న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ను చేపట్టింది. తద్వారా రూ. 1,385 కోట్లు సమీకరించినట్లు తాజాగా వెల్లడించింది. మొత్తం 38 సంస్థాగత ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలకు 2.40 కోట్లకుపైగా షేర్లను కేటాయించినట్లు తెలియజేసింది. రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 576 ధరలో జారీ చేసినట్లు తెలియజేసింది. క్విప్ కమిటీ షేర్ల జారీని అనుమతించినట్లు బుధవారం పేర్కొంది.
కాగా.. క్విప్ నేపథ్యంలో సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీలో పబ్లిక్‌కు కనీస వాటాకు వీలు కలిగినట్లు వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో ఈక్విటీ జారీ ప్రణాళికలేవీలేవని స్పష్టం చేసింది. తాజాగా సమీకరించిన నిధుల సహాయంతో బ్యాంకుల నుంచి తీసుకుంటున్న వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను తగ్గించుకోనున్నట్లు తెలియజేసింది. నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొంది. తద్వారా వృద్ధిని వేగవంతం చేయనున్నట్లు వివరించింది.
క్విప్ నేపథ్యంలో శ్యామ్ మెటాలిక్స్ షేరు బీఎస్‌ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 667 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment