Sabdham X Review: ‘శబ్దం’ మూవీ ట్విటర్‌ రివ్యూ | Sabdham Movie X Review: Aadhi Pinisetty Sabdham Movie Twitter Review, Premiere Talk | Sakshi
Sakshi News home page

Sabdham X Review: ఆది పినిశెట్టి ‘శబ్దం’ మూవీ టాక్‌ ఎలా ఉందంటే..?

Published Thu, Feb 27 2025 5:42 PM | Last Updated on Thu, Feb 27 2025 6:12 PM

Sabdham Movie X Review: Aadhi Pinisetty Sabdham Movie Twitter Review, Premiere Talk

'వైశాలి’తో సూపర్‌ హిట్‌ అందుకున్న హీరో ఆది పినిశెట్టి(Aadhi Pinisetty), దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’(Sabdham Movie) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 7G ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తో సినిమాపై క్యురియాసిటీ పెంచాయి. రేపు (ఫిబ్రవరి 28) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ కానుంది. 

ఇప్పటికే కోలీవుడ్‌లో పలు చోట్ల ఈ సినిమా ప్రీమియర్లు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. మరి ఈ చిత్రానికి కోలీవుడ్‌లో ఎలాంటి టాక్‌ వచ్చింది? నెటిజన్ల ఓపీనియన్‌ ఏంటి? ఓ లుక్కేద్దాం. ఈ సినిమా ప్రీమియర్‌ షోకి పాజిటివ్‌ స్పందనే లభించింది. సోషల్‌ మీడియాలో చాలా మంది పాజిటివ్‌గానే పోస్టులు పెడుతున్నారు.  మరి అసలు టాక్‌ ఏంటనేది రేపే తెలుస్తుంది.  

 శబ్దం సస్పెన్స్‌ హారర్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌. టెక్నికల్‌ టీమ్‌ పనితీరు చాలా బాగుంది. అరివళగన్‌ డైరెక్షన్‌, ఆది పినిశెట్టి యాక్టింగ్‌, తమన్‌ బీజీఎం అదిరిపోయిందంటూ ఓ నెటిజన్‌ 3.75 రేటింగ్‌ ఇచ్చాడు.

 శబ్దం ఓ మంచి ఇన్వెస్టిగేటివ్‌ హారర్‌ ఫిల్మ్‌. హారర్‌ కాన్సెప్ట్‌కి వినూత్నమైన సౌండ్‌ని మిళితం చేసి చక్కగా తీర్చిదిద్దారు. అరివళగన్ డైరెక్షన్ టెన్షన్‌ని పెంచేలా ఉంది. నిజంగా జరుగుతున్నట్లుగానే సినిమాను తెరకెక్కించారంటూ ఓ నెటిజన్‌ 3.5 రేటింగ్‌ ఇచ్చాడు.

 శబ్దం అద్భుతమైన హారర్‌ థ్రిల్లర్‌. థ్రిల్స్‌తో పాటు ఎమోషనల్‌ సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉన్నాయంటూ అంటూ ఓ నెటిజన్‌ 3.5 రేటింగ్‌ ఇచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement