లేడీ కమెడియన్ గీతా సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె పేరు వినగానే టక్కున గుర్తొచ్చే చిత్రం కితకితలు. ఈ సినిమాలో అల్లరి నరేశ్ సరసన హీరోయిన్‌గా నటించింది. ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఆమె మూవీ అప్పట్లో మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో గీతా సింగ్ రాత్రికి రాత్రే స్టార్‌డమ్ తెచ్చుకుంది. ఇందులో తన కామెడీతో కడుబ్బా నవ్వించడమే కాదు.. లావుగా ఉండే భార్య పడే కష్టాలను చూపించి అందరి చేత కన్నీరు పెట్టించింది. అలా ఎన్నో చిత్రాల్లో లేడీ కమెడియన్‌గా నటించి తెరపై ప్రేక్షకులను నవ్వించింది.
చదవండి: ఆ ఫొటో చూసి పెళ్లయిందా? అంటూ ప్రశ్నల వర్షం, క్లారిటీ ఇచ్చిన పూనమ్
అయితే కొంతకాలంగా ఆమె తెరకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆమె జీవితంలో చోటు చేసుకున్న చేదు సంఘటనలను గుర్తు చేసుకుంది. అలాగే ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదని, అందుకే తాను నటించడం లేదని చెప్పింది. పరిశ్రమలో అసలు సపోర్ట్ లేదంటూ గీతా సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడసలు సినిమాల్లో ఫిమేల్ యాక్టర్స్ ఎక్కడ కనిపిస్తున్నారని, అందరు మేల్ యాక్టర్సే కదా అని వ్యాఖ్యానించింది. ‘పరిశ్రమలో పురుషాధిక్యం ఎక్కువ. మహిళా నటులకు అసలు అవకాశాలు ఇవ్వడం లేదు. మనకు ఎంతమంది లేడీ కమెడియన్స్ లేరు.. ఇప్పుడు ఎవరైనా ఏ సినిమాలో అయినా కనిపిస్తున్నారా?’ అని ప్రశ్నించింది.
అనంతరం ఇటూ ఇండస్ట్రీ సపోర్ట్ , నమ్ముకున్న బంధువుల మద్దుతు లేకపోవడంతో ఒంటరిగా పోరాడుతున్నానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నమ్మిన వాళ్లే.. దారుణంగా మోసం చేశారు. డబ్బులు అవసరం ఉంటేనే నా కుటుంబానికి గుర్తుకు వస్తాను. డబ్బు అవసరం ఉన్నంత వరకే నాతో ఉండేవాళ్లు. నా సొంత చెల్లెల్లు కూడా నన్ను డబ్బు కోసం వాడుకున్నారు’ అంటూ కన్నీటీ పర్యంతరం అయ్యింది. ఇక ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి సంపాందిచుకున్న డబ్బును ఓ మనిషిని నమ్మి పోగొట్టుకున్నాని, ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని దగ్గర చిట్టీలు వేశానని చెప్పంది.
చదవండి: నిర్మాతగా వరుస విజయాలు.. ‘తగ్గేదే లే’ అంటున్న ‘అమ్ము’ హీరోయిన్
అయితే చివరకు ఆమె మోసం చేయడంతో సుమారు రూ. 6 కోట్ల వరకు నష్టపోయానని చెప్పుకొచ్చింది. ఇటు ఆఫర్స్ లేక, చేసుకోడానికి పని లేక ఒత్తిడికి గురయ్యానని, బాధలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశానని చెప్పింది. అయితే తన స్నేహితురాలు చూసి తనని కాపాడిందని తెలిపింది. ప్రస్తుతం తనకు ఆ స్నేహితురాలే పెద్ద దిక్కని, తన అన్నయ్య పిల్లలను దత్తత తీసుకుని వారితో కలిసి జీవిస్తున్నానంటూ గీతా సింగ్ చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన ‘మా’ ఎలక్షన్స్‌లో మంచు విష్ణు ప్యానెల్ తరపున గీతా సింగ్ పోటీ చేసి గెలుపు పొందిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment