Shyam
-
ఓ దొంగతనం.. ఆపై పంచాయితీ..
వట్పల్లి (అందోల్): దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తల్లీకుమారుడు ఆత్మహత్యా యత్నం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సంగారెడ్డికి చెందిన ఓ వ్యక్తి అందోలు మండలం చింతకుంట గ్రామంలో జరిగిన విందుకు ఆదివారం టాటా ఏస్ వాహనంలో వచ్చాడు. సోమవారం తిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకొని వాహనాన్ని గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో నిలిపాడు. అదే గ్రామానికి చెందిన తాగుడుకు బానిసైన వడ్ల శ్యామ్ (21) ఆ వాహనాన్ని అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎత్తుకెళ్లాడు. కౌడిపల్లి మండలం బుజరంపేట గ్రామ శివారుకు వెళ్లగానే వాహనం కాల్వలో ఇరుక్కుపోయింది. దానిని బయటకు తీసే ప్రయత్నంలో భారీ శబ్ధం రావడంతో చుట్టుపక్కల వారు లేచి దొంగ దొంగ అని అరిచారు. దీంతో శ్యామ్ వెంటనే సమీపంలోని ఓ బైక్‌ను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. బుజరంపేట గ్రామస్తులు దుంపలకుంటలోని సీసీ ఫుటేజీని పరిశీలించి వడ్ల శ్యామ్‌ను గుర్తించారు. గ్రామ పెద్దలతో సమావేశమై శ్యామ్‌ను తమకు అప్పగించాలని, లేకపోతే వాహనాన్ని ఇచ్చేది లేదని హెచ్చరించారు. అనంతరం శ్యామ్ తండ్రి యాదయ్యను పిలిపించి జరిగిన విషయాన్ని వివరించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం శ్యామ్ అతడి తల్లిదండ్రులు యాదయ్య, బాలమణి (46), చిన్నమ్మ మమత బుజరంపేటకు పంచాయితీకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. తండ్రి, చిన్నమ్మ బస్‌లో బయలుదేరగా, శ్యామ్ తల్లి బాలమణితో బైక్‌పై బయలుదేరాడు. చింతకుంట బ్రిడ్జిపైకి రాగానే బైక్‌ను ఆపి మొదట శ్యామ్ మంజీరా నీళ్లలోకి దూకగా, అనంతరం తల్లి దూకింది. విషయం తెలుసుకున్న జోగిపేట, చిలప్‌చెడ్ పోలీసులు వేర్వేరుగా గాలింపు చర్యలు చేపట్టినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. -
విచారణ జరిపించాలి..
డాక్టర్ కావాలని ఎంతో కష్టపడి చదివి ‘నీట్’ పరీక్షకు హాజరైన లక్షలాది విద్యార్థుల ఆశలపై ఆ పరీక్షల ఫలితాలు నీళ్లు చల్లాయి. ఎన్నడూ లేనివిధంగా 67 మందికి 720 మార్కులకు 720 రావడం, అలా వచ్చినవారిలో పలువురు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్ష రాయడం విద్యార్థులనే కాక, వారి తల్లి తండ్రులనూ నిరుత్తరులను చేసింది.దీనికి తోడు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వందలాదిమందికి పరీక్షానిర్వహణ సంస్థ ఎన్టీఏ గ్రేస్ మార్కులను ఇవ్వడం కూడా విమర్శలకు దారితీసింది. ప్రజల ఆందోళనల నేపథ్యంలో చివరికి గ్రేస్ మార్కులను ఎన్టీఏ ఉపసంహరించుకుంది. కాని, పరీక్షల నిర్వహణలో మాత్రం ఎటువంటి అవకతవకలూ జరగలేదని అనడమే విడ్డూరంగా ఉంది.ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే’ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని... కీలకమైన నీట్ పరీక్షపై ఆరోపణలు, అనుమానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ మాట్లాడకపోవడం విద్యార్థుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అర్థమవుతుంది. నీట్ పరీక్ష మాత్రమే కాక దేశంలోని ఎన్నో పోటీ పరీక్షలను ఎన్టీఏ నిర్వహిస్తోంది. తాజాగా బయటపడ్డ వివాదస్పద అంశాల కారణంగా దానిపై విద్యార్థులు నమ్మకం కోల్పోయే పరిస్థితి వచ్చింది.ప్రతిసారీ ఉత్తరాది రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువగా ర్యాంక్‌లు రావడం, దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులకు తక్కువ ర్యాంకులు రావడంపై దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు అనేక అనుమానాలు కల్గుతున్నాయి.ఈ మొత్తం వ్యవహారంపై కేంద్రం సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించి అవకతవకలు ఉన్నవని తేలితే బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా లబ్ధిపొందిన వారిపైనా చర్యలు తీసుకోవాలి. నీట్లో జరిగిన అక్రమాల కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. – గడ్డం శ్యామ్, పీడీఎస్‌యూ తెలంగాణ ఉపాధ్యక్షుడు -
మోదీపై పోటీ.. కమెడియన్ నామినేషన్ తిరస్కరణ
లోక్‌సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే ఆకర్షిస్తోంది. అక్కడ పోటీ చేస్తేది.. ప్రధాని మోదీ కాబట్టి. అయితే మోదీపై పోటీ చేయడానికి కమెడియన్ శ్యామ్ రంగీలా వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ప్రధాని నరేంద్ర మోదీ వాయిస్‌ను అనుకరించటం వల్ల ఫేమస్ అయిన శ్యామ్ రంగీలా.. మే 14న వారణాసి స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సెగ్మెంట్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా నామినేషన్ వేశారు. ఒక రోజు తర్వాత ఆయన నామినేషన్‌ను తిర్కరించినట్లు ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపర్చింది. వారణాసిలో తనను నామినేషన్ వేయనీయకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.‘‘నన్ను ప్రతిపాదించేవారు ఉన్నారు. సంబందిత పత్రాలు కూడా నింపాం. ఆమోదించడానిక ఎవరు ముందుకు రావటం లేదు. రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాం’’ అని మే 13న శ్యామ్ రంగీలా అన్నారు. మరుసటి రోజు కూడా అధికారులు సహరించలేదని తెలిపారు. అనంతరం ఎట్టకేలకు నిబంధంనల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్యామ్ రంగీలా నామినేష్‌ను తిరస్కరణకు గురైంది. దీనిపై బుధవారం శ్యామ్ రంగీలా స్పదించారు. ‘‘ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. ఎన్నికల్లో పోటీ చేయటాన్ని ఎన్నికల సంఘం ఒక ఆటలా భావిస్తోంది. నా నామినేషన్‌ను తిరస్కరించారు. ప్రజల ముందు ఎన్నికల అధికారుల ఇలా ఎందుకు చేశారో? 24 గంటల్లోనే ప్రజలకు అర్థం అయింది. నేను సమర్పించిన పత్రాల్లో ఎటువంటి సమస్య లేదు. నాకు తెలుసు నేను అన్ని అవసరమైన పత్రాలు సమర్పించాను. నిన్నటి విజయం నేడు ఓడి పోయింది’’ అని శ్యామ్ రంగీలా అన్నారు.ఇక.. రాజస్థాన్‌లోని హనుమాన్‌గర్హ్ జిల్లాలోని మనక్తేరి బరనీ గ్రామంలో 1994లో పుట్టిన ఆయన అసలు పేరు శ్యామ్ సుందర్. యానిమేషన్ పట్టభద్రుడైన శ్యామ్ సరదాగా కామెడీ, మిమిక్రీ, స్టాండప్ కామెడీ చేస్తుండేవాడు. 2017లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ పోటీలో నరేంద్ర మోదీ వాయిస్‌ను శ్యామ్ మిమిక్రీ చేశాడు. అప్పటి నుంచే ఆయన విశేష గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ చేసిన తర్వాత శ్యామ్‌కు వేధింపులు మొదలయ్యాయి. శ్యామ్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని విమర్శలు చేస్తూ సంచలనం రేపారు. వారణాసి పార్లమెంట్ స్థానానికి ఏడో విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. -
ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత ఇలా.. సంతోషంగా ఉంది!
India's 85th chess Grandmaster- దుబాయ్: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అనుకున్నది సాధించాడు తమిళనాడు చెస్ ప్లేయర్ శ్యామ్ నిఖిల్. 31 ఏళ్ల శ్యామ్ నిఖిల్భారత చెస్‌లో 85వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించాడు. జీఎం హోదా దక్కాలంటే చెస్ ప్లేయర్ 2500 ఎలో రేటింగ్‌ను దాటడంతోపాటు మూడు జీఎం నార్మ్‌లు సాధించాలి. ఈ రెండూ సాధ్యమైతేనే జీఎం హోదా లభిస్తుంది. 2012లోనే శ్యామ్ 2500 ఎలో రేటింగ్‌ను అందుకోవడంతోపాటు రెండు జీఎం నార్మ్‌లు సాధించాడు. అయితే చివరిదైన మూడో జీఎం నార్మ్ కోసం సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వచ్చింది.12 ఏళ్లపాటు వేచి చూశాక ఎట్టకేలకు శ్యామ్ నిఖిల్ దుబాయ్ పోలీస్ మాస్టర్స్ ఓపెన్ చెస్ టోర్నీలో జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను అందుకున్నాడు. ఈ టోర్నీలో శ్యామ్ నిఖిల్ ఐదు పాయింట్లతో 39వ ర్యాంక్‌లో నిలిచాడు. చాలా సంతోషంగా ఉందిఈ క్రమంలో ఏడుగురు గ్రాండ్మాస్టర్లతో తలపడిన శ్యామ్ ఒకరిపై గెలిచి, ఆరుగురితో ‘డ్రా’ చేసుకొని మూడో జీఎం నార్మ్‌ను సాధించాడు. ‘ఎనిమిదేళ్ల వయస్సులో చెస్ ఆడటం ప్రారంభించాను. అయితే మూడేళ్లపాటు ఏ టోర్నీలోనూ ఆడలేదు. ఆ తర్వాత అండర్–13 రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాను. 2012లోనే రెండు జీఎం నార్మ్‌లు అందుకున్నా మూడో జీఎం నార్మ్ సులభంగా రాలేదు. పలుమార్లు చేరువై దూరమయ్యాను. ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత మూడో జీఎం నార్మ్ అందుకోవడంతో చాలా సంతోషంగా ఉంది’ అని 2022లో కామన్వెల్త్ చాంపియన్‌గా నిలిచిన శ్యామ్ నిఖిల్ వ్యాఖ్యానించాడు. -
Lok Sabha Election 2024: మోదీకి ఆయన స్టైల్లోనే బదులిస్తా
శ్యామ్ రంగీలా. మిమిక్రీ సంచలనం. ప్రధాని మోదీ, రాహుల్‌గాంధీ వంటి నేతలను అనుకరిస్తూ 2017లో ఆయన చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. సరిగ్గా ఏడేళ్ల తరవాత ఆయన స్వతంత్ర అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. అది కూడా వారణాసిలో మోదీపైనే పోటీ చేస్తున్నారు! రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన శ్యామ్ యూట్యూబ్ చానల్‌కు దాదాపు కోటిమంది సబ్స్రై్కబర్లున్నారు. మోదీని అనుకరిస్తూ ‘ధంగ్ కీ బాత్’ షో కూడా నడుపుతున్నారాయన. ఒకప్పుడు మోదీకి మద్దతు పలికిన శ్యామ్ ఆయనపైనే ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఇలాంటి పలు ప్రశ్నలకు ఆయన ఇచి్చన సమాధానాలు... ప్రధానిపై ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఇటీవల సూరత్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ ఏకగ్రీవంగా గెలిచింది. అది సరికాదనిపించింది. ఎన్నికల ప్రక్రియే ప్రజాస్వామ్యానికి ప్రాణం. పోటీ ఉండాలి. అలాకాకుండా బీజేపీ తన ప్రత్యర్థుల నామినేషన్లను విత్‌డ్రా చేయిస్తోంది. అందుకే నేను పోటీ చేస్తున్నా. ఒక సామాన్యుడు ప్రధానిపైనే పోటీలో నిలబడ్డాడనే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నా. మీది రాజకీయ ప్రధాన హాస్యం. ప్రస్తుతం దేశ రాజకీయాల తీరుపై ఏమంటారు? ఇప్పుడు రాజకీయాలే అతి పెద్ద కామెడీ. రాజకీయాల్లో హాస్యానికి కొదవే లేదు. కమెడియన్లను నిషేధించి రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ ఖర్చుతో కూడింది. మరి మీకు డబ్బులెలా...? నా దగ్గర ఏమీ లేవు. నేనేం చేసినా ప్రజల సాయంతోనే. ‘అభీ తో జోలా హై బస్. ఉఠాకే చల్ దేంగే, ఔర్ క్యా?’ (నా దగ్గరున్నది జోలె మాత్రమే. అది తీసుకుని రోడ్డున పడతానంతే) ‘జోలా ఉఠాకే’ అన్నది ప్రధాని మోదీ డైలాగ్ కదా! ఒకప్పుడు ప్రధాని మద్దతుదారుగా ఉన్న మిమ్మల్ని మార్చిందేమిటి? 2016 దాకా ప్రధానికి అభిమానినే. బీజేపీ అధికారంలోకి రాగానే ఇక అవినీతి పోతుందని, పెద్ద మార్పు వస్తుందని చాలామందిమి భావించాం. అందుకే ఆయనకు మద్దతుగా పోస్టులు పెట్టేవాన్ని. ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్‌కు ఎంపికైనప్పుడు ఎగిరి గంతేశా. మోదీని అనుకరిస్తూ నేను చేసిన వీడియోకు ప్రశంసలొచ్చాయి. కానీ అది ప్రసారమే కాలేదు. ప్రభుత్వం వద్దందని చానల్ వాళ్లు చెప్పారు. నేను మోదీని అనుకరించానంతే. ఎందుకు వద్దన్నారో అర్థం కాలేదు. రాజకీయాలపై హాస్యానికి చాలా దేశాల్లో ఆదరణ ఉంది. భారత్‌లో పరిస్థితి ఏమిటనుకుంటున్నారు? ఇక్కడ వ్యంగ్యాన్ని, హాస్యాన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. రాజకీయాలపై హాస్యం ఇక్కడ పని చేయదు. అందుకే చానళ్లలో పొలిటికల్ కామెడీ షోలే ఉండవు. రాహుల్ గాంధీపై జోకేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆహా్వనించవు, మోదీ మీద కామెడీ చేస్తే బీజేపీ ఊరుకోదు. అందుకే నా యూట్యూబ్‌లో వీడియోలు చేయాలని నిర్ణయించుకున్నా. వారణాసిలో ప్రచారమెలా ఉంది? బాగా సాగుతోంది. నలుగురైదుగురు స్నేహితులు నా వెంట వచ్చారు. ఇక్కడ మరింతమంది కలిసొస్తున్నారు. మీకు వారణాసి ప్రజల మద్దతు ఉందనుకుంటున్నారా? కచ్చితంగా. పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచే నాకు మద్దతుగా సందేశాలు వస్తున్నాయి. వరుస కాల్స్ వస్తున్నాయి. ప్రచారంలోనూ మోదీని మీ స్టయిల్లో అనుకరిస్తారా? తప్పకుండా. మోదీకి ఆయన శైలిలోనే బదులిస్తానని ఇప్పటికే చెప్పా కూడా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్యామిలీతో తిరుమలలో సందడి చేసిన రేసుగుర్రం నటుడు (ఫొటోలు)
-
శ్యామ్ మెటాలిక్స్ షేర్ల జారీ
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్)ను చేపట్టింది. తద్వారా రూ. 1,385 కోట్లు సమీకరించినట్లు తాజాగా వెల్లడించింది. మొత్తం 38 సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 2.40 కోట్లకుపైగా షేర్లను కేటాయించినట్లు తెలియజేసింది. రూ. 10 ముఖ విలువగల ఒక్కో షేరునీ రూ. 576 ధరలో జారీ చేసినట్లు తెలియజేసింది. క్విప్ కమిటీ షేర్ల జారీని అనుమతించినట్లు బుధవారం పేర్కొంది. కాగా.. క్విప్ నేపథ్యంలో సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీలో పబ్లిక్కు కనీస వాటాకు వీలు కలిగినట్లు వెల్లడించింది. రానున్న కొన్నేళ్లలో ఈక్విటీ జారీ ప్రణాళికలేవీలేవని స్పష్టం చేసింది. తాజాగా సమీకరించిన నిధుల సహాయంతో బ్యాంకుల నుంచి తీసుకుంటున్న వర్కింగ్ క్యాపిటల్ పరిమితులను తగ్గించుకోనున్నట్లు తెలియజేసింది. నికర రుణరహిత కంపెనీగా ఆవిర్భవించనున్నట్లు పేర్కొంది. తద్వారా వృద్ధిని వేగవంతం చేయనున్నట్లు వివరించింది. క్విప్ నేపథ్యంలో శ్యామ్ మెటాలిక్స్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 667 వద్ద ముగిసింది. -
ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీ కొట్టడంతో.. ఒక్కసారిగా..
సాక్షి, విశాఖపట్నం: ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్లైఓవర్‌పై మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. వేగంగా వస్తూ వాహనాలను అదుపు చేయలేక ప్రమాదానికి గురవుతున్నారు. అల్లిపురం నగరంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రెండో పట్టణ ఇన్చార్జి సీఐ రమణమూర్తి తెలిపిన వివరాలివీ.. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటకు చెందిన కాపరపు శ్యామ్(21), కాపరపు రాజు అలియాస్ బాబీ(20), అనకాపల్లి జిల్లా కొత్తూరుకు చెందిన తోట హర్ష అలియాస్ నాని ఇళ్లకు సున్నాలు వేస్తూ.. తద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. గాజువాకలో సున్నాలు వేసేందుకు వచ్చిన వారు బుధవారం రాత్రి 10.45 గంటల ప్రాంతంలో ఒకే బైక్‌పై ఆర్.కె.బీచ్‌కు వెళ్లారు. తిరిగి సుమారు మూడు గంటల ప్రాంతంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా గాజువాక వెళ్తున్నారు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పడంతో వంతెన చివర్లో గల మలుపు వద్ద డివైడర్‌ను బలంగా ఢీకొట్టారు. ప్రమాదంలో శ్యామ్ తలకు తీవ్ర గాయమై ఘటనా స్థలంలోనే మరణించాడు. హర్ష తలకు తీవ్ర గాయాలవడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. రాజు కాళ్లు విరిగిపోవడంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే హర్ష ప్రాణాలు కోల్పోయాడు. రాజు ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. శ్యామ్, రాజులిద్దరూ అన్నదమ్ముల పిల్లలు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీపీ.. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ ఏడీసీపీ, ఏసీపీలను ఆదేశించారు. నిబంధనలు పాటించాలి.. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై ఎత్తు పల్లంతో కూడిన ప్రమాదకర మలుపు వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. ఫ్లైఓవర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 13 మంది మరణించారని, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఇంజినీరింగ్ వైఫల్యమే ఇందుకు కారణమని, ఈ సమస్యపై గత ఫిబ్రవరిలో జీవీఎంసీ అధికారులకు లేఖ రాసినట్లు చెప్పారు. జీవీఎంసీ అధికారులు సత్వరమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వాహన చోదకులు కూడా నిబంధనలు పాటించాలన్నారు. త్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ప్రమాదకర, శిక్షార్హమైన డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. వాహన చోదకలు నిబంధనలు పాటించకపోవడం వల్ల వారితో పాటు పాదచారులకు భద్రత లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. -
బ్యాటరీ అల్యుమినియం ఫాయిల్స్ తయారీలోకి శ్యామ్ మెటాలిక్స్
కోల్‌కతా: ఎస్–ఈ–ల్ టై గర్ టీఎంటీ రీ–బార్లను ఉత్పత్తి చేసే శ్యామ్ మెటా లిక్స్ అండ్ ఎనర్జీ కొత్తగా బ్యాటరీ–గ్రేడ్ అల్యుమినియం ఫాయిల్స్ తయారీలోకి ప్రవేశించింది. ఈ ఫాయిల్స్‌ను లిథియం అయాన్ సెల్స్ తయారీలో ఉపయోగిస్తారు. దీనితో అంతర్జాతీయంగా లిథియం అయాన్ సెల్ మార్కె ట్లో ముడివస్తువులకు సంబంధించి భారత్ గణనీయమైన వాటాను దక్కించుకోవడంలో శ్యామ్ మెటాలిక్స్ తోడ్పాటు అందించగలదని సంస్థ పేర్కొంది. 1 గిగావాట్‌అవర్ ఎల్ఎఫ్పీ (లిథియం ఐరన్ ఫాస్ఫేట్) సెల్స్ తయారీ కోసం 350 టన్నుల అత్యంత శుద్ధి చేసిన అల్యూమినియం ఫాయిల్ అవసరమవుతుందని తెలిపింది. -
రేఖా నాయక్ తిరుగుబాటు..కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే !
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా రాజకీయ సమీకరణాలను మారుస్తోంది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లకు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో వారిలో ఒకరైన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. కాంగ్రెస్‌లో చేరాలని ఆమె నిర్ణయించుకొన్నారు. ఈ మేరకు మంగళవారం పార్టీ ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ కానున్నారు. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యాం నాయక్ ఈ పరిణామాల్లో భాగంగానే.. ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త, మాజీ రవాణా శాఖ అధికారి శ్యాం నాయక్ సోమవారం రాత్రే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయనకు ఆసిఫాబాద్ టికెట్టు ఖరారైనట్లు సమాచారం. రేఖా నాయక్‌ను కూడా కాంగ్రెస్‌లో చేర్చుకొని ఖానాపూర్ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో బోథ్, ఆసిఫాబాద్ స్థానాలకు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఆదిలాబాద్ పార్లమెంటు సీటు ఇస్తామని చెప్పినా.. ఆయన కూడా అసంతృప్తితోనే ఉన్నట్లు సమాచారం. సక్కు గత ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి గెలిచి వెంటనే బీఆర్ఎస్లో చేరారు. ఇలావుండగా బోథ్ ఎమ్మెల్యే బాపూరావు రాథోడ్‌కు కూడా ఈసారి బీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. -
సమర్థవంతంగా జువెనైల్ జస్టిస్
సాక్షి, హైదరాబాద్: పిల్లల సంరక్షణ, పునరావాసం కోసం జువెనైల్ జస్టిస్ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, యూనిసెఫ్ పలు చర్యలు తీసుకుంటున్నాయని తెలంగాణ లీగల్ సర్విసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని.. వారి అభివృద్ధే సమాజ ప్రగతి అన్నారు. లీగల్ సర్విసెస్ అథారిటీ, జ్యుడీషియల్ అకాడమీ సంయుక్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. జువెనైల్ జస్టిస్‌పై రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడు, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జ్యువెనైల్ జస్టిస్ బోర్డు చైర్మన్, న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ శ్యామ్ కోషి మాట్లాడారు. పాఠశాలల్లో, నివాస ప్రాంతాల్లో ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని, పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలని జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ ఉద్ఘాటించారు. బాల నేరస్తులను సంస్కరించడం, పునరావాసం కల్పించడం లాంటి అంశాలను చట్టంలో పొందుపరిచారని జస్టిస్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. జువెనైల్కు న్యాయ సేవలను అందించడంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ స్టేట్ లీగల్ సర్విసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎస్.గోవర్ధన్‌రెడ్డి వివరించారు. జువెనైల్ జస్టిస్ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి తదితరులు పాల్గొన్నారు. -
‘అన్‌లాగ్’లో ఇంటర్న్‌షిప్‌కు ట్రిపుల్ఐటీ విద్యార్థులు
నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ఐటీకి చెందిన ఈసీఈ ఆఖరి సంవత్సరం విద్యార్థులు తొమ్మిది మంది అమెరికన్ బహుళజాతి సెమీ కండక్టర్ కంపెనీ అయిన అన్‌లాగ్ డివైజెస్‌కి ఎంపికయ్యారు. ఆ సంస్థ ప్రతినిధులు ట్రిపుల్‌ఐటీలో ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించి ఆప్టిట్యూడ్, టెక్నికల్ పరీక్షల అనంతరం తొమ్మిది మంది విద్యార్థులను ఏడాదిపాటు లాంగ్‌టర్మ్ ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేశారు. ఇంటర్న్‌షిప్ సమయంలో ఈ విద్యార్థులకు నెలకు రూ.40వేలు చొప్పున స్టయిఫండ్ ఇస్తారు. ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత వారి పనితీరు ఆధారంగా విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఇదే సంస్థ గతేడాది నూజివీడు ట్రిపుల్ఐటీకి చెందిన ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి రూ.27లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలను ఇచ్చింది. ఈ సందర్భంగా ట్రిపుల్ఐటీ ఈసీఈ హెచ్‌వోడీ పి.శ్యామ్ మాట్లాడుతూ భారతదేశ సెమీ కండక్టర్ పాలసీ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా అగ్రశ్రేణి విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణుల సలహాలు, సూచనల మేరకు ట్రిపుల్‌ఐటీలో పాఠ్యాంశాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఎనిమిది రకాల అత్యాధునిక ల్యాబ్‌లతో నిరంతరం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. -
భారత – చైనా బంధం బలపడేనా?
సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే! అయితే గల్వాన్ ఘర్షణలు చైనా ప్రణాళికాబద్ధంగా జరిపినవన్న భారత్ అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్‌కు కచ్చితమైన ఆలోచన ఉంది. ఎల్ఏసీ గురించి సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. వార్షిక వరల్డ్ పీస్ ఫోరమ్‌లో పాల్గొనడానికి నేను ఈ నెల ప్రారంభంలో బీజింగ్‌లో ఉన్నాను. ఆ సమావేశంలోనే అదనంగా భారత్–చైనా సరిహద్దు సమస్యపై ఒక ఆంతరంగిక చర్చ జరిగింది. దీనికి పలువురు చైనా విద్వాంసులు హాజరయ్యారు. ప్రస్తుత, మాజీ చైనా అధికారులు కొందరితో సంభాషణకు కూడా వీలు కలిగింది. ఇవి భారత్–చైనా సంబంధాలకు సంబంధించిన అవకాశాల గురించి చైనా అవగాహన విష యంలో ఒక కొత్త గవాక్షాన్ని అందించాయి. సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే. చైనీయుల ప్రకారం, సరిహద్దు పరిస్థితి ‘స్థిరీకరించబడింది’. ఘర్షణకు సంబంధించిన కొన్ని అంశాలను పరిష్కరించడంలో పురోగతి సాధించామనీ, అయితే మరికొన్ని మిగిలి ఉన్నా యనీ భారతదేశం గుర్తిస్తోంది. 2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు ముందు ఉన్న యథాతథ స్థితికి తిరిగి రావడానికి చైనా సుముఖంగా ఉన్నట్లు ఎవరూ భావించడం లేదు. భారత–చైనా సరిహద్దు ప్రశ్న (2005) పరిష్కారానికిగానూ రాజకీయ పారామితులు, మార్గదర్శక సూత్రంతో సహా – వాస్తవాధీన రేఖను (ఎల్ఏసీ) స్పష్టం చేయడం కోసం ఉమ్మడి కసరత్తును చేపట్టేందుకు – అనేక శాంతి భద్రతల ఒప్పందాలను ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ, చైనీయులు అలా చేయడానికి నిరాకరించారు. భూభా గాన్ని ‘కొద్దికొద్దిగా కొరుక్కు తింటూ’ చైనాను భారతదేశం దూరంగా నెడుతోందని ఒక ఆరోపణ వచ్చినప్పుడు, భారత్ చేపట్టడానికి సిద్ధంగా ఉన్న ఎల్ఏసీ స్పష్టీకరణ ద్వారా అటువంటి కబళింపును కచ్చి తంగా నిరోధించవచ్చని ఎత్తి చూపడం ద్వారా ఒకరు దీనిని ప్రతిఘటించారు. దీనికి సమాధానం ఏమిటంటే, 2004లో జరిగిన సమా వేశంలో ఈ కసరత్తు ప్రారంభమైనప్పుడు, చైనా ప్రాదేశిక క్లెయిమ్‌లను బలహీనపర్చగల ‘అతిశయోక్తి’ క్లెయిమ్‌లను భారతదేశం పశ్చిమ సెక్టార్లో ముందుకు తెచ్చింది. ఎల్ఏసీని సరిగా స్పష్టం చేయకపోవడం వల్ల భారత్ అధీనంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి సందిగ్ధతలను ప్రదర్శించగల వీలు చైనాకు కలుగుతుంది. అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్‌కు కచ్చితమైన ఆలోచన ఉంది. కొన్ని అంశాల్లో ఎల్ఏసీకి సంబంధించి ‘భిన్నమైన అవగాహనలు’ ఉన్నాయని మనం చెప్పు కోకూడదు. భారత్ పేర్కొన్నట్లుగా ఎల్ఏసీపై పోటీ పడటంలో చైనా పక్షానికి కొంత సమర్థన ఉందని ఇది పరోక్షంగా అంగీకరిస్తుంది. ఎల్ఏసీ అమరికలో మనం పరిగణించే వాటిపై చైనీస్ పక్షాన్ని పోటీ పడనివ్వండి. ఎల్ఏసీ ఎక్కడ ఉందనే దాని గురించి మనకు సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. మొత్తంమీద, సరిహద్దు వద్ద ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉంది. అయితే రెండు వైపులా భారీ సైన్యాన్ని మోహరించే అవకాశం లేదు. ఎల్ఏసీ వైపు చైనా నిర్మించిన తాజా శాశ్వత, పాక్షిక–శాశ్వత నిర్మాణాలను కూల్చి వేయడం, తొలగించడం కూడా అసంభవం. భారత్ అలవర్చుకోవా ల్సిన మెరుగైన సామర్థ్యానికి ఇవి సూచికలా పనిచేస్తాయి. భవిష్యత్‌లో ఏం జరగవచ్చో సూచించే రెండు ఘటనలు కూడా ఉన్నాయి. సరిహద్దు సమస్యపై తరచూ వ్యాఖ్యానించే చైనా మాజీ పీఎల్ఏ అధికారి ఒకరు, గల్వాన్ ఘర్షణలు చైనా బలగాలు ముంద స్తుగా, ప్రణాళికాబద్ధంగా జరిపిన ఆపరేషన్ అని భారత్ భావిస్తున్న అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ నాతో అన్నారు. నేను ఇంతకు ముందు ఇది వినలేదు. పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? ప్రస్తుతం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కమిషన్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ ఆఫీస్ డైరెక్టర్‌గా ఉన్న వాంగ్ యీ(జూలై 25నే తిరిగి విదేశాంగ మంత్రి అయ్యారు) ఇటీవల జకార్తాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో జరిపిన భేటీలో, ‘నిర్దిష్ట సమస్యలు మొత్తం సంబంధాన్ని నిర్వచించనివ్వకుండా, సరిహద్దు సమస్యకు ఇరు పక్షాలు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలి’ అన్నారు. ఇది చైనా వైఖరికి పునఃప్రకటన. అయితే, ‘భారత పక్షం చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకునేలా, సరిహద్దు సమస్యకు ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశిస్తున్నట్లు’ ఆయన కొనసాగించారు. ఆ ప్రాంతం చైనా సార్వభౌమ భూభాగమనీ, దానిని కాపాడు కుంటామనీ చైనా ప్రకటనలు పేర్కొంటున్నాయి కాబట్టి గల్వాన్ సంఘటన నేపథ్యంలో, ఇది సాపేక్షంగా సామరస్యపూర్వకమైన భాషగా కనిపిస్తోంది. దీంతో సంబంధాలు ‘మెరుగుపర్చుకునే’ అవ కాశం లేకుండా పోయింది. మారిన భాషను మనం అతిగా వ్యాఖ్యా నిస్తున్నామేమో! కాలమే దీన్ని తేల్చి చెబుతుంది. ప్రధాని మోదీ వాషింగ్టన్ లో ఉన్నత స్థాయి అధికారిక పర్యటన విజయవంతంగా ముగించిన తర్వాత వెంటనే బీజింగ్‌లో నా సంభాషణలు జరిగాయి. భారత్–అమెరికా సంబంధాల్లో పురోగతిపై చైనా ఆందోళన స్పష్టంగా కనిపించింది. చైనాను నిలువరించే అమెరికా వ్యూహంలో భారత్ భాగమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియాలో ‘నాటో’ పాత్రకు భారతదేశం మద్దతు ఇస్తుందా అనేది నాకు వారు సంధించిన ఒక ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం, నాటో అనేది యూరోపియన్ భద్రతకు సంబంధించినదనీ, ఆసియాన్ నేతృత్వంలోని యంత్రాంగాలతో సహా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి ఆసియా అనేక యంత్రాంగాలను కలిగి ఉందనీ నేను చెప్పాను. గ్లోబల్ సౌత్ నుండి చైనాను మినహాయించాలని భారతదేశం ప్రయత్నిస్తున్నదా అనే ఆందోళన కూడా వారిలో ఉంది. తాము గ్లోబల్ సౌత్‌లో భాగమా, కాదా అనేది నిర్ణయించుకోవాల్సింది చైనాయేనని నేను చెప్పాను. త్వరలో జరగనున్న జీ20 సదస్సు సన్నాహాల్లో భాగంగా, గ్లోబల్ సౌత్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు మోదీ చొరవ తీసుకోవడం చైనాను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్థికపరమైన చిక్కులను కలిగించవచ్చు కాబట్టి, చైనాకు ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ హోదాను నిరాకరించే అమెరికా ప్రయత్నాల గురించి వారు ప్రస్తావించారు. చైనా చేసిన మరొక ఫిర్యాదు ఏమిటంటే, ‘షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్’ (ఎస్సీఓ) సమావేశాన్ని భారత్ వ్యక్తిగత స్థాయిలో కాకుండా, క్లుప్తంగా ఆన్ లైన్ సదస్సును నిర్వహించడం ద్వారా దాని ‘స్థాయిని తగ్గించింది’ అని. ఇది అమెరికా ప్రభావంతో జరిగిందనే అనుమానం చైనాకు ఉంది. మొత్తంమీద, చైనా తన గురించి తాను అస్పష్టంగానే ఉందనే భావన కలుగుతుంది. అదే సమయంలో భారత్ తన ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రావీణ్యతనూ, చురుకుదనాన్నీ ప్రదర్శించిందనే అభిప్రాయం ఉంది. పెట్టుబడి, సాంకేతికత ప్రవాహానికి భారతదేశం కొత్త గమ్యస్థానంగా మారినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో, ఇది చైనా ఆర్థిక అవకాశాల గురించి గుర్తించిన ఒక నిర్దిష్ట నిరాశా వాదానికి సంబంధించినది కావచ్చు. ఇది భారతదేశం పట్ల చైనా వైఖరిలో మార్పును సూచిస్తుందా? ఇకపై సంఘటనలు ఎలా వెల్లడవుతాయో చూద్దాం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ మాజీ కార్యదర్శి,ఆనరరీ ఫెలో, సీపీఆర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
విషాదం.. యంగ్ టైగర్ వీరాభిమాని మృతి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్‌ను ప్రాణానికి ప్రాణంగా భావించే అభిమాని శ్యామ్ (23) కన్నుమూశాడు. చిన్నవయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ సంఘటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. శ్యామ్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. కానీ శ్యామ్ చనిపోయింది మాత్రం చింతలూరు గ్రామం. అక్కడ తను ఉంటున్న రూమ్‌లో ఉరి వేసుకుని చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి ) కాగా.. గతంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ మూవీ ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఆ సమయంలో వేదికపై వచ్చిన శ్యామ్ ఎన్టీఆర్‌ను హత్తుకున్నారు. ఆ సమయంలో ఆ వీడియో తెగ వైరలైంది. ప్రస్తుతం శ్యామ్ మృతి చెందడంతో ఆ వీడియోను షేర్ చేస్తూ అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ ఇంట విషాదం) RIP raa Thammudu...😭😭💔 Epudu natho events lo evaru Racha chestharu...😭😭😭😭 Final ga ni dream fullfill chesukuni elipoyav😭😪 (@tarak9999 Kalesav) NTR fans lo Unna oka Thammudu kuda vadhilesi poyadu..😪 @shyambadboy6 Om Shanti 🙏🥀💔😭 pic.twitter.com/lBMCCBKqaI — Sandhya NTR🖤 (@Kuttima_kutty) June 25, 2023 Today We Lost One Of Our Co Fan @shyambadboy6 💔 Rest In peace Brother 🙏 pic.twitter.com/Zbf1NViqNI — Jr NTR Fan Club (@JrNTRFC) June 25, 2023 -
విజయ్ దేవరకొండ ఖాతాలో మరో కంపెనీ
హైదరాబాద్: టీఎంటీ బార్ల తయారీలోని శ్యామ్ స్టీల్ నటుడు విజయ్‌దేవరకొండతో కలసి నూతన డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. టెలివిజన్ ప్రచార చిత్రాన్ని ఇగ్నిషన్ ఫిల్మ్స్‌కు చెందిన రెన్సిల్ డిసిల్వ, పార్థో సర్కార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ టెలివిజన్ ప్రచారం ద్వారా ఏపీ, తెలంగాణలో కస్టమర్లకు తన ఉత్పత్తులను మరింత చేరువ చేయాలన్నది శ్యామ్ స్టీల్ ప్రణాళికగా ఉంది. -
రూ. 2,500 కోట్లతో శ్యామ్ స్టీల్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టీఎంటీ ఉక్కు కడ్డీల తయారీ సంస్థ శ్యామ్ స్టీల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తమ రిటైల్ కార్యకలాపాలను మరింతగా విస్తరించనుంది. వచ్చే అయిదేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో 500 పైచిలుకు డీలర్ డిస్ట్రిబ్యూటర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించుకున్నట్లు కంపెనీ డైరెక్టర్ లలిత్ బెరివాలా తెలిపారు. అలాగే నటుడు విజయ్ దేవరకొండను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు పేర్కొన్నారు. ఉత్పత్తి సామర్థ్యాల పెంపునకు రూ. 2,500 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లోని ప్లాంటుపై రూ. 1,000 కోట్లు, మరో కొత్త ప్లాంటుపై రూ. 1,500 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు బెరివాలా చెప్పారు. ప్రస్తుత సామర్థ్యం వార్షికంగా 0.7 మిలియన్ టన్నులుగా ఉండగా, దీన్ని 1 మిలియన్ టన్నులకు పెంచుకుంటున్నట్లు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 4,500 కోట్ల టర్నోవరు నమోదు కాగా వచ్చే మూడేళ్ల వ్యవధిలో దీన్ని రూ. 9,000 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. -
రజనీకాంత్‌తో విజయ్‌ని పోల్చడం సరికాదు!: నటుడు శ్యామ్
తమిళ సినిమా: నటుడు విజయ్‌తో కలిసి వారీసు చిత్రంలో నటించడం మంచి అనుభవం అని నటుడు శ్యామ్ పేర్కొన్నారు. 12బి చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన ఈయన ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించి గుర్తింపు పొందారు. అలాగే పలు చిత్రాలకు కూడా ఆయన నిర్మాత వ్యవహిరించారు. ప్రస్తుతం తమిళం, తెలుగు తదితర భాషల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా విజయ్ కథానాయకుడిగా నటించిన వారసుడు(తమిళంలో వారీసు) చిత్రంలో ఆయనకు సోదరుడిగా ముఖ్య పాత్రలో శ్యామ్ నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పొంగల్ సందర్భంగా నేడు(బుధవారం) 11వ తేదీన భారీ అంచనాల మధ్య వారిసు చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా నటుడు శ్యామ్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపొందిన మంచి ఎంటర్టైనర్ కథాచిత్రంగా వారీసు ఉంటుందన్నారు. తాను ఆరంభ దశలో విజయ్‌తో ఖుషి చిత్రంలో చిన్న పాత్రలో నటించానని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత 12బి చిత్రంలో కథానాయకుడిగా నటించినప్పుడు విజయ్ తనను అభినందించారని చెప్పారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ వారీసు చిత్రంలో ఆయనతో కలిసి నటించడం మరచిపోలేని అనుభవంగా పేర్కొన్నారు. విజయ్ ప్రవర్తన, ఆహారపు అలవాట్లు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయన్నారు. ఎలాంటి ఈగో లేకుండా అందరితో సరదాగా మాట్లాడతారని,ఎక్కువగా కసరత్తులు చేస్తారన్నారు. ప్రస్తుతం సూపర్‌స్టార్ ఎవరన్న ఆంశంపై పెద్ద చర్చే జరుగుతోందని, అయితే ఈ విషయంలో రజనీకాంత్‌తో విజయ్‌ని పోల్చడం సరికాదని పేర్కొన్నారు. రజనీకాంత్, కమలహాసన్ వంటి నటుల స్థాయి వేరని, అయితే విజయ్‌కు అజిత్‌కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందన్నారు. ఇద్దరికీ అత్యధిక సంఖ్యలోనే అభిమానులు ఉన్నారన్నారు. పొంగల్‌కు విడుదల అవుతున్న వారిసు, తుణివు చిత్రాలు రెండు విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. కాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తాను నటించిన పార్టీ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతుందని, గోలీ సోడా 3 చిత్రంలో ముఖ్య పాత్రలో నటించనున్నట్లు, మరికొన్ని చిత్రాల్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు చెప్పారు. తెలుగు, కన్నడంలోనూ నటిస్తున్నానని, అదే విధంగా త్వరలో ఒక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు శ్యామ్ చెప్పుకొచ్చారు. -
స్వతంత్ర భారత్ తొలి ఓటర్ కన్నుమూత..
-
‘క్రైమ్ థ్రిల్లర్‌గా 'అం అః’.. రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించడం చాలా కష్టంగా మారింది. కథలో కొత్తదనం ఉంటే తప్పా.. ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. . ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'అం అః'. ‘ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్’ అనేది ట్యాగ్‌లైన్. సుధాకర్ జంగం, లావణ్య హీరో హీరోయిన్లుగా ఈ చిత్రానికి శ్యామ్ మండల దర్శకత్వం వహిస్తున్నారు. రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. . చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్గా విడుదలైన 'నీ మనసే నాదని' వీడియో సాంగ్ , టీజర్‌కి మంచి స్పందన లభించింది.సస్పెన్స్‌కి తోడు రొమాంటిక్ సన్నివేశాలు, యూత్ ఆడియన్స్ మెచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీని మేకర్లు తాజాగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. -
హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం
Hero Nikhil Father Passed Away: యంగ్ హీరో నిఖిల్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం(ఏప్రిల్ 28) ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు అరోగ్యం విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. తండ్రి అకాల మరణంతో నిఖిల్ ఇంట విషాదచాయలు అలుముకున్నాయి. చదవండి: ‘ఆచార్య’లో సత్యదేవ్ అతిథి పాత్ర, గర్వంగా ఉందన్న చిరు నిఖిల్ తండ్రి మరణవార్త తెలిసి టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. నిఖిల్‌ను పరామర్శిస్తూ.. సోషల్ మీడియా వేదికగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే 'స్పై' టైటిట్‌తో ఇటీవల ఓ పాన్ ఇండియా సినిమాను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. వరుస ప్రాజెక్ట్స్‌తో ఇప్పుడిప్పుడే కెరీర్ పరంగా సక్సెస్ సాధిస్తూ ముందుకు వెళుతున్న నిఖిల్‌కు పితృవియోగం కలగడం అందరిని కలిచివేస్తోంది. -
Shyam Karri: అందుకే నా పెయింటింగ్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు
తాను కెరీర్ ఎంపిక చేసుకునే సమయంలో ఎన్నో మార్గాలు కనిపిస్తున్నాయి. కానీ ఏ మార్గాన్ని ఎంచుకోవాలో తెలియడం లేదు. ఆ సమయంలో జిడ్డు కృష్ణమూర్తి ‘థింక్ ఆన్ దిస్ థింగ్స్’ పుస్తకం దారి చూపింది. తనను ప్రతిభావంతుడైన వాటర్ కలర్ ఆర్టిస్ట్‌గా మార్చింది... పుడుతూనే పోలియో బారిన పడ్డాడు శ్యాం. విశాఖలో జన్మించిన శ్యాం దాదాపు ఐదేళ్ల వరకు నడవగలడో లేదో అనే ఆందోళన అందరిలో. అయితే తల్లిదండ్రుల ప్రోత్సాహం అతడిని నేలపై తొలి అడుగులు వేయించింది. కొద్దికాలానికి అతని అడుగులు స్కూల్ వైపు సాగాయి. స్కూల్లో డ్రాయింగ్ నేర్పించే ఉమా టీచర్ ప్రభావంతో శ్యాంకు పెయింటింగ్ అంటే ఇష్టం ఏర్పడింది. ఇంజినీరింగ్ చదివేందుకు శ్యాంకు ఎన్ఐటీ తిరుచ్చిలో సీటు రావడం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. ఇంజినీరింగ్, ఫిలిం మేకింగ్, పెయింటింగ్... ఇలా ఏ రంగంలో రాణించాలా? అనే ఆలోచనలు మొదలయ్యాయి. అయితే చివరిగా ప్రకృతికి హాని కలిగించని అంశాన్నే కెరీర్‌గా ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో జిడ్డు కృష్ణమూర్తి రాసిన ‘థింక్ ఆన్ దిస్ థింగ్స్’ పుస్తకం శ్యామ్‌కు మార్గం చూపింది. అంతర్జాతీయ వాటర్ కలర్ చిత్రకారులు మిలింద్ ముల్లిక్, రాజ్‌కుమార్ స్తబథేలు తాను అభిమానించే గురువులుగా చెప్పుకునే శ్యాం సహజత్వం, భావోద్వేగమైన ఆవిష్కరణతో పలు వేదికలపై వారి నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. ‘‘నా పెయింటింగ్స్‌లో నిత్యం ప్రయోగాలకే ప్రాధాన్యమిస్తాను. ప్రతి పెయింటింగ్‌ను నా తొలి పెయింటింగ్‌గా ఫీలవుతాను. పెయింటింగ్ వేసే ముందు ప్రకృతితో మమేకమయ్యేందుకు తాపత్రయపడతాను. అందుకే పెయింటింగ్స్ వేసేందుకు మా ప్రాంతంలో ఆకర్షణీయ స్థలాలతోపాటు హంపి, కొడైకెనాల్, హిమాచల్‌ప్రదేశ్‌లకు ఎక్కువగా వెళతాను. కొన్ని ప్రాంతాల్లో వాటర్‌లోని సాల్ట్, ఫ్లోరిన్ శాతాలను బట్టి పెయింటింగ్స్‌లో అద్భుత ఆవిష్కరణ చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. నా పెయింటింగ్స్‌లో ఎక్కువగా యానిమల్స్ ఎమోషన్స్ కనిపిస్తాయని అభిమానులు చెబుతారు. అందుకే వాటికి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా నా పెయింటింగ్స్ కోసం ఆర్డర్లు వస్తున్నాయి’’ అంటున్నాడు శ్యాం. – పలివెల రవీంద్ర, ఎంవీపీ కాలనీ, సాక్షి, విశాఖపట్టణం చదవండి: Nishitha Rajput: అనుమానాలు.. అవమానాలు.. అయినా 3 కోట్ల రూపాయలు సేకరించి.. చదువులమ్మా.. నువ్వు చల్లంగుండాల! ఇది కూడా చదవండి: Jeedipappu Health Benefits: జీడిపప్పును పచ్చిగా తింటున్నారా..! పిస్తాతో పాటు వీటిని తింటే.. -
రాజధాని రైతులను ప్రత్యేకవర్గంగా చూడాలంటే ఎలా?
సాక్షి, అమరావతి: రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక హక్కులున్నాయని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ తెలిపారు. రాజధాని రైతులను ప్రత్యేకవర్గంగా చూడాలని, వారిని ఇతరులతో పోల్చడానికి వీల్లేదని చెప్పారు. ఈ వాదనపై హైకోర్టు స్పందిస్తూ.. రాజధాని అన్నది ఏ వర్గానిదో కాదని, అది అందరిదీ అవుతుందని వ్యాఖ్యానించింది. అమరావతిని ప్రజల రాజధాని అని చెబుతున్నప్పుడు అది రాష్ట్ర ప్రజలందరిదీ అవుతుందే తప్ప కొద్దిమందిది ఎంత మాత్రం కాజాలదంది. కర్నూలు, విశాఖపట్నం కూడా అందరివీ అవుతాయని తెలిపింది. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులు తాము పోరాడాం కాబట్టి ఈ దేశం తమది అవుతుందని ఎలా చెప్పజాలరో, అలా రాజధానిని కూడా తమదని కొద్దిమంది చెప్పడానికి వీల్లేదని పేర్కొంది. రాజధానిని మనది అని ఎందుకు భావించరని ప్రశ్నించింది. దివాన్ తదుపరి వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. పిటిషనర్లలో ఒకరైన రాజధాని రైతు పరిరక్షణ సమితి తరఫున సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ రెండోరోజు మంగళవారం తన వాదనలను కొనసాగించారు. రాజధాని విషయంలో ఎన్నికల తరువాత ప్రభుత్వ తీరు మాత్రం మారిపోయిందన్నారు. రైతుల త్యాగాలకు ప్రభుత్వం విలువ లేకుండా చేస్తోందన్నారు. రాజధాని ప్రాంతంలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టు పూర్తికావడానికి చట్టంలో నిర్దిష్ట కాలవ్యవధి ఉందన్నారు. అయితే ప్రభుత్వ చర్యల వల్ల ఆ ప్రాజెక్టులు పూర్తయ్యే పరిస్థితిలేదన్నారు. చట్ట ప్రకారం చేయాల్సిందేదీ ప్రభుత్వం చేయలేదన్నారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం చట్టాన్ని అపహాస్యం చేసిందన్నారు. సీఆర్డీఏ చట్టంలో పేర్కొన్న మాస్టర్ ప్లాన్‌ను అమలు చేస్తామని అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏఎంఆర్డీఏ) చట్టంలో ప్రస్తావించారని, అయితే ఆచరణ సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదని పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్‌కు తిలోదకాలిచ్చేందుకే మూడు రాజధానుల నిర్ణయాన్ని తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. అందులో భాగంగానే పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను తెచ్చారని దివాన్ పేర్కొన్నారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణ బుధవారానికి వాయిదా పడింది. -
రాజకీయాలకు బ్యూరోక్రసీ బలి..!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తిన విభేదాలు, రిటైర్మెంట్కు దగ్గరైన పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శిని ఇరకాటంలో పడేయటం మన దేశ పాలనా తీరును పట్టి చూపిస్తోంది. ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య రాజకీయ పెనుగులాటలో బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ పావులాగా మారారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారుల డెప్యుటేషన్‌లో పాటించాల్సిన విధానాలు ఆయన విషయంలో అమలు కాలేదు. మోదీ హయాంలో ఉన్నతోద్యోగుల స్థాయి దిగజారిపోయిందన్న భావన పెరుగుతోంది. బ్యూరోక్రసీ నియామకం ప్రక్రియలో చేపట్టే స్పల్ప మార్పులు సైతం దేశానికి ఉత్తమంగా సేవలందించడానికి సివిల్ సర్వీసును పూర్తిగా మార్చివేయడంలో దోహదపడతాయి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన ఆలాపన్ బందోపాధ్యాయ్‌ని అంతకుముందు కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేయడం ద్వారా తలెత్తిన వివాదం కారణంగా దేశ ఉన్నతాధికార వర్గం రాజకీయాల ముందు మరోసారి తలవంచినట్లయింది. అలాపన్ మే 31న రాజీనామా చేయాల్సి ఉంది. కానీ ఆయన పదవీకాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది. గత వారం బెంగాల్లో తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టంపై సర్వేలో భాగంగా ప్రధాని బెంగాల్‌ని సందర్శించడానికి కొద్ది రోజుల ముందు ఈ నిర్ణయం జరిగింది. కానీ మే 31న ఆలాపన్ బందోపాధ్యాయను వెంటనే ఢిల్లీకి వచ్చి రిపోర్ట్ చేయాలంటూ సివిల్ సర్వీసుల వ్యవహారాలను చూసే సిబ్బంది, శిక్షణా విభాగం ఉన్నట్లుండి తాఖీదు పంపింది కానీ ఈ ముందస్తు, ఆకస్మిక ఆదేశానికి కారణం కూడా చెప్పలేకపోయింది. ఒక రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారిని కేంద్రానికి బదిలీ చేసే ప్రక్రియను పర్సనల్, ట్రెయినింగ్ విభాగం పాటించలేదు. ఏ అధికారినైనా రాష్ట్రం నుంచి కేంద్రానికి డెప్యుటేషన్‌పై తీసుకోవాలంటే ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లాంఛనప్రాయంగా అభ్యర్థన పంపాలి. కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రం తోసిపుచ్చవచ్చు కూడా. ఆ తర్వాత మాత్రమే తన అభ్యర్థనను అమలు చేసి తీరాలని కేంద్రం తన అధికారాన్ని ప్రయోగించే వీలుంది. అయితే ఎంతో సీనియర్ అయి ఉండి కూడా ప్రధాని మోదీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్య రాజకీయ పెనుగులాటలో ఆలాపన్ బందోపాధ్యాయ్ పావులాగా మారిపోవడం గమనార్హం. ప్రధాని మోదీ హయాంలో ప్రభుత్వ ఉన్నతోద్యోగి పాత్ర, ప్రతి పత్తి పూర్తిగా దిగజారిపోయాయన్న భావన పెరుగుతోంది. గత కొన్నే ళ్లుగా రాష్ట్ర కేడర్‌లోని ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కేంద్ర ప్రభుత్వంలో పదోన్నతిని కోరుకోకుండా తమ తమ రాష్ట్ర స్థాయిలో సర్వీసును పూర్తి చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన ప్రారంభ సంవత్సరాల్లో కేంద్రంలో పనిచేయడం గొప్ప అవకాశంగా సివిల్ సర్వీసు అధికారులు భావించేవారు. కానీ, ప్రస్తుతం కేంద్రంలో పనిచేయాలంటేనే ఉన్నతాధికారులు జడుసుకుంటున్నారు. భారత గణతంత్ర ప్రజాస్వామ్యం ప్రారంభ దినాలనుంచే దేశంలో సివిల్ సర్వీసు పాత్ర వివాదాస్పదంగా ఉంటూ వచ్చింది. 1969లో ఇందిరాగాంధీ నిబద్ధత కలిగిన సివిల్ సర్వీసు కావాలంటూ పిలుపిచ్చారు. కానీ భారత రాజ్యాంగం, సర్వీసు నిబంధనలు మాత్రం ప్రతిభ ప్రాతిపదికన పనిచేసే సివిల్ సర్వీసు కావాలని పేర్కొన్నాయి. దీనికోసం జాతీయ స్థాయి పోటీ పరీక్షల ద్వారా ఉన్నతోద్యోగులను నియమించాలని, సంబంధిత విభాగంలో వృత్తిపరమైన శిక్షణను అందిస్తూ వారి పనితీరును అంచనా వేసే ప్రక్రియను కచ్చితంగా పాటించాల్సి ఉందని నిబంధనలు సూచించాయి. ఉద్యోగి పనితీరు మదింపు ప్రక్రియలో రాజకీయ ప్రభువులకు ఏ పాత్రా ఉండేది కాదు. 2016లో అఖిల భారత సర్వీసుల్లో తీసుకొచ్చిన కొత్త మదింపు ప్రక్రియలోనూ రాజకీయ పాత్రకు చోటివ్వలేదు. అంటే ఒక ఉన్నతాధికారి నాణ్యతను మదింపు చేసే అధికారం మంత్రికి కూడా ఉండదన్నమాట. రాజ్యాంగ విలువలను ఎత్తిపెట్టడమే తమ లక్ష్యమైనందున అఖిల భారత సర్వీసు, ఇతర కేంద్ర సర్వీసుల్లో పనిచేసేవారికి రాజ్యాంగపరమైన రక్షణ ఉండేది. అయితే ఈ రాజ్యాంగ రక్షణ సైతం ఉన్నతాధికారుల పనితీరులో రాజకీయ జోక్యాన్ని నివారించేది కాదు. రాజకీయ నాయకులతో అధికారవర్గం కుమ్మక్కు కావడం ఉండేది కానీ దీనికి చాలా మినహాయింపులు మాత్రమే ఉండేవి. కానీ క్రమేణా రాజకీయ ప్రభువులు ఉన్నతాధికారుల నియామకం, బదిలీపై అధికారాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికార వర్గం రాజకీయ పార్టీల ఇచ్ఛకు, అధికారంలో ఉన్న నాయకుల సంకల్పానికి లోబడుతూ వచ్చేవారు. ఉన్నతాధికారుల్లో వృత్తిగత నైపుణ్యాలు, అనుభవం కంటే వారి విశ్వాçÜం, భావజాల పరమైన సారూప్యతలే విలువైనవిగా రాజకీయ నేతలు భావించడం కొనసాగేకొద్దీ బ్యూరోక్రసీలో రాజకీయాలు చోటుచేసుకోవడం పెరుగుతూ వచ్చింది. విజ్ఞానం, అనుభవం ప్రాతిపదికన ఉత్తమమైన సలహాలను అందించే ధోరణి తగ్గిపోయి రాజకీయ ప్రాధాన్యతలకు విలువ ఇచ్చేదిగా ప్రభుత్వంలోని ఉన్నతోద్యోగుల పాత్ర కుదించుకుపోయిందని నేను గతంలోనే సూచించాను. ఈ దురదృష్టకరమైన పక్షపాతం, ముందస్తు ఇష్టాల కారణంగానే కోవిడ్–19 మహమ్మారి సెకండ్ వేవ్‌తో సరిగా వ్యవహరించడంలో మన పాలనాయంత్రాంగంలో లొసుగులు చోటుచేసుకున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. మన ఉన్నతాధికారవర్గ పనితీరుపై రాజకీయ నాయకుల్లో కానీ సాధారణ ప్రజానీకంలోకానీ అసంతృప్తి పెరుగుతున్నప్పటికీ ఆధునిక రాజ్యంలో పరిపాలనా యంత్రాంగం పాత్ర అనివార్యమైందని అందరూ ఆమోదించాలి. ఈ నేపథ్యంలో ప్రతిభ, బాధ్యత, సమర్థత ప్రాతిపదికన సివిల్ సర్వీసును మెరుగుపర్చడానికి మనముందున్న మార్గాలేవీ అని ప్రశ్నించుకోవాలి. ఒకటి. ఉన్నతాధికారుల నియామకం వయోపరిమితిని 21–24 సంవత్సరాల వయస్సుకే కుదించాలి. ఈ వయసులో ఉన్న వారు పరీ క్షలు రాసి ఉత్తీర్ణులయ్యేందుకు పలు ప్రయత్నాలు కల్పించాలి. ఇప్పుడు జనరల్ కేటగిరీలో 32 సంవత్సరాలు, రిజర్వుడ్ కేటగిరీలో 35 సంవత్సరాల వరకు గరిష్టంగా వయో పరిమితిని పెంచారు. ప్రభుత్వోద్యోగికి తగిన శిక్షణ ఇచ్చి, ప్రస్తుత కాలానికి తగిన పాలన అవసరాలకు అనుగుణంగా వారి నైపుణ్యాలను, వైఖరులను తీర్చిదిద్దాలంటే యుక్తవయసులోనే నియమించుకోవడానికి చాలా ప్రాధాన్యత ఉంది. రెండు. ప్రభుత్వోద్యోగులు పదవీ విరమణ చేశాక, ప్రభుత్వ విచక్షణతో కూడిన నిర్ణయాలు, రాజకీయ జోక్యం ద్వారా వారికి కొత్త బాధ్యతలు ఇచ్చే పరిస్థితిని తొలగించాలి. ఉదాహరణకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో రిటైరైన వారిని చట్టబద్ధమైన కమిషన్లు, రెగ్యులేటరీ అధికారులు లేక తత్సమానమైన విభాగాలు మాత్రమే నియమించే స్థితి రావాలి. అర్హులైన వారి అప్లికేషన్లను స్వాగతించడం, బహిరంగ నియామకం ప్రక్రియ వంటి దశలను ప్రభుత్వేతర విభాగాల్లోని నిపుణుల విభాగం మాత్రమే చేపట్టాలి. అత్యంత సమర్థత, నిపుణతతో ఇతరులతో పోటీ పడగలిగే స్థాయి ఉన్న రిటైరైన ప్రభుత్వోద్యోగులను ఈ నియామకాల నుంచి మినహాయించాల్సిన పనిలేదు. ఇది జరిగినప్పుడు ప్రభుత్వ రాజకీయ ప్రాధాన్యతలకు లొంగకుండా ఉన్నతాధికార వర్గం ప్రజాప్రయోజనమే ప్రాతిపదికగా తన సేవలను అందించగలదు. మూడు. పని తీరుకు సంబంధించిన రివార్డులు, దండనల వ్యవస్థను మార్చాల్సి ఉంది. ఎంత చిన్న స్థాయిలోనైనా సరే కమీషన్లకు అలవాటు పడిన వారిపై మాత్రమే చర్యలు తీసుకునేలా ప్రస్తుత వ్యవస్థ ఉంది. కానీ ఉద్యోగుల కర్తవ్య ఉపేక్ష అనేది ప్రభుత్వ ఖజానాకు గణనీయంగా నష్టం కలిగిస్తుంది. ప్రజా సంక్షేమాన్ని దెబ్బతీస్తుంది. కానీ ఇలాంటి చర్యలకు పాల్పడేవారు ఇప్పుడు దండనల నుంచి దాదాపుగా తప్పించుకుంటున్నారు. ఎంతో నమ్మకంతో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయం వల్ల తప్పిదాలు జరిగిన సందర్భంలో అలాంటి వారిపై ప్రస్తుత నిబంధనలు చర్యలు తీసుకోవడం లేదు. ఎవరూ తప్పులనుంచి బయటపడకూడదు. శిక్షణా ప్రక్రియ కాలంలోనే ఉద్యోగులు దీన్ని గుర్తించి, అంగీకరించాల్సి ఉంది. తేలికపాటి సంస్కరణల ద్వారానే పాలనలో మార్పులు చేసుకోవచ్చు. కానీ దేశానికి ఉత్తమంగా సేవలందించడానికి సివిల్ సర్వీసును పూర్తిగా మార్చివేయడంలో ఇవి తప్పకుండా దోహదపడతాయి. మన వద్ద ఉన్న అపరిమిత ప్రతిభా సంపన్నులు, అనుభవజ్ఞులను ఉత్తమంగా ఉపయోగించుకోవడం ఎంతో అవసరం. వ్యాసకర్త: శ్యామ్ శరణ్ మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి (ట్రిబ్యూన్ సౌజన్యంతో) -
వైఎస్సార్సీపీ నేత శ్యామ్ కన్నుమూత.. సీఎం జగన్ సంతాపం
సాక్షి, బెంగళూరు/సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ నేత, పార్టీ ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శి కలకడ శ్యామ్‌సుందర్‌రెడ్డి (42) కరోనా కారణంగా కన్నుమూశారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఆయన 15 రోజుల పాటు అక్కడి అపోలో ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి పొద్దుపోయాక తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, నాలుగేళ్ల కుమార్తె, ఏడాది వయసున్న కుమారుడు ఉన్నారు. వారు కూడా కరోనా బారిన పడి ప్రస్తుతం కోలుకుంటున్నారు. పార్టీలో శ్యామ్‌గా చిరపరిచితుడైన ఆయన బెంగళూరులో పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఏపీలో జరిగిన పలు ఎన్నికల్లో తన ఐటీ బృందంతో కలసి పార్టీ విజయానికి ఎంతో కృషిచేశారు. అహర్నిశలు పార్టీ కోసం శ్యామ్ కష్టపడ్డారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం శ్యామ్ స్వగ్రామం చిత్తూరు జిల్లా కేవీ పల్లి మండలం కొత్తపల్లిలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. సీఎం వైఎస్ జగన్ సంతాపం శ్యామ్ కలకడ మృతిపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్యామ్ సతీమణి సుప్రియకు ఫోన్ చేసి సంతాపం తెలియజేశారు. వారి కుటుంబానికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. శ్యామ్ మృతి పట్ల పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీకి అంకితభావంతో పనిచేశారంటూ శ్యామ్ సేవలను కొనియాడారు. చదవండి : శ్యాం కలకడకు వైఎస్సార్సీపీ నివాళి -
శ్యాం కలకడకు వైఎస్సార్సీపీ నివాళి
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ ప్రధాన కార్యదర్శి శ్యాం కలకడ కన్నుమూశారు. మహమ్మారి కరోనా బారిన పడి ఆయన మరణించారు. కాగా శ్యాం కలకడ మరణం పట్ల వైఎస్సార్సీపీ విచారం వ్యక్తం చేసింది. ట్విటర్ వేదికగా నివాళి అర్పించింది. "వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు పార్టీ కోసం అనుక్షణం పనిచేసిన క్రియాశీలక కార్యకర్త శ్యామ్ కలకడ. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాధించాలని కోరుకుంటూ వైయస్ఆర్ సీపీ ఘన నివాళి అర్పిస్తోంది" అని ట్వీట్ చేసింది. అదే విధంగా శ్యాం కలకడ ఆకస్మిక మృతి పట్ల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సంతాపం ప్రకటించారు. "వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేసిన శ్యామ్ కలకడ మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన కలిగించింది. శ్యామ్ మరణం పార్టీకి తీరని లోటు" అని శ్యాం కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి తన చివరి శ్వాస వరకు పార్టీ కోసం అనుక్షణం పనిచేసిన క్రియాశీలక కార్యకర్త శ్యామ్ కలకడ. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాధించాలని కోరుకుంటూ వైయస్ఆర్ సీపీ ఘన నివాళి అర్పిస్తోంది. pic.twitter.com/3mY7rhzyXN — YSR Congress Party (@YSRCParty) May 12, 2021 చదవండి: మహమ్మారిని జయించి: తల్లి మరణ వార్త విని బాలింత మృతి