comedian actor
-
టాలీవుడ్ కమెడియన్ అలీ పెళ్లి వేడుక.. సెలబ్రేషన్స్ చూశారా!
టాలీవుడ్ కమెడియన్ నటుడు అలీ గురించి పరిచయం అక్కర్లేదు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో తన కామెడీతో అభిమానులను ఎంటర్టైన్ చేశారు. తెలుగులో స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. హీరోగా, హీరో స్నేహితుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా విభిన్న పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ తెలుగు సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. సీతాకోకచిలుక చిత్రం ద్వారా హీరోగా మారారు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.జుబేదాను పెళ్లాడిన అలీ..అయితే జుబేదాను పెళ్లాడిన అలీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2022 డిసెంబర్లో పెద్దకూతురు ఫాతిమా పెళ్లిని గ్రాండ్‌గా చేశారు. ఈ పెళ్లికి టాలీవుడ్ స్టార్స్‌తో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరలయ్యాయి. అయితే తాజాగా అలీ సైతం మరోసారి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో మనం కూడా చూసేద్దాం.గ్రాండ్‌గా అలీ పెళ్లి వేడుక..ఇటీవల తన పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు అలీ దంపతులు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మరోసారి వివాహా వేడుక జరుపుకున్నారు. తమ ఇద్దరు కూతుర్ల సమక్షంలో ఈ పెళ్లి వేడుకను సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియో జుబేదా అలీ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. వారి సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. -
తెలుగులో సరికొత్త వెబ్ సిరీస్.. డైరెక్టర్‌గా టాలీవుడ్ కమెడియన్!
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సరికొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. పౌరాణిక నేపథ్యంలో ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ(అదిరే అభి) దర్శకత్వంలో ఈ సిరీస్‌ను రూపొందించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్‌కు చిరంజీవా అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ టాలీవుడ్ మైథలాజికల్ వెబ్ సిరీస్ డిసెంబర్లో స్ట్రీమింగ్ రానుందని ప్రకటించారు. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేయనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే భక్తి కోణంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఈ వెబ్ సిరీస్‌ను రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ నిర్మించారు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్‌కు అచ్చు రాజమణి సందీతమందిస్తున్నారు. -
మోదీపై పోటీ.. కమెడియన్ నామినేషన్ తిరస్కరణ
లోక్‌సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే ఆకర్షిస్తోంది. అక్కడ పోటీ చేస్తేది.. ప్రధాని మోదీ కాబట్టి. అయితే మోదీపై పోటీ చేయడానికి కమెడియన్ శ్యామ్ రంగీలా వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ప్రధాని నరేంద్ర మోదీ వాయిస్‌ను అనుకరించటం వల్ల ఫేమస్ అయిన శ్యామ్ రంగీలా.. మే 14న వారణాసి స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సెగ్మెంట్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా నామినేషన్ వేశారు. ఒక రోజు తర్వాత ఆయన నామినేషన్‌ను తిర్కరించినట్లు ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపర్చింది. వారణాసిలో తనను నామినేషన్ వేయనీయకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.‘‘నన్ను ప్రతిపాదించేవారు ఉన్నారు. సంబందిత పత్రాలు కూడా నింపాం. ఆమోదించడానిక ఎవరు ముందుకు రావటం లేదు. రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాం’’ అని మే 13న శ్యామ్ రంగీలా అన్నారు. మరుసటి రోజు కూడా అధికారులు సహరించలేదని తెలిపారు. అనంతరం ఎట్టకేలకు నిబంధంనల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్యామ్ రంగీలా నామినేష్‌ను తిరస్కరణకు గురైంది. దీనిపై బుధవారం శ్యామ్ రంగీలా స్పదించారు. ‘‘ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. ఎన్నికల్లో పోటీ చేయటాన్ని ఎన్నికల సంఘం ఒక ఆటలా భావిస్తోంది. నా నామినేషన్‌ను తిరస్కరించారు. ప్రజల ముందు ఎన్నికల అధికారుల ఇలా ఎందుకు చేశారో? 24 గంటల్లోనే ప్రజలకు అర్థం అయింది. నేను సమర్పించిన పత్రాల్లో ఎటువంటి సమస్య లేదు. నాకు తెలుసు నేను అన్ని అవసరమైన పత్రాలు సమర్పించాను. నిన్నటి విజయం నేడు ఓడి పోయింది’’ అని శ్యామ్ రంగీలా అన్నారు.ఇక.. రాజస్థాన్‌లోని హనుమాన్‌గర్హ్ జిల్లాలోని మనక్తేరి బరనీ గ్రామంలో 1994లో పుట్టిన ఆయన అసలు పేరు శ్యామ్ సుందర్. యానిమేషన్ పట్టభద్రుడైన శ్యామ్ సరదాగా కామెడీ, మిమిక్రీ, స్టాండప్ కామెడీ చేస్తుండేవాడు. 2017లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ పోటీలో నరేంద్ర మోదీ వాయిస్‌ను శ్యామ్ మిమిక్రీ చేశాడు. అప్పటి నుంచే ఆయన విశేష గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ చేసిన తర్వాత శ్యామ్‌కు వేధింపులు మొదలయ్యాయి. శ్యామ్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని విమర్శలు చేస్తూ సంచలనం రేపారు. వారణాసి పార్లమెంట్ స్థానానికి ఏడో విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. -
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. తమ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రచార స్పీడ్ పెంచుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా మేము సైతం అంటూ.. ప్రధాని పార్టీల అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీకి దిగుతున్నారు. తాజాగా మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా (29) ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీ చేసే వారణాసి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ‘‘ నేను వారణాసి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మడానికి లేదు. ఎప్పుడైనా నామినేషన్ ఉపసంహరించుకుంటారు’’ అని శ్యామ్ రంగీలా అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని అనుకరిస్తూ పాపులారిటీ సంపాధించిన శ్యామ్ రంగీలా తన మద్దతుదారుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నేను వారణాసిలో పోటీ చేస్తానని ప్రకటించటంతో వచ్చిన స్పందనకు చాలా సంతోషంగా ఉంది. నేను నా వీడియోల ద్వారా నామినేషన్‌కు సంబంధించిన విషయాలు పంచుకుంటా’’ అని అన్నారు.वाराणसी से चुनाव लड़ने के ऐलान के बाद आप सबसे मिल रहे प्रेम से मैं उत्साहित हूँ, वाराणसी पहुँचने और नामांकन और चुनाव लड़ने को लेकर जल्द ही वीडियो के माध्यम से अपने विचार आप सबके सामने रखूँगावन्दे मातरम् - जय हिन्द #ShyamRangeelaforVaranasi #election— Shyam Rangeela (@ShyamRangeela) May 1, 2024 ‘‘2014లో నేను ప్రధాని మోదీ ఫాలోవర్ను.నేను మోదీకి మద్దతుగా వీడియోలు చేశాను. అదేవిధంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వీడియోలు షేర్ చేశాను. ఆ సమయంలోనే మరో 70 ఏళ్లు బీజేపీ ఓటు వేస్తాననుకున్నా. కానీ, గత పదేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. నేను ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా వారణాసిలో ఎంపీగా పోటీ చేస్తున్నా. నేను వారం రోజుల్లో వారణాసికి వేళ్లి నామినేషన్ ఫైల్ చేస్తాను’’ అని కమెడియన్ శ్యామ్ రంగీలా తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ పూర్వాంచల్‌లో బాహుబలి నేతగా పేరొందిన అజయ్‌రాయ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి మోదీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. -
Comedy Actor Visweswara Rao: ముగ్గురు సీఎంలతో నటించిన కమెడియన్.. అరుదైన ఫోటోలు
-
స్టార్ కమెడియన్ కూతురు బర్త్ డే.. హాజరైన అగ్ర హీరోలు!
కోలీవుడ్ ప్రముఖ కమెడియన్ యోగిబాబు గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. కోలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో అలరిస్తూనే ఉన్నారు. తాజాగా తన ముద్దుల కూతురు మొదటి బర్త్‌డేను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కోలీవుడ్ స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సూర్య, కార్తీ, విజయ్ సేతుపతి బర్త్ డే వేడుకలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: 'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!) కోలీవుడ్ సినిమాల్లో యోగిబాబు తనదైన కామెడీతో అభిమానులను సంపాదించుకున్నారు. కమెడియన్‌గా ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవలే రిలీజైన రజినీకాంత్ చిత్రం జైలర్‌లోనూ మెప్పించారు. షారుక్ ఖాన్, నయనతార జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ జవాన్‌లో కనిపించారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం అయాలన్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: మెగా ఫోన్ పట్టనున్న రామ్ చరణ్ విలన్!) -
పాకీజాను వీడని ఆర్థిక కష్టాలు.. షాపుల వద్ద భిక్షాటన చేస్తూ!
పాకీజా అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెహన్‌బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్రంలో తన పాత్రకు ప్రేక్షకులను మెప్పించింది. అలా తెరపై అందరినీ నవ్వించిన ఆమెకు నిజ జీవితంలో మాత్రం కష్టాలు వదలడం లేదు. తమిళనాడు సీఎం జయలలిత మరణం తర్వాత తన పరిస్థితి చాలా దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తినడానికి కూడా సరిగా తిండి లేక ఇబ్బందులు పడ్డామని వాపోయింది. ఆమె అసలు పేరు వాసుకి కాగా.. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్‌తో పాకీజాగా మారిపోయింది. (ఇది చదవండి: దీనస్థితిలో పాకీజా.. అండగా నిలిచిన మంచు విష్ణు) అయితే జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆమెకు టాలీవుడ్ ప్రముఖులు అండగా నిలిచారు. మెగా ఫ్యామిలీతో పాటు మా అసోసియేషన్ ఆమె సాయం చేశారు. అంతేకాకుండా మా అసోసియేషన్ తరఫున మంచు విష్ణు ఆమెకు గుర్తింపు కార్డును సైతం అందజేశారు. ఈ తరుణంలో మళ్లీ సినిమాల్లో అవకాశాలు వస్తాయన్న ఆశతో హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఇక్కడే ఉంటూ నగరంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటోంది. అయితే పాకీజాకు ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. సీరియల్స్‌తో పాటు కామెడీ షో అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె కష్టాలను తీర్చలేకపోయాయి. ఎప్పటిలాగే ఆర్థిక ఇబ్బందులు పడుతోంది. దీంతో ఇంటికి అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో తిరుపతిలో భిక్షాటన చేస్తూ కనిపించింది. తాను ఇంకా అర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొంది. తిరుపతిలోని దుకాణాల యజమానులు ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ కనిపించింది. ఒక ఆర్టిస్ట్‌గా అందరి నవ్వించిన వాసుకిని చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అనకుండా ఉండలేరు. సినీ ఇండస్ట్రీలో అందరి జీవితాలు ఓకేలా ఉండవని ఆమె పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. (ఇది చదవండి: నా సొంతింటికి వచ్చినట్లు ఉంది.. చెన్నైకి వెళ్లను: సీనియర్ నటి పాకీజా) -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!
కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆర్ఎస్ శివాజీ(66) కన్నుమూశారు. కోలీవుడ్‌లో హాస్యనటుడు మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిసలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తమిళంలో వందకుపైగా సినిమాల్లో నటించారు. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. శివాజీ ప్రముఖ నిర్మాత ఎంఆర్ సంతానం కుమారుడు కాగా.. ఆయన సోదరుడు సంతాన భారతి కోలీవుడ్‌లో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో వచ్చిన ‘పన్నీర్ పుష్పాలు’ సినిమాతో శివాజీ తెరంగేట్రం చేశారు. 'కోలమావు కోకిల', 'సూరరై పొట్రు', 'ధారల ప్రభు' 'గార్గి' లాంటి చిత్రాల్లో కనిపించారు. స్టార్ హీరో కమల్ హాసన్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌తో కలిసి ఎక్కువ చిత్రాల్లో పనిచేసినందుకు కోలీవుడ్‌లో గుర్తింపు పొందారు. కాగా.. శివాజీ చివరిసారిగా యోగి బాబు నటించిన 'లక్కీ మ్యాన్'లో కనిపించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలైంది. (ఇది చదవండి: దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది?.. రిలీజ్ ఎప్పుడంటే? ) కమల్‌హాసన్‌తో ప్రత్యేక అనుబంధం కమల్‌హాసన్‌తో శివాజీకి చక్కటి అనుబంధమున్నట్లు తెలుస్తోంది. ఆ సాన్నిహిత్యంతోనే కమల్‌హాసన్ సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. కమల్‌హాసన్ హీరోగా నటించిన విక్రమ్, సత్య, అపూర్వ సగోదరగళ్, మైఖేల్ మదన కామరాజు, గుణ, చాచి 420, అన్బేశివంతో పాటు పలు సినిమాల్లో శివాజీ కమెడియన్‌గా నటించారు. ఈ సినిమాలన్నీ తెలుగులోనూ అనువాదమై శివాజీకి మంచి పేరుతెచ్చిపెట్టాయి. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో కీలకపాత్ర మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు ఆర్ఎస్ శివాజీ. మాలోకం అనే ఓ కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు. అంతే కాకుండా తేజ డైరెక్షన్లో వచ్చిన 100 అబద్దాలు సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. వీటితో పాటు తెలుగులో గతేడాది సాయిపల్లవి హీరోయిన్గా తెరకెక్కిన గార్గి సినిమాలో ఆమె తండ్రి పాత్రలో కనిపించిన శివాజీ ప్రశంసలు అందుకున్నారు. సినిమాలతో పాటు కొన్ని టీవీ సీరియల్స్‌లో శివాజీ కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: పవన్ కల్యాణ్ ఓజీపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్..! ) -
ప్రముఖ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి ఫిక్స్!
బుల్లితెరలో ప్రసారం అవుతున్న కామెడీ షోలకు స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన హైపర్ ఆది రానురానూ అదే షోలో టీమ్‌కు లీడర్ అయ్యే స్థాయికి ఎదిగాడు. ఆపై తిరుగులేని పంచులతో మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకున్నాడు. తద్వారా వచ్చిన పాపులారిటీతో పలు షోలు చేస్తూ బిజీబిజీగా మారాడు. దీంతో తన కామెడీ టైమింగ్ పంచ్‌లతో సపరేట్ ఫ్యాన్ బేస్‌ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అలా బుల్లితెరపైనే కాకుండా బిగ్ స్క్రీన్‌పైనా కూడా పలు సినిమాల్లో కమెడియన్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ మధ్యే విడుదలైన ధనుష్ 'సార్' సినిమాలో కూడా ఆది మెప్పించాడు. (ఇదీ చదవండి: TFCC Election Live Update: టాలీవుడ్ లో ఉత్కంఠ.. గెలుపెవరిది?) తాజాగా అతడు పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అవ్వాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం ఊపందుకుంది. దీంతో అతడికి కాబోయే భార్య ఎవరా? అని అభిమానులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రముఖ యూట్యూబ్ యాంకర్‌తో ఆది ప్రేమలో ఉన్నారట. ఆమెతో ఆదికి చాలా కాలం నుంచే పరిచయం ఉందట. ఒక రకంగా ఆది ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో అతనికి ఆమె ఎంతో సాయంగా నిలిచిందట. అలా స్నేహంగా మొదలైన వారి బంధం ప్రేమ వరకు వచ్చిందట. (ఇదీ చదవండి: TFCC Election: సంతోషపడాలో, సిగ్గు పడాలో తెలియట్లేదు..తమ్మారెడ్డి) తాజాగా వీరి ప్రేమ గురించి ఇంట్లో తెలిపితే ఇద్దరి పెద్దలు కూడా అంగీకరించారట. ఇంకేముంది త్వరలోనే ఒక మంచి ముహూర్తం ఏర్పాటు చేసి ఆ అమ్మాయితో నిశ్చితార్థం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. త్వరలో ఆ ఆమ్మాయి పేరుతో పాటు.. పెళ్లి విషయాన్ని అధికారికంగా ఆదినే వెల్లడించాలనే ప్లాన్‌లో ఉన్నారట. -
మాజీ సీఎంపై ప్రముఖ కమెడియన్ వివాదాస్పద కామెంట్స్!
ఇటీవలే కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి రాజకీయ ప్రముఖులు, మలయాళ సినీతారలు సైతం సంతాపం వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం సైతం ఆ మృతికి రెండు రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించింది. ఈ నేపథ్యంలో మలయాళ స్టార్ కమెడియన్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారు? ఎందుకు వివాదంగా మారిందో తెలుసుకుందాం. మాలీవుడ్ నటుడు వినాయకన్ సోషల్ మీడియాలో లైవ్ పెట్టి మరీ మాజీ సీఎంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కొద్ది నిమిషాలకే సోషల్ మీడియా నుంచి తొలగించాడు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని కుదిపేసిన ఘటన.. హీరోయిన్‌పై అత్యాచారయత్నం!) లైవ్ వీడియోలో వినాయకన్ మాట్లాడుతూ.. 'అసలు ఊమెన్ చాందీ ఎవరు?. మూడు రోజులుగా అతని మరణం గురించి మీడియాలో విస్తృతంగా కవరేజీ రావడం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇలాంటి వార్తలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మానుకోవాలని మీడియాను కోరారు. మరణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో సాధారణంగా జరిగేదే. అందరిలాగే ఊమెన్ చాందీ కూడా చనిపోయారు. అంతే కాకుండా ఊమెన్ చాందీని మంచి వ్యక్తిగా చిత్రీకరించడం తప్పు..' అని విమర్శలు చేశారు. దీంతో కేరళలో పెద్దఎత్తున విమర్శలు రావడంతో వినాయకన్ ఆ లైవ్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేశాడు. కాగా.. వినాయకన్ తదుపరి ఆసిఫ్ అలీ నటిస్తోన్న 'కాసర్ గోల్డ్' చిత్రంలో నటిస్తున్నారు. (ఇది చదవండి: రెండోసారి తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్!) View this post on Instagram A post shared by Tk Vinayakan (@actorvinayakan) -
ధనవంతులమే కానీ తృప్తి లేని జీవితం నాది
-
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌కు అస్వస్థత
ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్ ఇప్పుడు కూతురి కోసం దర్శకుడిగా మారి సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రంగుల ప్రపంచం సినిమాకు ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా ప్రమోషన్స్ చేస్తూ బిజీబిజీగా గడపుతున్నారు. చదవండి: రానా తమ్ముడు హీరోగా 'అహింస'.. రిలీజ్ డేట్ ఫిక్స్ ఈ క్రమంలో అస్వస్థతకు గురై ఉన్నట్లుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. సెలైన్‌తో హాస్పిటల్ బెడ్‌పై తన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ పృథ్వీరాజ్ ఓ వీడియోను రిలీజ్ చేశారు. డైరెక్టర్‌గా తొలిసారి సినిమా తీస్తున్నాను. ఆసుపత్రిలో ఉన్నా సినిమా గురించి ఆలోచిస్తున్నానుకొత్త రంగుల ప్రపంచం సినిమాకి మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. చదవండి: ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే! -
నాన్న చితికి కూడా నా వద్ద డబ్బులు లేవు: రంగస్థలం మహేశ్
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పేరు సంపాదించుకున్న మహేశ్. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో నటనతో మరితం ఫేమ్ తెచ్చుకున్నాడు. కామెడీ షోలో ఎప్పుడు కడుపుబ్బా నవ్వించే మహేశ్.. తన యాస, డైలాగ్స్‌తో సినిమాల్లో తన మార్క్ చూపించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రంలో ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టాడు. ఆ సినిమాతో రంగస్థలం మహేశ్‌గా అభిమానుల్లో పేరు సంపాదించాడు. (ఇది చదవండి: 'సేవ్ ది టైగర్స్'.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన యాత్ర డైరెక్టర్!) అంతలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న మహేశ్ తన జీవితంలో పడ్డ కష్టాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన మహేశ్ తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు పేరు ఒక్క రోజులో వచ్చింది కాదని చెప్పారు. మహేశ్ మాట్లాడుతూ ..'నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జీరో. మన టాలెంట్ నమ్ముకొని వచ్చా. ఏం జరిగినా ముందుకెళ్లడమే నాకు తెలుసు. నాకు చిన్నతనం నుంచి సినిమాలు అంటే ఇష్టం. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని హైదరాబాద్‌కు వచ్చా. సినిమాలనే నమ్ముకున్నా. నేను సినిమాలలో ప్రయత్నాలు చేస్తున్నప్పుడే నాన్న చనిపోయారు. ఆ సమయంలో నాన్న చితి కట్టెలకు కూడా డబ్బులిచ్చే స్తోమత లేదు. అప్పుడు నా జేబులో రూ.500 కూడా లేవు. అప్పుడు చాలా బాధేసింది. ఆ సమయంలో ఈ బతుకు ఎందుకురా అనిపించింది. దీంతో చాలామంది బంధువులు, స్నేహితులు సినిమాలు అవసరమా? అంటూ నన్ను తిట్టారు. ఆ సందర్భంలో నేను మాత్రం చాలా బాధపడ్డా. నాకు మంచి అవకాశం ఇచ్చింది డైరెక్టర్ సుకుమార్. కొన్నేళ్లు పట్టినా కూడా మంచిపాత్ర చేసే అవకాశం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఇల్లు లేదని.. సొంతూళ్లో ఇటీవలే ఇంటిని నిర్మించా. ' అంటూ మహేశ్ తీవ్ర భావోద్వాగానికి గురయ్యాడు. (ఇది చదవండి: నరేశ్- పవిత్ర 'మళ్లీ పెళ్లి'.. ముహుర్తం పెట్టేశారుగా!) -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మలయాళ నటుడు, కమెడియన్ మముక్కోయ(77) కన్నుమూశారు. కేరళలోని కోజికోడ్‌లో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోమవారం రాత్రి మలప్పురం జిల్లాలోని ఫుట్‌బాల్ టోర్నమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆయనను ఆసుపత్రికి తరలించగా కోలుకోలేక ఇవాళ మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ శ్రీధర్ పిళ్లై ట్వీట్ చేశారు. (ఇది చదవండి: సమంత డై హార్డ్ ఫ్యాన్.. ఏకంగా ఇంట్లోనే గుడి కట్టేస్తున్నాడు!) మలయాళ చిత్రసీమలో అత్యుత్తమ హాస్య నటులలో ఒకరిగా పేరు మాముక్కోయ సంపాదించారు. 1979లో థియేటర్లో తన నటనా వృత్తిని ప్రారంభించిన ఆయన 450కి పైగా మలయాళ చిత్రాలలో నటించారు. మాముకోయ నటనకు రెండు రాష్ట్ర అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఆయన ఎక్కువగా కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నటించారు. తెలుగులో డబ్ అయిన దుల్కర్ సల్మాన్ నటించిన జనతా హోటల్, మోహన్ లాల్ నటించిన కనుపాప చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. #Mamukkoya (77), one of the finest comedy actors ever in Malayalam cinema passed away. Who can forget this Kozhikode man, the epicentre of laughter in so many films?#RIP pic.twitter.com/jrHlmXpv1m — Sreedhar Pillai (@sri50) April 26, 2023 -
టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత!
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, కమెడియన్ అల్లు రమేశ్ కన్నుమూశారు. మంగళవారం విశాఖపట్నంలో గుండెపోటుతో ఆయన మరణించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆనంద్ రవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అల్లు రమేశ్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లో కూడా కనిపించారు. ఇటీవలే విడుదలైన నెపోలియన్ సినిమాలో ఆయన నటించారు. విశాఖపట్టణానికి చెందిన అల్లు రమేష్ నాటకాల్లో నటించేవారు. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. యూట్యూబ్‌లో ప్రసారమయ్యే ‘మా విడాకులు’ వెబ్ సిరీస్‌లో నటించారు. తోలుబొమ్మలాట, మధుర వైన్స్, రావణ దేశం వంటి కొన్ని సినిమాలలో నటించారు. తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసినా తనదైన ప్రత్యేక కోస్తా యాసతో గుర్తింపు తెచ్చుకున్నాడు. -
అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చా: ‘బలగం’ డైరెక్టర్ వేణు
కమెడియన్ వేణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బలగం చిత్రంతో దర్శకుడిగా మారిన వేణు ప్రముఖ కామెడీ షో జబర్దస్త్‌తో పాపులర్ అయ్యాడు. అంతకు ముందే సినిమాల్లో కమెడియన్‌గా నటించిన వేణుకు జబర్దస్త్ మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. వేణు వండర్స్ అనే పేరుతో టీంకు లీడర్‌గా వ్యవహరించిన నవ్వులు పండించాడు. ఇప్పుడున్న గెటప్ శ్రీను, సుడిగాలి సుదీర్ ఆయన టీంలోనే ఎదిగారు. ఈ కామెడీ షోలో ఎన్నో హిట్ టాస్క్ చేసి బుల్లితెర ప్రేక్షకులను కడుబ్బా నవ్వించిన వేణు జబర్దస్త్‌లో ఎక్కువ కాలం ఉండలేకపోయాడు. చదవండి: Naresh-Pavithra Marriage: పెళ్లి చేసుకున్న నరేశ్-పవిత్ర? కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వేణు ఈ షో నుంచి బయటకు వచ్చాడు. అయితే విభేదాల కారణంగానే వేణు ఈ షో నుంచి బయటకు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో తాను జబర్దస్త్ నుంచి బయటకు రావడంపై తాజాగా వేణు స్పందించాడు. ఆయన దర్శకత్వం వహించిన ‘బలగం’ మూవీ మంచి విజయం సాధించిన సందర్భంగా వేణు వరుస ఇంటర్య్వూల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు జబర్దస్త్ వీడటంపై ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు స్పందిస్తూ.. ‘విబేధాల కారణంగా నేను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను అనడంలో వాస్తవం లేదు. చదవండి: ఆ ఘనత విజయకాంత్‌దే: హీరో విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు కేవలం సినిమాపై ఇష్టంతోనే ఆ షో వదిలేశాను. మొదటి నుండి నా లక్ష్యం సినిమానే. ఫుల్ టైం సినిమాల్లో రాణించాలనే కోరికతోనే జబర్దస్త్ వీడాను. నేను ఉన్నప్పుడు రేటింగ్ బాగుంది. మంచి రెమ్యూనరేషన్ వస్తుంది. అయినప్పటికీ సినిమా కోసం వదులుకొని బయటకు వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అప్పట్లో వేణు చేసిన ఓ స్కిట్ వివాదంలో నిలిచన సంగతి తెలిసిందే. ఓ వర్గం వారు వేణుపై దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. బలగం చిత్రంతో తొలిసారి మెగాఫోన్ పట్టిన వేణు మొదటి ప్రయత్నంలోనే విజయం అందుకున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రం అందరి ఊహాలను తలకిందులు చేస్తూ మంచి విజయం సాధించింది. -
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ హాస్యనటుడు మృతి
సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. గతేడాదిలో పలువురు సీనియర్ నటులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఇండస్ట్రీలో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం ఉదయం ప్రముఖ పంజాబీ నటుడు, కమెడియన్ అమృత్ పాల్ చోటు కన్నుమూశారు. పంజాబీ సినిమాల్లో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతితో పంజాబీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని పంజాబీ ఫిల్మ్ అండ్ టీవీ యాక్టర్స్ అసోసియేషన్ సోషల్ మీడియాలో వెల్లడించింది. అమృత్ పాల్ చోటూ సర్దార్జీ, సర్దార్ జీ- 2తో పాటు పలు చిత్రాల్లో నటించారు. సినీ ఇండస్ట్రీలో మంచి కమెడియన్‌గా పేరు సంపాదించారు. ఆయన పలు టీవీ సీరియల్స్‌లోనూ నటించారు. అమృత్ పాల్ మరణ వార్త విన్న సినీ ప్రముఖులు, అభిమానులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ప్రముఖ నటుడు, కమెడియన్ వడివేలు ఇంట విషాదం
ప్రముఖ సీనియర్ నటుడు, కమెడియన్ వడివేలు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి సరోజిని(87) అనారోగ్యంతో కన్నుమూశారు. మధురై సమీపంలోని తమ స్వగ్రామం విరగానూర్లో నివసిస్తున్న ఆమె కొంతకాలంగా వయోభారం అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మధురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అదే సమయంలో మూవీ షూటింగ్లో పాల్గొన్న వడివేలు తల్లి మరణవార్త తెలిసి షూటింగ్ మధ్యలోనే హుటాహుటిన తన స్వగ్రామం విరగానూర్కు పయనమయ్యారు. ఇక నేడు(గురువారం) సాయంత్రం స్వగ్రామంలో ఆమె అంత్యక్రియలు జరగునున్నట్లు సమాచారం. తల్లి మృతితో వడివేలు ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతి తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం ప్రకటించారు. అలాగే సినీ ప్రముఖులు, నటీనటులు సైతం సోషల్ మీడియా వేదికగా సరోజిని మృతికి నివాళులు అర్పిస్తున్నారు. కాగా తమిళ నటుడు అయిన వడివేలుకు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. స్టార్ కమెడియన్ ఆయన సౌత్ ఇండస్ట్రీలో ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే గతంలో కొన్ని కారణాల వల్ల ఆయనపై కోలీవుడ్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల రీఎంట్రీ ఇచ్చిన ఆయన గతేడాది నాయి శేఖర్ రిటర్న్స్‌తో ప్రేక్షకులను పలకరించారు. ప్రస్తుతం ఆయన చంద్రముఖి 2 మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి శృతి హాసన్‌కు ఐ లవ్ యూ చెప్పడంపై గోపిచంద్ మలినేని వివరణ -
సినీ పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ హాస్య నటుడు శివ నారాయణమూర్తి కన్నుమూశారు. కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కోలీవుడ్ విషాదం నెలకొంది. ఆయన మృతికి తమిళ నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా ప్రస్తుతం శివ నారాయణమూర్తి భౌతికకాయాన్ని ఆయన స్వస్థలం తమిళనాడులోని పట్టుకోట్టై జిల్లాలోని ఆయన నివాసంలో ఉంచారు. ఈరోజు (డిసెంబర్ 8) సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. శివ నారాయణమూర్తికి భార్య పుష్పవల్లి, ఇద్దరు కుమారులు లోకేష్, రామ్‌కుమార్, ఒక కుమార్తె శ్రీదేవి ఉన్నారు. తమిళ ఇండస్ట్రీలోకి మురళి హీరోగా నటించిన ‘పూంతోట్టం’ మూవీతో ఆయన నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. తమిళంలో శివ నారాయణమూర్తి 200లకుపైగా చిత్రాల్లో నటించారు. చదవండి: స్వాతి నా ఆల్ టైం క్రష్, అప్పటి నుంచి తనని చూస్తున్నా: డైరెక్టర్ హరీశ్ శంకర్ -
సొంతవాళ్లే మోసం చేశారు, నటి వల్ల రూ. 6 కోట్లు నష్టపోయా: గీతా సింగ్
లేడీ కమెడియన్ గీతా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె పేరు వినగానే టక్కున గుర్తొచ్చే చిత్రం కితకితలు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ సరసన హీరోయిన్గా నటించింది. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఆమె మూవీ అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో గీతా సింగ్ రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుంది. ఇందులో తన కామెడీతో కడుబ్బా నవ్వించడమే కాదు.. లావుగా ఉండే భార్య పడే కష్టాలను చూపించి అందరి చేత కన్నీరు పెట్టించింది. అలా ఎన్నో చిత్రాల్లో లేడీ కమెడియన్‌గా నటించి తెరపై ప్రేక్షకులను నవ్వించింది. చదవండి: ఆ ఫొటో చూసి పెళ్లయిందా? అంటూ ప్రశ్నల వర్షం, క్లారిటీ ఇచ్చిన పూనమ్ అయితే కొంతకాలంగా ఆమె తెరకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె జీవితంలో చోటు చేసుకున్న చేదు సంఘటనలను గుర్తు చేసుకుంది. అలాగే ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదని, అందుకే తాను నటించడం లేదని చెప్పింది. పరిశ్రమలో అసలు సపోర్ట్ లేదంటూ గీతా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడసలు సినిమాల్లో ఫిమేల్ యాక్టర్స్ ఎక్కడ కనిపిస్తున్నారని, అందరు మేల్ యాక్టర్సే కదా అని వ్యాఖ్యానించింది. ‘పరిశ్రమలో పురుషాధిక్యం ఎక్కువ. మహిళా నటులకు అసలు అవకాశాలు ఇవ్వడం లేదు. మనకు ఎంతమంది లేడీ కమెడియన్స్ లేరు.. ఇప్పుడు ఎవరైనా ఏ సినిమాలో అయినా కనిపిస్తున్నారా?’ అని ప్రశ్నించింది. అనంతరం ఇటూ ఇండస్ట్రీ సపోర్ట్ , నమ్ముకున్న బంధువుల మద్దుతు లేకపోవడంతో ఒంటరిగా పోరాడుతున్నానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నమ్మిన వాళ్లే.. దారుణంగా మోసం చేశారు. డబ్బులు అవసరం ఉంటేనే నా కుటుంబానికి గుర్తుకు వస్తాను. డబ్బు అవసరం ఉన్నంత వరకే నాతో ఉండేవాళ్లు. నా సొంత చెల్లెల్లు కూడా నన్ను డబ్బు కోసం వాడుకున్నారు’ అంటూ కన్నీటీ పర్యంతరం అయ్యింది. ఇక ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి సంపాందిచుకున్న డబ్బును ఓ మనిషిని నమ్మి పోగొట్టుకున్నాని, ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని దగ్గర చిట్టీలు వేశానని చెప్పంది. చదవండి: నిర్మాతగా వరుస విజయాలు.. ‘తగ్గేదే లే’ అంటున్న ‘అమ్ము’ హీరోయిన్ అయితే చివరకు ఆమె మోసం చేయడంతో సుమారు రూ. 6 కోట్ల వరకు నష్టపోయానని చెప్పుకొచ్చింది. ఇటు ఆఫర్స్ లేక, చేసుకోడానికి పని లేక ఒత్తిడికి గురయ్యానని, బాధలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశానని చెప్పింది. అయితే తన స్నేహితురాలు చూసి తనని కాపాడిందని తెలిపింది. ప్రస్తుతం తనకు ఆ స్నేహితురాలే పెద్ద దిక్కని, తన అన్నయ్య పిల్లలను దత్తత తీసుకుని వారితో కలిసి జీవిస్తున్నానంటూ గీతా సింగ్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ‘మా’ ఎలక్షన్స్‌లో మంచు విష్ణు ప్యానెల్ తరపున గీతా సింగ్ పోటీ చేసి గెలుపు పొందిన సంగతి తెలిసిందే. -
సీనియర్ కమెడియన్ రీ ఎంట్రీ ? స్వయంగా హీరోనే ఇంటికి వెళ్లి అడగడంతో..
తమిళసినిమా: సీనియర్ హాస్యనటుడు గౌండ్రమని రీ ఎంట్రీ షురూ అయిందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. మొదట్లో చిన్న చిన్న వేషాలు వేసినా ఈయనకు దర్శకుడు భారతీరాజా 16 వయదినిలే చిత్రంలో రజనీకాంత్‌కు మిత్రుడి పాత్రను ఇచ్చి ఆయన దశ తిరిగేలా చేశారు. ఆ తరువాత ప్రముఖ కమెడియన్‌గా ఎదిగి కొన్ని చిత్రాల్లో హీరోగానూ నటించారు. ముఖ్యంగా గౌండ్రమని, సెంథిల్ జంట వినోదాల విందే అని పేరు తెచ్చుకున్నారు. అలా కోలీవుడ్‌లో గౌండమని హవా 2000 ఏడాది వరకు వెలిగింది. ఆ తరువాత చిత్రాల సంఖ్య తగ్గించుకుంటూ వచ్చారు. ఆయన చివరగా 2016లో వాయ్మ్ అనే చిత్రంలో నటించారు. ఆ తరువాత నటనకు దూరంగా ఉంటున్న ఈయన తాజాగా రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్ తాజాగా నటిస్తున్న చిత్రాల్లో మావీరన్ ఒకటి. మడోనా అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌కు మహావీరుడు అనే టైటిల్ ఖరారు చేశారు. కాగా ఇందులో నటుడు గౌండ్రమని హాస్య పాత్రలో నటించనున్నారని తెలిసింది. నటుడు శివకార్తికేయన్ స్వయంగా గౌండ్రమని ఇంటికి వెళ్లి ఆయనను నటించమని కోరారట. చదవండి: Divya Bharathi: బికినీ ఫొటోషూట్‌తో 'బ్యాచ్‌లర్' హీరోయిన్ రచ్చ.. -
కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు..
Comedian Bill Cosby Found Guilty Sexually Assaulting In 1975: ఎంతటి ప్రముఖులైన చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదని మరో సంఘటన నిరూపించింది. ఓ ప్రముఖ కమెడియన్ 1975లో చేసిన నేరం సుమారు 50 ఏళ్ల తర్వాత రుజువైంది. 5 దశాబ్దాల క్రితం అమెరికన్ కమెడియన్ బిల్ కాస్బీ ప్లేబాయ్ మాన్షన్‌లో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. కొన్ని ఏళ్ల తర్వాత ఆమె బిల్‌పై కేసు పెట్టింది. తర్వాత విచారించిన కాలిఫోర్నియాలోని జ్యూరీ తాజాగా మంగళవారం (జూన్ 21, 2022) తీర్పునిచ్చింది. హాస్య నటుడు బిల్ కాస్బీ నేరం చేసినట్లు నిర్ధారించింది. అంతేకాకుండా బాధితురాలు జూడీ హుత్కు 5 లక్షల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. 1975లో 36 ఏళ్ల వయసున్న బిల్ కాస్బీ 16 సంవత్సరాల జూడీ హుత్ను లైంగికంగా వేధించాడు. ఓ సినిమా సెట్లో జరిగిన ఈ ఘటనలో జూడీతోపాటు ఆమె స్నేహితురాలు డొన్నా శామ్యూల్ సన్ (17) కూడా బాధితురాలైంది. చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ ప్రస్తుతం 84 ఏళ్ల వయసున్న బిల్ కాస్బీపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలతో కేసులు వేశారు. ఈ క్రమంలోనే బిల్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కాగా 'అమెరికాస్ డాడ్'గా పిలవబడే బిల్ కాస్బీ 2018లో కూడా ఒక క్రిమినల్ కేసులో జైలుపాలయ్యాడు. తర్వాత పలు కారణాల వల్ల నేరం రద్దు కావడంతో గతేడాది విడుదల అయ్యాడు. చదవండి: సినిమా సెట్లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు -
ఒకే ఫ్రేమ్‌లో మన తెలుగు కమెడియన్స్, పార్టీలో రచ్చ.. ఫొటో వైరల్
వెండితెరపై మనల్ని కడపుబ్బా నవ్వించే మన తెలుగు కమెడియన్స్ అంతా ఒకచోటే చేరితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటూనే వారు చేసే రచ్చ ఎలా ఉంటుందో కళ్ల ముందు కదలాడుతుంది కదా. మరి నిజంగానే వారంత ఒక్కచోట చేరితే. ఇక ఫ్యాన్స్, ప్రేక్షకులకు కనులవిందె. వేణు(టిల్లు), సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి, చిత్రం శ్రీను, వెన్నెల కిషోర్ పలువురు కమెడియన్స్ ఒకప్పుడు మనల్ని తమ కామెడీతో కడుపుబ్బా నవ్వించారు. అయితే కొంతకాలంగా వారిలో కొంతమంది వెండితెరపై తక్కువగా కనిపిస్తున్నారు. చదవండి: షణ్ముఖ్, సిరిలపై షాకింగ్ కామెంట్స్ చేసిన జెస్సీ.. అరియాన షాక్ దీంతో దీంతో వారి కామెడీని, నటనను మన తెలుగు ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. అలాంటి వారికి మరోసారి కనువిందు చేసే ఓ ఫొటతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మన ఒకప్పటి కమెడియన్స్‌తో పాటు ఇప్పుటి కమెడియన్స్ అంతా ఒక్కచోట చేరారు. వేణు, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, ధన్‌రాజ్, రాజేశ్‌తో పాటు పలువురు కమెడియన్స్ కొన్ని రోజుల క్రితం కొంతమంది కలిసి ఫ్లయింగ్ కలర్స్ అనే ఓ గ్రూప్‌ను పెట్టుకున్నారు. చదవండి: మరింత దూకుడుగా సమంత, త్వరలో హాలీవుడ్ ఎంట్రీ! View this post on Instagram A post shared by Dhanraj (@yoursdhanraj) ఈ గ్రూప్ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ సరదాగా పార్టీ చేసుకుంటారు. ప్రతి సారి ఏదో ఒక థీమ్‌తో పార్టీ చేసుకుంటారు. తాజాగా సండే వీకెండ్ సందర్భంగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్ళీ కలుసుకుని పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అందరూ బ్లూ కలర్ డెనిమ్ షర్ట్, ప్యాంటుతో మెరిపించారు. ఈ నేపథ్యంలో కమెడియన్ వేణు(టిల్లు) వారందరి గ్రూప్ ఫొటోను ఇన్స్టాగ్రామ్ షేర్ చేస్తూ నిన్న మా కలర్స్‌తో హ్యాపీ సండే అంటూ రాసుకొచ్చాడు. అలాగే ధన్‌రాజ్ కూడా ఈ ఫొటోను షేర్ చేస్తూ ‘స్వీట్ అండ్ క్యూట్ పార్టీ. హోస్టింగ్ చేసింది వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య. లవ్ యూ’ అంటూ షేర్ చేశాడు. చదవండి: రియల్ సినతల్లికి రూ. 10 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ View this post on Instagram A post shared by Venu Tillu (@venu_tilloo) -
‘ఐశ్యర్య రాయ్‌కి నటన రాదు, బ్యాడ్ యాక్టింగ్‌కు ఉదాహరణ ఆమె’
Russell Peters Comments On Aishwarya Rai Acting: మాజీ విశ్వ సుందరి, లేడీ సూపర్ స్టార్ ఐశ్వర్యరాయ్ బచ్చన్‌పై కమెడియన్ రస్సెల్ పీటర్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐశ్యర్య రాయ్ బ్యాడ్ యాక్టింగ్‌కు సరైన ఉదాహరణ అంటూ విమర్శించాడు. కాగా రస్సెల్ పీటర్స్ కెనడాకు చెందిన స్టాండప్ కమెడియన్, నిర్మాత. అయితే ఐశ్యర్య ఎన్నో సినిమాల్లో నటించి భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ‘హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాసు, జోధా అక్భర్, గుజారిష్’ వంటి చిత్రాల్లో తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలా హీరోయిన్గా, విశ్వ సుందరిగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ఆమెపై రస్సెల్ పీటర్స్ గతంలో చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. ఆ సమయంలో అక్షయ్ బచ్చన్ కుటుంబానికి క్షమాపణలు కోరాడు. చదవండి: సిద్ధార్థ్ శుక్లా మృతి: ఆసుపత్రిలో చేరిన బిగ్‌బాస్ బ్యూటీ కాగా అక్షయ్ ఇండో-కెనడియన్ చిత్రంలో నటించిన ఈ మూవీ వచ్చి పదేళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆ మూవీ సమయంలో చోటుచేసుకున్న ఈ సంఘటన మరోసారి తెరపైకి వచ్చింది. 2011 వచ్చిన ఇండో-కెనడియన్ సినిమా ‘స్పీడీ సింగ్స్’ ప్రమోషన్లో భాగంగా రస్సెల్ పీటర్స్ ఇండియాకు వచ్చాడు. ఈ మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలో జరిగిన ఈ మూవీ కార్యక్రమంలో రస్సెల్ మాట్లాడుతూ.. బాలీవుడ్ పరిశ్రమ, ఐశ్వర్య రాయ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు అతడు ‘నాకు బాలీవుడ్ పరిశ్రమ అంటే నచ్చదు. హిందీ సినిమాల్లో అంతా చెత్త ఉంటుంది. జస్ట్ టెర్రిబుల్. ఇది నా ఓపినియన్. కానీ బాలీవుడ్ సినిమాలకు, నటీనటులకు ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఉన్నారు. నా జీవిత కాలంలో ఇంతవరకు నేను బాలీవుడ్ సినిమా చూడలేదు. ఎందుకంటే నాకు వారి పాటలు, డ్యాన్స్‌లు, నటన అంటే అసలు నచ్చదు’ అంటూ విమర్శించాడు. చదవండి: భర్తపై దీపికా ఫిర్యాదు, రణవీర్ రొమాంటిక్ రిప్లై అంతేగాక ‘బ్యాడ్ యాక్టింగ్‌కు ఐశ్వర్యరాయ్ పర్ఫెక్ట్ ఉదహరణ. ఈ విషయాన్ని తను చాలా సార్లు రుజువు చేశారు. కేవలం తన అందమైన మొహంతోనే సూపర్ స్టార్ అయ్యారు. ఎలాగు ఆమె మంచి నటి కాకపోయిన అందమైన మొహం ఉంది అది చాలదా?. మంచి ఉద్యోగం, చివరకు అభిషేక్ బచ్చన్ ఆమెను తల్లిని చేయగలిగాడు’ అంటూ అసభ్య వ్యాఖ్యలు చేశాడు. ఆ తర్వాత అతడు చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందిగా పలు మహిళ సంఘాలు డిమాండ్ చేసిన రస్సెల్ మాత్రం క్షమపణలు కోరనని ఖరాఖండిగా చెప్పాడు. కాగా ఈ మూవీ తను ఓ భాగం అయినందున్న అక్షయ్ కుమార్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యలను రస్సెల్ తరపున క్షమపణలు కోరాడు. కాగా ప్రస్తుతం ఐశ్వర్య మణిరత్నం తాజా సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో విక్రమ్, జయం రవి, కార్తి, త్రిషతో పాటు పలువరు అగ్ర నటీనటులు భాగమవుతున్నారు. -
Jaya Prakash Reddy: ‘నాన్నను చూస్తే ఆడవాళ్లు భయపడేవాళ్లు’
యామిరా యామి చేస్తన్నావు.. అంటూ రాయలసీమ మాండలికంతో గుర్తింపు తెచ్చుకున్నారు.. చిన్నచిన్న పాత్రల నుంచి ఉత్తమ విలన్, ఉత్తమ కమేడియన్ స్థాయికి చేరుకున్నారు.. స్కూల్ టీచర్‌గా రజతోత్సవం చేసుకున్నారు.. కోస్తా, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల వారితో సంబంధం కలుపుకున్నారు.. గొప్ప స్థాయికి చేరినా, సాధారణమైన జీవితం గడిపిన తన తండ్రి జయప్రకాశ్ రెడ్డి గురించి కుమారుడు విపుల్ చంద్రప్రకాష్ రెడ్డి జ్ఞాపకాలు... తాడిపర్తి సాంబిరెడ్డి, సామ్రాజ్యమ్మ దంపతులకు నాన్న మొదటి సంతానం. నాన్నకు ఇద్దరు చెల్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లు. నాన్న గుంటూరులో బీఎస్సీ, బీఈడీ పూర్తి చేసి, ఇంగ్లీషు, లెక్కల మాస్టారుగా గవర్నమెంట్ స్కూల్లో పాతిక సంవత్సరాలు పనిచేశారు. నాన్నది అరేంజ్డ్ మ్యారేజ్. అమ్మ పేరు భాగ్యలక్ష్మి. నాన్నగారికి మేం ఇద్దరు పిల్లలం. అక్క మల్లిక, నేను. చదువు విషయంలో లిబర్టీ ఇచ్చారు. నేను వ్యాపారంలో గుంటూరులో స్థిరపడ్డాను. అక్క బీఎస్సీ చదివింది, వివాహం అయ్యాక విజయవాడలో స్థిరపడింది. ఇప్పుడు అమ్మ నా దగ్గరే ఉంటోంది. ( చదవండి: కన్నడ బ్యూటీ కాజోల్ చుఘ్ గురించి ఈ విషయాలు తెలుసా? ) సరదాగా ఉండేవారు... నేను నాలుగో తరగతి చదువుతున్న రోజుల్లో నాన్న నన్ను ఒకే ఒక్కసారి కొట్టారు. ఒక డాక్యుమెంటరీలో నన్ను కొట్టినట్లు నటిస్తే, నేను ఏడ్చినట్లు నటించే సీన్లో నవ్వాను. దాంతో నన్ను నాన్న గట్టిగా కొట్టారు. అప్పుడు ఏడిచాను. అంతే. మళ్లీ ఎన్నడూ చెయ్యి చేసుకోలేదు. మాతో క్యారమ్ బోర్డు, పేకాట వంటివి సరదాగా ఆడేవారు. నా డిగ్రీ పూర్తయ్యాక నేను ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిన కొంత కాలానికి నన్ను చూడటానికి అమెరికా వచ్చినప్పుడు నా కారులో యూనివర్సల్ స్టూడియోకు తీసుకెళ్ళాను. ఎంతో సంబరపడ్డారు. మా తాతగారిని తన కారులో తిప్పాలనుకున్న కోరిక నెరవేరనందుకు బాధపడేవారు. నాన్న కోరిక మేరకు భారతదేశానికి తిరిగి వచ్చి, వ్యాపారం ప్రారంభించాను. లాంగ్ లీవ్... నాన్న మా వూళ్లో షూటింగ్ చూడటానికి వెళ్లినప్పుడు ‘వారాలబ్బాయి’ చిత్రంలో, ఆ తరవాత కంచు కవచం, ఎర్ర మట్టి వంటి చిత్రాలలో నటించే అవకాశం వచ్చింది. మధ్యమధ్యలో సినిమాల కోసం లాంగ్ లీవ్ పెట్టేవారు. నాన్న నటించిన నాటకం చూసిన దాసరిగారు, నాన్నను రామానాయుడు గారికి పరిచయం చేయటంతో, బ్రహ్మపుత్రుడులో పోలీసు వేషం వచ్చింది. ఆ వేషంతో సినిమా అవకాశాలు పెరిగాయి. నాన్న మకాం చెన్నైకి మార్చారు. అయితే.. అది మూణ్నాళ్ల ముచ్చట కావటంతో, తిరిగి గుంటూరు వచ్చేసి, ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగం, ట్యూషన్లు చెప్పుకుంటూ ఉండిపోయారు. ( చదవండి: చిరుకు మెగాస్టార్ బిరుదు ఎవరిచ్చారో తెలుసా? ) దాసరిగారు నిర్మించిన ‘ఒసేయ్ రాములమ్మా!’తో మళ్లీ సినిమాలలోకి ప్రవేశించారు. ఇక వెనక్కి చూసుకోలేదు. చిన్నతనం నుంచి రాయలసీమ మాండలికం బాగా అలవాటు కావటం సినిమాలలో స్థిరపడటానికి ఉపయోగపడింది. అయినప్పటికీ మళ్లీ అక్కడి పల్లెటూళ్లకు వెళ్లి, సరిగ్గా మాట్లాడటం అలవాటు చేసుకున్నారు. సినిమాలలోకి ప్రవేశించడానికి నాన్న పడిన కష్టాలు, అప్పులు నాకు తెలుసు. ‘కాలక్షేపానికి సినిమాలలో నటించినా పరవాలేదు. అన్నం పెట్టే ఉద్యోగాన్ని వదులుకోవద్దు’ అని సలహా ఇచ్చేవారు. సొంతంగానే.. నేను అమెరికాలో ఉన్న రోజుల్లో నాన్న సినిమాలలో బిజీగా ఉన్నారు. నేను మూడు నెలలు సెలవు పెట్టి, గుంటూరు వస్తే, నాన్నను కలవడానికి కుదరలేదు. అందుకని హైదరాబాద్ హోటల్లో దిగి, నాన్న షూటింగ్‌కి వెళ్లిన సమయంలో నా పనులు పూర్తి చేసుకుని, సాయంత్రం హోటల్‌కి చేరుకుని, నాన్నతో గడిపాను. వస్త్రధారణ విషయంలో ప్రత్యేకంగా ఏమీ ఉండేది కాదు. రెండుమూడు రకాలవి నాలుగైదు జతలు కూడా ఉండేవి కావు. గుంటూరు విజయవాడల మధ్య సొంతంగా డ్రైవ్ చేసేవారు. 70 సంవత్సరాలు వచ్చాక డ్రైవర్ని పెట్టుకుని కారులోనే ప్రయాణించారు. అంతకుముందు రైలులోనే ప్రయాణించారు. రాయలసీమ పర్యటన.. సమరసింహారెడ్డి వంద రోజుల వేడుక సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో తిరగాలని యూనిట్ సభ్యులు అనుకుంటే, నాన్నగారు మాత్రం ఈ సినిమా రాయలసీమకు సంబంధించినది కనుక ఆ ప్రాంతాలలో పర్యటిద్దాం అన్నారు. ఒక వీడియో కెమెరా తీసుకుని, నాన్న వెంట నేను కూడా రైలులో బయలుదేరాను. నంద్యాల, కర్నూలు, ఆళ్లగడ్డ ప్రాంతాలలో థియేటర్లలో మూడు రోజుల పాటు తిరిగాం. ఆ ప్రాంతీయ భాష కావటం వల్ల, అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. నాన్నకు రాయలసీమలో ప్రాంతాలు చూపించాలనే అక్కడకు తీసుకువెళ్తే, అక్కడి వారు నాన్న మీద అభిమానంతో స్వయంగా దగ్గరుండి చూపించారు. అక్కడి స్నేహితులు నాపెళ్లికి కూడా వచ్చారు. నో అంటే నో నాన్న చాలా మితంగా భోజనం చేస్తారు. ఉదయం అల్పాహారంలో రెండు దోసెలు, మధ్యాహ్నం కొద్దిగా అన్నం, రాత్రి రెండు చపాతీలు. నాన్‌వెజ్ కూడా చాలా తక్కువ తినేవారు. మమ్మల్ని మాత్రం బాగా తిన మనేవారు. ఆయనకు తినిపించటం మీద చాలా శ్రద్ధ. చాలా సింపుల్‌గా ఉండేవారు. సెలబ్రిటీ అనే భావనే ఉండేది కాదు. కూరలు తేవటానికి కూడా ఇబ్బంది లేదు. కాకపోతే అక్కడకు వెళ్లినప్పుడు తన అనుమతి లేకుండా సెల్ఫీలు తీస్తే కోపంగా, టీచర్లా క్లాసు తీసుకునేవారు. ఎవరైనా అనవసరంగా ఇంగ్లీషులో మాట్లాడితే, ‘తెలుగులో మాట్లాడొచ్చుగా, మా అబ్బాయి తొమ్మిది సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చినా, తెలుగు చక్కగా మాట్లాడుతున్నాడు కదా, మీకేమైంది’ అనేవారు. విలన్ వేషాలు వేసే రోజుల్లో ఆడవాళ్లు నాన్న దగ్గరకు రావడానికి భయపడేవారని నాన్న చెప్పారు. నాన్న మరణం మాకు తీరని లోటుగానే ఉంది నేటికీ. సంభాషణ: వైజయంతి పురాణపండ -
గిఫ్ట్‌తో వధూవరులకు షాకిచ్చిన కమెడియన్: నవ్వులే నవ్వులు!
చెన్నె: ప్రస్తుతం దేశంలో బంగారం మాదిరి పెట్రోలియం ధరలు పెరిగిపోతున్నాయి. నిరంతరాయంగా పెరుగుతున్న పెట్రోల్ ధర దేశంలోని పలు ప్రాంతాల్లో రూ.110కి చేరువగా ఉంది. ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలోనే ఓ ప్రముఖ హాస్య నటుడు పెట్రోల్ ధరల పెరుగుదలపై ఓ వినూత్న నిరసన మాదిరి చేశారు. నవ దంపతుల వద్దకు వెళ్లి ఓ కవర్ తీసి రెండు డబ్బాలు ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా వధూవరులతో పాటు బంధుమిత్రులు షాకయ్యారు. అనంతరం నవ్వుకున్నారు. ఆయన ఇచ్చింది ఏమిటో తెలుసా? ఐదు లీటర్ల పెట్రోల్. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: తనయుడి గిఫ్ట్‌కు తన్మయత్వంతో కన్నీళ్లు రాల్చిన తల్లి ) తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ హాస్య నటుడు మయీల్ సామి. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఇటీవల జరిగిన ఓ వివాహానికి మయిల్ సామి హాజరయ్యాడు. కొత్త దంపతులను ఆశీర్వదించి కానుకగా పెట్రోల్ అందించాడు. ఈ ఫొటోలు ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. మయీల్ సామి చర్యను అందరూ అభినందిస్తున్నారు. మండుతున్న పెట్రోల్ ధరలపై ఇదో వింత నిరసన అని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలను తమిళ కాలమిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. అనంతరం నటుడు మయీల్ సామి మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ ధరలకు నిరసనలో భాగంగా పెళ్లి కానుకగా పెట్రోల్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే సీఎం స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. పెట్రోల్, డీజిల్ ధరలను రూ.3 తగ్గించడాన్ని అభినందించారు. దివంగత జయలలిత, ఎంజీ రామచంద్రన్‌కు వీరాభిమానిగా ఉన్న మయీల్ సామి సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటారు. గతంలో ఓ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. చదవండి: కరెంట్ షాక్‌తో భర్తను ఆడుకున్న భార్య.. తీరా కట్టుకథ అల్లి -
సీఎం సహాయనిధికి హాస్యనటుడు సూరి విరాళం
సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ప్రముఖ హాస్యనటుడు సూరి సీఎం రిలీఫ్ ఫండ్ నిధికి తన వంతుగా రూ.10 లక్షలు, తన కొడుకు సర్వాన్, కూతురు వెన్నెల పేరుతో మరో రూ.25వేలను విరాళంగా అందించారు. ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ను కలిసిన సూరి రూ.10 లక్షలు చెక్కు రూపంలోనూ, రూ.25వేలు నగదును అందించారు. ప్రజలకు కోవిడ్ వైద్యం, ఆక్సిజన్, వ్యాక్సిన్ సదుపాయాలను సమకూర్చడానికి దాతలు సీఎం సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు తమ వంతు విరాళాలను అందించారు. -
సినీ పరిశ్రమలో మరో విషాదం: నటుడు కన్నుమూత
చెన్నె: తమిళ సినీ పరిశ్రమలో ఆకస్మిక మరణాలు నిత్యకృత్యంగా మారాయి. ప్రముఖ హాస్య నటుడు నెల్లె శివ గుండెపోటుతో మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. నెల్లె జిల్లాకు చెందిన ఈయన నడిగర్ తిలగం శివాజీ గణేశన్‌కు వీరాభిమాని. ఆయనను స్ఫూర్తిగా తీసుకునే సినీ రంగానికి వచ్చారు. 1985లో ‘అన్భావం’ సినిమా ద్వారా శివ నటుడిగా పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 500కు పైగా సినిమాల్లో నెల్లె శివ నటించి ప్రేక్షకులను మెప్పించారు. నెల్లె శివ ఆకస్మిక మృతిపై తమిళ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నటుడు మారన్ కూడా కరోనాతో మంగళవారం చెంగల్పట్టులో మృతి చెందారు. పలు చిత్రాల్లో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ గుర్తింపు పొందారు. ఇక ప్రముఖ నిర్మాత, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి మంగళవారం గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విధంగా వరుస విషాద ఘటనలతో తమిళ సినీ పరిశ్రమ క్రుంగిపోతుంది. చదవండి: కరోనాతో ప్రముఖ రచయిత కన్నుమూత చదవండి: కరోనా భయంతో వర్ధమాన గాయని ఆత్మహత్య -
వైవా హర్ష నిశ్చితార్థం ఫొటోలు
-
కమెడియన్‌ను పెళ్లి చేసుకున్న నటి
ముంబై: టీవీ, సినీ నటి సులగ్నా పానిగ్రాహి పాపులర్ స్టాండప్ కామెడి షో ఫేం బిస్వా కళ్యాణ్ రాత్ను వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వీరి పెళ్లి ఫొటోలను శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్ చేసి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య బిస్వాను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. సులగ్నా మండపంలో కూర్చుని ఉన్న వాని రెండు ఫొటోలను షేర్ చేస్తూ.. ‘మొదటి ఫొటోలో మా సింగిల్ లైఫ్ ఎలా కాలిపోతుందో చూడవచ్చు’ అంటూ చమత్కరించారు. ఇక రెండవ ఫొటోకు ‘సరదాగా ఉన్నప్పుడు.. వావ్ మా వివాహం జరిగిపోయింది’ అంటూ చమత్కరించారు. View this post on Instagram A post shared by Sulagna Panigrahi (@sulagna03) ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ప్రసారమవుతున్న ‘బిస్వా మస్ట్ ఆద్మీ’ సరీస్ టైటిల్‌తో ‘బిస్వా మ్యారీడ్ ఆద్మీ’ అంటూ తనదైన శైలిలో పెళ్లి వార్తను ప్రకటించాడు బిస్వా. దీంతో వారి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసిన వారి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నటి సులగ్నా ‘అంబర్ ధారా’,‘దో సహేలియాన్ ... కిస్మత్ కి కత్పుతాలియన్’ వంటి సిరీయల్స్‌లో నటించి గుర్తింపు పొందారు. అంతేగాక ఇమ్రాన్ హష్మి ‘మర్డర్ 2’, ‘రైడ్’ ‘ఇష్క్ వాలా లవ్’ వంటి సినిమాల్లో కూడా ఆమె నటించారు. ఇక బిస్వా ప్రముఖ కామెడియన్ మాత్రం కాదు కంటెంట్ రైటర్ కూడా. ప్రెటెన్షియస్ మూవీ రివ్యూస్’ కామెడి సిరీస్‌తో అతడు కమెడియన్‌గా గుర్తింపు పొందాడు. -
ప్రముఖ కమెడియన్ అరెస్ట్
ముంబై : ప్రముఖ కమెడియన్ భారతి సింగ్‌ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం భారతీ సింగ్ ఇంటిపై ఎన్సీబీ అధికారులు దాడి చేశారు. ఆమె ఇంట్లో కొద్ది మొత్తంలో గంజాయి దొరికినట్లు అధికారులు వెల్లడించారు. సోదాల అనంతరం భారతి సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియాను అదుపులోకి తీసుకొని ప్రశ్నలు వర్షం కురిపించారు. అనంతరం భారతీ సింగ్‌తో పాటు ఆమె భర్త హర్ష్ లింబాచియాను అరెస్ట్ చేసి ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి తరలించారు. భారతీ సింగ్ ఇంట్లో నిషేధిత మాదక ద్రవ్యాలు లభించడంతో వారిని విచారణకు పిలిచాం అని ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖెడే తెలిపారు. కాగా, శుక్రవారం రాత్రి కూడా ముంబైని పలుప్రాంతాల్లో ఎన్సీబీ సోదాలు చేసింది. ఓ డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి విచారణలో భారతి పేరు రావడంతో.. శనివారం అంధేరిలోని ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు మొదలయ్యాయి. బాలీవుడ్ ప్రముఖులపై నిషేధిత మత్తు పదార్ధాల వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని విచారించింది. ఈ నెల ప్రారంభంలో నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు చేసింది. రాంపాల్, అతని స్నేహితురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ ఇద్దరినీ ప్రశ్నించింది. అయితే తన నివాసంలో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్నవి ప్రిస్క్రిప్షన్‌లో భాగమని రాంపాల్ చెప్పాడు. ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు వాడుతున్నాను తప్ప, తనకు డ్రగ్స్‌తో సంబంధం లేదనీ పేర్కొన్నాడు. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
కామెడీ క్వీన్‌కు ఎన్సీబీ సెగ
సాక్షి, ముంబై: బాలీవుడ్ కామెడీ క్వీన్ భారతీ సింగ్‌కు మరో షాక్ తగిలింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత మాదకద్రవ్యాల తుట్టె కదిలింది. బాలీవుడ్ ప్రముఖులపై నిషేధిత మత్తు పదార్ధాల వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని విచారించింది. తాజాగా నటి భారతీ సింగ్ ముంబై నివాసంపై శనివారం ఉదయం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాడి చేసింది. భారతి సింగ్‌తోపాటు, ఆమె భర్తపైనా నిషేధిత పదార్థాలు తీసుకున్న ఆరోపణలు వచ్చాయని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. డ్రగ్ పెడ్లర్ విచారణలో భారతి సింగ్ పేరు వెలుగులోకి రావడంతో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని బృందం ఈ దాడులు చేపట్టింది. కొద్దిమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీనియర్ అధికారి తెలిపారు. దీంతో భారతి, ఆమె భర్త హర్ష్ లింబాచియాకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఈ నెల ప్రారంభంలో నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు చేసింది. రాంపాల్, అతని స్నేహితురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ ఇద్దరినీ ప్రశ్నించింది. అయితే తన నివాసంలో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్నవి ప్రిస్క్రిప్షన్‌లో భాగమని రాంపాల్ చెప్పాడు. ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు వాడుతున్నాను తప్ప, తనకు డ్రగ్స్‌తో సంబంధం లేదనీ పేర్కొన్నాడు. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ప్రఖ్యాత హాస్య నటుడు ఇక లేరు!
ఒకప్పుడు ట్రాక్టర్ వెల్డర్. రోజంతా కష్టపడితే కడుపు నిండేది కానీ, సరదాలకు సరిపోయేది కాదు. టామీ కానన్ అతనికి మంచి మిత్రుడు. ఇద్దరూ ట్రాక్టర్ వెల్డర్లే. వారిద్దరు స్నేహితులతో కలిసి గప్పాలు కొడుతూ, జోకులు వేస్తూ కాలం గడిపేవారు. వారి గురించి, వారి జోకుల గురించి ఈ వాడకు, ఆ వాడకు తెలిసి నగరమంతా తెల్సింది. వారి జోకులు వినడానికి గుంపులు, గుంపులుగా జనం కూడే వారు. ఇదేదో బాగుందనుకొన్న బాబీ బాల్, తన మిత్రుడితో టామీ కానన్‌తో కలసి స్టేజీలెక్కి జోకులు చెప్పే వారు. 1960 దశకంలో వారు ‘కానన్ అండ్ బాల్’ పేరిట ప్రారంభించిన హాస్యోక్తులకు త్వరలోనే బ్రాండ్ ఇమేజ్ లభించింది. బ్రిటీష్ రాణి వారిద్దరిని పిలిపించి 1987లో రాజ ప్రాసాదంలో కచేరీ పెట్టించింది. అది సూపర్ డూపర్ హిట్టవడంతో ఇరువురికి జంటగా, విడివిడిగా టీవీ సీరియళ్ల కామెడీ పాత్రల్లో అవకాశం వచ్చింది. అలా బాబీ బాల్...‘ది లాస్ట్ ఆఫ్ ది సమ్మర్ వైన్, హార్ట్‌బీట్, ది కాక్ఫీల్డ్స్ లాంటి పలు సీరియళ్లలో అవకాశం వచ్చింది. బాబీ బాల్‌కు ట్రాక్టర్ వెల్డర్‌గా నెలకు ఎంత వచ్చేదోగానీ, ఐటీవీలో శనివారం వచ్చే పాపులర్ కామెడీ షో ద్వారా బాబీ బాల్‌కు నెలకు రెండు లక్షల పాండ్లు (దాదాపు 1.94 కోట్ల రూపాయలు) వస్తున్నాయి. ఈ శనివారం నాటి కామెడీ షోలో పాల్గొనే అవకాశం ఆయనకు లేకుండా పోయింది. ఛాతి నొప్పితో లండన్‌లోని బ్లాక్పూల్ ఆస్పత్రిలో సోమవారం చేరిన బాబీ బాల్ గురువారం రాత్రి కరోనా కారణంగా శాశ్వతంగా కన్ను మూశారు. -
తెలుగు హాస్య నటుడు మృతి
-
కరోనాతో తెలుగు హాస్య నటుడు మృతి
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్‌ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా తెలుగు సినీ పరిశ్రమ మరో నటుడిని కోల్పోయింది. ప్రముఖ నటుడు నటుడు కోసూరి వేణుగోపాల్ కరోనాతో కన్నుమూశారు. గత నెలలో ఈ వైరస్ బారినపడిన ఆయన హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తీవ్ర గుండెపోటు రావడంతో బుధవారం రాత్రి ఆయన తుది శ్వాస తీసుకున్నారు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. (నటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత) వేణుగోపాల్ ఆకస్మిక మరణంపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన వేణుగోపాల్ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేస్తూ రిటైర్ అయ్యారు. ఆ తరువాత నటనపై ఆసక్తితో సినీరంగం వైపు వచ్చారు. మర్యాద రామన్న, పిల్ల జమిందారు, ఛలో, అమీతుమీ చిత్రాల్లో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు -
సినిమా ఉన్నంతవరకూ.. జయప్రకాశం
నటుడు కాకముందు టీచర్ జయప్రకాశ్ రెడ్డి.. పిల్లలకు హోమ్ వర్క్ ఇచ్చారు. సినిమాల్లోకి వచ్చాక యాక్టర్ జయప్రకాశ్ రెడ్డి... పాత్రలు బాగా చేయడానికి హోమ్ వర్క్ చేశారు. ప్రతీ పాత్రకు హోమ్ వర్క్ ముఖ్యమనేవారు. కామెడీ–సీరియస్ రెండూ భిన్న ఎమోషన్లు. ఎలా కలుస్తాయి? జేపీకి కుదిరింది. రెంటినీ కలిపారు. ప్రేక్షకులను భయపెట్టారు... నవ్వించారు. తెరపై ‘ప్రతి నాయకుడి’గా కనిపించినా.. తన నటనతో ప్రతి ఇంటికి దగ్గరైన నటుడయ్యారు. ‘‘అలా అడ్డగాడిదల్లా ఖాళీగా కూర్చొని కాలయాపన చేయకపోతే, ఏదైనా నాటకం రాసి రిహార్సల్స్ చేసుకోవచ్చుగా’ – జయప్రకాశ్ రెడ్డి (జేపీ) నాటకాల్లో శ్రద్ధ పెంచుకోవడానికి దారి చూపిన తిట్టు. తిట్టింది జేపీ నాన్నగారే. సాంబిరెడ్డి (జేపీ తండ్రి)కి నాటకాలంటే పిచ్చి. నటుడు కూడా. ఇంట్లోనే విపరీతమైన ప్రోత్సాహం ఉండటంతో నాటికలు రాయడం, వేయడం వైపు అడుగులేశారు జేపీ. స్కూల్ రోజుల్లో రుద్రమదేవి నాటికలో అంబదేవుడు అనే సామంతరాజు వేషం వేశారు. అదే జేపీ తొలి వేషం. చిన్న పాత్ర అయినా రెండు పద్యాలు పడ్డాయి. ఆయన పద్యం పూర్తి చేసేసరికి చప్పట్లు పడ్డాయి. తొలి వేషాన్నే డిస్టింక్షన్లో పాసయ్యారు జేపీ. యాస మీధ ధ్యాస కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లెలో సామ్రాజమ్మ, సాంబి రెడ్డి దంపతులకు 1945లో జన్మించారు జేపీ. సాంబిరెడ్డి పోలీస్ ఉద్యోగి. తండ్రి ఉద్యోగరీత్యా బదిలీలు కావడంతో ప్రాంతానికో యాస ఉండటం, అవి గమ్మత్తుగా ఉండటం జేపీలో ఉత్సుకతను పెంచాయి. ఎక్కడికెళ్తే అక్కడి యాసను ఇట్టే పట్టేయడం అలవాటు చేసుకున్నాడు. కడప, కర్నూల్, ప్రొద్దుటూర్, అనంతపురం, గుంటూర్, నల్గొండ.. ఇలా ఉద్యోగం నిమిత్తం తండ్రికి అయిన బదిలీలన్నీ జేపీకి ఉపయోగపడ్డాయి. స్కూల్ చదువులన్నీ సీమ ప్రాంతంలో పూర్తి చేసిన జేపీ కాలేజీ చదువులన్నీ గుంటూరులో చేశాడు. నాటకానికి పనికిరావు అనంతపురంలో చదువుకునేటప్పుడు జేపీ, అతని స్నేహితుడు నాటకం వేయాలనుకున్నారు. ‘దుర్యోధన గర్వభంగం’ అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ పట్టారు. ‘ఏదీ చూపించండి’ అని సైన్స్ మాస్టారు అడిగితే, నాటకాన్ని మొత్తం చేసి చూపించారు. ‘ఇంకోసారి నాటకం అంటే కాళ్లు విరగ్గొడతా’ అని చివాట్లు పెట్టారాయన. అవమానంగా అనిపించింది జేపీకి. మూడు రోజులు ఏడుస్తూనే ఉన్నా, అధైర్యపడలేదు. ఎప్పటికైనా నాటకం వేసి ప్రేక్షకుల్ని అలరించాలని బలంగా నిర్ణయించుకున్నాడు జేపీ. (జయప్రకాశ్ మరణం తీరని లోటు: ప్రధాని మోదీ) ఉత్తమ నటి బహుమతి కాలేజీలో ‘స్టేజీ రాచరికం’ అనే నాటికలో వేషం వేయమని సీనియర్లు కోరితే ‘ఊ’ అన్నాడు జేపీ. చెలికత్తె వేషం అది. అంటే అమ్మాయిగా కనిపించాలి. జేపీ చేసేశాడు. కట్ చేస్తే.. మరుసటి రోజు కాలేజీ నోటీస్ బోర్డ్‌లో ‘ఉత్తమ నటి – జయప్రకాశ్ రెడ్డి’ అని బహుమతుల జాబితాలో రాసుంది. ఆ తర్వాత కాలేజీలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో జేపీ హాజరు పడాల్సిందే అన్నట్టుగా ఉండేది. కాలేజీ స్టార్లా చూసేవాళ్లు. సన్నగా, పొడుగ్గా ఉండటంతో ఎక్కువగా వినోద ప్రధానంగా ఉండే పాత్రలే చేసేవాడు జేపీ. గుంటూరులోనే బీఈడీ పూర్తి చేసి టీచర్ ఉద్యోగంలో చేరారు. చూడ్డానికి డ్రిల్ మాస్టార్లా ఉండటంతో అందరూ ఆయన్ను డ్రిల్ మాస్టార్ అనుకున్నారు. కానీ జేపీ లెక్కల మాస్టార్. టీచర్‌గా మారినా నాటకాల మీద తన ఇష్టాన్ని వదులుకోలేదు. స్కూల్లో పిల్లలతో తరచూ నాటికలు వేయిస్తూ ఉండేవారు. అప్పటికి పెళ్లయింది కూడా.. ఓ బాబు పుట్టాడు. కొడుకుని తన తండ్రి దగ్గర నల్గొండలో ఉంచారు జేపీ. అలా తరచూ నల్గొండ వెళ్లడంతో అక్కడ యాసను పట్టేశారు. కొత్త కెరీర్‌కి అన్‌లాక్ జేపీ నటుడిగా మారే టర్న్ నల్గొండలో జరిగింది. జేపీ శిష్యుడు ఓ పత్రికను స్థాపించారు. అందులో భాగంగా ఓ పెద్ద సభ ఏర్పాటు చేసి, దర్శకుడు దాసరి నారాయణరావును అతిథిగా ఆహ్వానించారు. జెపిని ఒక నాటకం కూడా ఆడాలన్నాడు ఆయన శిష్యుడు. సరే అనుకున్నారంతా. కానీ దాసరికి ఏదో పని ఉండి త్వరగా వెళ్లిపోవాలనుకున్నారు. ఆ విషయం తెలిసి, మైక్ అందుకున్న జేపీ, ‘మా నాటకాన్ని పూర్తిగా అస్వాదించి వెళ్తారనే అనుకుంటున్నాం’ అని దాసరిని లాక్ చేశారు. ఇది తన కొత్త కెరీర్‌ను అన్‌లాక్ చేస్తుందని ఆ నిమిషం జేపీకి తెలియదు. ‘భలే ఫిట్టింగ్ పెట్టావయ్యా. మొదటి పావుగంటా చూస్తా’ అన్నారు దాసరి. అయితే నాటకంలో నిమగ్నమై గడియారాన్ని చూసుకోవడం కూడా మర్చిపోయిన దాసరి చివరి వరకూ ఉన్నారు. ‘నువ్వుండాల్సింది సినిమాల్లో. నిన్ను సినిమాల్లోకి తీసుకెళ్తాను’ అని జేపీని అభినందించారు కూడా. వారం తిరగ్గానే రామానాయుడు స్టూడియోస్ నుంచి వేషం ఉందని ఫోన్. సినిమా ప్రయాణం రామానాయుడు నిర్మించిన ‘బ్రహ్మపుత్రుడు’ (1988) సినిమాలో తొలిసారి నటుడిగా స్క్రీన్ మీద కనిపించారు జేపీ. ఆ తర్వాత ‘బొబ్బిలిరాజా, ప్రేమఖైదీ’ ఇలా వరుస వేషాలు వేస్తూ వచ్చారు. కానీ ఆర్థికంగా నిలదొక్కుకునేంత సంపాదన లేదు. అప్పటికి ఓ కుమార్తె కూడా ఉంది జేపీకి. పిల్లలు పెద్దవాళ్లవుతున్నారు. కొన్ని అప్పులు కూడా మిగిలాయి. అరకొర సంపాదనతో బండి నడపడం కష్టమని గుంటూరు బండెక్కేశారు. టీచర్‌గా పిల్లలకు చదువు చెప్పడంలో పడిపోయారు. ఇలా నాలుగైదేళ్లు గడిచాయి. ఆ తర్వాత ఏదో పని మీద హైదరాబాద్‌లో అనుకోకుండా మళ్లీ రామానాయుడ్ని కలవడం జరిగింది. అప్పుడు ‘ప్రేమించుకుందాం రా’ సినిమాలో రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ పాత్ర ఆఫర్ చేశారు రామానాయుడు. అమ్రీష్ పురి, నానా పటేకర్.. ఇంకా ఎవరెవర్నో ఆ పాత్రకు అనుకున్నారు. కానీ జేపీకి కుదిరింది. పాత్ర బాగా పండాలంటే ఏం చేయాలని ఆలోచించిన జేపీకి డైలాగులు రాయలసీమ యాసలో చెబితే ఎలా ఉంటుంది? అనిపించింది. ఆ ఆలోచన చిత్రరచయితలు పరుచూరి బ్రదర్స్‌తో పాటు అందరికీ నచ్చింది. వెంటనే సీమ ప్రాంతంలో మారుమూల ఊళ్లల్లో కొన్నిరోజులు తిరిగి యాస మీద ఇంకా పట్టు సాధించారు. తెలియని పదాలను టేప్ రికార్డర్లో రికార్డ్ చేసుకున్నారు. పరుచూరి సోదరులనుంచి డైలాగ్స్ ముందే తెప్పించుకుని వాటిని యాసలోకి మార్చుకుని, ప్రాక్టీస్ చేసి నటించారు జేపీ. సినిమా సూపర్ హిట్. ఆ తర్వాత ‘శ్రీరాములయ్య, సమరసింహారెడ్డి’ ఇలా వరుస హిట్లు. ఇక కెరీర్ బాగుందని టీచర్ పదవికి రాజీనామా చేసి దృష్టంతా సినిమా మీదే పెట్టాలని నిశ్చయించుకున్నారు. శ్రీను వైట్ల ప్రతి సినిమాలోనూ జేపీ పాత్ర ఉంటుంది. వాటిలో ‘ఢీ’ ఒకటి. డైలాగ్ డెలివరీతో ఆకట్టుకునే జేపీ ఈ సినిమాలో ఒక్క డైలాగ్ లేకున్నా సైగలతో ప్రేక్షకుల్ని నవ్వించారు. తెలుగులో 300కి పైనే సినిమాల్లో నటించారు. తమిళ, కన్నడ సినిమాల్లోనూ కనిపించారు జేపీ. గుర్తుండిపోయే పాత్రలు ‘జంబలకిడి పంబ’లో అల్లరి పిల్లాడిగా, ‘సమరసింహారెడ్డి’లో క్రూరమైన ఫ్యాక్షనిస్ట్‌గా, ‘సొంతం’లో గులాబీ అనే కామెడీ దొంగగా, ‘ఎవడిగోల వాడిది’లో టవల్ మీదే కనిపించే బండ్రెడ్డి.. ఇంకా ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?, రెడీ, కిక్, ఊసరవెల్లి, నాయక్ వంటి సినిమాల్లోనూ గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ఇటీవల విడుదలైన మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఆయన చివరి రిలీజ్. శివభక్తుడు జేపీకి తెలుగు భాష అంటే ఎనలేని మమకారం. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, సామెతలు రాయడం చేసేవారు. సినిమాల్లో విలనే అయినా నిజజీవితంలో సౌమ్యుడు. అంతకుమించి శివభక్తుడు. దాదాపు 18 ఏళ్ల పాటు శివ దీక్ష చేశారు. ‘శివ ప్రకాశం’ పేరుతో ఓ ఆల్బమ్ చేశారు. అందులోని పాటలను ఆయనే పాడటం విశేషం. జేపీది సేవాగుణం కూడా. ఎంతోమందిని చదివించారు. రంగస్థలం మీద గుండెపోటు వచ్చినట్లు నటిస్తే.. నిజంగా వచ్చిందా అని కంగారుపడ్డారు ప్రేక్షకులు. జీవితం అనే వేదిక మీద ఆయనకు నిజంగానే గుండెపోటు వచ్చింది. ఇది కూడా నటనే అయితే బాగుండు అని జేపీని అభిమానించేవారు కోరుకోకుండా ఉండరు. జేపీ మరణం పరిశ్రమకే కాదు నాటకానికీ తీరని లోటు. అయితే జేపీ భౌతికంగా మాత్రమే దూరమయ్యారు. తాను చేసిన పాత్రల ద్వారా ప్రకాశిస్తూనే ఉంటారు... సినిమా ఉన్నంతవరకూ జయ‘ప్రకాశం’ ఉంటుంది. సినిమా – నాటకం సినిమాల్లో బిజీ నటుడిగా ఉన్నప్పటికీ జేపీ నాటకాన్ని వదలలేదు. వీలున్నప్పుడల్లా నాటకాలు వేస్తూనే ఉన్నారు. నాటకాల్ని బతికించాలని నాటకాలు వేస్తూనే ఉన్నారు. జేపీకి బాగా పేరు తెచ్చిన నాటకాల్లో ‘అలెగ్జాండర్’ ఒకటి. ఆ నాటకంలో సుమారు వంద నిమిషాలు ఏకపాత్రాభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేశారు జేపీ. నాటకం క్లైమాక్స్‌లో జేపీ పాత్రకు గుండెపోటు వస్తుంది. ఆ సీన్ చేస్తుంటే, ప్రేక్షకుల్లో ఒకరు నిజంగా గుండెపోటు వచ్చిందేమో అనుకొని అరిచేశారట. అది ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జేపీ. ఈ నాటకాన్ని వందసార్లు ప్రదర్శించాలనుకున్నారు. కానీ 66సార్లు మాత్రమే వేయగలిగారు. ఈ నాటకాన్ని సినిమాలానూ మలిచారు. తీరా విడుదల సమయానికి లాక్డౌన్ పడింది. – సినిమా డెస్క్ ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ప్రముఖ నటుడు జగదీప్ కన్నుమూత
ముంబై: ప్రముఖ నటుడు, బాలీవుడ్ హాస్యనటుడు జగదీప్(81) అలియాస్ సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ మృతి చెందారు. ముంబైలోని ఆయన నివాసంలో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బుధవారం రాత్రి 8:40 గంటలకు కన్నుముశారు. మార్చి 29, 1939న జన్మించిన జగదీప్‌కు ఇద్దరూ కుమారులు జావేద్ జాఫ్రీ, నవేద్ జాఫ్రీలు ఉన్నారు. ముంబైలోని షియా ఖబర్‌స్తాన్‌లో శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి బాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. (చదవండి: దర్శక–నిర్మాత హరీశ్ షా కన్నుమూత) My first film & the first time I ever faced the camera, was in the film #yehrishtanatoote with the legend himself #Jagdeep bhai. We will miss you...May his soul rest in peace 🙏🏽 Our prayers & deepest condolences to the family. pic.twitter.com/uhBjYSZdVe — Johny Lever (@iamjohnylever) July 8, 2020 జగదీప్ సహా నటుడు, కమెడియన్ జాన్ లీవర్ ఆయన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘నా మొట్టమొదటి సినిమా ‘యే రిషితా నా టూటే’లో లెజెండ్ నటుడు జగదీప్‌తో కలిసి నటించాను. జగదీప్ భాయ్ వియ్ మిస్ యూ. ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను’’ అంటూ ట్వీట్ చేశాడు. బాలీవుడ్లో దాదాపు 400లకుపైగా సినిమాలలో నటించిన జగదీప్ 1975లో వచ్చిన ‘షోలే’లో సూర్య భోపాలి పాత్రను పోషించారు. ఆయన నటించిన అదే పాత్ర పేరుతో వచ్చిన ‘సూర్య భోపాలి’ సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడిగా మారారు. ఆ తర్వాత అందాజ్ అప్నా, బ్రహ్మచారి, నాగిన్ వంటి సినిమాల్లో నటించారు. -
ప్రముఖ నటుడు జగదీప్ కన్నుమూత
-
24న ప్రముఖ హాస్య నటుడి వివాహం
చెన్నై: ప్రముఖ తమిళ హాస్య నటుడు అశ్విన్ రాజా(కుంకి అశ్విన్) ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జూన్ 24న చెన్నైలో తన ప్రేయసి విద్యాశ్రీని పెళ్లాడబోతున్నాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహ వేడుక జరగనుంది. కాగా గత నాలుగేళ్లుగా విద్యాశ్రీ, అశ్విన్ ప్రేమించుకుంటుండగా, ప్రస్తుతం మూడు ముళ్ల బంధంతో ఒకటి కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. (ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున) చెన్నైకు చెందిన రాజశేఖర్ కుమార్తె విద్యాశ్రీ. ఈమె అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితుల్లో నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ కేవలం 20 మంది మాత్రమే పెళ్లికి హాజరు కానున్నట్లు సమాచారం. ఇక అశ్విన్.. లక్ష్మీ మూవీ మేకర్స్ నిర్మాతాల్లో ఒకరైన వి. స్వామినాథన్ కుమారుడు. హీరో ఆర్య నటించిన ‘బాస్ ఎంగిరా బాస్కరన్’ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత దర్శకుడు ప్రభు సోలమన్ ‘కుంకి’ సినిమాలో నటించి మంచి పేరును సంపాదించారు. అప్పటి నుంచి తమిళ అభిమానులు అశ్విన్ రాజాను ప్రేమతో అశ్విన్ కుంకీ అని పిలుచుకుంటారు. (ఆరోగ్యానికే కాదు.. అందానికీ ఔషధమే) -
కరోనా అలర్ట్ : ప్రముఖ నటుడు మృతి
లండన్ : కరోనా వైరస్‌తో బాధపడుతూ ప్రముఖ నటుడు, బ్రిటన్ కమెడియన్ టిమ్ బ్రూక్ టేలర్ (75) కన్నుమూశారు. బ్రూక్ టేలర్ గత నాలుగు దశాబ్ధాలుగా బీబీసీ రేడియో 4కి రెగ్యులర్ ప్యానెలిస్ట్‌గా వ్యవహరించారు. 1970ల్లో బుల్లితెరపై వచ్చిన ది గుడీస్ షోతో ఆయన విశేష ప్రాచుర్యం పొందారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బ్రూక్ టేలర్ నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు. ఇక మహమ్మారి బారి నుంచి ఆయన కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలో ప్రాణాంతక వైరస్‌తో మరణించారనే వార్త బ్రూక్ టేలర్ అభిమానులను కలవరపరుస్తోంది. టేలర్ తన హాస్యంతో వివిధ తరాలకు చెందిన ప్రజలను కడుపుబ్బా నవ్వించేవారని ఆయన మరణం హాస్యప్రియులకు తీరని లోటని ప్రముఖ రచయిత సిమన్ బ్లాక్వెల్ ట్వీట్ చేశారు. చదవండి : రేపు ఉదయం పది గంటలకు ప్రధాని ప్రసంగం -
హాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు మృతి
లాస్ఏంజిల్స్: ప్రముఖ నటుడు, కమెడియన్, 'ఫ్రైడే' చిత్రంలో ఐస్‌క్యూబ్ తండ్రిగా అందరికీ గుర్తుండిపోయే పాత్రలో నటించిన జాన్ విథర్స్పూన్ (77) మంగళవారం తుదిశ్వాస విడిచారు. విథర్స్పూన్ లాస్ఏంజిల్స్లో మరణించారని ఆయన మేనేజర్ అలెక్స్ గుడ్మన్ తెలిపారు. విథర్స్పూన్ మరణంతో కుటుంబసభ్యులు షాక్‌లో ఉన్నారని అన్నారు. ఇప్పటివరకు ఫ్రైడే పేరుతో తెరకెక్కిన మూడు చిత్రాల్లో నటించిన ఆయన తన కెరీర్‌ను హాలీవుడ్లో రాణించారు. 'ది వయాన్స్ బ్రదర్స్' టెలివిజన్ సీరిస్తో పాటు 'ది బూండాక్స్' అనే ఎనిమేటేడ్ సినిమాకు వాయిన్ ఇచ్చారు. అంతేకాక 'వాంపైర్ ఇన్ బ్రూక్లిన్, బూమేరాంగ్' వంటి చిత్రాల్లో చెప్పుకోదగ్గ పాత్రాలు చేశారు. తాను ఎన్ని చిత్రాల్లో నటించినా హాస్యప్రియులు తనను ఫ్రైడే సినిమాలోని ఐస్‌క్యూబ్ తండ్రి 'పాప్స్'గా మాత్రం ఎక్కువగా గుర్తించారు. ప్రేక్షకులపై 'పాప్స్'గా విథర్స్పూన్ చెరిగిపోనిముద్ర వేశారు. విథర్స్పూన్ హఠాన్మరణం విని దిగ్భ్రాంతికి లోనయ్యానని నటుడు ఐస్‌క్యూబ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. జనవరి 27, 1942న జన్మించిన విథర్‌స్పూన్‌కు భార్య ఏంజెలా, కుమారులు జేడీ, అలెగ్జాండర్ ఉన్నారు. ' మా మధ్య బంధం తండ్రి, కొడుకు కన్నా ఎక్కువగా ఉండేది. నాన్న నాకు మంచి స్నేహితుడు, నా స్పూర్తి. లవ్ యు డాడ్ ... నిన్ను మిస్ అవుతాను' అని విథర్స్పూన్ కొడుకు జేడీ ట్వీట్ చేశారు. -
ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
సాక్షి, చెన్నై : కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ సీనియర్ కమెడియన్ క్రేజీ మోహన్(67) గుండెపోటుతో చెన్నైలో ఈరోజు(సోమవారం) తుదిశ్వాస విడిచారు. ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో దగ్గరలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. డాక్టర్లు కాపాడటానికి చేసిన ప్రయత్నాలన్ని విఫలమయ్యాయి. అపూర్వ సహోదరులు, మైకేల్ మదన కామరాజు, సతీలీలావతి, తెనాలి, పంచతంత్రం, కాదల కాదల, భామనే సత్యభామనే, వసూల్ రాజా ఎం.బి.బి.ఎస్ తదితర చిత్రాల్లో కామెడీ పాత్రలతో నటించి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. `క్రేజీ తీవ్స్ ఇన్ పాలవాక్కం` అనే నాటకం తర్వాత ఈయనకు క్రేజీ మోహన్ అనే పేరు వచ్చింది. ఇంజనీరింగ్ చదివేరోజుల్లోనే నాటకాలకు స్క్రిప్ట్స్ రాసేవారు. క్రేజీ మోహన్ సోదరుడు మధు బాలాజీ నాటక కంపెనీకి స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశారు. కె.బాలచందర్ దర్శకత్వం వహించిన `పొయ్‌కల్ కుదరై` సినిమాతో నటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్ చిత్ర ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
రోజుకు నాలుగు లక్షలా?
కమెడియన్‌గా టాప్ ప్లేస్‌లో ఉన్నప్పుడే, హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు సునీల్. మొదట్లో రెండు మూడు హిట్లు పడినా.. ఆ తరువాత కథ అడ్డం తిరిగింది. చాల రోజుల నుంచి కనీసం హిట్టు కాదు కదా.. యావరేజ్ మూవీ కూడా సునీల్ ఖాతాలో పడలేదు. ఇంకా హీరోగా ట్రై చేయడం కంటే.. తనకు లైఫ్ ఇచ్చిన కమెడియన్ పాత్రల్లోనే నటించేందుకు సిద్ధమయ్యారన్న విషయం తెలిసిందే. సునీల్ ప్రస్తుతం త్రివిక్రమ్, శ్రీనువైట్ల, భీమినేని శ్రీనివాసరావు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల్లో నటించేందుకు సునీల్ రోజుకు నాలుగు లక్షల పారితోషకంగా తీసుకుంటున్నట్లు టాక్. దీన్ని బట్టి సునీల్ రేంజ్ ఏంటో తెలిసిపోతోంది. మళ్లీ సునీల్ కమెడియన్‌గా తన సత్తా చాటి, పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటాడేమో చూడాలి. -
నేనా... హీరోయినా?
‘‘అదృష్టం కొద్దీ నేను కమెడియన్‌గా ఫుల్ బిజీ! అందువల్ల, హీరోయిన్గా నటించాలనే ఆలోచన అస్సలు చేయడం లేదు. తమ రంగు, రూపుతో సంబంధం లేకుండా మహిళలందరూ తాము అందంగా ఉన్నామని ఫీలవ్వాలనే పాయింట్‌ను నేను చెప్పాలనుకున్నా. ఈ ఫొటోలు చూసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పొందిన వందలమందికి... కీప్ ఇట్ గాళ్స్!’’ స్ట్రయిట్‌గా... సుత్తి లేకుండా... సింపుల్‌గా... నెట్టింట్లో జనాలకు బొద్దుగుమ్మ విద్యుల్లేఖా రామన్ ఇలా క్లారిటీ ఇచ్చారు! ఎటో వెళ్ళిపోయింది మనసు, రన్ రాజా రన్, రాజుగారి గది, భలే మంచి రోజు, సరైనోడు, ధృవ, నిన్ను కోరి తదితర తెలుగు చిత్రాల్లో కమెడియన్‌గా ప్రేక్షకులను నవ్వించారీ తమిళమ్మాయ్! తెర మీదా, తెర వెనుకా... ఎప్పుడూ నిండైన వస్త్రధారణతో కనిపించే విద్యుల్లేఖ ఇటీవల సడన్‌గా మోడరన్ డ్రస్సుల్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేనా? ‘‘ఎవరైనా నటి వరుసగా కామెడీ రోల్స్ చేస్తుంటే... ‘నువ్వు సెక్సీగా కనిపించలేవు, ఫీలవ్వలేవు’ అని ప్రజలు ఓ స్టాంప్ వేసేస్తారు. నేనంటాను ‘ఐ కెన్’ (నేను సెక్సీగా కనిపించగలను, ఫీలవ్వగలను)’’ అని ఫొటోలతో పాటు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘యు ఆర్ లుకింగ్ టూ హాట్’ అని సినిమా జనాలు విద్యుల్లేఖకి కాంప్లిమెంట్స్ ఇస్తే... మామూలు జనాలు ఈ హాస్యనటి దుస్తులపై, మాటలపై దుమ్మెత్తిపోశారు. ఎక్స్పోజింగ్ చేస్తున్నావా? హీరోయిన్ చాన్సుల కోసమేనా? అని కామెంట్లు చేశారు. అటువంటి జనాలకు కొంచెం గట్టిగానే జవాబిచ్చారీ బ్యూటీ. ‘‘ఓ మహిళ తనపై తనకున్న ప్రేమను చూపించుకోవడం షో ఆఫా (ఎక్స్పోజింగ్)? మీలాంటి సంకుచిత మనస్తత్వం, ఆలోచనలు గల వారికి నేను రిప్లై ఇస్తున్నా. జీవితంలో మిమ్మల్ని వెనక్కి తీసుకువెళ్లే ఆలోచనలతో తక్కువ చేసుకోకండి. హీరోయిన్గా ట్రై చేయడంలేదు. కమెడియన్లూ అందంగా కనిపిస్తారని చెప్పడమే నా ఉద్దేశ్యం’’ అని పేర్కొన్నారు విద్యుల్లేఖా రామన్. -
డాక్టర్ టు యాక్టర్
డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని చాలా మంది అంటుంటారు. కానీ నిజంగానే ఓ డాక్టర్ యాక్టర్‌గా మారితే.. అందులోనూ కమేడియన్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తే.. గొప్ప విషయమే కదా. ‘అల్లుడు గారు మామూలుగా లేరండీ..’, ‘అల్లుడు గారికి సరసం బాగా ఎక్కువండీ బాబూ..’ అంటూ మహానుభావుడు సినిమాలో జిడ్డేశ్ పాత్రలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న హాస్యనటుడు భద్రం. డాక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, వృత్తిని కొనసాగిస్తూ ప్రవృత్తిలోనూ దూసుకుపోతున్న భద్రం... ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... రాజమండ్రిలో పుట్టి పెరిగాను. నాన్న గిరి యుగంధర్ నాయుడు కొన్ని చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా చేశారు. ఆ కోవలోనే నాకూ సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. అయితే నాన్న సలహా మేరకు కెరీర్లో స్థిరపడాలని బెంగుళూర్లో ఫిజియోథెర పీ పూర్తి చేశాను. ఎర్గొనోమిక్స్ డాక్టర్‌గా హైదరాబాద్‌లో ప్రస్థానం ప్రారంభించాను. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వృత్తిరీత్యా వచ్చే సమస్యలు పరిష్కరిస్తూ ఫిజియోథెరపీ చేసేవాడిని. ‘పూరి’ పిలుపు... మలుపు డాక్టర్‌గా రాణిస్తున్న తరుణంలో నా సన్నిహితుడి సలహా మేరకు నా ప్రతిభతో ‘లవ్ పెయిన్’ పేరుతో ఓ చిన్న వీడియో తీశాను. ఇది చాలామంది దర్శకులకు నచ్చింది. దర్శకుడు సుధీర్‌వర్మ సన్నిహితుడు ఫణి సహకారంతో ‘మ్యాంగో’ కంపెనీకి చేరువయ్యాను. ‘పెళ్లితో జరభద్రం’ పేరుతో షార్ట్‌ఫిల్మ్ తీశాం. ఇదే నా లైఫ్‌కి టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ వీడియో చూసిన దర్శకుడు పూరి జగన్నాథ్ తన ఫేస్బుక్లో దీనిని పోస్ట్ చేసి.. ‘ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ పరిశ్రమకు అవసరం. నన్ను కలవండి’ అని రాశారు. ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ‘జ్యోతిలక్ష్మి’తో స్టార్ట్.. పూరి జగన్నా«థ్ గారు చెప్పినట్టే ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంలో బ్రోకర్ భద్రం పాత్రతో అవకాశమిచ్చారు. ఈ పాత్రకు మంచి స్పందన వచ్చింది. నేను చేసిన ‘పెళ్లితో జరభ్రదం’ షార్ట్‌ఫిల్మ్ వైరల్ అయి, దర్శకుడు మారుతి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ‘భలేభలే మగాడివోయ్’ చిత్రంలో ఆయన అవకాశమిచ్చారు. అలాగే దర్శకుడు సతీష్ వేగేశ్న ‘శతమానం భవతి’ చిత్రంలో గుర్తుండిపోయే పాత్ర ఇచ్చారు. అలా లోఫర్, ఎక్కడికిపోతావు చిన్నవాడా, ప్రేమమ్, పండగచేస్కో, డిక్టేటర్, వైశాఖం, గల్ఫ్ తదితర చిత్రాలతో సుమారు 50 సినిమాల్లో నటించాను. ‘జిడ్డేశ్’.. హిట్ ‘భలేభలే మగాడివోయ్’ తర్వాత నాకో టర్నింగ్ క్యారెక్టర్ ఇస్తానన్న డైరెక్టర్ మారుతి... ‘మహానుభావు డు’లో నాజర్‌కు సహాయకు డిగా జిడ్డేశ్ పాత్ర ఇచ్చారు. ఈ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల కు మరింత దగ్గరయ్యా ను. నిర్మాత సి.కళ్యాణ్.. నా ప్రతిభను గుర్తించి ఆయన తెరకెక్కిస్తున్న రెండు చిత్రాల్లో అవకాశమిచ్చారు. దేవుడిచ్చిన వరం.. డాక్టర్‌గా వైద్యం అందిస్తూ, హాస్య నటుడిగా అందరినీ నవ్విస్తున్నాను. ఇది నాకు దేవుడిచ్చిన గొప్ప వరం. డాక్టర్‌గా, యాక్టర్‌గా జీవితం సాఫీగా సాగుతోంది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. అలనాటి హాస్యనటుడు అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, అలీ నాకు స్ఫూర్తి. -
సినిమాకు హాస్యమే ప్రాణం
పిఠాపురం :‘నాటకానికైనా, సినిమాకైనా హాస్యమే ప్రాణం. హాస్యం లేకుండా ఏ ప్రదర్శనా రక్తికట్టదు’ అని ప్రముఖ హాస్య నటుడు పోలాప్రగడ జనార్దనరావు (జెన్నీ) అన్నారు. పాదగయ క్షేత్రాన్ని ఆయన సోమవారం సతీ సమేతంగా దర్శించుకున్నారు. శ్రీ కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరి దేవి, పురుహూతికా అమ్మవారు, దత్తాత్రేయ స్వామివార్లను దర్శించుకున్నారు. పాదగయను దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని ఈ సందర్భంగా అన్నారు. ఈఓ దారబాబు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించారు. అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తనను కలిసిన ‘సాక్షి’తో జెన్నీ మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ఇప్పటివరకూ 400 సినిమాలు, వెయ్యి టీవీ కార్యక్రమాల్లో నటించాను. 100 రేడియో ప్రోగ్రాముల్లో చేశాను. ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా చేయడంవల్ల నాకు అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. ప్రపంచంలో మూకాభినయం చేసే తొలి కళాకారుడిగా నాకు గుర్తింపు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మూకాభినయ ప్రదర్శనలు ఇచ్చాను. మూకాభినయం చేయడం చాలా కష్టం. ఎంతో శ్రమకోర్చి నేర్చుకుని, ప్రదర్శించడం ద్వారా ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందాను. హాస్యనటులు నవ్వించడమే తెరపై ప్రేక్షకులకు కనిపిస్తుంది తప్ప వారు పడే కష్టం కనిపించదు. సినిమా కాలక్షేపం అయితే దానిలో హాస్యం మానసికోల్లాసానికి దోహదపడుతుంది. యమలీల, హలోబ్రదర్, రెడీ, దూకుడు, ఆగడు, ప్రాణదాత, మాయలోడు, ఠాగూర్, ఆంటీ సినిమాల్లో నేను చేసిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం నితిన్ హీరోగా, తెలుగు, తమిళంలో నిర్మిస్తున్న ‘కొరియర్ బాయ్’, కళ్యాణ్, జగపతిబాబు నటిస్తున్న ‘ఒక మనిషి కథ’, ‘జగన్నాయకుడు’, ‘జన్మస్థానం’ తదితర ఏడు సినిమాల్లో నటిస్తున్నాను. -
ఏవీఎస్ మృతికి ప్రముఖుల సంతాపం
హాస్య నటుడు ఏవీఎస్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో సాయి కుమార్, తమ్మారెడ్డి భరద్వాజ, ఉత్తేజ్, ఆలీ, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. సినీ జీవితంలో తనకంటూ ప్రత్యేక ముద్రను సంపాదించుకున్నఏవీఎస్ ఇక లేకపోవడం చాలా బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.