‘క్రైమ్‌ థ్రిల్లర్‌గా 'అం అః’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ | Am Aha Movie Release Date Out | Sakshi
Sakshi News home page

‘క్రైమ్‌ థ్రిల్లర్‌గా 'అం అః’.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Published Sat, Sep 10 2022 4:43 PM | Last Updated on Sat, Sep 10 2022 4:43 PM

Am Aha Movie Release Date Out - Sakshi

ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్స్‌కి రప్పించడం చాలా కష్టంగా మారింది. కథలో కొత్తదనం ఉంటే తప్పా.. ప్రేక్షకులు సినిమాలను ఆదరించడం లేదు. . ఇలాంటి తరుణంలోనే డిఫరెంట్ టైటిల్, నేటితరం ఆడియన్స్ కోరుకునే థ్రిల్లింగ్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'అం అః'. ‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్’ అనేది ట్యాగ్‌లైన్‌. సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా  ఈ చిత్రానికి శ్యామ్ మండ‌ల దర్శకత్వం వహిస్తున్నారు.

రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. . చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా విడుదలైన 'నీ మనసే నాదని' వీడియో సాంగ్ , టీజర్‌కి మంచి స్పందన లభించింది.సస్పెన్స్‌కి తోడు రొమాంటిక్ సన్నివేశాలు, యూత్ ఆడియన్స్ మెచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రం విడుదల తేదీని మేకర్లు తాజాగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 16న భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement