డీజీహెచ్‌కు ఓఎన్‌జీసీ ‘కేజీ’ క్షేత్ర ప్రణాళిక ముసాయిదా | ONGC to DGH 'KG' Field Planning Framework | Sakshi
Sakshi News home page

డీజీహెచ్‌కు ఓఎన్‌జీసీ ‘కేజీ’ క్షేత్ర ప్రణాళిక ముసాయిదా

Published Thu, Aug 27 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

డీజీహెచ్‌కు ఓఎన్‌జీసీ ‘కేజీ’  క్షేత్ర ప్రణాళిక ముసాయిదా

డీజీహెచ్‌కు ఓఎన్‌జీసీ ‘కేజీ’ క్షేత్ర ప్రణాళిక ముసాయిదా

న్యూఢిల్లీ: కేజీ బేసిన్‌లోని డీ5 బ్లాకులో 2018-19 నాటికి చమురు, గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ (ఓఎన్‌జీసీ) సంస్థ క్షేత్ర అభివృద్ధి ప్రణాళిక (ఎఫ్‌డీపీ) ముసాయిదాను చమురు రంగ నియంత్రణ సంస్థ డీజీహెచ్‌కు సమర్పించింది. మొట్టమొదటిసారిగా కనుగొన్న నిక్షేపాల్లో రోజుకు 14 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల గ్యాస్‌ను, 77,000 బ్యారెళ్ల చమురును ఉత్పత్తి చేయొచ్చని భావిస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కేజీ-డీ5 బ్లాకులోని 12 చమురు, గ్యాస్ నిక్షేపాలను మూడు క్లస్టర్లుగా ఓఎన్‌జీసీ విడగొట్టింది. ప్రస్తుతం చమురు నిక్షేపాలున్న క్లస్టర్ 2ఏ, గ్యాస్ నిక్షేపాలు ఉన్న 2బీలను అభివృద్ధి చేయడంపై సంస్థ దృష్టి పెట్టిందని, దానికి సంబంధించిన ఎఫ్‌డీపీనే డీజీహెచ్‌కి ఇచ్చినట్లు ఆయా వర్గాలు తెలిపాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement