
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్ ఆర్టిస్ట్’ మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రతన్ రిషి దర్శకత్వంలో ఎస్‌జేకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిగా.. నైజాం ఏరియాలో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేసింది. దీంతో ఈ సినిమా సోషల్‌మీడియాలో ట్రెండ్ అయిపోయింది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో మొదలై, రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా టర్న్ తీసుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే..
మన సమాజంలో జరుగుతున్న ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. హత్య చేయడాన్ని కళగా భావించే ఓ వ్యక్తి కథనే కిల్లర్ ఆర్టిస్ట్‌లో చూపించారు. విక్కీ (సంతోష్) స్వాతి (స్నేహ మాధురి) అన్నాచెల్లెలుగా సంతోషంగా తమ ఇంట్లో ఉన్న సమయంలో గుర్తుతెలియని కొందరు వారిపై దాడి చేస్తారు. ఈ క్రమంలో స్వాతిని హింసించి చంపేస్తారు. ఈ ఘటన విక్కీ జీవితాన్ని మార్చేస్తుంది. తన కళ్ల ముందే చెల్లెలు మరణించడం తట్టుకోలేడు. ఆమె గుర్తులు తనను వెంటాడుతూనే ఉంటాయి. దీంతో బాగా కుంగిపోతాడు. ఈ క్రమంలో విక్కీ ప్రియురాలు జాను (క్రిషేక్ పటేల్) తెరపైకి వస్తుంది. అతన్నీ మళ్లీ మామూలు వ్యక్తిగా మార్చేందుకు ప్రయత్నం చేస్తుంది.
అలాంటి సమయంలో ఒక హీరోయిన్ మాస్క్ ధరించిన 'పిచ్చి రవి' అనే సైకో నగరంలోని అమ్మాయిలను టార్గెట్ చేస్తూ చంపేస్తుంటాడు. ఈ కేసును పోలీసులు ఛేదించి అతన్ని అరెస్ట్ చేస్తారు. టీవీలో వార్తలు చూసిన విక్కీకి ఆ సైకో ధరించిన మాస్క్ తన ఇంట్లో కూడా కనిపిస్తుంది. దీంతో తన చెల్లిని చంపింది ఈ సైకోనే ఉంటాడని అతను అనుకుంటాడు. ఇంతలో పోలీసుల నుంచి ఆ సైకో తప్పించుకొని పారిపోతాడు. అలా విక్కీ ప్రియిరాలు జాను పుట్టినరోజు వేడుకలో అతను ప్రత్యక్షమవుతాడు. కొన్ని సంఘటనల ద్వారా తన చెల్లిని చంపింది ఈ సైకో కాదని విక్కీ నిర్ణయించుకుంటాడు. అయితే, ఇంతకు స్వాతిని చంపింది ఎవరు..? సిటీలోని మర్డర్స్ చేస్తున్నది ఒకరా? లేక ఇద్దరా? ఆ సైకో జాను పార్టీకి ఎందుకు వచ్చాడు..? ఫైనల్‌గా తన చెల్లిని హత్య చేసిన వారిని విక్కీ ఎలా పట్టుకుంటాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో మొదలైన ఈ సినిమా.. ఒక హత్యతో థ్రిల్లర్ సినిమాగా మారుతుంది. కుటుంబ సభ్యులను ఎవరైన హత్య చేస్తే అందుకు ప్రతికారం తీర్చుకున్న హీరో కథలు చాలానే తెరపైకి వచ్చాయి. ఈ కిల్లర్ ఆర్టిస్ట్ చిత్రంలో కూడా తన చెల్లెల్ని చంపిన వారిపై రివేంజ్ తీర్చుకున్న యువకుడి కథ అని చెప్పవచ్చు. అయితే, ఇందులో ఎవరూ ఊహించని విధంగా మర్డర్ మిస్టరీని ప్రేక్షకులకు దర్శకుడు చూపాడు. కానీ, హత్యలకు ప్రధాన కారణం ఏంటి అనేది సరైన క్రమంలో దర్శకుడు చెప్పలేకపోయాడు. రొటీన్ పాయింట్‌తోనే ప్రేక్షకులను కన్వెన్స్ చేసేలా ఉంది. మొదటి గంట వరకు విక్కీ, జాను ప్రేమ కథతో పాటు స్వాతి హత్య చుట్టే ఉంటుంది. ఇంటర్వెల్‌కు ముందు సైకో నిజమైన హంతకుడు కాదని దర్శకుడు రివీల్ చేస్తాడు.
అయితే, ఈ పాయింట్‌ను చక్కగా చూపాడు. సిస్టర్ సెంటిమెంట్‌ను ప్రధానంగా చూపాలని దర్శకుడు అనుకున్నప్పటికీ దాన్ని సరైన డ్రామాగా చిత్రీకరించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. సైకో పాత్రలో కాలకేయ ప్రభాకర్ నటన బాగున్నప్పటికీ అతని పాత్రను ఎక్కువసేపు తెరపై చూపించడం వల్ల ప్రేక్షకులకు విసుగొస్తుంది. క్లైమాక్స్‌లో విలన్ ఇతనే అని సర్ ప్రైజ్ చేసి చివర్లో ఓ మెసేజ్‌తో ముగించేస్తారు. ఇందులో అన్నాచెల్లెలు సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. కథ పాతదే అయినప్పటికీ స్క్రీన్ ప్లేలో కొత్తదనం కనిపిస్తుంది. మర్డర్ చేయడం ఒక ఆర్ట్, నేను ఆర్టిస్ట్ అంటూ ప్రభాకర్‌తో చెప్పించిన సైకో డైలాగ్స్ కొత్తగా ఉంటాయి.
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు ప్రధనా బలం హీరో సంతోష్, కాలకేయ ప్రభాకర్... చెల్లి చనిపోతే ఒక అన్న ఎలా బాధపడుతాడో విక్సీ పాత్రలో సంతోష్ అదరగొట్టాడు. మరోవైపు క్రిషేక పటేల్ అందాలు ఆరబోస్తూనే పర్వాలేదనిపించింది. చెల్లి పాత్రలో నటించిన స్నేహ మాధురి కనిపించింది కొద్దిసేపు మాత్రమే.. అయినప్పటికీ ఆమె బాగానే నటించింది. సత్యం రాజేష్ పోలీస్ పాత్రలో మెప్పిస్తాడు. తనికెళ్ళ భరణి, బిగ్ బాస్ సోనియా అక్కడక్కడా కనిపించినా తమ పాత్రలకు న్యాయం చేస్తారు. సినిమాకు తగిన విధంగానే సాంకేతిక విలువలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment