ఆన్‌లైన్‌కే అంకితం
నేటితరం ఎక్కువగా ఆన్‌లైన్‌కే అంకితం అవుతున్న సంగతి తెలిసిందే. ఆన్‌లైన్లో చాటింగ్ ద్వారా పాత స్నేహితులతో మాట్లాడుకోవడంతో పాటు కొత్తవాళ్లతో స్నేహం చేయడం, తమకు తెలిసిన సమాచారాలను ఇతరులతో పంచుకోవడం.. ఇలా గడిపేస్తూ కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీన్నే ప్రధానాంశంగా చేసుకుని టీఎస్ కమల్ దర్శకత్వంలో లావణ్యా చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘చాటింగ్’. అభినయకృష్ణ, సునీత జంటగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వాస్తవ సంఘటనల సమాహారంతో ఈ చిత్రం ఉంటుందని నిర్మాత తెలిపారు.