కమెడియన్‌ను పెళ్లి చేసుకున్న నటి | Actor Sulagna Panigrahi Married Stand Up Comedian Biswa Kalyan Rath | Sakshi
Sakshi News home page

‘మా సింగిల్‌ లైఫ్‌ ఎలా కాలిపోతుందో చూడండి’

Published Sat, Dec 19 2020 7:38 PM | Last Updated on Sat, Dec 19 2020 9:39 PM

Actor Sulagna Panigrahi Married Stand Up Comedian Biswa Kalyan Rath - Sakshi

ముంబై: టీవీ, సినీ నటి సులగ్నా పానిగ్రాహి పాపులర్ స్టాండప్ కామెడి షో ఫేం బిస్వా కళ్యాణ్ రాత్‌ను వివాహం చేసుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. వీరి పెళ్లి ఫొటోలను శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్‌ చేసి కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య బిస్వాను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. సులగ్నా మండపంలో కూర్చుని ఉన్న వాని రెండు ఫొటోలను షేర్‌ చేస్తూ.. ‘మొదటి ఫొటోలో మా సింగిల్‌ లైఫ్‌ ఎలా కాలిపోతుందో చూడవచ్చు’ అంటూ చమత్కరించారు. ఇక రెండవ ఫొటోకు ‘సరదాగా ఉన్నప్పుడు.. వావ్‌ మా వివాహం జరిగిపోయింది’ అంటూ చమత్కరించారు. 

ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో ప్రసారమవుతున్న ‘బిస్వా మస్ట్ ఆద్మీ’ సరీస్‌ టైటిల్‌తో ‘బిస్వా మ్యారీడ్ ఆద్మీ’ అంటూ తనదైన శైలిలో పెళ్లి వార్తను ప్రకటించాడు బిస్వా. దీంతో వారి పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అవి చూసిన వారి అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నటి సులగ్నా ‘అంబర్ ధారా’,‘దో సహేలియాన్ ... కిస్మత్ కి కత్పుతాలియన్’ వంటి సిరీయల్స్‌లో నటించి గుర్తింపు పొందారు. అంతేగాక ఇమ్రాన్‌ హష్మి ‘మర్డర్ 2’, ‘రైడ్’ ‘ఇష్క్ వాలా లవ్’ వంటి సినిమాల్లో కూడా ఆమె నటించారు. ఇక బిస్వా ప్రముఖ కామెడియన్‌ మాత్రం కాదు కంటెంట్‌ రైటర్‌ కూడా. ప్రెటెన్షియస్ మూవీ రివ్యూస్’  కామెడి సిరీస్‌తో అతడు కమెడియన్‌గా గుర్తింపు పొందాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement