కృష్ణాగోదావరి బేసిన్‌లో గ్యాస్ అన్వేషణ విషయంలో కాగ్ తుది నివేదికపై 4 వారాల్లో సమాధానం తెలపాలని రిలయన్స్ ఇండస్ట్రీస్
న్యూఢిల్లీ: కృష్ణాగోదావరి బేసిన్‌లో గ్యాస్ అన్వేషణ విషయంలో కాగ్ తుది నివేదికపై 4 వారాల్లో సమాధానం తెలపాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), ఇతర ప్రతివాదులకు సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు ఇచ్చింది. కేసు తదుపరి విచారణను మే 5కు వాయిదా వేసింది. డీ6 బావుల తవ్వకంలో కాంట్రాక్టర్లకు చెల్లింపులుసహా, పలు అవకతవకలు చోటుచేసుకున్నట్లు కాగ్ నివేదిక పేర్కొంది. ఆయా అంశాలకు సంబంధించి దాదాపు రూ.2,179 కోట్ల వ్యయాలను ఆర్‌ఐఎల్ మినహాయించుకోడానికి అనుమతి ఇవ్వవద్దని నివేదిక కోరింది.