగా ఎలన్ మస్క్ నిలిచారు.
ప్రపంచానికి గ్యాస్, క్రూడ్ ఆయిల్ సరఫరా చేస్తున్న దేశాల్లో రష్యా కీలకం. ఒపెక్ దేశాలను మినహాయిస్తే వెనిజువెలా, రష్యాల్లో అపారమైన బొగ్గు, గ్యాస్, ముడి చమురు నిల్వలు ఉన్నాయి. అయితే తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తడంతో ప్రపంచ దేశాలు రష్యాపై అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. ఫలితంగా పది రోజుల వ్యవధిలోనే క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి.
సాధారణంగా పెట్రోడ్, డీజిల్ రేట్లు పెరిగితే.. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తారు. ఫలితంగా వాటికి డిమాండ్ పెరుగుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ కార్త తయారీ కంపెనీగా టెస్లా ఉంది. ప్రస్తుత పరిస్థితులు టెస్లాకు మేలు చేసేవే. అయితే టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ మరోరకంగా ఆలోచించారు.
చమురు, గ్యాస్ నిల్వలు ఉన్న దేశాలు తమ ఉత్పత్తిని పెంచాలంటూ ఎలన్ మస్క్ విజ్ఞప్తి చేశారు. ఈ సలహా ఇవ్వడం తనకు నచ్చకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను మరింత చిక్కుల్లోకి పడేయకుండా ఉండాలంటే చమురు, గ్యాస్ ఉత్పత్తి పెంచక తప్పదంటూ ట్వీట్ చేశాడు. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలు తీసుకోక తప్పదన్నాడు.
Hate to say it, but we need to increase oil & gas output immediately.
— Elon Musk (@elonmusk) March 5, 2022
Extraordinary times demand extraordinary measures.
ఉక్రెయిన్‌పై రష్యా దాడికి ముందు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 90 డాలర్ల దగ్గర ట్రేడయ్యింది. యుద్ధం మొదలవడం ఆలస్యం ఈ ధర పైకి ఏగబాకుతూ 120 డాలర్లకు చేరుకుంది. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా.. ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. చమురు ధరలు పెరిగితే దానిపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడిన అన్ని సెక్టార్లు ప్రభావితం అవుతాయి. ద్రవ్యోల్బణం ఎదురయ్యే దుస్థితి దాపురిస్తుంది. అందుకే ఎలన్‌మస్క్ .. తన లాభాలు పక్కన పెట్టి.. ప్రజల మేలు కోరి ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి పెంచాలనే సూచన చేశాడు.
చదవండి: జాగ్రత్త! రష్యన్లు ఇలా దాడి చేయొచ్చు.. ఉక్రెయిన్లకు ఎలన్ మస్క్ సూచనలు
Comments
Please login to add a commentAdd a comment