ముంబై: ప్రముఖ నటుడు, బాలీవుడ్ హాస్యనటుడు జగదీప్(81) అలియాస్ సయ్యద్ ఇష్తియాక్ అహ్మద్ జాఫ్రీ మృతి చెందారు. ముంబైలోని ఆయన నివాసంలో వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బుధవారం రాత్రి 8:40 గంటలకు కన్నుముశారు. మార్చి 29, 1939న జన్మించిన జగదీప్‌కు ఇద్దరూ కుమారులు జావేద్ జాఫ్రీ, నవేద్ జాఫ్రీలు ఉన్నారు. ముంబైలోని షియా ఖబర్‌స్తాన్‌లో శుక్రవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతికి బాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. (చదవండి: దర్శక–నిర్మాత హరీశ్ షా కన్నుమూత)
My first film & the first time I ever faced the camera, was in the film #yehrishtanatoote with the legend himself #Jagdeep bhai. We will miss you...May his soul rest in peace 🙏🏽 Our prayers & deepest condolences to the family. pic.twitter.com/uhBjYSZdVe
— Johny Lever (@iamjohnylever) July 8, 2020
జగదీప్ సహా నటుడు, కమెడియన్ జాన్ లీవర్ ఆయన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘నా మొట్టమొదటి సినిమా ‘యే రిషితా నా టూటే’లో లెజెండ్ నటుడు జగదీప్‌తో కలిసి నటించాను. జగదీప్ భాయ్ వియ్ మిస్ యూ. ఆయన ఆత్మ ప్రశాంతంగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను’’ అంటూ ట్వీట్ చేశాడు. బాలీవుడ్‌లో దాదాపు 400లకుపైగా సినిమాలలో నటించిన జగదీప్ 1975లో వచ్చిన ‘షోలే’లో సూర్య భోపాలి పాత్రను పోషించారు. ఆయన నటించిన అదే పాత్ర పేరుతో వచ్చిన ‘సూర్య భోపాలి’ సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడిగా మారారు. ఆ తర్వాత అందాజ్ అప్నా, బ్రహ్మచారి, నాగిన్ వంటి సినిమాల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment