metals
-
మార్కెట్ అల్లకల్లోలం
లోక్‌సభ తాజా ఫలితాలలో ఎన్డీఏ 300 సీట్లకంటే తక్కువకు పరిమితం కానున్నట్లు స్పష్టమవడంతో ఇన్వెస్టర్లు ఒక్కసారిగా ఆందోళన చెందారు. మార్కెట్ ఆరంభం నుంచే అమ్మకాలకు దిగారు. దీంతో సెన్సెక్స్ 6,234 పాయింట్లు, నిఫ్టీ 1,982 పాయింట్ల చొప్పున కుప్పకూలాయి. చివరికి కొంత కోలుకుని 4,390 పాయింట్ల నష్టంతో 72,079 వద్ద సెన్సెక్స్ నిలిచింది. 1,379 పాయింట్లకు నిఫ్టీ నీళ్లొదులుకుని 21,885 వద్ద ముగిసింది.ఇది రెండు నెలల కనిష్టంకాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్ 70,234కు పడిపోయింది. వెరసి ఎగ్జిట్ పోల్స్ కారణంగా సోమవారం ఇన్వెస్టర్లకు అందిన 3 శాతం లాభాలు ఒక్క రోజు తిరగకుండానే ఆవిరయ్యాయి. అంతేకాకుండా రికార్డ్ గరిష్టాలు 76,469, 23,264 పాయింట్ల స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ గత నాలుగేళ్లలోలేని విధంగా భారీగా పతనమయ్యాయి! ఇంతక్రితం కోవిడ్–19 మహమ్మారి కట్టడికి కేంద్రం లాక్డౌన్ ప్రకటించడంతో దేశీ స్టాక్ మార్కెట్లు 2020 మార్చి 23న ఇంతకంటే అధికంగా 13 % కుప్పకూలిన సంగతి తెలిసిందే!! పీఎస్‌యూ షేర్లు ఫట్ మోడీ ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ లభించకపోవడంతో ప్రభుత్వ రంగ కౌంటర్లు తీవ్రంగా నష్టపోయాయి. ప్రధానంగా ఆర్ఈసీ 24 శాతం, పీఎఫ్సీ 22%, బీఈఎంఎల్, కంకార్, బీఈఎల్, బీహెచ్ఈఎల్ 19%, హెచ్ఏఎల్ 17%, ఓఎన్జీసీ, మజ్గావ్ డాక్ 16%, రైల్‌టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా 14%, ఆర్వీఎన్ఎల్ 13%, ఐఆర్సీటీసీ, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్ 12% చొప్పున దిగజారాయి. ఇక పీఎస్‌యూ బ్యాంక్స్‌లో యూనియన్ బ్యాంక్, బీవోబీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, ఎస్బీఐ 18–13% మధ్య కుప్పకూలాయి. దీంతో పీఎస్ఈ ఇండెక్స్ 16%పైగా క్షీణించింది. ఎన్ఎస్ఈలో బ్యాంకెక్స్ 2022 ఫిబ్రవరి తదుపరి అత్యధికంగా 8% పతనమైంది. ఎదురీదిన ఎఫ్ఎంసీజీ.. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో అన్ని రంగాలూ దెబ్బతిన్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్, మెటల్, చమురు, రియలీ్ట, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ 15–6 శాతం మధ్య పతనమయ్యాయి. ఎఫ్ఎంసీజీ మాత్రం 1 శాతం బలపడింది. ప్రభుత్వేతర దిగ్గజాలలో ఎల్అండ్టీ, శ్రీరామ్ ఫైనాన్స్,టాటా స్టీల్, ఇండస్ఇండ్, హిందాల్కో, ఐసీఐసీఐ, జేఎస్‌డబ్ల్యూ, భారతీ, యాక్సిస్ 16–7 శాతం మధ్య క్షీణించాయి. అయితే హెచ్‌యూఎల్, బ్రిటానియా, నెస్లే, హీరో మోటో, టాటా కన్జూమర్ 6–2 % మధ్య జంప్ చేశాయి.అదానీ గ్రూప్ బేర్.. అదానీ గ్రూప్ కౌంటర్లు భారీగా పతనమై ముందురోజు ఆర్జించిన లాభాలను పోగొట్టుకోవడంతోపాటు మరింత నష్టపోయాయి. అదానీ పోర్ట్స్ 21 శాతం, ఎనర్జీ సొల్యూషన్స్ 20 శాతం దిగజారగా.. గ్రీన్ ఎనర్జీ, ఎంటర్ప్రైజెస్, టోటల్ గ్యాస్, ఎన్డీటీవీ 19 శాతం, అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ 17 శాతం చొప్పున పతనమయ్యాయి. ఏసీసీ 15 శాతం, అదానీ విల్మర్ 10 శాతం పడ్డాయి. అత్యధిక శాతం షేర్లు కొనేవాళ్లులేక లోయర్ సర్క్యూట్లను తాకాయి. ఫలితంగా గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువకు ఒక్క రోజులో రూ. 3.64 లక్షల కోట్లమేర కోతపడింది. రూ. 15.78 లక్షల కోట్లకు పరిమితమైంది. -
శ్యామ్ మెటాలిక్స్ షేర్ల జారీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ను చేపట్టింది. తద్వారా రూ. 1,385 కోట్లు సమీకరించినట్లు తాజాగా వెల్లడించింది. మొత్తం 38 సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 2.40 కోట్లకుపైగా షేర్లను కేటాయించినట్లు తెలియజేసింది. రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 576 ధరలో జారీ చేసినట్లు తెలియజేసింది. క్విప్ కమిటీ షేర్ల జారీని అనుమతించినట్లు బుధవారం పేర్కొంది. కాగా.. క్విప్ నేపథ్యంలో సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీలో పబ్లిక్కు కనీస వాటాకు వీలు కలిగినట్లు వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో ఈక్విటీ జారీ ప్రణాళికలేవీలేవని స్పష్టం చేసింది. తాజాగా సమీకరించిన నిధుల సహాయంతో బ్యాంకుల నుంచి తీసుకుంటున్న వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను తగ్గించుకోనున్నట్లు తెలియజేసింది. నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొంది. తద్వారా వృద్ధిని వేగవంతం చేయనున్నట్లు వివరించింది. క్విప్ నేపథ్యంలో శ్యామ్ మెటాలిక్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 667 వద్ద ముగిసింది. -
ఐటీ, మెటల్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఫైనాన్స్, మెటల్, ఫైనాన్స్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. కీలక వడ్డీ రేట్లను నిర్ణయించే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు(మినిట్స్), ఉపాధి కల్పన డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ తయారీ రంగం డిసెంబర్లో 19 నెలల కనిష్టానికి క్షీణించి 54.9 స్థాయికి దిగిరావడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 539 పాయింట్లు నష్టపోయి 71,357 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 149 పాయింట్లు క్షీణించి 21,517 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 588 పాయింట్లు క్షీణించి 71,304 వద్ద, నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 21,500 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. నష్టాల మార్కెట్లోనూ వినిమయ, సరీ్వసెస్, రియల్టీ, విద్యుత్, ఫార్మా రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.666 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.863 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో, చైనాలో డిమాండ్ తగ్గుదల ఆందోళనలతో మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దేశీయ ఐటీ రంగ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అదానీ షేర్ల పరుగు.. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో బుధవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 12%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ గ్రూప్ ఎనర్జీ 6%, అదానీ పవర్ 5% చొప్పున లాభపడ్డాయి. అదానీ విల్మార్ 4%, ఎన్డీటీవీ 3.50%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.50%, అదానీ పోర్ట్స్ 1.30%, అంబుజా సిమెంట్స్ 1%, ఏసీసీ 0.10% పెరిగాయి. ఫలితంగా అదానీ గ్రూప్ 10 కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.64,189 కోట్లు పెరిగి రూ.15.11 లక్షల కోట్లకు చేరింది. -
చంద్రుడిపై ఖనిజాలను గుర్తించిన చంద్రయాన్-3
బెంగుళూరు: చంద్రయాన్-3 ల్యాండర్ నుండి కిందికి దిగిన రోవర్ చంద్రుడి ఉపరితలంపై తిరుగాడుతూ పరిశోధనలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో రోవర్ చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుగొంది. ఈ విషయాన్ని ఇస్రో అధికారికంగా ధృవీకరించింది. శివ శక్తి పాయింట్ వద్దనున్న ల్యాండర్ నుండి జాబిల్లి నేలపైకి జారుకున్న రోవర్ మరుక్షణం నుంచే కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైంది. చంద్రుడి ఉపరితలం యొక్క ఉష్ణగ్రత వివరాలను ఇదివరకే ఇస్రోకు చేరవేసిన రోవర్ ఇప్పుడు చంద్రుడిపై పలు ఖనిజాల జాడను కనుగొంది. ఈ క్రమంలో రోవర్‌లోని లేజర్-ప్రేరిత బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) పరికరం దక్షిణ ధృవంలోని చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్ (S) ఉనికి పుష్కలంగా ఉన్నట్లు నిర్ధారించింది. చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు కూడా పుష్కలంగా ఉన్నటు గుర్తించింది. అలాగే క్రోమియం(Cr), టైటానియం(Ti), కాల్షియం(Ca), మాంగనీస్(Mn), సిలికాన్(Si), అల్యూమినియం(Al), ఇనుము(Fe) వంటి మరికొన్ని ఖనిజాలు కూడా ఉన్నట్లు గుర్తించింది. హైడ్రోజన్ కోసం ఇంకా రోవర్ పరిశోధిస్తోందని తెలిపింది ఇస్రో. Chandrayaan-3 Mission: In-situ scientific experiments continue ..... Laser-Induced Breakdown Spectroscope (LIBS) instrument onboard the Rover unambiguously confirms the presence of Sulphur (S) in the lunar surface near the south pole, through first-ever in-situ measurements.… pic.twitter.com/vDQmByWcSL — ISRO (@isro) August 29, 2023 ఇది కూడా చదవండి: అది వారికున్న పాత అలవాటే.. జయశంకర్ -
ఉంగరం ఒంటికి ఆనే చోట చర్మం నల్లగా అవుతోందా?
ఉంగరం లేదా ఆభరణం వంటిది ధరించినప్పుడు... అది అనుకునే చోట కొందరిలో చర్మం రంగు మారుతుంది. ఒక్కోసారి అక్కడ నల్లబారుతుంది. ఇలా రంగు మారడానికి ‘కాంటాక్ట్ డర్మటైటిస్’ అనే సమస్య కారణం కావచ్చు. ఉంగరాన్ని «ధరించే మనం స్నానం చేయడంతో ముఖం కడుక్కునే సమయంలో సబ్బు వాడటం వల్ల... దాని తాలూకు డిటెర్జెంట్ ఉపయోగిస్తుంటే దాని మిగిలిపోయిన భాగం (రెసిడ్యూ) ఉంగరం / ఆభరణం వెనక ఉండిపోతుంది. అది చర్మంపై చూపే ప్రతిచర్యతో చర్మం నల్లబారడం లేదా అలర్జీలా రావడం జరగవచ్చు. అంతేకాదు... ఉంగరం లేదా ఆభరణాల్లో ఉండే ఇతర లోహాల (అల్లాయ్స్) వల్ల కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంది. ఇలా జరిగినప్పుడు చేయాల్సిన పనులు.. ఉంగరాన్ని / ఆభరణాన్ని తీసి, శుభ్రపరచి మళ్లీ ధరించాలి. ఇలా తరచూ శుభ్రం చేసుకుని మళ్లీ తొడుగుతూ ఉండటం మేలు. చేతులు కడుక్కునే సమయంలో ఉంగరం వెనక ఎలాంటి సబ్బుగానీ లేదా రెసిడ్యూగానీ మిగలని విధంగా శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. లేదా ఉంగరం తీసి కడుక్కుని... వేళ్లు పొడిగా మారాక తొడుక్కోవాలి. ఇతర ఆభరణాల విషయంలోనూ ఇదే జాగ్రత్త తీసుకోవచ్చు. ఉంగరాన్ని వేరే వేలికి తొడిగేందుకు అవకాశం ఉంటే, అలా కూడా మార్చి చూడవచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా నలుపు తగ్గకపోతే... చర్మనిపుణులు సూచించిన మందుల్ని, వారు సూచించినంత కాలం వాడాలి. ఇలాంటి సందర్భాల్లో చర్మం నల్లగా మారిన చోట డాక్టర్ సలహా మేరకు హ్యాలోమెటాజోన్ వంటి మైల్డ్ కార్టికోస్టెరాయిడ్ ఉన్న క్రీమును రెండు వారాలు లేదా డాక్టర్ నిర్దేశించినంత కాలం వాడాల్సి రావచ్చు. -
7వ రోజూ భలే దూకుడు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లలో అలుపెరుగకుండా రంకెలేస్తున్న బుల్ మరోసారి విజృంభించింది. సూచీలు వరుసగా 7వ రోజూ హైజంప్ చేశాయి. సెన్సెక్స్ 460 పాయింట్లు ఎగసి 61,766 వద్ద నిలవగా.. నిఫ్టీ 139 పాయింట్లు ఎగసి 18,477 వద్ద ముగిసింది. ప్రధానంగా మెటల్, బ్యాంకింగ్, ఐటీలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 61,963కు చేరగా.. నిఫ్టీ 18,543 పాయింట్లను అధిగమించింది. వెరసి అటు ముగింపు, ఇటు ఇంట్రాడేలోనూ మార్కెట్లు చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి! విదేశీ మార్కెట్లలో కనిపిస్తున్న నిరుత్సాహకర ట్రెండ్‌ను సైతం లెక్కచేయకుండా సరికొత్త గరిష్టాలను చేరాయి. ఎన్ఎస్ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్ రంగాలు 4 శాతం జంప్‌చేయగా.. ఐటీ 1.6 శాతం ఎగసింది. లాభాల స్వీకరణ నేపథ్యంలో ఫార్మా, హెల్త్‌కేర్, మీడియా ఇండెక్సులు 0.7% బలహీనపడ్డాయి. ఇన్ఫోసిస్ జోరు నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో, ఇన్ఫోసిస్ 5 శాతం స్థాయిలో జంప్‌చేయగా.. టెక్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ, ఓఎన్జీసీ, మారుతీ, యాక్సిస్, ఎస్బీఐ 3.3–1.3 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే ఎంఅండ్ఎం, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్, బ్రిటానియా, బజాజ్ ఆటో, హీరో మోటో, సిప్లా, ఎయిర్టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సన్ ఫార్మా 2–0.5 శాతం మధ్య డీలాపడ్డాయి. ఈ ఏడాది క్యూ3(జులై–సెప్టెంబర్)లో చైనా జీడీపీ గణాంకాలు నిరాశపరచినప్పటికీ ఎంపిక చేసిన రంగాలలోని బ్లూచిప్ కౌంటర్లలో పెట్టుబడులు సెంటిమెంటుకు బలాన్నిచి్చనట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. క్యూ3లో చైనా ఆర్థిక వ్యవస్థ 4.9 శాతమే పుంజుకుంది. ఇందుకు పారిశ్రామికోత్పత్తి అంచనాలను అందుకోకపోవడం ప్రభావం చూపింది. బేస్ మెటల్ ధరలు బలపడటంతో మెటల్ షేర్లకు డిమాండ్ పెరిగినట్లు తెలియజేశారు. చిన్న షేర్లు ఓకే... బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1 శాతం స్మాల్ క్యాప్ 0.7 శాతం చొప్పున వృద్ధి చూపాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1,758 లాభపడగా.. 1,696 నీరసించాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నికరంగా రూ. 512 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) దాదాపు రూ. 1,704 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. ఇతర విశేషాలు.. ► పారస్ డిఫెన్స్ షేరు టీ గ్రూప్ నుంచి రోలింగ్ విభాగంలోకి బదిలీ కావడంతో 20% అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో రూ. 125 జమ చేసుకుని రూ. 750 వద్ద ముగిసింది. ► ఈ ఏడాది క్యూ2లో రెట్టింపు నికర లాభం ప్రకటించిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్(డీమార్ట్) షేరు తొలుత 11 శాతం దూసుకెళ్లి రూ. 5,900ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. చివర్లో లాభాల స్వీకరణ ఊపందుకుని చతికిలపడింది. 7.6% పతనమై రూ. 4,920 వద్ద స్థిరపడింది. ► కార్లయిల్ గ్రూప్‌నకు ప్రిఫరెన్స్ షేర్ల జారీ ద్వారా రూ. 4,000 కోట్లు సమకూర్చుకునే ప్రతిపాదనను విరమించుకోవడంతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు 5 శాతం లోయర్ సర్క్యూట్‌కు చేరింది. ఎన్ఎస్ఈలో రూ. 32 కోల్పోయి రూ. 607 వద్ద నిలిచింది. ► ఏడు వరుస సెషన్లలో మార్కెట్లు బలపడటంతో ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 12.49 లక్షల కోట్లమేర ఎగసింది. దీంతో బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,74,69,607 కోట్లకు చేరింది. ఇది సరికొత్త రికార్డు కావడం విశేషం! ► గత ఏడు రోజుల్లో ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 2,576 పాయింట్లు(4.4 శాతం) దూసుకెళ్లింది. -
Fact check: వ్యాక్సిన్‌తో అయస్కాంత శక్తి ... అసలు నిజం ఇది
మంగళూరు: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటే శరీరానికి అయస్కాంత లక్షణాలు వస్తున్నాయనే వార్తలు దేశమంతట నుంచి వినిపిస్తున్నాయి. దక్షిణ భారతం మొదలు ఈశాన్య భారతం వరకు చాలా మంది ఒంటికి కరెన్సీ బిళ్లలు, చెమ్చాలు, ప్లేట్లు అంటించుకుని సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు. గత వారం రోజులుగా ఈ తరహా వీడియోలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో వ్యాక్సినేషన్‌పై మరోసారి అనుమాన మేఘాలు ముసురుకుంటున్నాయి. పీఐబీ ఖండన వ్యాక్సిన్ వేసుకుంటే ఆయస్కాంత శక్తి వస్తోందంటూ వైరల్ అవుతోన్న వీడియోలపై ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్పందించింది. కోవిడ్ వ్యాక్సిన్లలో కరోనా వైరస్‌తో పోరాడే ఔషధాలే తప్ప శరీరానికి అయస్కాంత లక్షణాలు ఇచ్చే మరేవీ లేవని స్పష్టం చేసింది. వ్యాక్సిన్లు వేసుకోవడానికి ముందుకు రావాలని కోరింది. Several posts/videos claiming that #COVID19 #vaccines can make people magnetic are doing the rounds on social media. #PIBFactCheck: ✅COVID-19 vaccines do NOT make people magnetic and are completely SAFE Register for #LargestVaccineDrive now and GET VACCINATED ‼️ pic.twitter.com/pqIFaq9Dyt — PIB Fact Check (@PIBFactCheck) June 10, 2021 కర్నాటకలో కలకలం తాజాగా కర్నాటకలో ఉడుపి, బెంగళూరులలో ఇద్దరు మహిళలు ఇలాంటి పోస్టులు పెట్టడంతో నెట్టింట వైరల్‌గా మారాయి. వ్యాక్సిన్‌తో శరీరం అయస్కాంతంలా మారుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మంగళూరుకు చెందిన రేషనలిస్టు నరేంద్ర నాయక్. లోహపు వస్తువులు శరీరానికి అంటుకోవడానికి గల కారణాలను సైంటిఫిక్‌గా వివరించారు. కారణం ఇది కోవిడ్ వ్యాక్సిన్ అనంతరం అయస్కాంత శక్తి గురించి నరేంద్ర నాయక్ వివరిస్తూ ‘‘తలతన్యత (surface Tension) కారణంగానే శరీరానికి లోహపు వస్తువులు అంటుకుంటాయి, శరీర తత్వాలను బట్టి కొందరిలో ఈ తలతన్యత గుణం ఎక్కువగా ఉంటుంది. ఈసారి ఎవరైనా శరీరానికి లోహపు వస్తువులు అతుక్కుంటున్నాయని చెబితే... ఓసారి సబ్బుతో లేదా ఆల్కహాల్ శానిటైజర్‌తో ఎక్కడైతే లోహపు వస్తువులు ఆకర్షింపబడుతున్నాయని చెబుతున్నారో.... ఆ శరీర భాగాలను శుభ్రం చేయండి. ఆ తర్వాత ఆ శరీర భాగాన్ని టవల్‌తో తుడిచి పొడిగా మారేలా చూడాలి. అనంతరం ఆ శరీర భాగంపై లోహాపు వస్తువులు అంటివ్వమని కోరాలి...... ఇప్పుడు ఆ వస్తువులు వారి ఒంటికి అంటుకోవు. ఎందుకంటే సబ్బు, ఆల్కహాల్ శాటిటైజర్ కారణంగా తలతన్యత తగ్గిపోతుంది’ వివరించారు. నిజం కాదు లోహపు వస్తువులు శరీరారానికి అంటుకోవడానికి తలతన్యత తప్ప మరో కారణం లేదని ఆయన చెప్పారు. వ్యాక్సిన్ మాగ్నటిజం గురించి చెబతున్న వాళ్ల ఒంటికి రాగి వస్తువులు కూడా ఒంటికి అంటుకుంటున్నాయని. ఇది అయస్కాంత ధర్మాలకు విరుద్ధమని కూడా ఆయన తెలిపారు. చదవండి : Black Fungus: బెంగళూరులో ప్రమాద ఘంటికలు -
ఆకర్షణీయంగా హెల్త్‌కేర్, ఆటోమొబైల్
మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్నా, ఇది బబుల్ వేల్యుయేషన్ కాకపోవచ్చంటున్నారు యూటీఐ ఏఎంసీ ఫండ్ మేనేజర్ (ఈక్విటీ) వి. శ్రీవత్స. ఇన్వెస్టర్లు కొంత ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి సిద్ధపడి, ఈ స్థాయిలోనూ పెట్టుబడులను కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఆటోమొబైల్, హెల్త్‌కేర్, మెటల్స్ తదితర రంగాలు మధ్యకాలికంగా ఇన్వెస్ట్మెంట్కి ఆకర్షణీయంగా ఉన్నాయని సాక్షి బిజినెస్ బ్యూరోకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మరిన్ని వివరాలు.. ► ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, భవిష్యత్‌పై మీ అంచనాలేమిటి. ఈ ఏడాది మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కరోనా వైరస్ పరిణామాల కారణంగా తొలినాళ్లలో ప్రపంచ దేశాలతో పాటు భారత మార్కెట్లు కూడా భారీగా పతనమయ్యాయి. ఎకానమీ కూడా తీవ్రంగా దెబ్బతింది. అయితే, లాక్డౌన్ నిబంధనలను సరళతరం చేసి, ఆర్థిక కార్యకలాపాలు పునరుద్ధరించిన తర్వాత నుంచి మార్కెట్లు క్రమంగా సాధారణ స్థాయికి రావడం మొదలెట్టాయి. ఈ ఏడాది మార్చి కనిష్ట స్థాయి నుంచి రికార్డు స్థాయికి ర్యాలీ చేశాయి. డిమాండ్ పుంజుకుని, కార్పొరేట్లు మంచి ఆర్థిక ఫలితాలు ప్రకటించడం కూడా ఇందుకు ఊతమిచ్చింది. ప్రస్తుతం మార్కెట్లు సముచిత వేల్యుయేషన్లకు మించిన స్థాయిలో ట్రేడవుతున్నాయి. వైరస్ రిస్కు లు ఇంకా పొంచి ఉన్నందున కాస్త కన్సాలిడేషన్‌కు అవకాశం ఉంది. ► మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లకు మీ సలహా ఏంటి. మార్కెట్లు ఆల్‌టైమ్ గరిష్టాల్లో ట్రేడవుతూ, వేల్యుయేషన్లు కూడా సగటుకు మించిన స్థాయిలో ఉన్నప్పటికీ ఇవి బుడగలాగా పేలిపోయే బబుల్ వేల్యుయేషన్లని భావించడం లేదు. అలాగే, ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన స్థాయిలో అసంబద్ధమైన పరిస్థితులేమీ కూడా లేవు. కాబట్టి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించవచ్చు. అయితే, కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి మాత్రం సంసిద్ధంగానే ఉండాలి. ఇక మార్కెట్ హెచ్చుతగ్గులకు సంబంధించిన ప్రతికూల ప్రభావం పడకుండా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. దీనివల్ల ఒడిదుడుకుల మార్కెట్లో సగటు కొనుగోలు రేటు ఒక మోస్తరు స్థాయికి పరిమితం కాగలదు. ఏకమొత్తంగా పెట్టుబడి పెట్టాలంటే, దీర్ఘకాలిక సగటు కన్నా మార్కెట్లు చౌకగా ట్రేడవుతున్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయడం శ్రేయస్కరం. ► ఈక్విటీ ఇన్వెస్టర్లకు రాబోయే రోజుల్లో ఎలాంటి పెట్టుబడి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం కోవిడ్ సంబంధ బలహీన పరిస్థితుల నుంచి కోలుకుంటున్న దేశీ ఆధారిత పరిశ్రమలపై మరింతగా దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంది. ఇక ఆటోమొబైల్స్, క్యాపిటల్ గూడ్స్ వంటి కొన్ని దేశీయ పరిశ్రమల వేల్యుయేషన్లు దీర్ఘకాలిక సగటుల కన్నా తక్కువ స్థాయిలో ఉన్నాయి. వ్యయ నియంత్రణకు ప్రాధాన్యం పెరిగి, డిజిటల్ మాధ్యమం వైపు మళ్లుతుండటం వల్ల వినియోగదారులతో నేరుగా లావాదేవీలు జరిపే సంస్థలకు ఎంతో ఆదా కానుంది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణల ఊతంతో పాటు ఆకర్షణీయమైన వేల్యుయేషన్లలో ట్రేడవుతున్న యుటిలిటీస్ రంగ సంస్థలు కూడా ఆశావహంగానే ఉంటాయి. ► మధ్యకాలికంగా ఏయే రంగాలు మెరుగ్గా ఉండవచ్చు. వేటికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆటోమొబైల్స్, హెల్త్‌కేర్, మెటల్స్, యుటిలిటీస్, భారీ యంత్ర పరికరాలు మెరుగ్గా కనిపిస్తున్నాయి. సముచిత వేల్యుయేషన్లలో లభిస్తుండటం, మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండటం ఇందుకు కారణం. ఇక, ఫైనాన్షియల్స్, కన్జూమర్ గూడ్స్ షేర్ల విషయంలో కొంత అండర్‌వెయిట్‌గా ఉన్నాం. నాణ్యమైన బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల స్టాక్స్ చాలా ఖరీదైనవిగా మారడం ఇందుకు కారణం. ► మీరు నిర్వహిస్తున్న యూటీఐ హెల్త్‌కేర్ ఫండ్, యూటీఐ కోర్ ఈక్విటీ ఫండ్ పనితీరు ఎలా ఉంది. గత ఏడాది కాలంగా యూటీఐ హెల్త్‌కేర్ సెక్టార్ మెరుగ్గా రాణించడంతో పాటు బెంచ్‌మార్క్‌ను కూడా అధిగమించింది. ఫార్మా రంగం .. మొత్తం మార్కెట్‌కు మించిన పనితీరు కనబర్చింది. భవిష్యత్ వృద్ధి అవకాశాలు ఆశావహంగా ఉండటం ఇందుకు కారణం. మరోవైపు, యూటీఐ కోర్ ఈక్విటీ ఫండ్ అనేది ఎక్కువగా లార్జ్, మిడ్ క్యాప్ విభాగం స్టాక్స్‌పై ఆధారపడి ఉంటుంది. గత ఏడాది కాలంగా ఇది కాస్త ఆశించిన స్థాయి కన్నా తక్కువగానే రాణించింది. దీర్ఘకాలికంగా లాభదాయకత రికార్డు ఉండి, చౌక వేల్యుయేషన్స్‌లో లభించే సంస్థల్లో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. -
ఇన్ఫ్రా రంగానికి చెందిన షేర్లలో ఇన్వెస్ట్
ఇవి కేవలం ఇన్ఫ్రా రంగానికి చెందిన షేర్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. ఇన్ఫ్రా నిర్వచనం చాలా విస్తృతమైనది కావడంతో ఈ పరిధిలోకి చాలా రంగాలు అంటే.. ఆయిల్ అండ్ గ్యాస్, సిమెంట్, లోహాలు, బ్యాంకులు, క్యాపిటల్ గూడ్స్ ఇలా పలు రకాలకు రంగాలకు చెందిన షేర్లలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్రస్తుత ర్యాలీలో ఇన్ఫ్రా ఫండ్స్ ముందంజలో ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం వల్ల బాగా దెబ్బతిన్న ఈ రంగాన్ని మోడీ ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకొస్తుందన్న ఆశతో ఈ రంగానికి చెందిన షేర్లు బాగా పెరిగాయి. గతేడాది కాలంలో ఈ ఫండ్స్‌లో చాలా మటుకు 80 శాతానికిపైనే రాబడిని అందించాయి. కానీ ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి. 2008లో స్టాక్ మార్కెట్లు బూమ్‌లో ఉన్నప్పుడు ఇన్ఫ్రా ఫండ్స్ కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. ఆ సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారు ఇప్పటికీ చాలామంది నష్టాల్లోనే ఉన్నారు. ఉదాహరణకు ఎల్అండ్టీ ఇన్ఫ్రా ఫండ్‌నే తీసుకుందాం... ఈ ఏడాది కాలంలో ఈ ఫండ్ 84 శాతం రాబడిని అందించింది. కాని 2007లో ఈ ఫండ్ యూనిట్ రూ. 10కు ఎన్ఎఫ్వోకి వస్తే ఇప్పుడు ఆ యూనిట్ విలువ రూ. 10.17 మాత్రమే. అంటే ఎన్ఎఫ్వో సమయంలో ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పటి వరకు ఒక శాతం కూడా లాభాలు రాలేదు. దీనికి కారణం మధ్యలో ఇన్ఫ్రా రంగం బాగా దెబ్బతినడంతో ఈ ఫండ్స్ యూనిట్ విలువలు కూడా బాగా దెబ్బతిన్నాయి. అందుబాటులో ఉన్న కొన్ని ఇన్ఫ్రా ఫండ్స్ : రెలిగేర్ ఇన్ఫ్రా (98%), ఫ్ల్రాంకిన్ బిల్డ్ ఇండియా (95%), హెచ్డీఎఫ్సీ ఇన్ఫ్రా (92%), పైన్ బ్రిడ్జ్ ఇన్ఫ్రా (92%), ఎల్అండ్టీ ఇన్ఫ్రా (84%). -
బల్బుల ఫిలమెంట్‌లో ఉపయోగించే కఠినమైన లోహం?
రసాయన శాస్త్రం లోహశాస్త్రం లోహశాస్త్రం అత్యంత ప్రాచీనమైంది. వేదకాలం నుంచే రాగిని ఉపయోగిస్తున్నారు. బం గారం, ప్లాటినం లోహాలు ప్రకృతిలో స్వాభావికంగా లభిస్తున్నాయి. మిగిలినవన్నీ సంయోగ రూపంలో లభిస్తాయి. వీటినే ఖనిజాలు అంటారు. అన్ని ఖనిజాల నుంచి లోహాన్ని లాభసాటిగా నిష్కర్షణ చేయలేం. పారిశ్రామికంగా లోహాన్ని వేరు చేసే ఖనిజాన్ని ఆ లోహ ‘ధాతువు’ అంటారు. లోహాలు - వాటి ధాతువులు ఇనుము: హెమటైట్, మాగ్నటైట్, సిడరైట్ అల్యూమినియం: బాక్సైట్, క్రయొలైట్, కోరండం రాగి (కాపర్): కాపర్ పైరైటీస్, మాలకైట్ మెగ్నీషియం: మాగ్నసైట్, డోలమైట్ కాల్షియం: సున్నపురాయి (కాల్షియం కార్బొనేట్) యురేనియం: పిచ్‌బ్లెండ్ సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద మెర్క్యురీ (ద్రవం)తప్ప మిగిలినవన్నీ ఘన పదార్థాలే. సోడియం, పొటాషియం తప్ప మిగిలిన లోహాలన్నీ కఠినమైనవి. లోహాల్లోకెల్లా అత్యంత సాగే గుణం కలిగింది బంగారం. మంచి విద్యుద్వాహకం సిల్వర్. అరచేతిలో (శరీర ఉష్ణోగ్రత వద్ద) కరిగిపోయే లోహం గాలియం. భూ పటలంలో అత్యధికంగా లభించే లోహం అల్యూమినియం. రెండో స్థానంలో ఐరన్ ఉంటుంది. లోహ నిష్కర్షణ: ధాతువు నుంచి వివిధ భౌతిక రసాయనిక చర్యల ద్వారా లోహాన్ని వెలికితీసే పద్ధతినే లోహ నిష్కర్షణ అంటారు. ధాతువులో లోహంతోపాటు కలిసి ఉండే ఇసుక, బంకమట్టి, రాళ్లు, క్వార్టజ్ మొదలైన మలినాలను గాంగు అంటారు. ధాతువును గాలిలేకుండా బాగా వేడిచేసి బాష్పశీల మలినాలను తొలగించే పద్ధతిని భస్మీకరణం(కాల్షినేషన్) అంటారు. ఉదా: కాల్షియం కార్బొనేట్‌ను బట్టీలో వేడిచేస్తే కార్బన్‌డై ఆక్సైడ్ వేరుపడి, కాల్షియం ఆక్సైడ్ ఏర్పడుతుంది. మలిన లోహ ద్రవానికి కార్బన్ పొడి కలిపి పచ్చి కర్రలతో వేగంగా రుద్ది లోహాన్ని వేరు చేసే ప్రక్రియ పోలింగు. గాలి సమక్షంలో ధాతువును వేడిచేసే ప్రక్రియ భర్జనం. ధాతువు కరిగే ఉష్ణోగ్రతను తగ్గించడానికి కలిపే పదార్థాన్ని ద్రవకారి అంటారు. సాధారణంగా ఇనుమును శుద్ధి చేయడానికి బ్లాస్ట్ కొలిమిని ఉపయోగిస్తారు. బ్లాస్ట్ కొలిమిలో గరిష్ట ఉష్ణోగ్రత 1500నిఇ వరకు ఉంటుంది. బ్లాస్ట్ కొలిమిలో కోక్ అసంపూర్తిగా మండిన తర్వాత వచ్చిన ‘కార్బన్ మోనాక్సైడ్’ సమక్షంలో ఐరన్ ఆక్సైడ్ ఐరన్‌గా ‘క్షయకరణం’ చెందుతుంది. సుమారు 750నిఇ వద్ద కొలిమిలో ఏర్పడిన లోహం గుల్లబారి ఉంటుంది. దీన్నే ‘స్పాంజ్ ఇనుము’ అంటారు. ఇనుము రకాల్లో అత్యంత శుద్ధమైంది చేత ఇనుము. (అత్యల్ప కార్బన్ శాతం) ఉంటుంది. పిగ్ ఐరన్‌లో గరిష్ట శాతంలో కార్బన్ ఉంటుంది. ఎలక్ట్రో ప్లేటింగ్: లోహాల క్షయాన్ని నిరోధించడానికి, తుప్పు పట్టకుండా ఉండటానికి ఎలక్ట్రోప్లేటింగ్ లేదా గాల్వనైజింగ్ పద్ధతులను ఉపయోగిస్తారు. ఎలక్ట్రో ప్లేటింగ్ ద్వారా ఒక లోహంపై మరో లోహపు పూత పూస్తారు. ఈ పద్ధతిలో ఏ లోహంతో పూత పూయాలో ఆ లోహం ఉన్న ద్రావణాన్ని విద్యుద్వి శ్లేష్యంగా, ఏ లోహంపై పూత పూయాలో దాన్ని కాథోడ్‌గా తీసుకొని విద్యుద్విశ్లేషణ చేస్తారు. గాల్వనైజింగ్ పద్ధతిలో ఏదైనా లోహంపై పూత పూయడానికి ఉపయోగించే లోహం జింక్. మిశ్రమ లోహాలు: రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాల సజాతీయ మిశ్రమాన్ని మిశ్రమ లోహం అంటారు. మిశ్రమ లోహాలకు ఉన్నత ధర్మాలు వస్తాయి. తుప్పుపట్టే గుణం తక్కువ. మిశ్రమలోహంలో ఒక లోహం మెర్క్యురీ అయితే దాన్ని అమాల్గం అంటారు. ఐరన్, ప్లాటినం లోహలు మిశ్రమ లోహాలను ఏర్పరచవు. విగ్రహాల తయారీలో ఉపయోగించే పంచలోహాలు...గోల్డ్+ సిల్వర్+ కాపర్+ ఐరన్+ లెడ్. బంగారం, ప్లాటినం వంటి ఉన్నత లోహాలను కరిగించడానికి ద్రవరాజం (అక్వారీజియా) ఉపయోగిస్తారు. ఇది 3:1 నిష్పత్తిలో గాఢ హైడ్రోక్లోరికామ్లం, గాఢ నైట్రికామ్లాల మిశ్రమం. స్టీల్ (ఉక్కులో) సాధారణంగా కార్బన్ శాతం 0.1 నుంచి 2 వరకు ఉంటుంది. గతంలో అడిగిన ప్రశ్నలు 1. ఆహారపు పాత్రలకు టిన్ (తగరం)తో పూత పూస్తారు. కానీ జింక్‌తో కాదు. ఎందుకంటే? (కానిస్టేబుల్-2013) 1) తగరం కంటే జింక్ తక్కువ ప్రతిస్పందన (చర్యాశీలత) కలిగి ఉండటం వల్ల 2) జింకు తగరం కంటే ఖరీదైంది 3) జింక్, తగరం కంటే ఎక్కువ మెల్టింగ్ పాయింట్ కలిగి ఉండటం 4) జింక్, తగరం కంటే ఎక్కువ ప్రతిస్పందనను కలిగి ఉండటం జవాబు: 4 2. స్టెయిన్లెస్ స్టీలు దేని మిశ్రమం? (కానిస్టేబుల్ - 2012) 1) ఐరన్, నికెల్ 2) ఐరన్, క్రోమియం, నికెల్ 3) ఐరన్, క్రోమియం,జింక్ 4) ఐరన్, మాంగనీస్ జవాబు: 2. మాదిరి ప్రశ్నలు 1. అల్యూమినియం ప్రధానంగా ఏ ఖనిజం నుంచి లభిస్తుంది? 1) బాక్సైట్ 2) హెమటైట్ 3) మాగ్నసైట్ 4) సిడరైట్ 2. ఎర్రబాక్సైట్లో ఏది మలినంగా ఉంటుంది? 1) ఐరన్ ఆక్సైడ్ 2) సిలికా 3) కాపర్ ఆక్సైడ్ 4) ఏదీకాదు 3. పంచలోహంలో ఉండని లోహం ఏది? 1) బంగారం 2) వెండి 3) కాపర్ 4) టంగ్స్టన్ 4. భూమి పొరల్లో అంత్యంత విస్తారంగా లభించే లోహం ఏది? 1) అల్యూమినియం 2) ఐరన్ 3) కాపర్ 4) సిల్వర్ 5. ఏదైనా లోహం తుప్పుపట్టినపుడు దాని బరువు? 1) తగ్గుతుంది 2) పెరుగుతుంది 3) మారదు 4) లోహ స్వభావంపై ఆధారపడి ఉంటుంది 6. ఐరన్ తుప్పు పట్టినపుడు ఏర్పడే పదార్థం? 1) ఐరన్ కార్బైడ్ 2) ఐరన్ సల్ఫైడ్ 3) ఐరన్ ఆక్సైడ్ 4) ఐరన్ క్లోరైడ్ 7. బైరైటీస్ ఖనిజం ఏ లోహానికి సంబంధించింది? 1) కాల్షియం 2) బేరియం 3) ఐరన్ 4) కాపర్ 8. పైరైటీస్ ఖనిజం ప్రధానంగా ఏ లోహానికి సంబంధించినది? 1) అల్యూమినియం 2) గోల్డ్ 3) సిల్వర్ 4) కాపర్ 9. ఇత్తడి, కంచులో ఉండే సాధారణ లోహం ఏది? 1) జింక్ 2) మెగ్నీషియం 3) కాపర్ 4) అల్యూమినియం 10. జర్మన్ సిల్వర్‌లో లేని లోహం ఏది? 1) సిల్వర్ 2) కాపర్ 3) జింక్ 4) నికెల్ 11. లోహక్షయాన్ని నివారించడానికి ఏ లోహపు పూత పూస్తారు? 1) జింక్ 2) టిన్ 3) నికెల్ 4) పైఅన్నీ 12. భూమిలో స్వేచ్ఛాస్థితిలో లభించే లోహం ఏది? 1) బంగారం 2) సిల్వర్ 3) కాపర్ 4) పైవన్నీ 13. బల్బుల ఫిలమెంట్‌లో ఉపయోగించే కఠినమైన లోహం? 1) బంగారం 2) టంగ్స్టన్ 3) వెండి 4) ఇనుము 14. అత్యంత విద్యుద్వాహకత కల్గిన లోహం? 1) వెండి 2) బంగారం 3) అల్యూమినియం 4) రాగి 15. క్లోరోఫిల్‌లో ఉండే ప్రధాన లోహం? 1) ఐరన్ 2) మెగ్నీషియం 3) కాపర్ 4) జింక్ 16. రక్తంలోని ఎరుపు వర్ణదం హిమోగ్లోబిన్లో ఉండే లోహం? 1) ఐరన్ 2) మెగ్నీషియం 3) కాపర్ 4) జింక్ 17. ఎంజైముల్లో ఉండే ప్రధాన లోహం? 1) కాపర్ 2) జింక్ 3) ఐరన్ 4) అల్యూమినియం 18. వంటపాత్రలకు ఎక్కువగా ఉపయోగించే స్టీలు? 1) క్రోమ్ స్టీలు 2) స్టెయిన్లెస్ స్టీలు 3) టంగ్స్టన్ స్టీలు 4) ఇన్వార్ స్టీలు 19. కార్నలైట్ దేని ధాతువు? 1) రాగి 2) మెగ్నీషియం 3) కాల్షియం 4) జింక్ 20. ఎర్రని నేలలో ప్రధానంగా ఉండే లోహం? 1) ఐరన్ 2) కాల్షియం 3) అల్యూమినియం 4) రాగి 21. దుక్క ఇనుములో గల కార్బన్ శాతం? 1) 0-1 2) 0.2-2 3) 3-4 4) 5-10 22. శస్త్ర చికిత్స సాధనాలు తయారు చేయ డానికి ఉపయోగించే మిశ్రమలోహం? 1) స్టెయిన్లెస్ స్టీలు 2) టంగ్స్టన్ స్టీలు 3) ఇన్వార్ స్టీలు 4) క్రోమ్ స్టీలు 23. విద్యుత్ నిరోధాలు తయారు చేయడానికి ఉపయోగించే మిశ్రమలోహం? 1) గన్ మెటల్ 2) నిక్రోమ్ 3) స్టీలు 4) ఇన్వార్ 24. స్టెయిన్లెస్ స్టీలులో క్రోమియం శాతం? 1) 5-0 2) 12-20 3) 10-12 4) 6-10 25. లోహాల్లోకెల్లా అత్యంత సాగే గుణం కలిగింది? 1) బంగారం 2) రాగి 3) స్టీలు 4) ఇత్తడి సమాధానాలు: 1) 1; 2) 1; 3) 4; 4) 1; 5) 2; 6) 3; 7) 2; 8) 4; 9) 3; 10) 1; 11) 4; 12) 1; 13) 2; 14) 1; 15) 2; 16) 1; 17) 2; 18) 1; 19) 2; 20) 1; 21) 3; 22) 1; 23) 2; 24) 2; 25) 1. -
9 రోజుల ర్యాలీకి బ్రేక్
గత తొమ్మిది రోజులుగా లాభాలతో దూసుకెళుతున్న స్టాక్ మార్కెట్లు గురువారం తొలిసారి వెనకడుగు వేశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 54 పాయింట్లు క్షీణించి 27,086 వద్ద నిలవగా, 19 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 8,096 వద్ద స్థిరపడింది. ఇటీవల వరుస లాభాలను నమోదు చేస్తున్న మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ కోసం అమ్మకాలకు పాల్పడ్డారని నిపుణులు విశ్లేషించారు. గత తొమ్మిది రోజుల్లో సెన్సెక్స్ 826 పాయింట్లు జమ చేసుకున్న సంగతి తెలిసిందే. రియల్టీ బోర్లా: బీఎస్ఈలో ప్రధానంగా రియల్టీ ఇండెక్స్ 4.5% పతనమైంది. డీఎల్ఎఫ్ దాదాపు 9% దిగజారి రూ. 167 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ రూ. 2,803 కోట్లు తగ్గి రూ. 29,809 కోట్లకు పరిమితమైంది. డీఎల్ఎఫ్కు హర్యానాలోని వజీరాబాద్‌లో 350 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం 2010లో చేసిన ప్రతిపాదనను పంజాబ్, హర్యానా హైకోర్ట్ తాజాగా కొట్టివేయడంతో షేరు పతనమైంది. ఈ ప్రాజెక్ట్‌ను విడిగా(ఇండిపెండెంట్) అభివృద్ధి చేయతలపెట్టినందున ఈ ప్రభావం ఇతర ఏ ప్రాజెక్ట్‌లపైనా ఉండదని కంపెనీ పేర్కొంది. కాగా, ఈ భూమిని నెల రోజుల్లోగా అంతర్జాతీయ బిడ్డింగ్ ద్వారా వేలం వేయాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. బిడ్డింగ్‌లో డీఎల్‌ఎఫ్‌కూ అవకాశముంటుందని తెలిపింది. ఈ భూమిలో గోల్ఫ్ విల్లాలను నిర్మించాలని డీఎల్ఎఫ్ ప్రణాళికలు వేసింది. ఇక ఈ బాట లో యూనిటెక్, ఒబెరాయ్, డీబీ, అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్ 6-4% మధ్య నీరసించాయి. జేపీ 18% డౌన్: మరోపక్క కన్స్ట్రక్షన్ దిగ్గజం జేపీ అసోసియేట్స్ షేరు 18% కుప్పకూలింది. రూ. 38 వద్ద ముగిసింది. ప్రమోటర్ సంస్థ జేపీ ఇన్ఫ్రా వెంచర్స్ రూ. 62.4 కోట్ల విలువైన 1.45% వాటా(1.34 కోట్ల షేర్లు)ను ఓపెన్ మార్కెట్ ద్వారా విక్రయించడం దీనికి కారణమైంది. అయితే సామాజిక కోణంతోనే ప్రమోటర్లు షేర్లను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీలో ప్రమోటర్లకు 29.75% వాటా(72.36 కోట్ల షేర్లు) ఉన్నదని, తాజా అమ్మకంతో ఈ వాటా నామమాత్రంగా తగ్గి 28.3%కు చేరినట్లు తెలిపింది. ప్రమోటర్లకు కంపెనీపట్ల పూర్తి విశ్వాసం ఉన్నదని, ఇన్వెస్టర్లు, వాటాదారులు సైతం యాజమాన్యంపై నమ్మకముంచాలని కోరింది. -
25,550కు చేరిన సెన్సెక్స్
ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న సంకేతాలతో స్టాక్ మార్కెట్లకు జోష్వచ్చింది. చౌక ధరల గృహాలు, ఇన్ఫ్రా ఫైనాన్సింగ్‌కు ఆర్బీఐ మరింత వెసులుబాటును కల్పించడం దీనికి జత కలిసింది. వెరసి సెన్సెక్స్ గత రెండు వారాల్లోలేని విధంగా 321 పాయింట్లు ఎగసింది. వారం రోజుల గరిష్టం 25,550 వద్ద ముగిసింది. ఇంతక్రితం జూలై 2న మాత్రమే సెన్సెక్స్ ఈ స్థాయిలో 325 పాయింట్లు పుంజుకుంది. ఇక నిఫ్టీ కూడా 98 పాయింట్లు జంప్‌చేసి 7,624 వద్ద నిలిచింది. ద్రవ్యోల్బణం క్షీణించడం, పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడానికితోడు తాజాగా ఎగుమతులు పురోగమించడంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభిస్తున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో రెండు రోజుల్లో సెన్సెక్స్ 543 పాయింట్లు జమ చేసుకుందని చెప్పారు. చౌక ధరల గృహాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల ఫైనాన్సింగ్ నిబంధనలను ఆర్బీఐ సరళీకరించడంతో రియల్టీ ఇండెక్స్ 4.3% జంప్‌చేయగా, మెట ల్, బ్యాంకింగ్ రంగాలు సైతం 2.5% స్థాయిలో పురోగమించాయి. ఐడీఎఫ్సీ దూకుడు ఇన్ఫ్రా ఫైనాన్స్‌కు లభించిన ప్రోత్సాహంతో ఐడీఎఫ్సీ దాదాపు 9% ఎగసింది. ఇన్ఫ్రా షేర్లు ఐఆర్బీ, జేపీ అసోసియేట్స్, పుంజ్‌లాయిడ్, ఐవీఆర్సీఎల్, జీవీకే పవర్, ల్యాంకో ఇన్ఫ్రా, జీఎంఆర్ ఇన్ఫ్రా, ఎల్అండ్టీ 6-2% మధ్య పుంజుకున్నాయి. రియల్టీలో కోల్టేపాటిల్, యూనిటెక్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్, అనంత్‌రాజ్, ఇండియాబుల్స్, హెచ్‌డీఐఎల్, గోద్రెజ్ ప్రాపర్టీస్, మహీంద్రా లైఫ్ 8-3% మేరు పెరిగాయి. బ్యాంకింగ్‌లో ఐసీఐసీఐ, యాక్సిస్, బీఓఐ, ఎస్బీఐ, కెనరా, యస్ బ్యాంక్ 5-2% మధ్య లాభపడ్డాయి. మెటల్లో హిందాల్కో, టాటా స్టీల్, సెసాస్టెరిలైట్, జిందాల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 4-2% మధ్య పెరిగాయి. ఆటో దిగ్గజాలు మారుతీ, ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ సైతం 2% స్థాయిలో బలపడ్డాయి. బీఎస్ఈలో అన్ని రంగాలూ లాభపడగా... సెన్సెక్స్‌లో కేవలం5షేర్లు అదికూడా నామమాత్రంగా నష్టపోయాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.5%, 2% ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,990 లాభపడితే, 952 నష్టపోయాయి. -
స్టాక్ మార్కెట్లో సరికొత్త రికార్డు