
విస్తరణ ప్రాజెక్టులకు దన్నునిచ్చేందుకు వీలుగా మైనింగ్ దిగ్గజం వేదాంతా గ్లోబల్ భాగస్వామికోసం అన్వేషిస్తున్నట్లు పేర్కొంది. వివిధ విభాగాలలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో చేపట్టనున్న ప్రాజెక్టులకు మద్దతిచ్చే దిగ్గజంతో జత కట్టే యోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇది కంపెనీ భవిష్యత్తు కార్యకలాపాలకు ఎంతో తోడ్పడుతుందని చెప్పింది.
రానున్న మూడేళ్లలో భారీ విస్తరణ ప్రణాళికలు అమలు చేయనున్న కంపెనీ ఇందుకు ప్రపంచస్థాయిలో అనుభవమున్న ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్(ఈపీసీఎం) దిగ్గజం కోసం చూస్తున్నట్లు వెల్లడించింది. గ్రూప్ బిజినెస్‌లను వేదాంతా అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఐరన్ అండ్ స్టీల్ పేరుతో నాలుగు విభాగాలుగా విడదీయనుంది.
ఇదీ చదవండి: వడ్డీరేట్ల తగ్గింపు ప్రభావం ఎప్పటి నుంచంటే..
రానున్న మూడేళ్లలో మెటల్స్, మైనింగ్, హైడ్రోకార్బన్స్‌పై 20 బిలియన్ డాలర్లు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఇందుకు ఆసక్తిగల కంపెనీల నుంచి ఈ ఏప్రిల్ 30లోగా ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌ను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ఇంతక్రితం ప్రకటించిన విడదీత ప్రణాళికలను జూన్–జులైకు వాయిదా వేసింది.