
‘‘అదృష్టం కొద్దీ నేను కమెడియన్‌గా ఫుల్ బిజీ! అందువల్ల, హీరోయిన్‌గా నటించాలనే ఆలోచన అస్సలు చేయడం లేదు. తమ రంగు, రూపుతో సంబంధం లేకుండా మహిళలందరూ తాము అందంగా ఉన్నామని ఫీలవ్వాలనే పాయింట్‌ను నేను చెప్పాలనుకున్నా.
ఈ ఫొటోలు చూసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పొందిన వందలమందికి... కీప్ ఇట్ గాళ్స్!’’ స్ట్రయిట్‌గా... సుత్తి లేకుండా... సింపుల్‌గా... నెట్టింట్లో జనాలకు బొద్దుగుమ్మ విద్యుల్లేఖా రామన్ ఇలా క్లారిటీ ఇచ్చారు! ఎటో వెళ్ళిపోయింది మనసు, రన్ రాజా రన్, రాజుగారి గది, భలే మంచి రోజు, సరైనోడు, ధృవ, నిన్ను కోరి తదితర తెలుగు చిత్రాల్లో కమెడియన్‌గా ప్రేక్షకులను నవ్వించారీ తమిళమ్మాయ్! తెర మీదా, తెర వెనుకా... ఎప్పుడూ నిండైన వస్త్రధారణతో కనిపించే విద్యుల్లేఖ ఇటీవల సడన్‌గా మోడరన్ డ్రస్సుల్లో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అంతేనా? ‘‘ఎవరైనా నటి వరుసగా కామెడీ రోల్స్ చేస్తుంటే... ‘నువ్వు సెక్సీగా కనిపించలేవు, ఫీలవ్వలేవు’ అని ప్రజలు ఓ స్టాంప్ వేసేస్తారు. నేనంటాను ‘ఐ కెన్’ (నేను సెక్సీగా కనిపించగలను, ఫీలవ్వగలను)’’ అని ఫొటోలతో పాటు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘యు ఆర్ లుకింగ్ టూ హాట్’ అని సినిమా జనాలు విద్యుల్లేఖకి కాంప్లిమెంట్స్ ఇస్తే... మామూలు జనాలు ఈ హాస్యనటి దుస్తులపై, మాటలపై దుమ్మెత్తిపోశారు. ఎక్స్‌పోజింగ్ చేస్తున్నావా? హీరోయిన్ చాన్సుల కోసమేనా? అని కామెంట్లు చేశారు.
అటువంటి జనాలకు కొంచెం గట్టిగానే జవాబిచ్చారీ బ్యూటీ. ‘‘ఓ మహిళ తనపై తనకున్న ప్రేమను చూపించుకోవడం షో ఆఫా (ఎక్స్‌పోజింగ్)? మీలాంటి సంకుచిత మనస్తత్వం, ఆలోచనలు గల వారికి నేను రిప్లై ఇస్తున్నా. జీవితంలో మిమ్మల్ని వెనక్కి తీసుకువెళ్లే ఆలోచనలతో తక్కువ చేసుకోకండి. హీరోయిన్‌గా ట్రై చేయడంలేదు. కమెడియన్లూ అందంగా కనిపిస్తారని చెప్పడమే నా ఉద్దేశ్యం’’ అని పేర్కొన్నారు విద్యుల్లేఖా రామన్.
Comments
Please login to add a commentAdd a comment