ఒకప్పుడు ట్రాక్టర్ వెల్డర్. రోజంతా కష్టపడితే కడుపు నిండేది కానీ, సరదాలకు సరిపోయేది కాదు. టామీ కానన్ అతనికి మంచి మిత్రుడు. ఇద్దరూ ట్రాక్టర్ వెల్డర్లే. వారిద్దరు స్నేహితులతో కలిసి గప్పాలు కొడుతూ, జోకులు వేస్తూ కాలం గడిపేవారు. వారి గురించి, వారి జోకుల గురించి ఈ వాడకు, ఆ వాడకు తెలిసి నగరమంతా తెల్సింది. వారి జోకులు వినడానికి గుంపులు, గుంపులుగా జనం కూడే వారు. ఇదేదో బాగుందనుకొన్న బాబీ బాల్, తన మిత్రుడితో టామీ కానన్‌తో కలసి స్టేజీలెక్కి జోకులు చెప్పే వారు. 1960 దశకంలో వారు ‘కానన్ అండ్ బాల్’ పేరిట ప్రారంభించిన హాస్యోక్తులకు త్వరలోనే బ్రాండ్ ఇమేజ్ లభించింది.
బ్రిటీష్ రాణి వారిద్దరిని పిలిపించి 1987లో రాజ ప్రాసాదంలో కచేరీ పెట్టించింది. అది సూపర్ డూపర్ హిట్టవడంతో ఇరువురికి జంటగా, విడివిడిగా టీవీ సీరియళ్ల కామెడీ పాత్రల్లో అవకాశం వచ్చింది. అలా బాబీ బాల్...‘ది లాస్ట్ ఆఫ్ ది సమ్మర్ వైన్, హార్ట్‌బీట్, ది కాక్‌ఫీల్డ్స్ లాంటి పలు సీరియళ్లలో అవకాశం వచ్చింది. బాబీ బాల్‌కు ట్రాక్టర్ వెల్డర్‌గా నెలకు ఎంత వచ్చేదోగానీ, ఐటీవీలో శనివారం వచ్చే పాపులర్ కామెడీ షో ద్వారా బాబీ బాల్‌కు నెలకు రెండు లక్షల పాండ్లు (దాదాపు 1.94 కోట్ల రూపాయలు) వస్తున్నాయి. ఈ శనివారం నాటి కామెడీ షోలో పాల్గొనే అవకాశం ఆయనకు లేకుండా పోయింది. ఛాతి నొప్పితో లండన్‌లోని బ్లాక్‌పూల్ ఆస్పత్రిలో సోమవారం చేరిన బాబీ బాల్ గురువారం రాత్రి కరోనా కారణంగా శాశ్వతంగా కన్ను మూశారు.
Comments
Please login to add a commentAdd a comment