oil and gas
-
చమురు, గ్యాస్‌కు పటిష్ట డిమాండ్
న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభంకానున్న కొత్త ఆర్థిక సంవత్సరం(2025–26)లో దేశీయంగా చమురు, గ్యాస్‌లకు పటిష్ట డిమాండ్ కనిపించనున్నట్లు ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ తాజాగా అంచనా వేసింది. అయితే ప్రపంచస్థాయిలో డిమాండ్ నీరసించే వీలున్నదని, దీంతో చమురు శుద్ధి(రిఫైనింగ్) మార్జిన్లు బలహీనపడవచ్చని పేర్కొంది.పెట్రోలియం ప్రొడక్టులకు నెలకొనే భారీ డిమాండ్ కారణంగా డౌన్‌స్ట్రీమ్(రిఫైనింగ్) కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్ స్థిరంగా కొనసాగే అవకాశమున్నట్లు అభిప్రాయపడింది. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) మందగించినప్పటికీ బలమైన మార్కెటింగ్ మార్జిన్లు కంపెనీలకు అండగా నిలవనున్నట్లు తెలియజేసింది. వెరసి పటిష్ట నిర్వహణ లాభాలు(ఇబిటా) ఆర్జించే వీలున్నట్లు అంచనా వేసింది.నిర్మాణంలో ఉన్న రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టుల నేపథ్యంలో ప్రధాన చమురు మార్కెటింగ్ కంపెనీలన్నిటికీ అదనపు రుణ భారానికి అవకాశమున్నట్లు వివరించింది. అయితే చమురు ఉత్పాదక(అప్‌స్ట్రీమ్) కంపెనీల క్రెడిట్ ప్రొఫైల్ ముడిచమురు ధరలపై ఆధారపడనున్నట్లు 2025–26 ఆయిల్ అండ్ గ్యాస్ ఔట్‌లుక్‌పై విడుదల చేసిన నివేదికలో రేటింగ్ సంస్థ ఇండియారేటింగ్స్ వివరించింది. ఇబిటాకు ఆధారం రేటింగ్ సంస్థ నివేదిక ప్రకారం చమురు ధరల ఒత్తిడి, పురాతన క్షేత్రాల నుంచి ఉత్పత్తి తగ్గడం వంటి అంశాల నేపథ్యంలో అప్‌స్ట్రీమ్ కంపెనీల ఇబిటా క్షీణించవచ్చు. అయితే కొత్త డిస్కవరీల నుంచి చమురు ఉత్పత్తి పెరగడం, ఉత్పాదకతపై ప్రత్యేక ఎక్సైజ్ డ్యూటీ తొలగింపు వంటి అంశాలు చమురు ధరల క్షీణత ప్రభావానికి చెక్ పెట్టే వీలుంది.దేశీయంగా చమురు, గ్యాస్‌కు భారీ డిమాండ్ నెలకొనవచ్చని, ఇది రిఫైనింగ్, పెట్రోకెమికల్ సామర్థ్యాల విస్తరణకు దారి తీసే వీలున్నదని ఇండియారేటింగ్స్ కార్పొరేట్స్ విభాగం అసోయేట్ డైరెక్టర్ భాను పట్ని పేర్కొన్నారు. రానున్న రెండు, మూడేళ్లలో రిఫైనరీ సామర్థ్యం 22 శాతం బలపడవచ్చని అంచనా వేశారు. చమురు, గ్యాస్ విభాగాలలో పెట్టుబడి నిర్ణయాలను డిమాండ్ ప్రభావితం చేయనున్నట్లు అభిప్రాయపడ్డారు. జీఆర్‌ఎంలు వీక్ ఈ ఏడాది తొలి అర్ధభాగాన్ని ప్రతిఫలిస్తూ వచ్చే ఏడాది జీఆర్‌ఎంలు మందగించవచ్చు. ఇందుకు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు, పరిశ్రమల నుంచి డిమాండ్ నీరసించడం ప్రభావం చూపే వీలుంది. చైనాను ప్రధానంగా పేర్కొనవచ్చు. వీటికితోడు గ్లోబల్‌స్థాయిలో రిఫైనరీ సామర్థ్యాలు పెరగడం కారణంకానున్నాయి. దేశీయంగా పెట్రోలియం ప్రొడక్టులకు డిమాండ్ కొనసాగనుంది. డీజిల్, పెట్రోల్, ఎల్పీజీకి బల్క్ డిమాండ్ కనిపించనుంది.చమురు ధరల క్షీణత, నిలకడైన రిటైల్ ధరల కారణంగా సమీకృత కార్యకలాపాలుగల ఓఎంసీలకు ఈ తొలి అర్ధభాగంలో లభించిన మార్కెటింగ్ మార్జిన్లు మద్దతివ్వనున్నాయి. సమీకృత రిఫైనర్స్, స్టాండెలోన్ పెట్‌కెమ్ సంస్థల ఇబిటా వచ్చే ఏడాది మెరుగుపడనుంది. 2024 ఒత్తిడి తదుపరి ఈ ఏడాదిలోనే పెట్‌కెమ్ ఇబిటా బలపడటం మొదలైంది. బ్యారల్ ధర 65 డాలర్లకు ఎగువన కొనసాగితే అప్స్ట్రీమ్కంపెనీలు పటిష్ట మార్జిన్లు ఆర్జించే వీలుంది.ఒక్కో బ్యారల్‌పై 40–45 డాలర్లస్థాయిలో ఉత్పత్తి వ్యయాల బ్రేక్ఈవెన్కు చాన్స్ ఉంది. దీంతో బ్యారల్‌పై 20–30 డాలర్ల ఇబిటా ఆర్జించవచ్చు. ముడిచమురు ధరలు ప్రపంచ రాజకీయ, భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి కదులుతాయి. మరోవైపు డిమాండ్, ఒపెక్ దేశాల ఉత్పాదక లక్ష్యాలు సైతం ప్రభావం చూపుతాయి. దేశీయంగా విండ్‌ఫాల్ పన్ను తొలగింపుతో చమురు ధరల క్షీణత దేశీ అప్‌స్ట్రీమ్ కంపెనీలకు లబ్దిని చేకూర్చగలదు. సిటీ గ్యాస్ ఓకే వచ్చే ఏడాది దేశీ చౌక గ్యాస్ కేటాయింపులు తగ్గిన తదుపరి రానున్న ఏడాదిలో సిటీ గ్యాస్ పంపిణీ(సీజీడీ) సంస్థల క్రెటిట్ ప్రొఫైల్ స్థిరంగా కొనసాగవచ్చని ఇండియారేటింగ్స్ నివేదిక పేర్కొంది. మూలధన పెట్టుబడులపై రాబడి మందగించవచ్చు. అయితే పటిష్టస్థాయిలోనే నమోదయ్యే వీలుంది. కొత్త ప్రాంతాలలో పెట్టుబడుల వెచ్చింపుపై కొంతమేర ఒత్తిళ్లు నెలకొనవచ్చు.పెట్టుబడి వినియోగ అంతర్గత వనరులు తగ్గే వీలుంది. క్రాక్ స్ప్రెడ్స్(మార్జిన్ల అంతరం) మెరుగుపడటం, అధిక సరఫరా పరిస్థితులు ఉపశమించడం వంటి కారణాలతో విడిగా(స్టాండెలోన్) పెట్రోకెమికల్ కంపెనీలు పటిష్ట పనితీరును ప్రదర్శించే వీలుంది. 2019–24 మధ్యకాలంలో ప్రధానంగా చైనా నుంచి భారీ సామర్థ్యాలు జత కలవడం అధిక సరఫరాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. -
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఈటీఎఫ్
ముంబై: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఈటీఎఫ్‌ను ప్రారంభించినట్టు ప్రకటించింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ మాదిరే ఈ పథకం రాబడులు అందిస్తుందని తెలిపింది. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లో 15 కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ ఆయిల్, గ్యాస్, పెట్రోలియం రంగంలో సేవలు అందిస్తున్నవి. సూచీలో ఈ కంపెనీలకు వెయిటేజీకి అనుగుణంగానే ఈ పథకం కూడా పెట్టుబడులు పెడుతుంది. తక్కువ వ్యాల్యూషన్ల వద్ద ఉండడం, ఆయిల్, గ్యాస్ వినియోగానికి డిమాండ్ పెరుగుతుండడం పెట్టుబడులకు గొప్ప అవకాశాలను అందిస్తున్నట్టు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ తెలిపింది. ఈ నెల 8న ప్రారంభమైన ఈటీఎఫ్ 18వ తేదీ వరకు పెట్టుబడులకు అందుబాటులో ఉంటుంది. -
ఆయిల్, గ్యాస్ కంపెనీల చీఫ్‌లతో ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం దేశ, విదేశీ ఆయిల్, గ్యాస్ కంపెనీల చీఫ్‌లతో భేటీ కానున్నారు. గోవాలో ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు నిర్వహించే ఇండియా ఎనర్జీ వీక్‌లో భాగంగా ఈ సమావేశం చోటుచేసుకోనుంది. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సరఫరాపై, పెట్టుబడుల ఆకర్షణపై ప్రధాని దృష్టి సారించనున్నారు. ఈ విషయాన్ని పెట్రోలియం మంత్రి హర్దీప్సింగ్ పురి ప్రకటించారు. ఆయిల్ అండ్ గ్యాస్‌కు సంబంధించి గతంలో సీఈఆర్ఏ ఇండియా వీక్ పేరిట నిర్వహించే కార్యక్రమం ఇప్పుడు ఇండియా ఎనర్జీ వీక్ పేరుతో జరగనుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా హౌతి మిలిటెంట్లు ఎర్ర సుమద్రంలో రవాణా నౌకలపై దాడులకు పాల్పడుతున్న తరుణంలో ఈ ఏడాది సదస్సుకు ప్రాధాన్యం ఏర్పడింది. గతంలో మాదిరే ప్రముఖ ఆయిల్ అండ్ గ్యాస్ సీఈవోలతో ప్రధాని సమావేశం కానున్నారు. ఇండియా–యూఎస్ ఇన్వెస్ట్మెంట్ రౌండ్‌టేబుల్ సమావేశం కూడా జరగనుంది. ఎర్ర సముద్రం సంక్షోభం మన చమురు సరఫరాలకు విఘాతం కలిగించకపోయినా, దారి మళ్లింపు వల్ల రవాణా వ్యయం పెరిగినట్టు పురి చెప్పారు. మొత్తం మీద సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తున్నట్టు తెలిపారు. -
తగ్గేదెలే అంటున్న వేదాంత: వేల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: మెటల్ ధరలు క్షీణిస్తున్నప్పటికీ ఈ ఏడాది పెట్టుబడి వ్యయాలకు కోత పెట్టబోమంటూ వేదాంతా లిమిటెడ్ స్పష్టం చేసింది. జింక్, ఆయిల్ అండ్ గ్యాస్, అల్యూమినియం వ్యాపారాల్లో భారీ ప్రణాళికల్లో ఉంది. 2022-23లో 2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 16 వేల కోట్లు) వెచ్చించ నున్నట్లు వేదాంత తెలియజేసింది. జింక్, చమురు-గ్యాస్, అల్యూమినియం వ్యాపారంలో నిధులను వినియోగిస్తామని పేర్కొంది. ప్రాజెక్టులకు మధ్యలో ఫుల్స్టాప్ పెట్టబోమని కంపెనీ సీఈవో సునీల్ దుగ్గల్ వెల్లడించారు. వీటితో పటిష్ట రిటర్నులు లభిస్తాయన్నారు. తద్వారా నిర్వహణా సామర్థ్యం మరింత మెరుగుపడటంతోపాటు, ఉత్పాదకత పుంజు కుంటుందన్నారు. దేశీ మినరల్స్ అండ్ మెటల్స్ పరిశ్రమపై ఎన్ఎండీసీ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహించిన సదస్సు రెండో రోజు దుగ్గల్ విలేకరులకు ఈ విషయాలు వెల్లడించారు. రాబోయే రెండేళ్లలో సుమారు 3 బిలియన్ల డాలర్లు మూలధనాన్ని వెచ్చించ నున్నట్టు వేదాంత 57వ వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారులను ఉద్దేశించి కంపెనీ ఛైర్మన్ అనిల్ అగర్వాల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 18 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.3 లక్షల కోట్లు) నుంచి మరో ఎనిమిదేళ్లలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8 లక్షల కోట్లు) కంపెనీగా మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా భారతదేశంలో ఇంటిగ్రేటెడ్ సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటుకు ప్రపంచంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారులలో ఒకటైన ఫాక్స్‌కాన్‌తో వేదాంత ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. దీని ద్వారా రెండులక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ వేదాంత లిమిటెడ్, దేశం అంతటా చమురు, గ్యాస్, జింక్, సీసం, వెండి, రాగి, ఇనుప ఖనిజం, ఉక్కు,య అల్యూమినియం, పవర్ వ్యాపార నిర్వహణలో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలలో ఒకటిగా నిలుస్తోంది. -
ఎంత పనిచేశావ్ పుతిన్.. భారత్‌కు గట్టి షాక్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచమంతటినీ అతలాకుతలం చేస్తోంది. తిండి గింజల కొరత, నిత్యావసరాలు, చమురు ధరల పెరుగుదల... ఇలా అన్ని దేశాలకూ ఏదో రకంగా సెగ తగులుతోంది. మన దేశంపై కూడా యుద్ధ ప్రభావం గట్టిగానే పడుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచీ గత మూడు నెలల్లో నిత్యావసరాలతో పాటు అన్ని ధరలూ పైకి ఎగబాకుతుండటంతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను భారీగా వెనక్కు తీసుకుంటుండటం వంటి పరిణామాలతో ఆర్థిక రంగం కూడా నానా కుదుపులకు లోనవుతోంది. చమురు భగభగలు.. యుద్ధం పుణ్యమా అని అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇందుకు రూపాయి పతనం కూడా తోడవటంతో మరింతగా మోతెక్కిపోతున్నాయి. ఈ ఏడాది మొదట్లో 80 డాలర్లున్న బ్యారెల్ చమురు ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడికి దిగాక ఈ మూడు నెలల్లో 128 డాలర్లకు పెరిగింది. వంటింట్లో మంటలు.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం భారతీయుల వంట గదిలోనూ సెగలు రేపుతోంది. ఏడాది క్రితంతో పోలిస్తే వంట నూనెల ధరలు నాలుగో వంతు దాకా పెరిగిపోయాయి. 2021 మే 31తో పోలిస్తే గోధుమలు 14 శాతం, చక్కెర 4 శాతం, ఉత్తరాదిన విరివిగా వాడే ఆవ నూనె 5 శాతం చొప్పున పెరుగుదల నమోదు చేశాయి. పెట్టుబడులు వాపస్.. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారత మార్కెట్ల నుంచి గత మూడు నెలల్లో ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా వెనక్కు తీసుకున్నారు. అంతకుముందు 9 నెలల ఉపసంహరణ కంటే కూడా ఇది 50 వేల కోట్ల రూపాయలు ఎక్కువ! యుద్ధం దెబ్బకు ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. దీంతో అంతర్జాతీయంగా తలెత్తిన ఒడిదొడుకులను తట్టుకునే చర్యల్లో భాగంగా భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు ఇలా పెట్టుబడులను భారీగా వెనక్కు తీసుకుంటున్నారు. రూపాయి నేలచూపులు.. యుద్ధం దెబ్బకు డాలర్‌తో రూపాయి పతనం గత మూడు నెలల్లో వేగం పుంజుకుంది. ఫిబ్రవరి 24న డాలర్‌తో 75.3 వద్ద కదలాడిన రూపాయి మే 31 నాటికి 77.7కు పడిపోయింది. ఇది దిగుమతులపై, ముఖ్యంగా చమురు దిగుమతులపై బాగా ప్రభావం చూపింది. ఎఫ్‌పీఐల ఉపసంహరణ కూడా రూపాయి పతనానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. దీనికి తోడు భారత్‌లో ద్రవ్యోల్బణం కూడా ఏప్రిల్ నాటికే ఏకంగా 7.8 శాతానికి పెరిగింది! 2014 మే తర్వాత ద్రవ్యోల్బణం ఇంతగా పెరగడం ఇదే తొలిసారి. -నేషనల్ డెస్క్, సాక్షి. -
Seema Rayal: ప్రమాదకరమైనా... భర్తతో పాటు కుటుంబ ప్రోత్సాహంతో..
పెళ్లిచేసి అత్తారింటికి పంపించే ఆడపిల్లకు చదువెందుకు? చదివి ఊళ్లు ఏలాలా! దేశాన్ని ఉద్ధరించాలా? వంటి మాటలన్నెంటినో దాటుకుని ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో ఇంజినీర్‌గా రాణిస్తోంది సీమా రాయల్. మగవాళ్లు ఎక్కువగా ఉండే ఈ రంగంలో ఈజీగా ఆయిల్‌ను తోడేస్తోంది. రాజస్థాన్‌కు చెందిన సీమా రాయల్‌కు ముగ్గురు తమ్ముళ్లు. ఒక్కతే అమ్మాయి కాబట్టి అల్లారుముద్దుగా పెరిగి ఉండొచ్చు అనుకోవడానికి లేదు. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీర్ కావాలన్న తన కలను నిజం చేసుకోవడానికి అనేక అడ్డంకులను దాటాల్సి వచ్చింది. ఆడపిల్ల ఇంటి పనులు నేర్చుకుంటే చాలన్న భావన ఉన్న సమాజంలో పుట్టిన సీమకు చదువుకోవడమే పెద్ద సవాలు. చదువు ఎందుకు అనే మాటలను పోగొట్టడానికి ఆమె చిన్నప్పటి నుంచి శ్రద్ధగా చదువుకునేది. జూడో, కరాటే ప్రాక్టీస్ చేస్తూనే ఇంటి పనులన్నింటినీ నేర్చుకుంది. సీమ చురుకుదనాన్ని గమనించిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వారి మాటలను పట్టించుకోకుండా తనని చదువుకునేందుకు ప్రోత్సహించేవారు. ఫైనలియర్లో ఉండగానే.. చిన్నప్పటి నుంచి క్రీడల్లో చురుకుగా ఉండే సీమ ..ఇంజినీరింగ్ కాలేజీలో తోటి విద్యార్థులు ఎవరూ క్రీడలపై ఆసక్తి కనబర్చక పోవడం కనిపించింది. దీంతో సీమానే అమ్మాయిలతో ఒక టీమ్‌ను ఏర్పరిచి రకరకాల ఆటలపోటీలలో పాల్గొనేది. రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటూనే ఇంజినీరింగ్ సబ్జెక్టులను ఏకాగ్రతతో చదివేది. ఫైనలియర్లో ఉండగా కాలేజీలో క్యాంపస్ ఇంటర్య్వూలు జరిగాయి. ఇంటర్య్వూలో పాసవ్వడంతో.. కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో సీమకు ఉద్యోగం వచ్చింది. కానీ ఇంటికి దూరంగా బర్మర్ ప్రాంతంలో కంపెనీ ఉంది. ‘‘అంతదూరం వెళ్లి అమ్మాయి ఉద్యోగం చేయాలా? ఆయిల్ కంపెనీ అంటే అంతా మగవాళ్లే ఉంటారు! ఎందుకొచ్చిన గోల ’’ అంటూ ఇరుగుపొరుగు సీమ తల్లిదండ్రులకు పదేపదే చెప్పేవారు. ఈ మాటలేవీ పట్టించుకోని కుటుంబసభ్యులు సీమను ఉద్యోగం చేసేందుకు అనుమతించారు. దీంతో కెయిర్న్ కంపెనీలో ‘ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీర్’గా చేరింది. కంపెనీలో పనిని వేగంగా నేర్చుకుని పై అధికారుల మన్ననలను అందుకుంది. సీమ పనితీరు మెచ్చిన కంపెనీ యాజమాన్యం ఆమెను అనేక పదోన్నతులతో ప్రోత్సహించింది. ప్రమాదకరమైనప్పటికీ.. ‘‘ఇన్స్ట్రమెంట్ ఇంజినీర్ అంటే చాలా పనులు చేయాల్సి ఉంటుంది. ఆటోమాటిక్‌గా పనిచేసే అనేక పరికరాలను చూసుకోవాల్సి ఉంటుంది. బావి నుంచి ఆయిల్ తియ్యాలి. కొన్ని మెషిన్లతో, కొన్నింటిని మ్యానువల్‌గా తీయాలి. నీళ్లు, గ్యాస్, మట్టి నుంచి ఆయిల్‌ను వేరుచేసి పైప్లైన్లకు పంపించాలి. ఈ మొత్తం ప్రక్రియలో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది. ఇనుస్ట్రుమెంట్ ఇంజినీర్ నుంచి సీనియర్ ఇంజినీర్‌గా పదోన్నతి వచ్చినప్పుడు బాధ్యతలు పెరిగాయి. ప్రస్తుతం సూపరిండెంట్, ఇన్స్టాలేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. పద్నాలుగేళ్లలో నేను ఎదిగేందుకు కంపెనీ అనేక అవకాశాలు కల్పించింది. ఇప్పటికీ రాజస్థాన్‌లో ఉన్న అమ్మాయిలు అంత చురుగ్గా ముందుకు సాగడం లేదు. టీచర్ ఉద్యోగం చేస్తే చాల్లే అనుకునేవారే ఎక్కువ. ఇంతకు మించి ఆలోచించడం లేదు. ఆయిల్ గ్యాస్ కంపెనీలవైపు అసలే చూడడంలేదు. నా పెళ్లి అయ్యాక భర్తతో పాటు కుటుంబం కూడా చాలా ప్రోత్సహించింది. వృత్తిపరంగా కొన్నిసార్లు ఇంటికి దగ్గరగా, మరికొన్ని సార్లు ఇంటికి దూరంగా వెళ్లాల్సి ఉంటుంది. ఆ సమయంలో కూడా వాళ్లు నాకు అండగా నిలిచారు. అందువల్లే ఒకపక్క ఉద్యోగం, మరోపక్క పిల్లల్ని చూసుకోగలిగాను. ఎప్పుడూ మంచి జరుగుతుందనే ఆశావహ దృక్పథంలో ఉండేదాన్ని. ఎంతవరకు కష్టపడగలమో అంతవరకు శ్రమిస్తే విజయం దానంతట అదే వస్తుందని నేను నమ్ముతాను. కష్టాలనేవి సహజం. వాటిని దాటుకుని ముందుకెళ్తేనే జీవితంలో విజయం సాధించగలం. అందుకే ఎంతటి కఠిన రంగంలోనైనా రాణించగలరు’’ అని చెప్పే సీమ ఎంతో మంది అమ్మాయిలకు ప్రేరణగా నిలుస్తోంది. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! -
అసలు చెల్లిస్తే వడ్డీ వదులుకుంటాం
న్యూఢిల్లీ: యూకే కంపెనీ కెయిర్న్ ఎనర్జీ తాజాగా అసలు చెల్లిస్తే వడ్డీని వదులుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీనిలో భాగంగా 50 కోట్ల డాలర్ల వడ్డీని ప్రభుత్వం సూచించిన చమురు, గ్యాస్ లేదా పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అవార్డుకు ప్రభుత్వం ఒప్పుకుని పునఃసమీక్ష ద్వారా పన్ను విధింపుతో తమకు కలిగిన నష్టాన్ని చెల్లించేటట్లయితే వడ్డీని వదులుకోగలమని కెయిర్న్ ఎనర్జీ వివరించినట్లు తెలుస్తోంది. 1994లో చమురు, గ్యాస్ రంగంలో ఈ స్కాట్లాండ్ కంపెనీ ఇన్వెస్ట్ చేసింది. తద్వారా రాజస్తాన్‌లో భారీ చమురు నిక్షేపాన్ని వెలికి తీసింది. 2006–07లో బీఎస్ఈలో దేశీ ఆస్తులతో కూడిన కంపెనీని లిస్ట్ చేసింది. ఐదేళ్ల తదుపరి కంపెనీ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెట్రోయాక్టివ్ పన్ను చట్టం ప్రకారం వడ్డీతో సహా రూ. 10,247 కోట్లు చెల్లించవలసిందిగా ఆదేశించింది. అంతేకాకుండా దేశీ సంస్థలో మిగిలిన కెయిర్న్ షేర్లను లిక్విడేట్ చేయడం, పన్ను రిఫండ్లను నిలువరించడం తదితరాలను చేపట్టింది. అయితే కెయిర్న్ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ హేగ్‌లోని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. కాగా.. 2020 డిసెంబర్లో ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ వడ్డీతో కలిపి అసలు 1.2 బిలియన్ డాలర్లు కెయిర్న్ ఎనర్జీకి తిరిగి చెల్లించవలసిందిగా తీర్పులో పేర్కొంది. చదవండి: రెమిడెసివర్ ఎగుమతులపై కేంద్రం నిషేధం -
ఏపీలో పెట్టుబడులు ఓఎన్జీసీ రుణపరపతికి ప్రతికూలం
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కేజీ బేసిన్లో చమురు, గ్యాస్ నిక్షేపాల వెలికితీత కోసం ప్రతిపాదిత రూ. 78,000 కోట్ల పెట్టుబడులు ఓఎన్జీసీ రుణపరపతిపై ప్రతికూల ప్రభావం ఉండగలదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది. ప్రారంభ దశలో కంపెనీ రుణసమీకరణ ఒక్కసారిగా ఎగియగలదని పేర్కొంది. ఓఎన్జీసీ 2018– 2021 మధ్యలో మొత్తం రూ. 78,000 కోట్లలో రూ. 10,000 కోట్లు ఆన్‌షోర్ బ్లాక్లపైన, మిగతా రూ. 68,000 కోట్లు కేజీ బేసిన్‌లోని ఆఫ్‌షోర్ అసెట్స్పైన ఇన్వెస్ట్ చేయనుంది. చమురు, గ్యాస్ అసెట్స్ నుంచి మంచి ఆదాయాలు ఆర్జించడానికి సుదీర్ఘకాలం పట్టేస్తుందని, ఈ నేపథ్యంలో ఇంత భారీ పెట్టుబడి ప్రణాళికలు ఓఎన్జీసీ రుణపరపతికి ప్రతికూలమని మూడీస్ పేర్కొంది. -
ఇన్ఫ్రా రంగానికి చెందిన షేర్లలో ఇన్వెస్ట్
ఇవి కేవలం ఇన్ఫ్రా రంగానికి చెందిన షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఇన్ఫ్రా నిర్వచనం చాలా విస్తృతమైనది కావడంతో ఈ పరిధిలోకి చాలా రంగాలు అంటే.. ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, లోహాలు, బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్ ఇలా పలు రకాలకు రంగాలకు చెందిన షేర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్రస్తుత ర్యాలీలో ఇన్ఫ్రా ఫండ్స్ ముందంజలో ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం వల్ల బాగా దెబ్బతిన్న ఈ రంగాన్ని మోడీ ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొస్తుందన్న ఆశతో ఈ రంగానికి చెందిన షేర్లు బాగా పెరిగాయి. గతేడాది కాలంలో ఈ ఫండ్స్‌లో చాలా మటుకు 80 శాతానికిపైనే రాబడిని అందించాయి. కానీ ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. 2008లో స్టాక్ మార్కెట్లు బూమ్‌లో ఉన్నప్పుడు ఇన్ఫ్రా ఫండ్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. ఆ సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారు ఇప్పటికీ చాలామంది నష్టాల్లోనే ఉన్నారు. ఉదాహరణకు ఎల్అండ్టీ ఇన్ఫ్రా ఫండ్‌నే తీసుకుందాం... ఈ ఏడాది కాలంలో ఈ ఫండ్ 84 శాతం రాబడిని అందించింది. కాని 2007లో ఈ ఫండ్ యూనిట్ రూ. 10కు ఎన్ఎఫ్వోకి వస్తే ఇప్పుడు ఆ యూనిట్ విలువ రూ. 10.17 మాత్రమే. అంటే ఎన్ఎఫ్వో సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పటి వరకు ఒక శాతం కూడా లాభాలు రాలేదు. దీనికి కారణం మధ్యలో ఇన్ఫ్రా రంగం బాగా దెబ్బతినడంతో ఈ ఫండ్స్ యూనిట్ విలువలు కూడా బాగా దెబ్బతిన్నాయి. అందుబాటులో ఉన్న కొన్ని ఇన్ఫ్రా ఫండ్స్ : రెలిగేర్ ఇన్ఫ్రా (98%), ఫ్ల్రాంకిన్ బిల్డ్ ఇండియా (95%), హెచ్డీఎఫ్సీ ఇన్ఫ్రా (92%), పైన్ బ్రిడ్జ్ ఇన్ఫ్రా (92%), ఎల్అండ్టీ ఇన్ఫ్రా (84%).