నూజివీడు: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీకి చెందిన ఈసీఈ ఆఖరి సంవత్సరం విద్యార్థులు తొమ్మిది మంది అమెరికన్ బహుళజాతి సెమీ కండక్టర్ కంపెనీ అయిన అన్‌లాగ్ డివైజెస్‌కి ఎంపికయ్యారు. ఆ సంస్థ ప్రతినిధులు ట్రిపుల్‌ఐటీలో ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించి ఆప్టిట్యూడ్, టెక్నికల్ పరీక్షల అనంతరం తొమ్మిది మంది విద్యార్థులను ఏడాదిపాటు లాంగ్‌టర్మ్ ఇంటర్న్‌షిప్‌కు ఎంపిక చేశారు. ఇంటర్న్‌షిప్ సమయంలో ఈ విద్యార్థులకు నెలకు రూ.40వేలు చొప్పున స్టయిఫండ్ ఇస్తారు.
ఇంటర్న్‌షిప్ పూర్తయిన తర్వాత వారి పనితీరు ఆధారంగా విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఇదే సంస్థ గతేడాది నూజివీడు ట్రిపుల్‌ఐటీకి చెందిన ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి రూ.27లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలను ఇచ్చింది.
ఈ సందర్భంగా ట్రిపుల్‌ఐటీ ఈసీఈ హెచ్‌వోడీ పి.శ్యామ్ మాట్లాడుతూ భారతదేశ సెమీ కండక్టర్ పాలసీ ఫ్రేమ్ వర్క్‌కు అనుగుణంగా అగ్రశ్రేణి విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణుల సలహాలు, సూచనల మేరకు ట్రిపుల్‌ఐటీలో పాఠ్యాంశాలను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఎనిమిది రకాల అత్యాధునిక ల్యాబ్‌లతో నిరంతరం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment