75 శాతం దిగువకు చేరనున్న ప్రభుత్వ వాటా
పబ్లిక్‌కు కనీస వాటా నిబంధన అమలుపై దృష్టి
జాబితాలో ఐవోబీ, యుకోసహా ఐదు బ్యాంకులు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్ర ప్రభుత్వం కొంతమేర వాటాలను విక్రయించనుంది. పబ్లిక్‌కు కనీసం 25 శాతం వాటా నిబంధన(ఎంపీఎస్) అమలులో భాగంగా ఐదు బ్యాంకుల్లో వాటాలను ఆఫర్ చేయనుంది. ఈ జాబితాలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సీబీఐ), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్(ఐవోబీ), యుకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్(పీఎస్‌బీ) ఉన్నట్లు ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ వివేక్ జోషీ పేర్కొన్నారు.
2023 మార్చి 31కల్లా మొత్తం 12 పీఎస్‌యూ బ్యాంకుల్లో 4 ఎంపీఎస్ నిబంధనలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరో 3 ప్రభుత్వ రంగ బ్యాంకులు 25 శాతం ఎంపీఎస్‌ను సాధించినట్లు పేర్కొన్నారు. ఇకపై మిగిలిన 5 బ్యాంకులు సైతం నిబంధనలను అందుకునే కార్యాచరణకు తెరతీయనున్నట్లు తెలియజేశారు.
ప్రస్తుత తీరిలా: ప్రస్తుతం పీఎస్‌బీలో కేంద్ర ప్రభుత్వం 98.25 శాతం వాటాను కలిగి ఉంది. ఈ బాటలో ప్రభుత్వానికి ఐవోబీలో 96.38 శాతం, యుకో బ్యాంక్‌లో 95.39 శాతం, సెంట్రల్ బ్యాంక్‌లో 93.08 శాతం, బ్యాంక్ మహారాష్ట్రలో 86.46 శాతం చొప్పున వాటాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment