టైటిల్: సంఘర్షణ
నటీనటులు: శివ రామచంద్రపు,చైతన్య పసుపులేటి, రషీద భాను, ఎక్స్‌ప్రెస్ హరి, స్వాతిశ్రీ చెల్లబోయిన, సుధాకర్ తదితరులు
నిర్మాత: వల్లూరి శ్రీనివాస్ రావ్
దర్శకత్వం: చిన్నా వెంకటేష్
సినిమాటోగ్రఫీ: కేవీ ప్రసాద్, సుధాకర్ బార్ట్లే
ఎడిటర్: బొంతల నాగేశ్వర రెడ్డి
సంగీతం: ఆదిత్య శ్రీరామ్
శివ రామచంద్రపు,చైతన్య పసుపులేటి, రషీద భాను ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం సంఘర్షణ. మహీంద్ర పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై వల్లూరి శ్రీనివాస్ రావ్ నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 9న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్న చైతన్య (చైతన్య పసుపులేటి), సంయుక్త (రసీదా భాను) లైఫ్‌లో అనుకోకుండా ఓ సంఘటన జరుగుతుంది. అసలు వాళ్ల జీవితంలో ఎలాంటి సంఘటన జరిగింది? దాన్ని ఎలా ఫేస్ చేశారు. ఈక్రమంలో సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఈ హత్యలకు, చైతన్యకు ఉన్న సంబంధం ఏంటన్నదే అసలు కథ.
ఎలా ఉందంటే..
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న క్రైం కాన్సెప్ట్‌తో ఈ కథను రాసుకున్నట్లు అర్థమవుతోంది. ఫస్ట్ హాఫ్‌లో చైతన్య (చైతన్య పసుపులేటి), సంయుక్త (రసీదా భాను) చుట్టే కథ తిరుగుతుంది. ఆ తర్వాత జరిగే హత్యలు, ఇన్వెస్టిగేషన్ . దర్శకుడు చిన్న వెంకటేష్ మర్డర్ మిస్టరీని తెరపై చూపించడంలో సక్సెస్ కాలేకపోయాడు.
సెకండాఫ్‌లో కథలో కాస్తా వేగం పెరుగుతుంది. హత్యలు, ఇన్‌స్టిగేషన్ సీన్స్ ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోవు. అంతా రోటీన్‌గా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ కథను ఆసక్తిగా చూపించడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. అక్కడక్కడా కొన్ని సీన్స్ బోర్‌గా అనిపిస్తాయి. కథలో ఎక్స్‌ప్రెస్ హరి కామెడీ టైమింగ్ బాగుంది. ఇందులో కథ, కథనం ఆడియన్స్‌ను అంతగా మెప్పించకపోయినా.. క్లైమాక్స్ ఫర్వాలేదనిపించింది. డైరెక్టర్ చిన్న వెంకటేష్ ఎంచుకున్న పాయింట్ ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
చైతన్య, రసీదా బాను తమ పాత్రల పరిధిలో బాగా నటించారు. శివ రామచంద్రవరుపు, కరణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే కేవీప్రసాద్, సుధాకర్ బాట్లే సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ బొంతల నాగేశ్వర రెడ్డి కత్తెరకు మరింత పని చెప్పాల్సిది. ఆదిత్య శ్రీరామ్ నేపధ్య సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment