ఏపీలో పెట్టుబడులు ఓఎన్‌జీసీ రుణపరపతికి ప్రతికూలం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కేజీ బేసిన్‌లో చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీత కోసం ప్రతిపాదిత రూ. 78,000 కోట్ల పెట్టుబడులు ఓఎన్‌జీసీ రుణపరపతిపై ప్రతికూల ప్రభావం ఉండగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది. ప్రారంభ దశలో కంపెనీ రుణసమీకరణ ఒక్కసారిగా ఎగియగలదని పేర్కొంది.
ఓఎన్‌జీసీ 2018– 2021 మధ్యలో మొత్తం రూ. 78,000 కోట్లలో రూ. 10,000 కోట్లు ఆన్‌షోర్ బ్లాక్‌లపైన, మిగతా రూ. 68,000 కోట్లు కేజీ బేసిన్‌లోని ఆఫ్‌షోర్ అసెట్స్‌పైన ఇన్వెస్ట్ చేయనుంది. చమురు, గ్యాస్ అసెట్స్ నుంచి మంచి ఆదాయాలు ఆర్జించడానికి సుదీర్ఘకాలం పట్టేస్తుందని, ఈ నేపథ్యంలో ఇంత భారీ పెట్టుబడి ప్రణాళికలు ఓఎన్‌జీసీ రుణపరపతికి ప్రతికూలమని మూడీస్ పేర్కొంది.