
బాక్సర్ కాకర శ్యామ్ కుమార్
జకార్తా: ఆసియా క్రీడల టెస్ట్ ఈవెంట్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ ఫైనల్‌కు చేరాడు. ఇండోనేసియా రాజధాని జకార్తాలో బుధవారం జరిగిన పురుషుల 49 కేజీల విభాగం సెమీఫైనల్లో మొహమ్మద్ ఫౌద్ రెడ్‌జూన్ (మలేసియా) నుంచి వాకోవర్ లభించడంతో శ్యామ్ కుమార్ ఫైనల్ చేరాడు. తుది పోరులో అతను ఇండోనేసియాకు చెందిన మారియో బ్లాసౌస్‌తో తలపడనున్నాడు.
ఈ టోర్నీలో భారత్ నుంచి శ్యామ్‌తో పాటు శశి చోప్రా, పవిత్ర, కౌశిక్, షేక్ సల్మాన్ అన్వర్, ఆశిష్ ఫైనల్‌కు అర్హత సాధించారు. రీతు, మొహమ్మద్ ఇతాశ్ ఖాన్, పవన్ కుమార్, ఆశిష్ కుమార్‌లు సెమీస్‌లో ఓడి కాంస్యాలతో సరిపెట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment