రాజ్ తరుణ్- లావణ్య వివాదం టాలీవుడ్‌లో సంచలనంగా సృష్టించింది. గతేడాది ఒకరిపై ఒకరు కేసులతో పాటు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. తాము విడిపోవడానికి కారణం మస్తాన్ సాయినే అని నార్సింగి పోలీసులకు తాజాగా లావణ్య ఫిర్యాదు చేసింది. ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
ఫిర్యాదులో సంచలన విషయాలు..
మస్తాన్ సాయిపై పోలీసులకిచ్చిన ఫిర్యాదులో లావణ్య ోసంచలన విషయాలు బయటపెట్టింది. పలువురు అమ్మాయిలతో ఏకాంతంగా ఉన్న వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా పోలీసులకు కీలకమైన హార్డ్ డిస్క్ అందించినట్లు లావణ్య వెల్లడించింది.
హార్డ్ డిస్క్‌లో 300 వీడియోలు..
పోలీసులు స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్‌లో దాదాపు 300లకు పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో లావణ్యకు సంబంధించినవీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లావణ్య వెల్లడించింది. ఇప్పటికే లావణ్య స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు.. ఈ కేసులో మరో యువకుడు ఖాజాను కూడా అరెస్ట్ చేశారు. ఇద్దరూ కలిసి బెదిరింపులకు పాల్పడ్డారన్న లావణ్య ఫిర్యాదులో పోలీసులకు వివరించింది.
ఆధారాలతో వచ్చా- లావణ్య
మస్తాన్ సాయిపై అన్నీ ఆధారాలతో పోలీసులకు ఫిర్యాదు చేశానని లావణ్య తెలిపింది. గతంలో నా వద్ద ఆధారాలు లేవని.. అందుకే ఇన్ని రోజులు ఫిర్యాదు చేయలేదని వెల్లడించింది. ఇప్పుడు వీడియోలతో సహా నా వద్ద ఉన్న ఆధారాలు నార్సింగి పోలీసులకు ఇచ్చానని లావణ్య పేర్కొంది. దీంతో ఈ కేసు మరింత హాట్ టాపిక్‌గా మారింది.
ప్రాణహాని ఉంది..లావణ్య
మస్తాన్ సాయితో తనకు ప్రాణహాని ఉందని లావణ్య ఆరోపించింది. అతని నుంచి రక్షణ కల్పించాలని లావణ్య పోలీసులను కోరింది. తనకు ఇప్పటికీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపింది. అంతేకాకుండా హార్డ్ డిస్క్ కోసం తనను చంపేందుకు యత్నిస్తున్నారని లావణ్య ఆరోపణలు చేసింది. ప్రస్తుతం హార్డ్ డిస్క్‌ను పోలీసులకు అప్పగించానని లావణ్య పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment