![Comedian Mahesh Shares Emotional Words About His Career - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/3/WhatsApp%20Image%202023-05-03%20at%2020.02.30.jpeg.webp?itok=rfvBJap6)
జబర్దస్త్ కామెడీ షో ద్వారా పేరు సంపాదించుకున్న మహేశ్. ఆ తర్వాత రంగస్థలం సినిమాలో నటనతో మరితం ఫేమ్ తెచ్చుకున్నాడు. కామెడీ షోలో ఎప్పుడు కడుపుబ్బా నవ్వించే మహేశ్.. తన యాస, డైలాగ్స్‌తో సినిమాల్లో తన మార్క్ చూపించారు. రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం చిత్రంలో ఎమోషనల్ సీన్స్‌లో అదరగొట్టాడు. ఆ సినిమాతో రంగస్థలం మహేశ్‌గా అభిమానుల్లో పేరు సంపాదించాడు.
(ఇది చదవండి: 'సేవ్ ది టైగర్స్'.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన యాత్ర డైరెక్టర్!)
అంతలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు సంపాదించుకున్న మహేశ్ తన జీవితంలో పడ్డ కష్టాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన మహేశ్ తన కెరీర్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు పేరు ఒక్క రోజులో వచ్చింది కాదని చెప్పారు.
మహేశ్ మాట్లాడుతూ ..'నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు జీరో. మన టాలెంట్ నమ్ముకొని వచ్చా. ఏం జరిగినా ముందుకెళ్లడమే నాకు తెలుసు. నాకు చిన్నతనం నుంచి సినిమాలు అంటే ఇష్టం. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని హైదరాబాద్‌కు వచ్చా. సినిమాలనే నమ్ముకున్నా. నేను సినిమాలలో ప్రయత్నాలు చేస్తున్నప్పుడే నాన్న చనిపోయారు. ఆ సమయంలో నాన్న చితి కట్టెలకు కూడా డబ్బులిచ్చే స్తోమత లేదు. అప్పుడు నా జేబులో రూ.500 కూడా లేవు. అప్పుడు చాలా బాధేసింది. ఆ సమయంలో ఈ బతుకు ఎందుకురా అనిపించింది. దీంతో చాలామంది బంధువులు, స్నేహితులు సినిమాలు అవసరమా? అంటూ నన్ను తిట్టారు. ఆ సందర్భంలో నేను మాత్రం చాలా బాధపడ్డా. నాకు మంచి అవకాశం ఇచ్చింది డైరెక్టర్ సుకుమార్. కొన్నేళ్లు పట్టినా కూడా మంచిపాత్ర చేసే అవకాశం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఇల్లు లేదని.. సొంతూళ్లో ఇటీవలే ఇంటిని నిర్మించా. ' అంటూ మహేశ్ తీవ్ర భావోద్వాగానికి గురయ్యాడు.
(ఇది చదవండి: నరేశ్- పవిత్ర 'మళ్లీ పెళ్లి'.. ముహుర్తం పెట్టేశారుగా!)
Comments
Please login to add a commentAdd a comment