abhinaya krishna
-
‘ది డెవిల్స్ చైర్’ మూవీ రివ్యూ
టైటిల్: ది డెవిల్స్ చైర్నటీనటులు: అభినయ కృష్ణ(జబర్దస్త్ అభి), ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్,వెంకట్ దుగ్గి రెడ్డి తదితరులునిర్మాణ సంస్థ: బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్ నిర్మాతలు: KK చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి .దర్శకత్వం: గంగా సప్తశిఖరసంగీతం: బిషేక్ సినిమాటోగ్రఫీ:గంగా సప్తశిఖరవిడుదల తేది: ఫిబ్రవరి 21, 2025కథేంటంటే..ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే విక్రమ్(అదిరే అభి) బెట్టింగ్‌కు బానిసగా మారుతాడు. కంపెనీకి చెందిన కోటి రూపాయాలను కొట్టేసి బెట్టింగ్‌లో పెడతాడు. ఈ విషయం తెలిసి యాజమాన్యం అతన్ని ఉదోగ్యంలో నుంచి తీసేవేయడంతో పాటు కేసు కూడా పెడుతుంది. లీగల్ కేసు ఎదుర్కొంటున్న విక్రమ్‌ని ప్రియురాలు రుధిర(స్వాతి మందల్) చేరదీస్తుంది. తన ఇంట్లోనే ఉంచుకుంటూ ఆర్థికంగా ఆదుకుంటుంది. ఓ సారి రుధిర ఇష్టపడి ఓ యాంటిక్ చైర్‌ని కొని తెచ్చుకుంటుంది. ఆ చైర్లో ఓ డెవిల్ శక్తి ఉంటుంది. అది విక్రమ్‌కి మాత్రమే కనిపిస్తూ.. కండిషన్స్‌పై అతనికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటుంది. రూ. కోటి కట్టాలని యాజమాన్యం ఒత్తిడి తేవడంతో ఆ డబ్బు కోసం మళ్లీ డెవిల్‌ని శక్తినే సంప్రదిస్తాడు. ప్రియురాలు రుధిరను చంపేస్తే రూ.5 కోట్లు ఇస్తానని ఆ డెవిల్ చైర్ ఆఫర్ ఇస్తుంది. మరి పీకల్లోతు అప్పుల్లో ఉన్న విక్రమ్ డబ్బు కోసం ప్రియురాలిని చంపేశాడా? అసలు ఆ చైర్లో ఉన్నది ఎవరు? విక్రమ్‌ని వశం చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తుంది? అసలు ఆ చైర్ వెనుక ఉన్న రహస్య స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..హారర్ చిత్రాలు టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. ఇప్పటికే ఈ జానర్లో చాలా చిత్రాలు వచ్చాయి.. వస్తునే ఉన్నాయి. ది డెవిల్స్ చైర్ కూడా ఆ జానర్ చిత్రమే. అయితే కంటెంట్‌తో పాటు మేకింగ్‌ని కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు గంగా సప్తశిఖర. కేవలం భయపెట్టేందుకు మాత్రమే సీన్లను రాసుకోకుండా..బలమైన కథ చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రం ఓ వైపు భయపెడుతూనే..దురాశ దు:ఖానికి చేటు అనే సందేశాన్ని ఇస్తుంది. ప్రేక్షకులకు హారర్ తో పాటు థ్రిల్ ను ఇవ్వడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఈజీ మనీకి అలవాటు పడిన వారు ఎలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారనేది ఇందులో చూపించారు. కథ ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. అయితే హీరోపై లీగల్ కేసు నమోదైన తర్వాత కథనం కాస్త నెమ్మదిగా సాగుతుది. ఇంటర్వెల్ సీన్ బాగా ప్లాన్ చేశాడు. సెకండాఫ్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రీక్లైమాక్స్ నుంచి వచ్చే ప్రతీ సీన్ భయానికి గురి చేస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అయితే డెవిల్ చైర్ నేపథ్యం ఏంటి? అసలు ఆ చైర్‌లోకి వచ్చి దృష్టశక్తి ఏంటనేది పార్ట్ 2లో చూడాల్సిందే. పార్ట్ 2 కోసం ఇచ్చిన ఎలివేషన్స్ బాగున్నాయి. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నచ్చే ప్రేక్షకులకు ‘ది డెవిల్స్ చైర్’ సినిమా నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే.. ఈజీ మనీకోసం అలవాటు పడిన యువకుడు విక్రమ్ పాత్రలో అదిరే అభి చక్కగా నటించాడు. రెండు మూడు వేరియషన్స్ లో అభి అభినయం అందిరినీ ఆకట్టుకుంటుంది. తనకు జోడీగా నటించిన స్వాతి మందల్ ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే సీన్ తన తన పర్ ఫార్మెన్స్ కు అద్దం పడుతుంది. అలాగే ఛత్రపతి శేఖర్ ప్రొ ఫెసర్ పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు మనోజవ పాత్రలో వెంకట్ దుగ్గిరెడ్డి, పుండాక్ష పాత్రలో చంద్ర సుబ్బగారి, నూర్జహాన్ గా మూగమ్మాయిగా అద్విత చౌదరి నటించి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. పాటలు పర్వాలేదు. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు. -
తొలి సినిమానే ప్రయోగం..యంగ్ డైరెక్టర్ సాహసం!
సాధారణంగా తొలి సినిమా అంటే సేఫ్ జోన్లో ఉండేందుకు ట్రెండింగ్ సబ్జెక్ట్‌ను ఎంచుకొని పాత పద్దతినే ఫాలో అవుతారు నూతన దర్శకులు. కానీ కొద్ది మంది మాత్రమే తొలి సినిమాతోనే ప్రయోగం చేస్తారు. ఆ లిస్ట్‌లోకి యంగ్ డైరెక్టర్ గంగ సప్తశిఖర(Ganga Saptha Shikhara ) కూడా వస్తాడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ది డెవిల్స్ చైర్’(The Devil's Chair). జబర్దస్త్ ద్వారా జనాల్లోకి వెళ్లిన అదిరే అభి హీరోగా నటిస్తున్నాడు. ఈ హారర్ సినిమా కోసం అప్డేటెడ్ ఏ ఐ టెక్నాలజీ ఉపయోగించాడట డైరెక్టర్. కాన్సెప్ట్‌తో పాటు మేకింగ్ కూడా డిఫరెంట్‌గా ఉండబోతుందట. గతంలో ఆయన తెరకెక్కించిన షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు పలు అవార్డులను తెచ్చిపెట్టాయి. లిమిటెడ్ బడ్జెట్లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ తియ్యగల సత్తా ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ‘ది డెవిల్స్ చైర్’ని కూడా అదే తరహాలో డిఫరెంట్‌గా తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది.హీరోగా నటించిన అభి కూడా దర్శకుడి ప్రతిభపై ప్రశంసలు కురిపించాడు.‘ది డెవిల్స్ చైర్ అనే టైటిల్ అన్ని భాషలకు యాప్ట్‌గా ఉంటుంది. మనిషికి ఉండే దురాశ మీదే ఈ చిత్రాన్ని తీశాం. మంచి కాన్సెప్ట్‌తో పాటు మంచి సందేశం ఇచ్చేలా దర్శకుడు గంగ సప్తశిఖర ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఈ చిత్రం అందరినీ భయపెట్టేలా ఉంటుంది’ అని అన్నారు.‘ది డెవిల్స్ చైర్’చూసిన ప్రతీ ఒక్కరినీ హంట్ చేస్తుంది. డెవిల్ మీ ఇంటికి వస్తుంది. మంచి కంటెంట్‌తో ఈ చిత్రం రాబోతోంది. కావాల్సినంత డ్రామా, వినోదం ఉంటుంది’ అని దర్శకుడు గంగ సప్త శిఖర అన్నారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంతో పాటు W/O అనిర్వేష్ చిత్రానికి కూడా గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. జబర్దస్త్ రాంప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. -
ఇంకో 23 ఏళ్లయినా కష్టపడతా..సక్సెస్ తర్వాతే బయటకు వెళ్తా: అదిరే అభి
అదిరే అభి, స్వాతి మందల్ జంటగా గంగ సప్తశిఖర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది డెవిల్స్ చైర్’(the devil's chair). కేకే చైతన్య, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్రసుబ్బా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా పాయింట్ చెప్పినప్పుడు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అభి అద్భుతంగా నటిస్తాడు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. అదిరే అభి మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు అవుతోంది. ఈ 23 ఏళ్లు ఉన్నందుకు సంతోషపడాలా? ఇంకా స్ట్రగుల్స్ పడుతున్నాని బాధపడాలా? అన్నది అర్థం కావడం లేదు. నేను ఈ 23 ఏళ్లు కష్టపడుతూనే ఉన్నాను. ఇంకో 23 ఏళ్లు అయినా కష్టపడతాను.. సక్సెస్ అయిన తరువాత బయటకు వెళ్తాను. ఒకరో ఇద్దరికో అయినా ఇన్ స్పైరింగ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. నాకు సినిమాల మీదున్న ప్యాషన్‌తోనే అన్నీ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రతీ శుక్రవారం ఓ ఆర్టిస్ట్ తలరాత మారిపోతుంది. ఈ శుక్రవారం మేం రాబోతోంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ది డెవిల్స్ చైర్ అనే టైటిల్ అన్ని భాషలకు యాప్ట్‌గా ఉంటుంది. మనిషికి ఉండే దురాశ మీదే ఈ చిత్రాన్ని తీశాం. మంచి కాన్సెప్ట్‌తో పాటు మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. ఈ చిత్రం అందరినీ భయపెట్టేలా ఉంటుంది. నవీన్ గారు నిర్మాతగా మరో సినిమాను చేస్తున్నాను. నాకు అవకాశం ఇస్తున్న ప్రతీ ఒక్క నిర్మాతకు థాంక్స్’ అని అన్నారు.దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ.. ‘‘ది డెవిల్స్ చైర్’ ఫిబ్రవరి 21న రాబోతోంది. చూసిన ప్రతీ ఒక్కరినీ హంట్ చేస్తుంది. డెవిల్ మీ ఇంటికి వస్తుంది. మంచి కంటెంట్‌తో ఈ చిత్రం రాబోతోంది. కావాల్సినంత డ్రామా, వినోదం ఉంటుంది. ఈ చిత్రం కోసం అభి చాలా కష్టపడ్డాడు. అతని సపోర్ట్‌ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. నిర్మాతల సహకారం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. నాకు ఈ ప్రాజెక్ట్ చేసిన గడ్డం నవీన్ అన్నకి థాంక్స్’ అని అన్నారు. -
తెలుగులో సరికొత్త వెబ్ సిరీస్.. డైరెక్టర్‌గా టాలీవుడ్ కమెడియన్!
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా సరికొత్త వెబ్ సిరీస్‌ను ప్రకటించింది. పౌరాణిక నేపథ్యంలో ఈ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ అభినయ కృష్ణ(అదిరే అభి) దర్శకత్వంలో ఈ సిరీస్‌ను రూపొందించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సిరీస్‌కు చిరంజీవా అనే టైటిల్ ఖరారు చేశారు. తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ టాలీవుడ్ మైథలాజికల్ వెబ్ సిరీస్ డిసెంబర్లో స్ట్రీమింగ్ రానుందని ప్రకటించారు. త్వరలోనే స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేయనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే భక్తి కోణంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. కాగా.. ఈ వెబ్ సిరీస్‌ను రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ నిర్మించారు. ఈ టాలీవుడ్ వెబ్ సిరీస్‌కు అచ్చు రాజమణి సందీతమందిస్తున్నారు. -
అక్కడికెళ్లి కోహ్లీతో ఆడొచ్చు కదా?.. అదిరే అభి వీడియో వైరల్!
జబర్దస్త్ కామెడీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అభినయ కృష్ణ. అభిమానులను ఆయనను అదిరే అభి అని పిలుస్తుంటారు. తన కామెడీ పంచ్‌లతో కామెడీ షోతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2002లో వచ్చిన ప్రభాస్ మూవీ ఈశ్వర్లో హీరో ఫ్రెండ్‌గా తొలిసారిగా నటించారు. ఆ తరువాత విష్ణు, విద్యార్థి, గౌతమ్ ఎస్ఎస్సీ, ఈగ చిత్రాలలో నటించారు. అయితే తాజాగా అదిరే అభి ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: చిన్నప్పుడే తండ్రి మరణం.. హోటల్లో వెయిటర్‌గా.. అత్తారింటికి దారేదీ నటుడి స్టోరీ!) అదిరే అభి వీడియోలో మాట్లాడుతూ..'మొన్ననే పక్కన టీ కొట్టుకు వెళ్లి టీ తాగుతున్నా. అప్పుడే టీ కొట్టు అతను మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఆ లాస్ట్ బాల్‌ను ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడుంటే సిక్స్ వెళ్లేది అన్నాడు. మిస్ చేశాడు కోహ్లీ అన్నాడు. నేను షాకయ్యా. విరాట్ కోహ్లీకి సిక్స్ ఎలా కొట్టాలో అతను చెబుతుంటే నాకు ఆశ్చర్యమనిపించింది. ఇంకో పక్కనున్న వ్యక్తి దేశంలో, రాష్ట్రంలో ఇలా చేసి ఉంటే వీళ్ల పార్టీ గెలిచేది అని అన్నాడు. అదోక షాక్. ఇంకొంతమంది సినిమాల గురించి చెప్పారు. ఈ సీన్ అలా కాకుండా ఇలా తీసి ఉంటే బాగుండేది అన్నారు.' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ..'నాకు అర్థం కానీ విషయం ఏంటంటే అంత నాలెడ్జ్ ఉన్నోడు ఇక్కడ టీ షాపు దగ్గర మాట్లాడాల్సిన అవసరమేంటి? అక్కడికెళ్లి కోహ్లీతో ఆడొచ్చు కదా? పాలిటిక్స్‌లో చేరి అధికారంలోకి రావొచ్చు కదా? సినిమాల్లో చేరి డైరెక్షన్ చేయొచ్చు కదా? బేసిక్‌గా ఏంటంటే మనం మనపని తప్పా అందరి పనులు చేసేస్తాం. అందరికంటే ఎక్కువ మనకే తెలుసనుకుంటాం. ఈరోజు కోహ్లీ ఎందుకు క్రికెట్ గ్రౌండ్లో ఉన్నాడు.. మనం టీ షాపు దగ్గర ఎందుకు ఉన్నామనేది రియలైజ్ చేసుకోవాలి. మనం మనపనిని ఫర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు. ఎవరితో అవసరం లేదు. మన పని పక్కనపెట్టి.. అతను అలా ఆడితే బాగుండేది.. వాళ్లు ఇలా చేస్తే బాగుండేది.. అంటే మనల్ని నాశనం చేసుకున్నట్టే. అవతలి వాళ్లు అడిగితే చెప్పండి.. అంతేకానీ అడగకున్నా కూడా మనం మాట్లాడుతున్నామంటే టైం వేస్ట్ చేస్తున్నట్టు' అని అన్నారు. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!) అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో అదిరే అభి మాటలకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో అలాంటి వాళ్లతో మీకెందుకు అన్నా అని పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది మేధావులకు టైం కలిసిరాక అలా రోడ్లమీద తిరుగుతూ ఉంటారు అన్నా అంటూ నెటిజన్స్ రిప్లై ఇస్తున్నారు. ఏది ఏమైనా అదిరే అభి చెప్పిన మాటలు మనం కూడా ఎక్కడో ఒకచోట అలా మాట్లాడి ఉంటాం అని అనిపిస్తోంది. View this post on Instagram A post shared by Adhire Abhi (@abbhinav_actor) -
ఈ జబర్దస్త్‌కు ఏమైంది.. ఇలా తిట్టుకుంటున్నారు.. అదిరే అభి ఎమోషనల్
జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరినీ నవ్వించే బబర్దస్త్ కామెడీ షోకు దిష్టి తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం జరిగిందో ఏమో కానీ మమ్మల్ని మేమే తిట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఎవరి దిష్టి తగిలిందో అర్థం కావడం లేదని ఎమోషనల్ పోస్ట్ చేశారు. మళ్లీ ప్రేక్షకులను నవ్వించే పాత రోజులు వస్తే బాగుండని అన్నారు. 'జబర్దస్త్ టీం అంతా సంతోషంగా ఉండేవాళ్లమని.. అంతా ఓ కుటుంబం లాగా ఉండేదని.. మాది జబర్దస్త్ ఫ్యామిలీ అని అనేవారు. అలాంటి ఫ్యామిలీ లాంటి జబర్దస్త్‌కు ఎవరో దిష్టి పెట్టారంటూ' ఎమోషనల్ అయ్యారు. అందులో ఏముందంటే.. 'జబ్బలు చరుచుకుంటూ నవ్వే జడ్జీలు, టైమింగ్‌తో పంచులేసే టీమ్ లీడర్లు, కామెడీని అవపోసన పట్టే కంటిస్టెంట్లు. అందరికీ అన్నం పెట్టే అమ్మలాంటి మల్లెమాల ఇది కదా మా కుటుంబం. కలిసి ఉన్నప్పుడు కష్టం తెలిసేది కాదు.స్టేజ్ ఎక్కేవరకూ రిహార్సల్స్ అయినా అప్పుడప్పుడు స్పాంటేనిటీలు. పోస్టర్ ఆఫ్ ది డే కోసం ఫోజులు, పాతికవేల చెక్కుతో ఫోటోలు, జడ్జీలు వేసే కౌంటర్లు, కామెంట్లు, కాంప్లిమెంట్లు, సలహాలు, సూచనలు. ఇవేమీ ఇప్పుడు కనిపించడం లేదని అభి రాసుకొచ్చారు. మళ్లీ పాత రోజులు వస్తే బాగుండునని తన వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేశారు. ఎవరైనా ఏదైనా అంటే పడని మేము.. మమ్మల్ని మేమే తిట్టుకుంటున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చాలా మంది కమెడియన్స్ ఈ షో నుంచి బయటకొచ్చేసిన సంగతి తెలిసిందే. అనసూయ, కిరాక్ ఆర్పీ వంటి వాళ్లు ఇప్పుడు షోలో లేరు. అదిరే అభి కూడా జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశారు. దీనికి తోడు.. మల్లెమాల యాజమాన్యం మీద ఆరోపణలు, ఒకరి మీద ఒకరు విమర్శలు వంటివి నచ్చక ఇలా పోస్ట్ పెట్టినట్లు అర్థమవుతోంది. -
ఆన్‌లైన్‌కే అంకితం
నేటితరం ఎక్కువగా ఆన్‌లైన్‌కే అంకితం అవుతున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్లో చాటింగ్ ద్వారా పాత స్నేహితులతో మాట్లాడుకోవడంతో పాటు కొత్తవాళ్లతో స్నేహం చేయడం, తమకు తెలిసిన సమాచారాలను ఇతరులతో పంచుకోవడం.. ఇలా గడిపేస్తూ కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీన్నే ప్రధానాంశంగా చేసుకుని టీఎస్ కమల్ దర్శకత్వంలో లావణ్యా చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘చాటింగ్’. అభినయకృష్ణ, సునీత జంటగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వాస్తవ సంఘటనల సమాహారంతో ఈ చిత్రం ఉంటుందని నిర్మాత తెలిపారు.