‘ది డెవిల్స్ చైర్’ మూవీ రివ్యూ | The Devils Chair Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

The Devil's Chair Review: ‘ది డెవిల్స్ చైర్’ మూవీ రివ్యూ

Published Fri, Feb 21 2025 4:03 PM | Last Updated on Fri, Feb 21 2025 4:22 PM

The Devils Chair Movie Review And Rating In Telugu

టైటిల్‌: ది డెవిల్స్ చైర్
నటీనటులు: అభినయ కృష్ణ(జబర్దస్త్ అభి), ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్,వెంకట్ దుగ్గి రెడ్డి  తదితరులు
నిర్మాణ సంస్థ: బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్ 
నిర్మాతలు: KK చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి .
దర్శకత్వం: గంగా సప్తశిఖర
సంగీతం: బిషేక్ 
సినిమాటోగ్రఫీ:గంగా సప్తశిఖర
విడుదల తేది: ఫిబ్రవరి 21, 2025

కథేంటంటే..
ఓ ప్రైవేట్‌ కంపెనీలో పని చేసే విక్రమ్‌(అదిరే అభి) బెట్టింగ్‌కు బానిసగా మారుతాడు. కంపెనీకి చెందిన కోటి రూపాయాలను కొట్టేసి బెట్టింగ్‌లో పెడతాడు. ఈ విషయం తెలిసి యాజమాన్యం అతన్ని ఉదోగ్యంలో నుంచి తీసేవేయడంతో పాటు కేసు కూడా పెడుతుంది. లీగల్‌ కేసు ఎదుర్కొంటున్న విక్రమ్‌ని ప్రియురాలు  రుధిర(స్వాతి మందల్) చేరదీస్తుంది. తన ఇంట్లోనే ఉంచుకుంటూ ఆర్థికంగా ఆదుకుంటుంది. ఓ సారి రుధిర ఇష్టపడి ఓ యాంటిక్‌ చైర్‌ని కొని తెచ్చుకుంటుంది. ఆ చైర్‌లో ఓ డెవిల్‌ శక్తి ఉంటుంది. అది విక్రమ్‌కి మాత్రమే కనిపిస్తూ.. కండిషన్స్‌పై అతనికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటుంది. రూ. కోటి కట్టాలని యాజమాన్యం ఒత్తిడి తేవడంతో ఆ డబ్బు కోసం మళ్లీ డెవిల్‌ని శక్తినే సంప్రదిస్తాడు. ప్రియురాలు రుధిరను చంపేస్తే రూ.5 కోట్లు ఇస్తానని ఆ డెవిల్‌ చైర్‌ ఆఫర్‌ ఇస్తుంది. మరి పీకల్లోతు అప్పుల్లో ఉన్న విక్రమ్‌ డబ్బు కోసం ప్రియురాలిని చంపేశాడా? అసలు ఆ చైర్‌లో ఉన్నది ఎవరు? విక్రమ్‌ని వశం చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తుంది? అసలు ఆ చైర్‌ వెనుక ఉన్న రహస్య స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
హారర్‌ చిత్రాలు టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. ఇప్పటికే ఈ జానర్‌లో చాలా చిత్రాలు వచ్చాయి.. వస్తునే ఉన్నాయి. ది డెవిల్స్ చైర్ కూడా ఆ జానర్‌ చిత్రమే. అయితే కంటెంట్‌తో పాటు మేకింగ్‌ని కూడా డిఫరెంట్‌గా ప్లాన్‌ చేసుకున్నాడు దర్శకుడు గంగా సప్తశిఖర. కేవలం భయపెట్టేందుకు మాత్రమే సీన్లను రాసుకోకుండా..బలమైన కథ చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రం ఓ వైపు భయపెడుతూనే..దురాశ దు:ఖానికి చేటు అనే సందేశాన్ని ఇస్తుంది. ప్రేక్షకులకు హారర్ తో పాటు థ్రిల్ ను ఇవ్వడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. 

ఈజీ మనీకి అలవాటు పడిన వారు ఎలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారనేది ఇందులో చూపించారు. కథ ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. అయితే హీరోపై లీగల్‌ కేసు నమోదైన తర్వాత కథనం కాస్త నెమ్మదిగా సాగుతుది. ఇంటర్వెల్‌ సీన్‌ బాగా ప్లాన్‌ చేశాడు. సెకండాఫ్‌ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రీక్లైమాక్స్‌ నుంచి వచ్చే ప్రతీ సీన్‌ భయానికి గురి చేస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. అయితే డెవిల్‌ చైర్‌ నేపథ్యం ఏంటి? అసలు ఆ చైర్‌లోకి వచ్చి దృష్టశక్తి ఏంటనేది పార్ట్‌ 2లో చూడాల్సిందే. పార్ట్‌ 2 కోసం ఇచ్చిన ఎలివేషన్స్‌ బాగున్నాయి. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నచ్చే ప్రేక్షకులకు ‘ది డెవిల్స్ చైర్’ సినిమా నచ్చుతుంది.

ఎవరెలా చేశారంటే.. 
ఈజీ మనీకోసం అలవాటు పడిన యువకుడు విక్రమ్‌ పాత్రలో అదిరే అభి చక్కగా నటించాడు. రెండు మూడు వేరియషన్స్ లో అభి అభినయం అందిరినీ ఆకట్టుకుంటుంది. తనకు జోడీగా నటించిన స్వాతి మందల్ ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే సీన్ తన తన పర్ ఫార్మెన్స్ కు అద్దం పడుతుంది. అలాగే ఛత్రపతి శేఖర్ ప్రొ ఫెసర్ పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు మనోజవ పాత్రలో వెంకట్ దుగ్గిరెడ్డి, పుండాక్ష పాత్రలో చంద్ర సుబ్బగారి, నూర్జహాన్ గా మూగమ్మాయిగా అద్విత చౌదరి నటించి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.  బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. పాటలు పర్వాలేదు. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement