జబర్దస్త్ కామెడీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అభినయ కృష్ణ. అభిమానులను ఆయనను అదిరే అభి అని పిలుస్తుంటారు. తన కామెడీ పంచ్‌లతో కామెడీ షోతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2002లో వచ్చిన ప్రభాస్ మూవీ ఈశ్వర్‌లో హీరో ఫ్రెండ్‌గా తొలిసారిగా నటించారు. ఆ తరువాత విష్ణు, విద్యార్థి, గౌతమ్ ఎస్ఎస్‌సీ, ఈగ చిత్రాలలో నటించారు. అయితే తాజాగా అదిరే అభి ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
(ఇది చదవండి: చిన్నప్పుడే తండ్రి మరణం.. హోటల్‌లో వెయిటర్‌గా.. అత్తారింటికి దారేదీ నటుడి స్టోరీ!)
అదిరే అభి వీడియోలో మాట్లాడుతూ..'మొన్ననే పక్కన టీ కొట్టుకు వెళ్లి టీ తాగుతున్నా. అప్పుడే టీ కొట్టు అతను మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఆ లాస్ట్ బాల్‌ను ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడుంటే సిక్స్ వెళ్లేది అన్నాడు. మిస్ చేశాడు కోహ్లీ అన్నాడు. నేను షాకయ్యా. విరాట్ కోహ్లీకి సిక్స్ ఎలా కొట్టాలో అతను చెబుతుంటే నాకు ఆశ్చర్యమనిపించింది. ఇంకో పక్కనున్న వ్యక్తి దేశంలో, రాష్ట్రంలో ఇలా చేసి ఉంటే వీళ్ల పార్టీ గెలిచేది అని అన్నాడు. అదోక షాక్. ఇంకొంతమంది సినిమాల గురించి చెప్పారు. ఈ సీన్ అలా కాకుండా ఇలా తీసి ఉంటే బాగుండేది అన్నారు.' అని అన్నారు.
అనంతరం మాట్లాడుతూ..'నాకు అర్థం కానీ విషయం ఏంటంటే అంత నాలెడ్జ్ ఉన్నోడు ఇక్కడ టీ షాపు దగ్గర మాట్లాడాల్సిన అవసరమేంటి? అక్కడికెళ్లి కోహ్లీతో ఆడొచ్చు కదా? పాలిటిక్స్‌లో చేరి అధికారంలోకి రావొచ్చు కదా? సినిమాల్లో చేరి డైరెక్షన్ చేయొచ్చు కదా? బేసిక్‌గా ఏంటంటే మనం మనపని తప్పా అందరి పనులు చేసేస్తాం. అందరికంటే ఎక్కువ మనకే తెలుసనుకుంటాం. ఈరోజు కోహ్లీ ఎందుకు క్రికెట్ గ్రౌండ్‌లో ఉన్నాడు.. మనం టీ షాపు దగ్గర ఎందుకు ఉన్నామనేది రియలైజ్ చేసుకోవాలి. మనం మనపనిని ఫర్‌ఫెక్ట్‌గా చేసుకుంటే చాలు. ఎవరితో అవసరం లేదు. మన పని పక్కనపెట్టి.. అతను అలా ఆడితే బాగుండేది.. వాళ్లు ఇలా చేస్తే బాగుండేది.. అంటే మనల్ని నాశనం చేసుకున్నట్టే. అవతలి వాళ్లు అడిగితే చెప్పండి.. అంతేకానీ అడగకున్నా కూడా మనం మాట్లాడుతున్నామంటే టైం వేస్ట్ చేస్తున్నట్టు' అని అన్నారు.
(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!)
అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో అదిరే అభి మాటలకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో అలాంటి వాళ్లతో మీకెందుకు అన్నా అని పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది మేధావులకు టైం కలిసిరాక అలా రోడ్లమీద తిరుగుతూ ఉంటారు అన్నా అంటూ నెటిజన్స్ రిప్లై ఇస్తున్నారు. ఏది ఏమైనా అదిరే అభి చెప్పిన మాటలు మనం కూడా ఎక్కడో ఒకచోట అలా మాట్లాడి ఉంటాం అని అనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment