
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సరికొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. పౌరాణిక నేపథ్యంలో ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ(అదిరే అభి) దర్శకత్వంలో ఈ సిరీస్‌ను రూపొందించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్‌కు చిరంజీవా అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ టాలీవుడ్ మైథలాజికల్ వెబ్ సిరీస్ డిసెంబర్‌లో స్ట్రీమింగ్ రానుందని ప్రకటించారు. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేయనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే భక్తి కోణంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఈ వెబ్ సిరీస్‌ను రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ నిర్మించారు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్‌కు అచ్చు రాజమణి సందీతమందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment