
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్- లావణ్య కేసులో తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు అయింది. రాజ్‌తరుణ్‌పై లావణ్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని పోలీసులు తేల్చేశారు. లావణ్య- రాజ్‌తరుణ్ పదేళ్లుగా ఒకే ఇంట్లో ఉన్నట్లుగా తమ ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. అందుకు సంబంధించి లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు కూడా సేకరించినట్లు వారు పేర్కొన్నారు. ఈ కేసు విషయంలో లావణ్య చెప్తున్నదాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు.
ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్‌తరుణ్‌పై కోకపేటకు చెందిన లావణ్య అనే యువతి నార్సింగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్, తాను పదేళ్లుగా కలిసి జీవించామని, ఇప్పుడు అతను ముంబైకి చెందిన హీరోయిన్‌తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడంటూ గతంలో ఆమె పిర్యాదులో పేర్కొంది. పిర్యాదులో పేర్కొన్నట్లుగా ఆమె పలు ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించింది. ఈ క్రమంలో ఆమె రాజ్ తరుణపై కేసు కూడా పెట్టింది. ఈ కేసులో రాజ్‌తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ విషయంలో తాజాగా పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేయడంతో ఆయన తీసుకున్న ముందస్తు బెయిల్ కొట్టివేసే ఛాన్స్ ఉంది.

Comments
Please login to add a commentAdd a comment