గ్యాస్‌కు అధిక రేటు ఇవ్వాలి: బీపీ | Given the high rate of gas | Sakshi
Sakshi News home page

గ్యాస్‌కు అధిక రేటు ఇవ్వాలి: బీపీ

Published Thu, Jul 16 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

Given the high rate of gas

న్యూఢిల్లీ: కేజీ బేసిన్‌తో పాటు తూర్పున ఇతరత్రా ఆఫ్‌షోర్ బ్లాక్‌లలో ఇంకా అభివృద్ధి చేయని క్షేత్రాల నుంచి గ్యాస్ వెలికి తీయాలంటే  రేటు మరింత ఎక్కువగా ఉంటేనే గిట్టుబాటు అవుతుందని చమురు దిగ్గజం బీపీ.. కేంద్రానికి తెలిపింది. అలాగే, కేజీ-డీ6 వ్యయాలపై పెనాల్టీలపై ఆర్బిట్రేషన్ అంశం కూడా సత్వరం ఒక కొలిక్కి వచ్చేలా చూడాలని కోరింది. ప్రధాని నరేంద్ర మోదీ, చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో బుధవారం భేటీ అయిన బీపీ సీఈవో బాబ్ డడ్లీ ఈ అంశాలను వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈసారి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆయన వెంట రాకపోవడం గమనార్హం. సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్‌కు ఇచ్చే ప్రీమియం రేటును కేజీ-డీ6తో పాటు ఎన్‌ఈసీ-25 క్షేత్రాలకు కూడా వర్తింపచేయాలని బీపీ కోరుతున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement