త్రిగుణ్‌ ‘జిగేల్‌’ మూవీ రివ్యూ | Trigun's Jigel Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

త్రిగుణ్‌ ‘జిగేల్‌’ మూవీ రివ్యూ

Published Fri, Mar 7 2025 8:36 AM | Last Updated on Fri, Mar 7 2025 9:00 AM

Trigun's Jigel Movie Review And Rating In Telugu

త్రిగుణ్‌(Trigun) హీరోగా మల్లి ఏలూరి రూపొందించిన చిత్రం ‘జిగేల్‌’(Jigel). వై.జగన్‌ మోహన్, నాగార్జున అల్లం నిర్మించారు. మేఘా చౌదరి హీరోయిన్‌. రఘుబాబు, మధునందన్, పృథ్వీరాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నేడు(మార్చి 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
నందు(త్రిగుణ్‌) ఓ లాకర్ల దొంగ. బాగా డబ్బు దోచుకొని జీవితంలో సెటిల్‌ అవ్వాలనుకుంటాడు. అతనికి కలలో మీనా(మేఘా చౌదరి) అనే అమ్మాయి వస్తుంది. ఆమెతో సహజీవనం కలిసి కాపురం చేస్తున్నట్లు కలలు కంటాడు. ఓ సారి నిజంగానే మీనా తారాసపడుతుంది. ఆమె కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తున్నట్లు నందుకు తెలుస్తుంది. దీంతో ఇద్దరు కలిసి దొంగతనాలు చేయడం ప్రారంభిస్తారు. ఓసారా రాజా చంద్ర వర్మ ప్యాలెస్‌లో ఉండే ఓ పురాతన లాకర్‌ తెరచుకోవడం లేదని..అందులో పెద్ద మొత్తంలో నగలు ఉన్నట్లు మీనాకి తెలుస్తుంది. దీంతో ఆమె జేపీ(సాయాజీ షిండే)దగ్గర పీఏగా చేరి..నందుతో ఆ లాకర్‌ని ఓపెన్‌ చేయించాలని ప్లాన్‌ వస్తుంది. మరి ఆమె ప్లాన్‌ వర్కౌట్‌ అయిందా? అలసు ఆ లాకర్‌ ఎవరిది? అందులో ఏం ఉంది? రాజా చంద్ర వర్మ ప్యాలెస్‌ ప్లాష్‌బ్యాక్‌ ఏంటి? మీనాకి ఆ ప్యాలెస్‌తో ఉన్న సంబంధం ఏంటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.. 
ఇదొక కామెడీ సస్పెన్స్‌ రొమాంటిక్‌ థ్రిల్లర్‌.గ్రిప్పింగ్ స్టోరీ, స్క్రీన్ ప్లేతో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు దర్శకుడు మల్లి యేలూరి ప్రయత్నించాడు. యూత్ ను ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలతో పాటు... కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కామెడీ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ఎంగేజ్ అయ్యేలా చేశారు. ఫస్ట్ హాఫ్ లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ కామెడీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే పోసాని వేసిన ఆండ్రాయిడ్ బాబా వేషం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటాయి. పోసానికి రాసిన సంభాషణలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే లాయర్ మన్మథరావు పాత్రలో పృథ్వీ రాజ్ చేత చేయించిన కామెడీ  కొంతవరకు వర్కౌట్‌ అయింది. అయితే హీరోహీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు యూత్‌ని ఆకట్టుకున్నా.. ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం ఇబ్బందికరంగా అనిపిస్తాయి. సెకెండాఫ్ లో అసలు కథ మొదలై... చివరి వరకూ సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో లాకర్ చుట్టూ రాసుకున్న స్టోరీ, స్క్రీన్‌ ప్లే ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ఎవరెలా చేశారంటే..
త్రిగుణ్ ఎప్పటిలాగే తన ఎనర్జిటిక్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. లాకర్ టెక్నీషియన్ గా బాగా సూట్ అయ్యాడు. అందులో లాకర్ ను ఓపెన్ చేసే టెక్నిక్స్ ను కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీశారు. ఆ పాత్రలో త్రిగుణ్ బాగా ఒదిగిపోయి నటించారు. అతనికి జంటగా నటించిన మేఘా చౌదరి కూడా రొమాంటిక్, యాక్షన్ సన్నివేశాల్లో బాగా నటించింది. కథ మొత్తం సెకెండాఫ్ లో ఆమె చుట్టూనే తిరుగుతుంది కాబట్టి... ఆమె పాత్ర ఇంపార్టెన్స్ బాగా ఆకట్టుకుంటుంది. పోసాని పాత్ర బాగా నవ్విస్తుంది. ఫస్ట్ హాఫ్ లోనూ, సెకెండాఫ్ లోనూ అతని పాత్ర ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. 

సాయాజీ షిండే పాత్ర నెగిటివ్ రోల్ లో పర్వాలేదు అనిపిస్తుంది. మన్మథరావు పాత్రలో పృథ్వీ రాజ్ ఎప్పటిలాగే బాగా నటించారు. అతనితో పాటు నటించిన జయవాణి పాత్ర కూడా బాగుంది. హీరోయిన్ తల్లి పాత్రలో నళిని నటించి ఆకట్టుకుంది. రఘుబాబు ముక్కు అవినాష్, మధునందన్ పాత్రలు పర్వాలేదు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సాకేంతికంగా సినిమా పర్వాలేదు. సంగీత దర్శకుడు ఆనంద్ మంత్ర అందించిన బాణీలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టకుంటాయి.వాసు అందించిన సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. విజువల్స్ అన్నీ బాగున్నాయి. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు  ఎడిటింగ్‌ బాగుంది.నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement