లోక్‌సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే ఆకర్షిస్తోంది. అక్కడ పోటీ చేస్తేది.. ప్రధాని మోదీ కాబట్టి. అయితే మోదీపై పోటీ చేయడానికి కమెడియన్ శ్యామ్ రంగీలా వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ప్రధాని నరేంద్ర మోదీ వాయిస్‌ను అనుకరించటం వల్ల ఫేమస్ అయిన శ్యామ్ రంగీలా.. మే 14న వారణాసి స్థానానికి నామినేషన్ వేశారు.
ఈ సెగ్మెంట్‌లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా నామినేషన్ వేశారు. ఒక రోజు తర్వాత ఆయన నామినేషన్‌ను తిర్కరించినట్లు ఎన్నికల సంఘం తన వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. వారణాసిలో తనను నామినేషన్ వేయనీయకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
‘‘నన్ను ప్రతిపాదించేవారు ఉన్నారు. సంబందిత పత్రాలు కూడా నింపాం. ఆమోదించడానిక ఎవరు ముందుకు రావటం లేదు. రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాం’’ అని మే 13న శ్యామ్ రంగీలా అన్నారు. మరుసటి రోజు కూడా అధికారులు సహరించలేదని తెలిపారు. అనంతరం ఎట్టకేలకు నిబంధంనల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్యామ్ రంగీలా నామినేష్‌ను తిరస్కరణకు గురైంది.
దీనిపై బుధవారం శ్యామ్ రంగీలా స్పదించారు. ‘‘ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. ఎన్నికల్లో పోటీ చేయటాన్ని ఎన్నికల సంఘం ఒక ఆటలా భావిస్తోంది. నా నామినేషన్‌ను తిరస్కరించారు. ప్రజల ముందు ఎన్నికల అధికారుల ఇలా ఎందుకు చేశారో? 24 గంటల్లోనే ప్రజలకు అర్థం అయింది. నేను సమర్పించిన పత్రాల్లో ఎటువంటి సమస్య లేదు. నాకు తెలుసు నేను అన్ని అవసరమైన పత్రాలు సమర్పించాను. నిన్నటి విజయం నేడు ఓడి పోయింది’’ అని శ్యామ్ రంగీలా అన్నారు.
ఇక.. రాజస్థాన్‌లోని హనుమాన్‌గర్హ్ జిల్లాలోని మనక్‌తేరి బరనీ గ్రామంలో 1994లో పుట్టిన ఆయన అసలు పేరు శ్యామ్ సుందర్. యానిమేషన్ పట్టభద్రుడైన శ్యామ్ సరదాగా కామెడీ, మిమిక్రీ, స్టాండప్ కామెడీ చేస్తుండేవాడు. 2017లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ పోటీలో నరేంద్ర మోదీ వాయిస్‌ను శ్యామ్ మిమిక్రీ చేశాడు.
అప్పటి నుంచే ఆయన విశేష గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ చేసిన తర్వాత శ్యామ్‌కు వేధింపులు మొదలయ్యాయి. శ్యామ్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని విమర్శలు చేస్తూ సంచలనం రేపారు. వారణాసి పార్లమెంట్ స్థానానికి ఏడో విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment