Sabdham X Review: ‘శబ్దం’ మూవీ ట్విటర్ రివ్యూ
'వైశాలి’తో సూపర్ హిట్ అందుకున్న హీరో ఆది పినిశెట్టి(Aadhi Pinisetty), దర్శకుడు అరివళగన్‌లు రెండోసారి మరో ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ ‘శబ్దం’(Sabdham Movie) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 7G ఫిల్మ్స్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తో సినిమాపై క్యురియాసిటీ పెంచాయి. రేపు (ఫిబ్రవరి 28) ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే కోలీవుడ్‌లో పలు చోట్ల ఈ సినిమా ప్రీమియర్లు పడ్డాయి. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. మరి ఈ చిత్రానికి కోలీవుడ్‌లో ఎలాంటి టాక్ వచ్చింది? నెటిజన్ల ఓపీనియన్ ఏంటి? ఓ లుక్కేద్దాం. ఈ సినిమా ప్రీమియర్ షోకి పాజిటివ్ స్పందనే లభించింది. సోషల్ మీడియాలో చాలా మంది పాజిటివ్‌గానే పోస్టులు పెడుతున్నారు. మరి అసలు టాక్ ఏంటనేది రేపే తెలుస్తుంది. #Sabdham (3.75/5) Suspense Horror Investigation Thriller with High quality technical stuff 👌𝐇𝐢𝐠𝐡𝐥𝐢𝐠𝐡𝐭𝐬 :Direction @dirarivazhagan Writting & Direction 👏Adhi Performance 💯 Thaman BGM 👌Technical Department 🔥1st Half 💥 𝐕𝐞𝐫𝐝𝐢𝐜𝐭 : 𝐇𝐢𝐠𝐡𝐥𝐲…— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) February 27, 2025 శబ్దం సస్పెన్స్ హారర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. టెక్నికల్ టీమ్ పనితీరు చాలా బాగుంది. అరివళగన్ డైరెక్షన్, ఆది పినిశెట్టి యాక్టింగ్, తమన్ బీజీఎం అదిరిపోయిందంటూ ఓ నెటిజన్ 3.75 రేటింగ్ ఇచ్చాడు.#Sabdham Review - A Brilliant Sound Horror Thriller Rating: 3.5/5 (Try not to miss)Sabdham is a good investigative horror film that brilliantly blends the suspense with an innovative sound based horror Concept.#Arivazhagan direction keeps the tension high, making the movie… pic.twitter.com/I8gFyBEoM7— Tamizh Stories (@TamizhStoriesz) February 27, 2025 శబ్దం ఓ మంచి ఇన్వెస్టిగేటివ్ హారర్ ఫిల్మ్. హారర్ కాన్సెప్ట్‌కి వినూత్నమైన సౌండ్‌ని మిళితం చేసి చక్కగా తీర్చిదిద్దారు. అరివళగన్ డైరెక్షన్ టెన్షన్‌ని పెంచేలా ఉంది. నిజంగా జరుగుతున్నట్లుగానే సినిమాను తెరకెక్కించారంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు.#Sabdham [3.5/5] : An Excellent horror thriller that uses sound to detect Paranormal activities..It offers plenty of thrills and emotions..Scenes arexinterestingly and intelligently written..@AadhiOfficial excels as the Paranormal Investigator.. 👏@MusicThaman 's Music is…— Ramesh Bala (@rameshlaus) February 26, 2025 శబ్దం అద్భుతమైన హారర్ థ్రిల్లర్. థ్రిల్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉన్నాయంటూ అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్ ఇచ్చాడు.#Sabdham - 3.5/5👌-Offers One Of The Best Theatrical Experiences in Recent Times! -A Uniquely Crafted Horror Film Where @MusicThaman's BG Score Plays A Vital Role. -Extraordinary Writing From @dirarivazhagan.-A Solid Comeback Movie For @AadhiOfficial Visually Looks Stunned pic.twitter.com/2ixhX7K5W8— Hemanathan Nagarajan (@HemanathanNaga1) February 26, 2025