
సాధారణంగా తొలి సినిమా అంటే సేఫ్ జోన్‌లో ఉండేందుకు ట్రెండింగ్ సబ్జెక్ట్‌ను ఎంచుకొని పాత పద్దతినే ఫాలో అవుతారు నూతన దర్శకులు. కానీ కొద్ది మంది మాత్రమే తొలి సినిమాతోనే ప్రయోగం చేస్తారు. ఆ లిస్ట్‌లోకి యంగ్ డైరెక్టర్ గంగ సప్తశిఖర(Ganga Saptha Shikhara ) కూడా వస్తాడు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘ది డెవిల్స్ చైర్’(The Devil's Chair). జబర్దస్త్ ద్వారా జనాల్లోకి వెళ్లిన అదిరే అభి హీరోగా నటిస్తున్నాడు.
ఈ హారర్ సినిమా కోసం అప్డేటెడ్ ఏ ఐ టెక్నాలజీ ఉపయోగించాడట డైరెక్టర్. కాన్సెప్ట్‌తో పాటు మేకింగ్ కూడా డిఫరెంట్‌గా ఉండబోతుందట. గతంలో ఆయన తెరకెక్కించిన షార్ట్ ఫిలిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు పలు అవార్డులను తెచ్చిపెట్టాయి. లిమిటెడ్ బడ్జెట్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ తియ్యగల సత్తా ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందాడు. ‘ది డెవిల్స్ చైర్’ని కూడా అదే తరహాలో డిఫరెంట్‌గా తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతుంది.

హీరోగా నటించిన అభి కూడా దర్శకుడి ప్రతిభపై ప్రశంసలు కురిపించాడు.‘ది డెవిల్స్ చైర్ అనే టైటిల్ అన్ని భాషలకు యాప్ట్‌గా ఉంటుంది. మనిషికి ఉండే దురాశ మీదే ఈ చిత్రాన్ని తీశాం. మంచి కాన్సెప్ట్‌తో పాటు మంచి సందేశం ఇచ్చేలా దర్శకుడు గంగ సప్తశిఖర ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. ఈ చిత్రం అందరినీ భయపెట్టేలా ఉంటుంది’ అని అన్నారు.
‘ది డెవిల్స్ చైర్’చూసిన ప్రతీ ఒక్కరినీ హంట్ చేస్తుంది. డెవిల్ మీ ఇంటికి వస్తుంది. మంచి కంటెంట్‌తో ఈ చిత్రం రాబోతోంది. కావాల్సినంత డ్రామా, వినోదం ఉంటుంది’ అని దర్శకుడు గంగ సప్త శిఖర అన్నారు. ఫిబ్రవరి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంతో పాటు W/O అనిర్వేష్ చిత్రానికి కూడా గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. జబర్దస్త్ రాంప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment