ఇన్‌ఫ్రా రంగానికి చెందిన షేర్లలో ఇన్వెస్ట్ | invest in infra sector shares | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫ్రా రంగానికి చెందిన షేర్లలో ఇన్వెస్ట్

Published Sun, Nov 16 2014 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

ఇన్‌ఫ్రా రంగానికి చెందిన షేర్లలో ఇన్వెస్ట్

ఇన్‌ఫ్రా రంగానికి చెందిన షేర్లలో ఇన్వెస్ట్

ఇవి కేవలం ఇన్‌ఫ్రా రంగానికి చెందిన షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఇన్‌ఫ్రా నిర్వచనం చాలా విస్తృతమైనది కావడంతో ఈ పరిధిలోకి చాలా రంగాలు అంటే.. ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, లోహాలు, బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్ ఇలా పలు రకాలకు రంగాలకు చెందిన షేర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్రస్తుత ర్యాలీలో ఇన్‌ఫ్రా ఫండ్స్ ముందంజలో ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం వల్ల బాగా దెబ్బతిన్న ఈ రంగాన్ని మోడీ ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొస్తుందన్న ఆశతో ఈ రంగానికి చెందిన షేర్లు బాగా పెరిగాయి.

గతేడాది కాలంలో ఈ ఫండ్స్‌లో చాలా మటుకు 80 శాతానికిపైనే రాబడిని అందించాయి. కానీ ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. 2008లో స్టాక్ మార్కెట్లు బూమ్‌లో ఉన్నప్పుడు ఇన్‌ఫ్రా ఫండ్స్  కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. ఆ సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారు ఇప్పటికీ చాలామంది నష్టాల్లోనే ఉన్నారు. ఉదాహరణకు ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫ్రా ఫండ్‌నే తీసుకుందాం... ఈ ఏడాది కాలంలో ఈ ఫండ్ 84 శాతం రాబడిని అందించింది.

కాని 2007లో ఈ ఫండ్ యూనిట్ రూ. 10కు ఎన్‌ఎఫ్‌వోకి వస్తే ఇప్పుడు  ఆ యూనిట్ విలువ రూ. 10.17 మాత్రమే. అంటే ఎన్‌ఎఫ్‌వో సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పటి వరకు ఒక శాతం కూడా లాభాలు రాలేదు. దీనికి కారణం మధ్యలో ఇన్‌ఫ్రా రంగం బాగా దెబ్బతినడంతో ఈ ఫండ్స్ యూనిట్ విలువలు కూడా బాగా దెబ్బతిన్నాయి.

 అందుబాటులో ఉన్న కొన్ని ఇన్‌ఫ్రా ఫండ్స్ : రెలిగేర్ ఇన్‌ఫ్రా (98%), ఫ్ల్రాంకిన్ బిల్డ్ ఇండియా (95%), హెచ్‌డీఎఫ్‌సీ ఇన్‌ఫ్రా (92%), పైన్ బ్రిడ్జ్ ఇన్‌ఫ్రా (92%), ఎల్‌అండ్‌టీ ఇన్‌ఫ్రా (84%).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement