
అదిరే అభి, స్వాతి మందల్ జంటగా గంగ సప్తశిఖర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది డెవిల్స్ చైర్’(the devil's chair). కేకే చైతన్య, వెంకట్ దుగ్గిరెడ్డి, చంద్రసుబ్బా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా పాయింట్ చెప్పినప్పుడు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. అభి అద్భుతంగా నటిస్తాడు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
అదిరే అభి మాట్లాడుతూ.. ‘నేను ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్లు అవుతోంది. ఈ 23 ఏళ్లు ఉన్నందుకు సంతోషపడాలా? ఇంకా స్ట్రగుల్స్ పడుతున్నాని బాధపడాలా? అన్నది అర్థం కావడం లేదు. నేను ఈ 23 ఏళ్లు కష్టపడుతూనే ఉన్నాను. ఇంకో 23 ఏళ్లు అయినా కష్టపడతాను.. సక్సెస్ అయిన తరువాత బయటకు వెళ్తాను. ఒకరో ఇద్దరికో అయినా ఇన్ స్పైరింగ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను.
నాకు సినిమాల మీదున్న ప్యాషన్‌తోనే అన్నీ వదిలేసుకుని ఇండస్ట్రీలోకి వచ్చాను. ప్రతీ శుక్రవారం ఓ ఆర్టిస్ట్ తలరాత మారిపోతుంది. ఈ శుక్రవారం మేం రాబోతోంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ది డెవిల్స్ చైర్ అనే టైటిల్ అన్ని భాషలకు యాప్ట్‌గా ఉంటుంది. మనిషికి ఉండే దురాశ మీదే ఈ చిత్రాన్ని తీశాం. మంచి కాన్సెప్ట్‌తో పాటు మంచి సందేశం ఇచ్చేలా ఉంటుంది. ఈ చిత్రం అందరినీ భయపెట్టేలా ఉంటుంది. నవీన్ గారు నిర్మాతగా మరో సినిమాను చేస్తున్నాను. నాకు అవకాశం ఇస్తున్న ప్రతీ ఒక్క నిర్మాతకు థాంక్స్’ అని అన్నారు.
దర్శకుడు గంగ సప్త శిఖర మాట్లాడుతూ.. ‘‘ది డెవిల్స్ చైర్’ ఫిబ్రవరి 21న రాబోతోంది. చూసిన ప్రతీ ఒక్కరినీ హంట్ చేస్తుంది. డెవిల్ మీ ఇంటికి వస్తుంది. మంచి కంటెంట్‌తో ఈ చిత్రం రాబోతోంది. కావాల్సినంత డ్రామా, వినోదం ఉంటుంది. ఈ చిత్రం కోసం అభి చాలా కష్టపడ్డాడు. అతని సపోర్ట్‌ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. నిర్మాతల సహకారం వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. నాకు ఈ ప్రాజెక్ట్ చేసిన గడ్డం నవీన్ అన్నకి థాంక్స్’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment