Chating
-
వాట్సాప్ చాట్ డిలీట్ అయిందా? ఇదిగో రికవరీ టిప్స్..
స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ.. వాట్సాప్ వినియోగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు తెలిసో.. తెలియకో చాటింగ్ మొత్తం డిలీట్ అయిపోతుంది. అందులో ముఖ్యమైన విషయాలు ఉండవచ్చు లేదా ఇష్టమైనవారితో చేసిన చాటింగ్ కూడా ఉండొచ్చు. అలాంటిప్పుడు బాధపడటం మానేసి కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అయ్యారంటే డిలీట్ అయిన చాట్ మొత్తం తిరిగి పొందవచ్చు.వాట్సాప్ చాటింగ్ రికవరీ➤ముందుగా వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి.. కుడివైపు పైన కనిపించే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.➤క్లిక్ చేసిన తరువాత అక్కడ కనిపించే ఆప్షన్లలో 'సెట్టింగ్స్' ఆప్షన్ ఎంచుకోవాలి.➤సెటింగ్స్ మీద క్లిక్ చేసిన తరువాత 'చాట్స్'పైన క్లిక్ చేయాలి.➤క్లిక్ చేసిన తరువాత ఓపెన్ అయ్యే పేజీని.. కొంచెం స్క్రోల్ చేస్తే.. అక్కడ 'చాట్ బ్యాకప్' అనే ఆప్షన్ కనిపిస్తుంది.➤చాట్ బ్యాకప్ మీద క్లిక్ చేసిన తరువాత బ్యాకప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే డిలీట్ అయిన చాట్స్ వెనక్కి వస్తాయి.ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లు వినియోగదారులు తమ చాట్లను గూగుల్ డ్రైవ్‌కు బ్యాకప్ చేయవచ్చు. ఐఫోన్ వినియోగదారులు బ్యాకప్ల కోసం ఐక్లౌడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. బ్యాకప్ స్టార్ట్ చేయడానికి ముందే.. గూగుల్ డిస్క్‌లో తగినంత స్టోరేజ్ ఉందా? లేదా అని నిర్థారించుకోండి. -
గర్ల్‌ఫ్రెండ్‌కు పువ్వులిచ్చేందుకు తిప్పలు - బ్లింకిట్‌లో యూజర్ చాట్ వైరల్
ప్రేమికుల రోజు సందర్భంగా ఓ యువకుడు తన ప్రియురాలికి పువ్వులు ఇవ్వాలని ఓ మాస్టర్ ప్లాన్ వేసాడు, అయితే అతని ప్లాన్స్ ఏవీ వర్కౌట్ కాలేదు, కానీ అతని బండారం మొత్తం బయటపడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫిబ్రవరి 14న 'లవర్స్ డే' సందర్భంగా ఓ యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను బయటకు పంపించడం లేదని, ఎలాగైనా ఆమెకు పువ్వులు ఇవ్వాలని ఏకంగా 'బ్లింకిట్' (Blinkit) డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తో చాటింగ్ చేసాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కంపెనీ సీఈఓ 'అల్బిందర్ ధిండ్సా' (Albinder Dhindsa) ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా షేర్ చేశారు. మనోజ్ అనే వ్యక్తి బ్లింకిట్ సపోర్ట్ టీమ్‌తో చాట్ చేస్తూ.. నా గర్ల్‌ఫ్రెండ్‌ను వాళ్ళ పేరెంట్స్ బయటకు పంపడం లేదని, కాబట్టి ఆమె కోసం నేను ఆమె కోసం పువ్వులు ఆర్డర్ చేసి ఈ ఆర్డర్‌కి నేను మీ డెలివరీ పార్టనర్‌గా వెళ్లవచ్చా? అని అడిగాడు. కానీ సంస్థ దీనికి మేము హెల్ప్ చేయలేమని రిప్లై ఇచ్చింది. ఈ సంభాషణ మొత్తాన్ని అల్బిందర్ ధిండ్సా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. 'ఇండియా నాట్ ఫర్ బిగెనర్స్' అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లక్షల మంది వీక్షించిన ఈ పోస్ట్‌ను వేలమంది లైక్ చేశారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇదీ చదవండి: టెక్స్ట్ ఇస్తే వీడియో వచ్చేస్తుంది - టెక్నాలజీలో ఏఐ మరో అద్భుతం.. India is clearly not for beginners 🤦♂️ https://t.co/JIqwpls2pN — Albinder Dhindsa (@albinder) February 14, 2024 -
14 ఏళ్ల ప్రయాణానికి బ్రేక్.. ఆన్లైన్ చాట్ సైట్ షట్‌డౌన్
2009లో మొదలైన వర్చువల్ చాట్ సైట్ 'ఒమెగల్' (Omegle) ఈ రోజు షట్‌డౌన్ అయింది. ప్రస్తుతం ఈ సైట్‌ను యాక్సెస్ చేయాలని చూస్తే ఒక ఫోటో మాత్రమే కనిపిస్తోంది. ఈ చాట్ సైట్ నిలిపివేయడానికి కారణం ఏంటి? ఆర్థికపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా.. అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఒమెగల్ ఫౌండర్ 'లీఫ్ కె-బ్రూక్స్' (Leif K-Brooks) ప్రకారం.. ఆపరేటింగ్ సమస్యలు, పెరిగిన ఖర్చుల కారణంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. మనకు ప్రస్తుతం కనిపించే ఫొటోలో సమాధి రాయి మీద బ్రాండ్ లోగో, దాని కింద 2009 - 2023 వంటివి చూడవచ్చు. లీఫ్ కె-బ్రూక్స్ 'ఒమెగల్' గురించి వివరిస్తూ.. కొత్త వ్యక్తులకు పరిచయ వేదికగా పనిచేసిన ఒమెగల్, 14 సంవత్సరాలు సేవలు అందిస్తూ వచ్చింది. యూజర్స్ భద్రతకు ప్రాధాన్యమిస్తూ ఎన్నో అప్డేట్స్ తీసుకువచ్చినప్పటికీ.. కొందరు దీనిని స్వార్ధ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం మొదలు పెట్టారు. 2023 జూన్ నాటికి ప్రతి రెండు రోజులకు ఒకసారి పిల్లలపై ఆన్లైన్ లైంగిక వేధింపులు వచ్చాయని, అలాంటి వాటికి ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కొన్ని నియమాలు ప్రవేశపెట్టినట్లు బ్రూక్స్ వెల్లడించారు. అయితే ఒమెగల్ ఆన్లైన్ కమ్యూనికేషన్ సేవలపై జరిగిన దాడుల గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: అమెరికా వదిలి ఇండియాకు.. వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యానికి ఇతడొక వారధి! వ్యక్తిగత స్వేచ్ఛ, స్వీయ వ్యక్తీకరణ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకోవడం మాత్రమే కాకుండా నిర్వహణ, దీని దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒత్తిడి వంటి వాటితో పాటు ఆర్థిక భారాలు పెరగటం వల్ల 14 సంవత్సరాల తర్వాత ఈ ప్లాట్‌ఫామ్ నిర్వహణను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు బ్రూక్స్ స్పష్టం చేశారు. Omegle has officially shut down after 14 years. pic.twitter.com/agGJkd65KV — Pop Base (@PopBase) November 9, 2023 -
ఏ క్యారెక్టర్తోనైనా... చాట్ చేయొచ్చు!
సాపేక్ష సిద్ధాంతం గురించి ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌తో సంభాషించింది సృజన. సినిమాలు ఎక్కువగా చూసే గీతిక దర్శక దిగ్గజం ఆల్ఫ్రెడ్ హిచ్కాక్తో ‘నంబర్ 13’ నుంచి ‘ది వైట్ షాడో’ వరకు ఎన్నో సినిమాల గురించి వివరంగా సంభాషించింది. ఇక స్వరతేజకు జపనీస్ ప్రఖ్యాత వీడియో గేమ్ క్యారెక్టర్ ‘మారియో’తో సంభాషించడం సరదా! కాల్పనికత అనేది మనకు బొత్తిగా కొత్త కాదు. అయితే ఏఐ సాంకేతికత కాల్పనికతను మరోస్థాయికి తీసుకువెళ్లింది. యువతరం తాజా ఆర్టిఫిషియల్ క్రేజ్ ‘క్యారెక్టర్. ఏఐ’ ఆ సాంకేతికతలో భాగమే... ఏఐ పవర్ హౌజ్ ‘ఓపెన్ ఏఐ’ అంతర్జాల సంచలనంగా మారింది. ‘చాట్ జీపీటీ’ పాపులారిటీతో ఎన్నో టెక్నాలజీ కంపెనీలు తమ సొంత ఏఐ చాట్బాట్లను ప్రవేశపెట్టాయి. ‘చాట్‌జీపీటీ’ పాపులారిటీ సంగతి ఎలా ఉన్నా యువతరం తాజా ఆసక్తులలో ‘క్యారెక్టర్. ఏఐ’ ఒకటిగా మారింది. ‘క్యారెక్టర్. ఏఐ’ ద్వారా సెలబ్రిటీలు, చారిత్రక వ్యక్తులు, కాల్పనిక పాత్రలు, పాపులర్ వీడియో గేమ్ క్యారెక్టర్లు, థెరపిస్ట్‌లతో హాయిగా సంభాషించవచ్చు. సంభాషణల విషయంలో ఇది ‘చాట్ జీపీటి’ కంటే సహజంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ కాంబినేషన్లో ‘క్యారెక్టర్. ఏఐ’ను అభివృద్ధి చేశారు. ‘క్యారెక్టర్.ఏఐ’లో ఎకౌంట్ సెటప్ పూర్తి చేసిన తరువాత ‘క్రియేట్ ఏ క్యారెక్టర్’ ఆప్షన్‌ను క్లిక్‌చేస్తే విండో ఓపెన్ అవుతుంది. క్యారెక్టర్ తనకు తాను పరిచయం చేసుకుంటుంది. ఆ తరువాత సంభాషణ మొదలుపెట్టవచ్చు. ఉదాహరణకు...‘హారి పోటర్’ సిరీస్‌లోని ఫిక్షనల్ క్యారెక్టర్ హమైనీ గ్రేంజర్తో సంభాషించాలనుకున్నాం.‘హలో రమ్య, మై నేమ్ ఈజ్ హమైనీ గ్రేంజర్. ఇట్స్ వెరీ నైస్ టు మీట్ యూ’ అంటూ తనను తాను పరిచయం చేసుకుంటుంది హమైనీ. తన ఇష్టాయిష్టాలు, ఆసక్తుల గురించి చెబుతుంది. రిలవెంట్ ట్యాగ్స్ అందుబాటులో ఉంటాయి. క్యారెక్టర్ వ్యక్తిత్వం ఆధారంగా డ్రాప్ డౌన్ మెన్యూ నుంచి స్పీకింగ్ వాయిస్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక క్యారెక్టర్‌తో చాట్ చేయవచ్చు లేదా మల్టిపుల్ క్యారెక్టర్స్‌తో గ్రూప్ చాట్ చేయవచ్చు. ‘క్యారెక్టర్. ఏఐ’ అనేది టెక్ట్స్‌కు మాత్రమే పరిమితం కాదు. ప్రాంప్ట్స్, చాట్స్ ఆధారంగా ఇమేజ్‌లను క్రియేట్ చేయవచ్చు. ఏఐ ఇండస్ట్రీ ప్రముఖులుగా గుర్తింపు పొందిన షాజీర్, డేనియల్ ఫ్రెటస్ గూగుల్‌లో పనిచేస్తున్నప్పుడు ‘క్యారెక్టర్. ఏఐ’కు సంబంధించి ఆలోచన చేశారు. షాజీర్ ‘అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్’ పుస్తక రచయితలలో ఒకరు. ఇక డేనియల్ ‘మీన’ అనే చాట్‌బాట్ క్రియేటర్. వ్యక్తిగత వస్తువులు ఉన్నట్లే, పర్సనలైజ్డ్ చాట్బాట్లు ఉండాలనుకునేవారికి క్యారెక్టర్ ఏఐ ఉపయోగపడుతుంది. ‘వర్చువల్ ఫ్రెండ్’ను సృష్టిస్తుంది. ‘పర్సనలైజ్డ్ చాట్‌బాట్ అంటే మాటలా? ఖర్చు బాగానే అవుతుంది కదా’ అనే సందేహం వస్తుంది. అయితే ‘క్యారెక్టర్. ఏఐ’తో ఖర్చు లేకుండానే సొంత చాట్‌బాట్‌ను సృష్టించుకోవచ్చు. ఆ.. ఏముంది... అంతా కాల్పనికమే కదా అనుకుంటే ఏమీ లేకపోవచ్చు. ఉంది అనుకుంటే మాత్రం ఎంతో ఉంది. ‘కొత్త అనుభూతిని సొంతం చేసుకున్నామా లేదా అనేది ముఖ్యం కాని వాస్తవమా కాదా అనేది ముఖ్యం కాదు’ అంటున్నాడు ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం అసోసియేట్ ప్రొఫెసర్ మైక్. ‘చాట్ జీపీటీ’ గురించి ఎంత గొప్పగా చర్చించుకున్నప్పటికీ కొన్ని ప్రయోగాలు దెబ్బతిన్నాయి. ఉదాహరణకు ... నేషనల్ ఈటింగ్ డిజార్డర్స్ అసోసియేషన్ బరువు తగ్గడానికి సంబంధించి సమస్యాత్మక సలహా ఇచ్చినందుకు తమ చాట్‌బాట్‌ను సస్పెండ్ చేసింది. క్యారెక్టర్. ఏఐ విషయంలోనూ పొరపాట్లు జరగవచ్చు. సాంకేతికతకు పరిమితులు ఉండే విషయాన్ని అర్థం చేసుకోవాలి’ అంటుంది చెన్నైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ మనీష. రియల్ చాలెంజర్... జెమిని ఏఐ రేసులో ఓపెన్ ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ లీడింగ్‌లో ఉన్నప్పటికీ ఇది ఎప్పటివరకు అనేది ప్రశ్నార్థకంగా ఉంది. దీనికి కారణం సరికొత్తగా వస్తున్న పవర్ఫుల్ ఏఐ మోడల్స్. వీటిమాట ఎలా ఉన్నా గూగుల్ వారి ‘జెమిని’ని అసలు సిసలు రియల్ చాలెంజర్ అంటున్నారు. గూగుల్ తమ కొత్త ‘జెమిని’ ప్రాజెక్ట్‌లో భాగంగా నెక్స్›్ట– జనరేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్‌ను లాంచ్ చేయనుంది. ‘జెమిని’ అనేది కన్వర్సేషనల్ టెక్ట్స్‌ను జనరేట్ చేయడానికి పరిమితం కాదు. ఇన్‌ఫుట్స్, వీడియోలు, ఇమేజ్ లను హ్యాండిల్ చేసే మల్టీ–మోడల్ జెమిని. గూగుల్ దగ్గర ఉన్న అపారమైన వనరులు(యాక్సెస్ టు యూ ట్యూబ్ వీడియోస్, గూగుల్ బుక్స్, సెర్చ్ ఇండెక్స్, స్కాలర్ మెటీరియల్)లతో ‘జెమిని’ ఇతర కంపెనీలకు గట్టి ప్రత్యర్థిగా మారనుంది. ‘ఎక్స్‌క్లూజివ్ టు గూగుల్’ అనే ప్రత్యేకత వల్ల జెమిని మరింత బలంగా మారనుంది. (చదవండి: తండ్రికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే! హైకోర్టు జస్టిస్ ఆదేశం!) -
గే యాప్‌లో ఛాటింగ్.. కొద్దిసేపట్లోనే పరిచయం.. ఇంటికి రమ్మని పిలిచి..
హైదరాబాద్: గే యాప్‌లో ఛాటింగ్ చేస్తుండగా హాయ్.. హాయ్.. అంటూ పలకరించుకున్నారు.. కొద్ది సేపటి లోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మా ఇంటికి రావాలంటూ అవతలి వ్యక్తి ఆహ్వానం మేరకు వెళ్లిన యువకుడిని కత్తితో బెదిరించి బ్రాస్లెట్తో పాటు నగదు లాక్కున్న సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్–12 ప్రాంతానికి చెందిన యువకుడు(23) ఈ నెల 1న తన గే లకు సంబంధించి గ్లెండర్ యాప్‌లో చాటింగ్ చేస్తుండగా అవతలి వైపు నుంచి అఫ్రిది అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కాసేపు చాటింగ్ చేసుకున్న తరువాత తన గదికి రావాలంటూ ఆఫ్రిది లొకేషన్ పంపాడు. దీంతో సదరు యువకుడు ఆఫ్రిది గదికి వెళ్లగా కత్తి చూపించి న్యూడ్ వీడియోలు, ఫొటోలు తీశాడు. బలవంతంగా అతడి చేతికి ఉన్న బ్రాస్లెట్తో పాటు గొలుసు, రూ. 2వేల నగదు, డెబిట్, క్రెడిట్ కార్డులు లాక్కున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అతడి భారి నుంచి తప్పించుకుని బయటపడిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు ఆఫ్రిదిని రౌడీషీటర్‌గా గుర్తించారు. అదే తరహాలో మరో యువకుడిని.. నిందితుడు ఆఫ్రిది ఇదే తరహాలో మరో యువకుడిని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 భోళానగర్లోని తన గదికి రప్పించాడు. అనంతరం కత్తితో బెదిరించి దుస్తులు విప్పించి నగ్న దృశ్యాలు వీడియో తీయించాడు. వీడియోలు ఎందుకు తీస్తున్నావంటూ నిలదీయగా అతడిపై దాడి చేయడమే కాకుండా తన స్నేహితుడు హరున్తో కలిసి దాడి చేసి రూ. 7వేల నగదు, బంగారు ఉంగరం లాక్కున్నాడు. ఫోన్ పే ద్వారా రూ. 20 వేలు మహ్మద్ ఉమర్ మొయినుద్దీన్ ఖాతాకు బదిలీ చేయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చాటింగ్ తెచ్చిన రగడ
శంకర్పల్లి: ఓ కళాశాలలో విద్యార్థుల చాటింగ్ వ్యవహారం గొడవలకు దారితీసింది. దీంతో ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డాయి. అయితే జూనియర్‌పై సీనియర్లు ర్యాగింగ్ చేశారని, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను మంత్రి కేటీఆర్‌కు, సైబరాబాద్ కమిషనర్‌కు షేర్ చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా , శంకర్పల్లి మండలం, దొంతాన్పల్లి శివారులోని ఇక్ఫాయి (ఐబీఎస్) కళాశాలలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల 1న ఇక్ఫాయి కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అబ్బాయి, అమ్మాయి చాటింగ్ చేసుకున్నారు. ఇది కాస్తా వివాదానికి దారి తీసింది. ఇద్దరూ తమ స్నేహితులకు విషయం చెప్పారు. రెండు వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు. ఈ విషయం ఇరువర్గాల విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియడంతో వారు కళాశాల యాజమాన్యంతో చర్చించారు. విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం శంకర్పల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మళ్లీ గొడవ పడొద్దని రాజీ కుదిర్చి పంపారు. అయితే.. ఓ విద్యార్థిని సీనియర్లు తీవ్రంగా కొడుతున్న వీడియో మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ పోస్టు చేశారు.దీనిపై స్పందించిన ఆయన.. వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు పోస్టు చేస్తూ ఈ ఘటనపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పాత గొడవ వైరల్ చేస్తున్నారు: సీఐ ఇక్ఫాయి కళాశాల విద్యార్థుల మధ్య ఈ నెల ఒకటో 1న గొడవ జరిగింది. విషయం విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పి.. వారి సమక్షంలోనే కౌన్సెలింగ్ ఇచ్చి పంపాం. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిరింది. అయితే.. కావాలని ఎవరో విద్యార్థులు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి వైరల్ చేస్తున్నారు. వీడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం. (చదవండి: పుట్టిన ఆసుపత్రికి రూ.కోటి మంజూరు) -
శృతిహాసన్ గురించి ఎవరికీ తెలియని విషయం ఇదే!
తండ్రి కమల్‌హాసన్ నుంచి శ్రుతీహాసన్ ఏం నేర్చుకున్నారు? లండన్‌లో ఆమె ఇల్లు కొన్నారా? శ్రుతి వాట్సప్ నెంబర్ ఏంటి? ఆమె బలాలు.. బలహీనతలు.. ఇలా ఎన్నో విషయాలకు సమాధానం దొరికింది. బుధవారం ఆమె శ్రుతి ట్విట్టర్లో చాట్ చేశారు. నెటిజన్ల సీరియస్ ప్రశ్నలు... శ్రుతి కొంటె సమాధానాలు, నెటిజన్ల కవ్వింపులు, శ్రుతి తెలివైన జవాబులు... ఇలా సాగిన ఈ చాట్ సెషన్ పై ఓ లుక్ వేయండి. ► మీ జీవితంలో మీకు బాగా గుర్తుండిపోయే జ్ఞాపకం? సింగపూర్‌లో గాయనిగా తొలిసారి నేను స్టేజ్‌పై పాట పాడిన సంఘటన నా బెస్ట్ మెమరీ. ► మీ జీవితంలో మీరు పశ్చాత్తాపపడిన సంఘటనలు ఏమైనా? కొన్ని ఉన్నాయి. కానీ మరీ అంత బాధపడే సంఘటనలైతే కాదు. నిజం చెప్పాలంటే జీవితంలో మనం ఊహించకుండా జరిగేవన్నీ మంచి పాఠాలే. ► మీరు తరచుగా ఎందుకు నలుపు రంగు దుస్తులే ధరిస్తారు? నలుపు రంగు నాకు సూట్ అవుతుందని, అందంగా కనిపిస్తానని నా ఫీలింగ్. పైగా నేను ఏదైనా తినేటప్పుడు పొరపాటున నా దుస్తులపై పడితే మరకలు పెద్దగా కనిపించవు కదా (సరదాగా). ► దురదృష్టవశాత్తు మీరు అడవిలో ఒంటరిగా మిగిలిపోతే ఏ జంతువు మీకు బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది? సింహం. ► మీరు డేట్‌కు వెళ్లాలనుకుంటే మీ ఫస్ట్ ప్రియారిటీ ఎవరు? ఇది నాకు అసలు ప్రియారిటీయే కాదు. ► ఏ ఫిక్షనల్ క్యారెక్టర్‌ను మీరు మీ లైఫ్‌లో కలవాలనుకుంటున్నారు? తాలియా రస్గుల్ (అమెరికన్ కామిక్ బుక్స్‌లోని క్యారెక్టర్) ► దోసె, వడా పావ్, ప్యాన్ కేక్స్... వీటిలో మీకు ఏది ఇష్టం? సందేహం లేదు... దోసె. ► మీ పేరును సరిగ్గా పలకలేని కొందరి గురించి మీరేం చెబుతారు? చాలామంది చాలా రకాలుగా నా పేరును పలుకుతుంటారు. నాకది కామెడీగా ఉంటుంది. ► మీ ఇల్లు కాకుండా ప్రపంచంలో మీకు బాగా నచ్చే ప్లేస్? లండన్ . అక్కడ నాకు ఓ ఇల్లు కూడా ఉంది. ► మీలో ఉన్న మంచి, చెడుల గురించి? నాలో ఉన్న మంచి గురించి ఇతరులు చెప్పాలి. ఇక నాలో ఉన్న చెడు గురించి చెప్పాలంటే నాకు సహనం చాలా తక్కువ. అందుకే లాక్డౌన్ లో ఈ విషయంపై ఫోకస్ పెట్టాను. ఇప్పుడు ఫర్లేదు. ► మీరు త్వరలో ఉత్తరాఖండ్‌కు వచ్చే ప్లాన్ ఏమైనా ఉందా? లేదు. కానీ రావాలని ఉంది ► బెంగళూరు, చెన్నై... ఇంతకీ ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? ముంబయ్‌లో! ► మహిళల గురించి మీ మనసులో ఉన్న మాట? మహిళల హక్కులు, సంక్షేమం, చిన్నపిల్లల భద్రత బాగుండాలి. ► మీ ఫ్యాన్ మూమెంట్? నా చిన్నప్పటి నుంచి సింగర్ టోరి అమోస్‌కు వీరాభిమానిని. లండన్ లో ఆమెను కలిసేందుకు ఓ కాఫీ షాప్‌కు పరిగెత్తుకుంటూ వెళ్లాను. ఆ సమయంలో భావోద్వేగానికి లోనై ఏడ్చాను. ► మీ మొబైల్ వాల్‌పేపర్‌పై ఏ పిక్చర్ ఉంటుంది? మురుగన్ (కుమారస్వామి). ► మీ వాట్సప్ నెంబర్? 100. ► మిమ్మల్ని గతంలోకి తీసుకుని వెళ్లే మిషన్ మీ దగ్గర ఉంటే..? నా ఎనిమిదో తరగతి క్లాసులకు వెళతాను ► మిమ్మల్ని సంతోషపరచే మూడు చిన్న విషయాలు? నిజం, నిద్ర, స్వచ్ఛమైన కౌగిలింత. ► మీ గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పండి? పాములంటే నాకు విపరీతమైన భయం. ► నటి కాకపోయి ఉంటే? ఏదైనా క్రియేటివ్ జాబ్‌లోనే ఉండేదాన్ని. ► మీ నాన్న కమల్‌హాసన్ నుంచి మీరేం నేర్చుకున్నారు? నిన్ను నువ్వు ప్రశ్నించుకో అండ్ నెవర్ గివ్ అప్ ► కోవిడ్ టైమ్ జాగ్రత్తలు తీసుకోండి. ఓ.. తీసుకుంటున్నా. నేను బాగున్నా. మీరు జాగ్రత్త. ► కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారా? ఇంకా లేదు. త్వరలో తీసుకుంటాను ► నన్ను మీరు ఎక్కడ కలుస్తారు? కోవిడ్ టైమ్... నో మీటింగ్స్. ► మీలో మీకు నచ్చనిది? నా గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తుంటాను. ఒక్క మాటలో... ► మహేశ్‌బాబు: జెంటిల్‌మేన్ ► రామ్‌చరణ్: స్వీటెస్ట్ ► ప్రభాస్: సూపర్ చిల్ అండ్ లవ్లీ ► విజయ్: ఎమేజింగ్ ∙కీర్తీ సురేశ్: ‘మహానటి’లో కీర్తి నటన నాకు బాగా నచ్చింది ► నాగచైతన్య: కైండెస్ట్ పర్సన్ ► నాని: అతనితో నటించే అవకాశం రాలేదు. అద్భుతమైన నటుడు. ► దర్శకుడు ప్రశాంత్ నీల్: సూపర్‌మైండ్ అండ్ కామ్ ► మీ ఫ్యా¯Œ ్స: ది బెస్ట్ ఫేవరెట్స్ ► సబ్జెక్ట్స్: హిస్టరీ, బయాలజీ ► స్కూల్ డేస్‌లో క్రష్: హృతిక్‌రోషన్, లియోనార్డో డికాప్రియో ► ఫుడ్: సాంబర్ రైస్, దోసె చాలు.. ఈ లైఫ్‌కి! ► హాలీవుడ్ యాక్షన్ ఫిల్మ్స్: ఎంటర్ ది డ్రాగన్, కిల్‌బిల్ ► కాఫీ లేదా టీ: కాఫీ తాగను... సో మిగిలింది టీ! ► గులాబ్ జామూన్ లేదా ఐస్‌క్రీమ్: రెండూ కలిపితే బాగుంటుంది -
ప్రియుడి కోసం దేశం దాటొచ్చింది..!
సాక్షి, వెల్గటూరు(ధర్మపురి): ఇరాక్ వేదికగా తెలంగాణ అబ్బాయి, నేపాల్ అమ్మాయి ప్రేమించుకున్నారు. ఐదేళ్లు అక్కడే కలిసి కాపురం చేశారు. చుట్టీ మీద ఇంటికి వెళ్తున్నానని చెప్పి ప్రియుడు ఇండియాకు చేరాడు. ఫోన్ నంబరు మార్చడంతో మోసపోయానని గ్రహించిన సదరు యువతి ఇరాక్ నుంచి నేరుగా వెల్గటూరు చేరుకుని స్థానిక పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన అల్లె చంద్రశేఖర్ బతుకుదెరువుకు ఐదేళ్ల క్రితం ఇరాక్‌వెళ్లాడు. నేపాల్‌కు చెందిన లలితఅన్నా సైతం ఉపాధి నిమిత్తం ఇరాక్‌కు వెళ్లింది. అక్కడ ఇద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఐదేళ్లు కలిసికాపురం సైతం చేశారు. ఇటీవల అక్టోబర్‌లో చంద్రశేఖర్ చుట్టీమీద స్వగ్రామం వెంకటాపూర్ వచ్చాడు. కొద్దిరోజులు ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. తరువాత చంద్రశేఖర్ ఫోన్‌నంబర్ మార్చివేశాడు. లలితకు చాలారోజుల నుంచి ఫోన్ చేయకపోవడంతో తనవద్ద ఉన్న రాజశేఖర్ ఓటర్ ఐటీ ఆధారంగా శనివారం వెల్గటూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. చంద్రశేఖర్ తనకు పెళ్లి కాలేదని చెప్పి ప్రేమపేరుతో లోబర్చుకున్నాడని, అతడికిపెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు తెలిసి మోసపోయాయని వాపోయింది. పోలీసులే తనకు న్యాయం జరిగేలా చూడాలని లలిత వేడుకుంటోంది. -
హాయిగా నవ్వండి
నవ్వు మంచి మెడిసిన్ అంటుంటారు. ఆ మెడిసిన్‌ను ప్రతిరోజూ తీసుకోమంటున్నారు కాజల్ అగర్వాల్. తన ట్వీటర్ ఫాలోయర్స్ 30 లక్షలకు చేరుకున్న సందర్భంగా నెటిజన్లతో చాట్ చేశారు కాజల్. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘మీరు నవ్వినప్పుడు చాలా అందంగా ఉంటారు. అలా స్వచ్ఛంగా నవ్వడానికి మీ రహస్యం ఏమిటి?’ అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, ‘‘మనలోని అంతరాత్మకు మన నవ్వు ఒక ప్రతిబింబమని నేను నమ్ముతాను. నిజాయతీ గల నవ్వు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇతరులకు మన పట్ల సద్భావం కలిగేలా చేస్తుంది. నవ్వును ఓ అలవాటుగా మార్చుకోవడానికి రోజూ నవ్వుతూ సంతోషంగా ఉండండి’’ అని బదులు ఇచ్చారు. ‘‘పెళ్లి వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వివాహ బంధానికి నేను రెడీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాను’’ అని పెళ్లి గురించి ఓ ఫాలోయర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ప్రస్తుతం ‘కాల్ సెంటర్, ఇండియన్ 2, ముంబై సాగ’ సినిమాలతో కాజల్ ఫుల్ బిజీగా ఉన్నారు. -
మార్చుకుంటూ.. నేర్చుకుంటూ.. ముందుకెళ్తా!
శ్రుతీహాసన్‌ను తన అభిమానులు స్క్రీన్ మీద మిస్ అవుతున్నారు. ‘మీ అందర్నీ స్క్రీన్ మీద త్వరలోనే పలకరిస్తాను. ఈ బ్రేక్‌లో చిన్న చాట్ చేద్దామా?’ అని అడిగారు. వెంటనే ఆమె అభిమానులంతా ప్రశ్నల వర్షం కురిపించారు. శ్రుతీ అభిమానులతో చేసిన చాట్‌లో కొన్ని ప్రశ్నలు.. ► లైఫ్‌లో ఎప్పుడైనా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యారా? అఫ్కోర్స్! చాలాసార్లు. కానీ దాన్ని ఎదుర్కొనే మార్గం కూడా కనుగొన్నాను. ► పిజ్జా ఇష్టమా లేక బర్గర్ ఇష్టమా? పిజ్జా అంటే ప్రాణం. ► మీ నాన్నగారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైనది? మహానది. ► మీ యాక్టింగ్ సై ్టల్ని వర్ణించండి? ముందుగా ప్లాన్ ఏదీ చేసుకోకుండా లొకేషన్లో అక్కడికక్కడ నటించడం నా సై ్టల్. ► కమల్‌హాసన్ గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎప్పుడైనా భారంగా అనిపించిందా? మా ఫ్యామిలీ అంటే నాకు చాలా గర్వం. దాన్ని నిలబెట్టడానికి ప్రతిరోజూ కష్టపడుతూనే ఉంటాను. అది భారం కాదు. ► మీ జీవితంలో గొప్ప అచీవ్మెంట్ ఏంటి? ఎప్పటికప్పుడు నన్ను మార్చుకుంటూ కొత్త విషయాలను నేర్చుకోవడం. ► స్క్రీన్ మీద మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నాం. మీ ఫ్యాన్స్ కోసం ఓ తెలుగు సినిమా చేయండి. త్వరలోనే చేస్తాను. ► జీవితం ఎలా ఉంది శ్రుతీ? వండర్ఫుల్. అడిగినందుకు ధన్యవాదాలు. ► మీరు చేస్తున్న అమెరికన్ టీవీ సిరీస్ ‘ట్రెడ్‌స్టోన్’ గురించి ఏదైనా చెప్పండి? ప్రస్తుతానికైతే యాక్షన్ ట్రైనింగ్ చాలా బాగా నడుస్తోంది. ► మీరు దేనికి ఎక్కువగా భయపడతారు? పాములకు, అజ్ఞానానికి. ► ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సీజన్ 8 గురించి మీ అభిప్రాయం? చాలా బాధగా ఉంది. దాని గురించి మాట్లాడదలచుకోలేదు కూడా. ► మీ ఫేవరెట్ చాక్లెట్? రోయ్స్. ►మీరు స్ట్రిక్ట్‌గా ఉండే సిస్టరా? ఫ్రెండ్లీ సిస్టరా? ఆ విషయం మీరు నా చెల్లెలు అక్షరాహాసన్ని అడగాలి. ► మీ నుండి ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అతి త్వరలోనే.. ► ఏలియన్స్ (గ్రహాంతర వాసులు) ఉన్నాయని నమ్ముతారా? నమ్ముతాను. ► ఏ విషయం మీకు చిరాకు తెప్పిస్తుంది? కామన్సెన్స్ లేకుండా ఉంటే చిరాకొస్తుంది. ► మీకు పిల్లలు కావాలా? కావల్సిస్తే ఎంత మంది? కచ్చితంగా కావాలి, ఇద్దరు పిల్లలు కావాలి. ► విమర్శలను ఎలా స్వీకరిస్తారు? విలువైన విమర్శలను ఎప్పడూ స్వీకరిస్తాను. ► మీరు రైటర్ అని మాకు తెలుసు. నాకో సలహా కావాలి. మనమెప్పుడూ అనుభవించని విషయాన్ని ఎలా రాయాలి? మనుషులందరం ఒకలాంటి ఎమోషన్స్‌కే కనెక్ట్ అయ్యుంటాం అని అనుకుంటాను. అందుకే ఆర్టిస్టిక్ట్గా ప్రేక్షకులు కూడా అనుభవించగలిగేది రాయడం చాలా ముఖ్యం. ఆ సంఘటన జరిగితే ఎలా ఉంటుంది? అనే ఊహతో ఆలోచిస్తూ నీకు ఏదనిపిస్తే అది రాస్తూ ఉండు. ► మీ అభిమానుల గురించి ఒక్క మాట? మీ అందర్నీ నేను ఎంతో ప్రేమిస్తాను. మీరంతా నా డిజిటల్ ఫ్యామిలీ. మీరందరూ నా జీవితంలో ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ► శ్రుతీహాసన్‌లా ఉండటం ఎలా ఉంటుంది? చాలా చాలా సరదాగా ఉంటుంది. ► మీ జీవితాన్ని మార్చేసిన పుస్తకాల గురించి చెబుతారా? రిచార్డ్ బ్యాచ్ రాసిన ఇల్యూషన్ పుస్తకం చదవమని నాన్నగారు చెప్పారు. అది నా జీవితాన్నే మార్చేసింది. అలానే మార్లిన్ బ్రాండో ఆటోబయోగ్రఫీలోని పాటలు చాలా ఇష్టం. మా అమ్మ నేర్పించారు. ► స్టార్ కిడ్‌గా ఉండటం కష్టమైన విషయమా? యాక్టర్‌గా గుర్తింపు పొందాలనుకుంటున్నారా? సింగర్గానా? స్టార్ కిడ్‌గా ఉండటం అంత కష్టమేం కాదు. ఆర్టిస్ట్‌గా గుర్తింపబడాలి అనుకుంటాను. ► మీకేదైనా సూపర్‌పవర్ ఉంటే ఏం చేస్తారు? పేదవాళ్లకు సహాయం చేస్తాను. ► మీ జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటి? సంతోషంగా ఉండటం. ► మీ చిన్నప్పటి క్రష్ పేరు ఏంటి? హృతిక్ రోషన్. ► మీ అమ్మానాన్న ఉన్న ఫీల్డ్‌లోనే ఉండటం ప్లస్ అనుకుంటున్నారా? మైనస్ అనుకుంటున్నారా? ప్లస్. ► మిమ్మల్ని ద్వేషించేవాళ్లను ఎలా డీల్ చేస్తారు? నేను వాళ్లను అసలు డీల్ చేయను. -
ఫేస్బుక్ పరిచయం.. పెళ్లి చేసుకుంటానని..
సాక్షి, కడప అర్బన్: కడప నగరానికి చెందిన ఎస్సీ యువతికి ఫేస్బుక్ ద్వారా పరిచయమై మోసం చేసిన కేసులో పులివెందుల మండలానికి చెందిన రూప్సాగర్ను ఎస్సీ, ఎస్టీసెల్ డీఎస్పీ ఎన్. సుధాకర్ శుక్రవారం తమ సిబ్బందితో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను తెలియజేశారు. కడప నగరానికి చెందిన ఎస్సీ యువతికి, ఫేస్బుక్ ద్వారా పులివెందులకు చెందిన రూప్‌సాగర్ పరిచయమయ్యాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికించి యువతిని శారీరకంగా అనుభవించి తరువాత ముఖం చాటేశాడు. సదరు యువతి, యువకుని ఇంటి వద్దకు వెళ్లి పెళ్లి చేసుకోమని బతిమలాడగా ఆ అమ్మాయిని కులం పేరుతో తిట్టిన యువకుడు, తాను ఇదివరకే వేరే అమ్మాయితో వివాహం చేసుకున్నానని చెప్పాడు. దీంతో సదరు యువతి తనకు జరిగిన అవమానభారం భరించలేక చనిపోవాలనే ఉద్దేశంతో చేయి కోసుకుని, వాస్మోల్ సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. తరువాత ఆసుపత్రి పాలైంది. ఈ సంఘటనపై పులివెందుల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆ కేసును ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీకి అప్పగించారన్నారు. కేసులో విచారణ జరిపి నిజనిర్ధారణ చేసి, రూప్ సాగర్‌ను అరెస్ట్ చేశామన్నారు పులివెందుల కోర్టులో నిందితుడిని హాజరుపర్చగా, ఆగస్టు 2 వరకు నిందితుడికి రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
సమస్యల సహజీవనం!
చాటింగ్‌తో మొదలు.. ‘ఆమె ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్. వయసు 26 ఏళ్లు. డేటింగ్ యాప్ ద్వారా 2018, జనవరిలో 27 ఏళ్ల యువకుడు పరిచయమయ్యాడు. అతనూ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇద్దరూ మొబైల్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని చాటింగ్ ప్రారంభించారు. మనసులు కూడా కలవడంతో సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో విహారయాత్రలకు వెళ్లారు. ఆ యువకుడు తన ప్రియురాలి ఫోటోను ఓ స్నేహితుడికి చూపించాడు. ఆమె తనకు తెలుసని మిత్రుడు చెప్పాడు. ఆమె ఇంకా చాలా మందితో అఫైర్ కొనసాగించినట్లు తెలుసుకుని యువకుడు కంగుతిన్నాడు’ పార్టీలో కలిశారు.. ‘ఉత్తర భారత్‌కు చెందిన 22 ఏళ్ల యువతి నగరంలోని ఒక కళాశాలలో డిగ్రీ చదువుతోంది. 2018లో స్నేహితుడి ఇంటికి పార్టీకి వెళ్లినప్పుడు 31 ఏళ్ల టెక్కీ పరిచయం అయ్యాడు. అభిరుచులు కలిసి సహజీవనం ప్రారంభించారు. ఆతర్వాత అతనితో పెళ్లి ఇష్టం లేదంటూ ఆ యువతి తన సొంతూరుకి వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో తీసుకున్న వీడియోను చూపి బెదిరించడం ప్రారంభించాడు. ఆమె తల్లిదండ్రులకు తెలియడంతో పోలీసులను ఆశ్రయించారు’ వెలుగులోకి రానివెన్నో టెక్ హబ్‌గా పేరొందిన బెంగళూరు సహజీవనానికి కూడా కేంద్రంగా మారుతోంది. పైన చెప్పిన సంఘటనలు కేవలం రెండు ఉదాహరణలు మాత్రమే. నగరంలో ఇంకా వెలుగుచూడని ఇలాంటి దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలనే సాకుతో పెళ్లి అనే సంప్రదాయానికి తూట్లు పొడిచి విదేశాల్లో ప్రాచుర్యం పొందిన సహజీవనం పేరిట యువత కొన్ని నెలల పాటు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. తరువాత ఒకరితో ఒకరికి పొసగకనో, మరో కారణంతోనో విడిపోతున్నారు. కొందరు ఇంతటితో ఆగకుండా సహజీవనంతో మోసపోయామని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు. ఒక్క 2018లోనే కర్ణాటక వ్యాప్తంగా ఇలాంటి కేసులు 300కు పైగా నమోదయ్యాయి. ఫేస్బుక్, ఇతర డేటింగ్ యాప్‌ల ద్వారా పరిచయమైన వ్యక్తులతో సహజీవనం చేసేందుకు చాలా మంది యువత సిద్ధమవుతున్నారు. ఆకర్షణ కూడా సహజీవనానికి ఒక కారణంగా తెలుస్తోంది. బాధితుల్లో యువతీయువకులు ఇద్దరూ ఉంటున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు బెయిల్ సులువుగా దొరుకుతోంది. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుకరించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని నిపుణులు భావిస్తున్నారు. – సాక్షి, బెంగళూరు -
ఐ లవ్ నిక్కీ!
నాగచైతన్య నటించిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు హీరోయిన్ నిధీ అగర్వాల్. తెలుగు ఆడియన్స్ గురించి తన అభిప్రాయాన్ని, కొత్త ఏడాది తీసుకున్న నిర్ణయాలు.. ఇంకా కొన్ని విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకున్నారామె. ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు నిధీ అగర్వాల్. ఈ నెల 25న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ బ్యూటీ చెప్పిన విషయాలు తెలుసుకుందాం. ► తెలుగు ప్రేక్షకుల గురించి మీ అభిప్రాయం? అద్భుతమైన, నమ్మకమైనవారు. ► కొత్త ఏడాది తీసుకున్న నిర్ణయం? భయం లేకుండా ఉండటం. ► ‘మిస్టర్ మజ్ను’ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి? మై మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్. ఐ లవ్ యు నిక్కీ (సినిమాలో నిధి పాత్ర పేరు నిక్కీ). ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎగై్జటెడ్‌గా ఎదురు చూస్తున్నా. ప్రేక్షకులు సపోర్ట్ చేయాలి. ► మీకు బిర్యానీ అంటే ఇష్టమేనా? చాలా ఇష్టం. ► మీ ఫేవరెట్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్? ప్రస్తుతం ‘వైల్డ్ వైల్డ్ కంట్రీ’ చూస్తున్నాను. ► మీ రోల్ మోడల్ ఎవరు? ఈ రోజు ఆమె పుట్టినరోజు (శనివారం బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ పుట్టినరోజని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు) ► ‘అర్జున్‌రెడ్డి’ సినిమా చూశారా? ఇప్పటివరకు నాలుగుసార్లు చూశాను. ► అఖిల్ లేదా నాగచైతన్య.. ఎవరిష్టం? ఈ ప్రశ్న చాలామంది అడుగుతున్నారు (నవ్వుతూ) ► ‘మిస్టర్ మజ్ను’ డైరెక్టర్ వెంకీ అట్లూరి గురించి? మై ఫేవరెట్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్. ► సౌత్ ఇండియన్ స్టార్స్‌లో ఎవరిపై అయినా మీకు క్రష్ ఉందా? అవును. ఉంది కానీ ఎవరో చెప్పను. ► ఫైనల్లీ మీ గోల్ ఏంటి? నా పూర్తి బలాన్ని ఉపయోగించి నేను ఆశించిన శిఖరాలకు చేరుకోవాలి. భవిష్యత్ బాగా ఉండటానికి కావాల్సిన కృషి చేసేంత ఎనర్జీ నాలో దాగి ఉందని నా నమ్మకం. -
ఆయన జెంటిల్‌మేన్
‘నిన్నా కుట్టేసినాది... మొన్నా కుట్టేసినాది గండు చీమ...’ పాటలో ఎలా కనిపించారో సిమ్రాన్ ఇప్పటికీ అలానే ఉన్నారు. కధానాయికగా భేష్ అనిపించుకున్న ఆమె ఇటీవల ‘సీమరాజా’ సినిమాలో తన విలనిజమ్ని కూడా చూపించి, ప్రశంసలు పొందారు. అభిమానులతో టచ్‌లో ఉండేందుకు ట్వీటర్లో యాక్టీవ్‌గా ఉంటారు. తాజాగా తన ఫ్యాన్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సిమ్రాన్ సమాధానం చెప్పారు. అందులో కొన్ని... ► మళ్లీ తెలుగు సినిమాలో ఎప్పుడు కనిపిస్తారు? మంచి రోల్ వస్తే తప్పకుండా.. త్వరలోనే. ► మీ డ్యాన్స్‌కు పెద్ద అభిమానులం. మీరు డ్యాన్స్ చేసిన వాటిలో మీకు నచ్చిన పాట? ‘జోడీ’ సినిమాలో పాటలు నాకు పర్సనల్‌గా ఇష్టం. ► నటిగా మీకు సంతృప్తి ఇచ్చిన పాత్ర ఏది? ‘కన్నత్తిల్ ముత్తమిట్టాల్’ (తెలుగులో ‘అమృత’) సినిమాలో పాత్ర చాలా సంతృప్తినిచ్చింది. ► ‘పేట్టా’లో రజనీకాంత్‌తో నటించడం ఎలా ఉంది? ఈ సినిమా ఓ అద్భుతమైన ఎక్స్పీరియన్స్. రజనీ సార్ జెంటిల్‌మేన్. ► అప్పటి, ఇప్పటి దర్శకులతో పని చేశారు. వాళ్లలో మీరు గమనించిన తేడా ఏంటి? ఎటువంటి తేడా లేదు. ► తమిళంలో ‘సీమరాజా’ సినిమాలో నెగటీవ్ పాత్ర చేశారు. వాటిని కొనసాగిస్తారా? పవర్ఫుల్ రోల్స్ వస్తే తప్పకుండా చేస్తా. ► మీ ఫిట్నెస్ సీక్రెట్ చెబుతారా? క్రమశిక్షణతో ఉండటం. అన్ని పనులు టైమ్‌కి చేయడమే నా ఫిట్నెస్ సీక్రెట్. ► దర్శకురాలిగా ఎప్పుడు మారుతున్నారు? నాకు ఇంకా నటించాలని, ఇంకా నేర్చుకోవాలని ఉంది. సినిమాలు సముద్రంలాంటివి. ఎన్ని నేర్చుకున్నా ఇంకా మిగిలున్నట్లే ఉంటుంది. -
చాటింగ్.. చీటింగ్!
- బలవుతున్న యువతీయువకులు - పోలీసు స్టేషన్లలో పంచాయితీలు –అపరిచిత ఫొటోలు, కాల్స్‌కు దూరంగా ఉండడమే మేలంటున్న నిపుణులు తిరుపతి క్రైం : ఎవరిచేతిలో చూసిన స్మార్ట్‌ఫోన్.. చవకగా దొరుకుతున్న ఇంటర్నెట్.. కాసేపు చాటింగ్ చేయకుంటే నిద్రపట్టని పరిస్థితి. బస్సు ఫుట్‌బోర్డుపై వెలాడుతూ కూడా చాటింగ్ చేస్తున్నారు. అవతల వారు ఎవరో కూడా తెలియకుండా చాటింగ్ చేస్తూ బుట్టలో పడుతున్నారు. ఇందుకు నిదర్శనం తిరుపతిలో జరిగిన రెండు సంఘటనలు . అవేవో చూద్దాం.. – ఇటీవల తిరుపతి నగరంలో ఓ యువకుడు మహిళ వలలో పడ్డాడు. ఫేస్బుక్లో ఇతరుల ఫొటో పెట్టి యువతి ఆ యువకుడికి ఫ్రెండ్ రిక్విస్ట్ పెట్టింది. యువకుడు ఫొటోను చూసి ఆకర్షితుడయ్యాడు. చాటింగ్ చేశాడు. తియ్యని మాటలకు కరిగిపోయాడు. ఇరువురూ చాటింగ్‌లో వేరే ఊరులో కలుద్దామనుకున్నారు. ఆ ఊరిలో ఆ యువతిని చూడగానే షాక్ అయ్యాడు. అప్పటి నుంచి ఆ యువతి బ్లాక్ మెయిల్ చేస్తోంది. తనకు నగదు ఇవ్వాలని, ఇవ్వకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని రోడ్డుపై నిలబెడుతానని బెదిరించడం ప్రారంభించింది. గుట్టుచప్పుడు కాకుండా తిరిగి ఆ యువతితో బేరసరాలకు పోయి పోలీసుల సమక్షంలో పంచాయితీ జరిగింది. – మదనపల్లికి చెందిన ఓ యువతి వేరే ప్రాంతంలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఫోన్చాటింగ్లో వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన యువకుడు పరిచయమయ్యాడు. ఆమె ఉద్యోగస్తురాలు కావడంతో తరచూ ఆ యువకుడు ఆమె పనిచేసే ప్రాంతానికి వెళ్లేవాడు. తిరిగి అవసరాల మేరకు డబ్బులు తెచ్చుకునేవాడు. ప్రేమించిన వ్యక్తి కావడంతో అడిగినంత డబ్బు ఇచ్చేది. నాలుగు లక్షలు దాకా నగదు ఇచ్చింది. అనంతరం ఆ యువకుడు యువతికి దూరమయ్యాడు. ఫోన్ టచ్‌లో కూడా లేకుండా పోయాడు. ఆ యువతి యువకుడి కోసం ఆరా తీసింది. యువకుడు అదే జిల్లాకు చెందిన యువతితో వివాహానికి సిద్ధమయ్యాడని తెలుసుకుంది. చేసేది లేక పోలీసులను ఆశ్రయించింది. యువతీయువకులు అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్‌ను వదిలించుకుంటేనే జీవితం సాఫీగా సాగుతుందని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు. -
మోసం తీసిన ప్రాణం
- అప్పు తీసుకుని తిరిగివ్వని బంధువు - మనస్తాపంతో రుణగ్రహీత ఇంట్లోనే ఆత్మహత్య - డబ్బు ఇచ్చేంత వరకు మృతదేహాన్ని తీసుకెళ్లమంటున్న కుటుంబీకులు పత్తికొండ: సొంత బంధువు నమ్మకంగా తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వనందుకు ఓ వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆలూరు మండలం పెద్ద హోతూరు గ్రామానికి చెందిన కురువ మల్లికార్జున (40) వద్ద నాలుగేళ్ల క్రితం తుగ్గలి మండలం మారెళ్ల గ్రామానికి చెందిన అతని చిన్నాన్న కుమారుడు అశోక్ జేసీబీ కొనుగోలు చేసేందుకు రూ. 3.50 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. జేసీబీ కొనుగోలు చేసి కొంత సంపాదించాడు. ఏడాది క్రితం మల్లికార్జునకు తెలియకుండా జేసీబీ అమ్మేశాడు. ఆ తర్వాత అప్పు తిరిగి ఇవ్వమని మల్లికార్జున పలుమార్లు కోరినా అశోక్ ఇవ్వకుండ దాటవేశాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం అప్పు వసూలు చేసేందుకు మల్లికార్జున మారెళ్లకు చేరుకున్నాడు. డబ్బు ఇస్తేనే పోతానంటూ నిలదీశాడు. అయితే అప్పు ఇవ్వలేమని ఆశోక్‌తో పాటు అతని తల్లిదండ్రులు తేల్చీ చెప్పారు. దీంతో జీర్ణించుకోలేని మల్లికార్జున అక్కడే పురుగు ముందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని పత్తికొండ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆసుపత్రికి చేరుకున్న కుటుంబీకులు, భార్య మల్లేశ్వరి, పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపించారు. అప్పు ఇవ్వకపోతే మృతదేహాన్ని మారెళ్లకు తీసుకెళ్తామని మృతుడి బంధువులు పూజారి హనుమంతు, హోటల్ పరమేష్, తిక్కయ్య, విశ్వనాథ్, రామప్ప, నల్లన్న తేల్చీచెప్పారు. పోస్టుమార్టం చేయకపోవడంతో మృతదేహం ఆసుపత్రిలోనే ఉంది. ఇరువర్గాల పెద్దలు ఈ విషయంపై చర్చలు జరుపుతున్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం: కేశవులు, తుగ్గలి ఎస్ఐ ఇంతవరకు మృతుడి మల్లికార్జున బంధువులు ఫిర్యాదు చేయలేదు. ఎవరైన ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం. విషయం తెలుసుకొని ఆసుపత్రికి వెళ్లాం. మృతుడి తరుపు ఎవరు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాలేదు. -
రేషన్ షాపుల్లో ఆగని మోసాలు
సాక్షి, విశాఖపట్నం : ఈపాస్, ఐరిస్, ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లు.. ఇలా సాంకేతిక పరిజ్ఞానం ఎంత అందుబాటులో తీసుకొచ్చినా రేషన్‌డీలర్ల మోసాలు మాత్రం ఆగడం లేదు. ఈపాస్‌తో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లను అనుసంధానించినప్పటికీ వీరి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. జిల్లావ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. వారం రోజులపాటు సాగించిన ఈ తనిఖీల్లో అనేక అవకతవకలు బయటపడ్డాయి. నగరంతోపాటు అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, కె.కోటపాడు, గొలుగొండ, అచ్యుతాపురం, ఎస్.రాయవరం, రోలుగుంట, నాతవరం, అరకు, బొర్రా, సుంకరమెట్ట, బోసుబెడ, శివలింగాపురం వంటì ప్రాంతాల్లోని రేషన్ డిపోలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 10 కేజీల నుంచి 30 కేజీల బియ్యం సరఫరాలో అర కే జీ నుంచి రెండు కేజీల వరకు తక్కువ తూకం ఇస్తున్నట్టుగా గుర్తించారు. కొన్నిచోట్ల తక్కువ తూకం కోసం రాళ్లు కూడా పెట్టి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇలా తూకంలో చేస్తున్న మోసాలకు పాల్పడిన 34 షాపులపై లీగల్ మెట్రాలజీ అధికారులు కేసులు నమోదు చేశారు. లీగల్ మెట్రాలజీ సహాయ సంచాలకుడు పి.సుధాకర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. ఎక్కడైనా తక్కువ తూకం తూస్తే ఫిర్యాదు చేయండి తూకాల్లో మోసాలు చేస్తే సహించేది లేదు. బియ్యం తూకం వేసేటప్పుడు విధిగా గుడ్డ సంచులను గాని తక్కువతూకం కలిగిన ఇతర సంచులను మాత్రమే వినియోగించాలి. అధిక బరువు కలిగిన ఉక్కు, ఇనుప, ప్లాస్టిక్ గిన్నెలను వినియోగించడానికి వీల్లేరు. ఈ పాస్ అనుసంధానిత కాటాలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవు. ఎక్కడైనా తూకం తక్కువగా ఇస్తున్నట్టు గుర్తిస్తే వెంటనే ఈ కింది నెంబర్లకు ఫిర్యాదు చేయండి. సహాయ నియంత్రాధికారి కార్యాలయం : 0891–2799551 సహాయ నియంత్రకులు :9490165675 విశాఖపట్నం సిటీ ఏరియా:9885828883 గాజువాక ఏరియా :9866672119 అనకాపల్లి ఏరియా :9885334497 నర్సీపట్నం ఏరియా :9703353679 – పి.సుధాకర్, సహాయ నియంత్రకులు,లీగల్ మెట్రాలజీ, విశాఖపట్నం -
'నువ్వు చాలా అందంగా ఉంటావ్'
*బయటపడిన డ్రగ్ మాఫియా అధినేత గుజ్మాన్-నటి ఛాటింగ్ ముచ్చట్లు మెక్సికో: జోక్విన్ ఎల్ చాపో గుజ్మాన్... ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా అధినేత. మెక్సికన్ డ్రగ్ మాఫియా చీకటి సామ్రాజ్యాన్ని తన కనుసన్నలతోనే శాసించగల ఈ కరుడుగట్టిన నేరగాడు ప్రముఖ మెక్సికన్ నటి కేట్ డెల్ కాస్టిలోను 'నువ్వు ప్రతి సందర్భంలోనూ ఎంతో అందంగా ఉంటావు' అని ప్రశంసించగా ఆమె మాత్రం 'నిన్ను కలవడం నా కల' అంటూ ఇద్దరు పరస్పరం ఒకరినొకరు పలకరించుకున్నారు. వీరిద్దరు ఈ విధంగా జరిపిన సంభాషణ చాటింగ్‌లను మిలీనియో అనే వార్తపత్రిక బుధవారం బయటపెట్టింది. గతేడాది అక్టోబర్‌లో మెక్సికన్ అడవుల్లో వీరిద్దరితో పాటు మరో అమెరికన్ నటి సియాన్ పెన్‌తో సమావేశమైన ముందు, అనంతరం జరిపిన చాటింగ్‌లు నేడు ప్రపంచం ముంగిట బహిర్గతమయ్యాయి. ఈ సందేశాలు బయటకి పొక్కడంతో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలు కొత్త ఊహాగానాలకు తెర తీసాయి. గత జూలైలో అసాధారణంగా మెక్సికన్ జైలు నుంచి సొరంగం తవ్వి పారిపోయిన గుజ్మాన్‌కు సంబంధించి మళ్లీ వార్తలు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. -
APP.. యాప్ హుర్రే
సెల్‌ఫోన్.... పదేళ్ల క్రితం వరకు అది ఒక విలాస వస్తువు. కానీ ఇప్పుడు అదే సెల్‌ఫోన్ నిత్యావసర వస్తువు. ఒక్కరోజు.... కాదు కాదు ఒక్క నిమిషం చేతిలో సెల్‌ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయినట్లు బాధపడతాం. ఈ రోజుల్లో జేబులో స్మార్ట్ ఫోన్ లేని కుర్రాళ్లు లేరు. అన్నీ ఆండ్రాయిడ్‌తో పనిచేసేవే. సెల్‌ఫోన్ ఖాళీగా ఉంటే బాగుండదు కదా? అందుకని బోలెడన్ని అప్లికేషన్లు. ఆండ్రాయిడ్‌లో పనిచేసే కొన్ని వందల అప్లికేషన్స్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొన్ని రకాల అప్లికేషన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం అయితే మరికొన్ని అప్లికేషన్లు డేటా కోసం. ఏదేమైనా ఇప్పటి యూత్ అంతా యాప్స్ గోలలో పడ్డారు. ఏ యాప్ తమకు ఉపయోగపడుతుందో వెతికి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. అలా ప్రస్తుతం సిటీ యూత్ ఈ యాప్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. అవేమిటో చూద్దామా? టీసీహెచ్వీ రమణ సమోసా అంటే ఇష్టపడాని వారు ఎవరుంటారు..! వేడివేడిగా సమోస తింటే హమ్మ్మ్మ్మ్మ్... ఆ టేస్టే వేరు కదా? అదేంటీ యాప్స్ అని తినడం గురించి చెప్తున్నాడనుకుంటున్నారా? సమోసా కూడా ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఫేస్బుక్లో గానీ,వాట్సాప్‌లో గానీ చాటింగ్ చేసేటప్పుడు కొన్ని కొన్ని సినిమా డైలాగులను టైప్ చేసి పంపిస్తాం. అలా టైప్ చేసే బదులు డెరైక్ట్‌గా ఆ డైలాగ్‌నే ఫ్రెండ్స్‌కు షేర్ చేస్తే? బాగుంటుంది కదా? ఈ సమోసా అందుకు ఉపయోగనడుతుంది. ఇందులో బాగా పాపులర్ అయిన సినిమా డైలాగ్స్ కొన్ని ఉంటాయి. వాటిని నేరుగా ఫేస్బుక్ లేదా వాట్సాప్ కాంటాక్ట్‌కు షేర్ చేసుకోవచ్చు. భలే ఫన్నీగా ఉంటుంది. వూమీ టీవీలో వచ్చే సినిమాల గురించి లేదా పాటల గురించి విషయాలు తెలుసుకోవడానికి వూమీ అప్లికేషన్ ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సింది చాలా సింపుల్. జస్ట్ అప్లికేషన్ ఆన్ చేసి వదిలేస్తే చాలు. అందులో నుంచి వచ్చే సౌండ్‌ను క్యాచ్ చేసి దానికి సంబంధించి ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీరు కష్టపడి నెట్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సూపర్ బ్యాకప్ స్మార్ట్ ఫోన్స్ వల్ల లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. వైరస్ రావడం వల్ల మొబైల్ స్లో అయ్యే ఛాన్స్ ఉంది. కచ్ఛితంగా మొబైల్ అప్డేషన్కు ఇవ్వాలి. సెల్లో ఉన్న డేటా అంటే డిలీట్ అయిపోతుంది. అది అందరికీ తెలిసినదే. అయితే కాంటాక్ట్స్ వరకు బ్యాకప్ తీసుకోవడం తెలుసుగానీ డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్, మెసెజస్, కాల్‌లాగ్ ఇవన్నీ లాస్ అవ్వాల్సిందే. అదే ఈ సూపర్ బ్యాకప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఏవీ నష్టపోవలసిన పని లేదు. కాల్లాగ్తో సహా మొబైల్లోని డేటా అంతటినీ బ్యాకప్ చేసుకుని మెమొరీ కార్డ్‌లో సేవ్ చేసుకోవచ్చు. మరికొన్ని.... ఫ్రీ వీడియో కాలింగ్ కోసం ఐఎంవో ఉంది. ఎంత సేపైనా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. కేవలం డేటా ఛార్జీలు తప్ప మెయిన్ బాలెన్స్ ఛార్జ్ అవ్వదు. మరొక యాప్... ఇది వరకు మొబైల్ టూ మొబైల్ డేటా ట్రాన్స్ఫర్ కోసం బ్లూటూత్ వాడేవాళ్లం. చాలా సమయం తీసుకునేది ట్రాన్స్ఫర్ అవ్వడానికి. కానీ ఇప్పుడు ‘షేరిట్’ యాప్ ద్వారా 1 జీబీ మెమొరీను కూడా కొన్ని సెకన్లలోనే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పటి వాళ్లందరికీ వర్క్ చాలా ‘స్మార్ట్’గా జరగాలి. అందుకే టెక్ట్స్ టైప్ చేయడానికి కూడా ఇష్టపడడం లేదు. అలాంటి వారి కోసమే ‘స్పీచ్ టూ టెక్ట్స్’ అప్లికేషన్ ఉంది. మీరు మాట్లాడితే చాలు. అది టెక్ట్స్‌గా మారి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. జాగ్రత్త అవసరం నెట్లో మనకు ఉపయోగపడే అప్లికేషన్స్ చాలా ఉంటాయి. అయితే అన్నీ డౌన్లోడ్ చేసుకోవడం మంచిది కాదు. కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవడం వలన మొబైల్‌లోకి వైరస్ వచ్చి సెల్ హ్యాంగ్ అయ్యేలా చేయవచ్చు. అలాగే మన డేటాను ఇతరులు హ్యాక్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏదైనా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకునే ముందు ఆ యాప్‌కు ఎన్ని డౌన్లోడ్స్ ఉన్నాయి. డెవలపర్ ఎవరు? రివ్యూలు ఎలా ఉన్నాయి? ఇలాంటివన్నీ చూసుకుని డౌన్లోడ్ చేసుకుంటే మంచిది. ఫన్నీగా ఉంది సమోసా యాప్ చాలా ఉపయోగంగా ఉంది. ఫ్రెండ్స్‌తో సరదాగా మాట్లాడుకోవడానికి ఇందులో డైలాగ్స్ బాగుంటాయి. ఒక్కోసారి టెక్ట్స్ లేకుండా కేవలం ఈ యాప్‌లోని డైలాగ్స్‌తోనే మాట్లాడుకుంటాం. నేను ఒక డైలాగ్ పంపితే దానికి రిలేటెడ్‌గా మరొక డైలాగ్ పంపడం ఇలా అన్నమాట. నాకు ఈ యాప్ గురించి తెలియగానే వెంటనే డౌన్లోడ్ చేసుకున్నాను. చాలా ఫన్నీగా ఉంది ఈ అప్లికేషన్. - హేమంత్, స్టూడెంట్ సూపర్‌గా ఉంది నా స్మార్ట్ ఫోన్ అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ అప్డేషన్కు ఇస్తుంటాను. అప్పుడు కేవలం నా కాంటాక్ట్స్ ఒక్కటే బ్యాకప్ తీసుకునేవాడిని. మిగిలిన డేటా,అప్లికేషన్స్ అన్నీ డిలీట్ అయిపోయేవి. మళ్లీ ఫస్ట్ నుంచి నాకు కావలసిన అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. డేటా బాలెన్స్,టైం.. రెండూ వేస్ట్. అదే సూపర్ బ్యాకప్ యాప్‌తో అయితే అప్లికేషన్స్, కాల్‌లాగ్స్, మెసెజెస్ అన్నీ బ్యాకప్ తీసుకుని మెమొరీ కార్డ్‌లో సేవ్ చేసుకోవచ్చు. - అఖిల్, స్టూడెంట్ చాటింగ్‌కు బాగుంది నాకు ఇటీవలే మలేసియాలో జాబ్ వచ్చింది. నా ఫ్రెండ్స్ అందరూ వైజాగ్‌లోనే ఉన్నారు. వాళ్లతో ఫోన్లో మాట్లాడాలి అంటే బిల్ ఎక్కువ అయిపోతుంది. అందుకే ఐఎంవో యాప్ నుంచి ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అది కూడా వీడియోతో కాలింగ్‌తో. నాలా ఫ్రెండ్స్,ఫ్యామిలీకి దూరంగా ఉండే వారికి వాళ్లతో కాసేపు టైం స్పెండ్ చేయడానికి ఈ అప్లికేషన్ బాగుంటుంది. - శివ, మలేసియా -
ఆన్‌లైన్‌కే అంకితం
నేటితరం ఎక్కువగా ఆన్‌లైన్‌కే అంకితం అవుతున్న సంగతి తెలిసిందే. ఆన్లైన్లో చాటింగ్ ద్వారా పాత స్నేహితులతో మాట్లాడుకోవడంతో పాటు కొత్తవాళ్లతో స్నేహం చేయడం, తమకు తెలిసిన సమాచారాలను ఇతరులతో పంచుకోవడం.. ఇలా గడిపేస్తూ కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. దీన్నే ప్రధానాంశంగా చేసుకుని టీఎస్ కమల్ దర్శకత్వంలో లావణ్యా చంద్రశేఖర్ నిర్మించిన చిత్రం ‘చాటింగ్’. అభినయకృష్ణ, సునీత జంటగా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వాస్తవ సంఘటనల సమాహారంతో ఈ చిత్రం ఉంటుందని నిర్మాత తెలిపారు. -
ప్రాణాలు తీస్తున్న సైట్లు!
బెంగళూరులో ఓ కార్పొరేట్ పాఠశాలలో చదివే 14 ఏళ్ల అమ్మాయికి రెండు నెలల క్రితం నగరానికి చెందిన మనోజ్ అనే యువకుడు ఫేస్బుక్లో పరిచయమయ్యాడు. ఇక రోజూ గంటల కొద్దీ చాటింగ్. అది వారి మధ్య ప్రేమకు దారి తీసింది. కొద్ది రోజులకు వారు శారీరకంగా కూడా దగ్గరయ్యారు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. మోజు తీరాక మనోజ్ ముఖం చాటేస్తూ వచ్చాడు. ఏమని ప్రశ్నిస్తే ‘నేనిదంతా సరదా కోసం చేశా’ అని అన్నాడు. ఇంకేముంది నిస్పృహకు గురైన ఆ అమ్మాయి తన మెడకు ఉరి బిగించుకుంది. తల్లిదండ్రుల మనసుల్లో మానని గాయాన్ని రేపి తనువు చాలించింది. తనకు జరిగిన మోసాన్ని స్వయంగా ఆ అమ్మాయి తన సూసైడ్ నోట్లో వెల్లడించింది. బుధవారం నగరంలో జరిగిన ఈ సంఘటన.. తమ పిల్లలు సోషల్ నెట్‌వర్కింగ్స్ వాడకంపై తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమని హెచ్చరిస్తోంది. సమాచార, సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్లు యువత పాలిట యమపాశలవుతున్నాయి! అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికత కారణంగా ప్రస్తుతం నగరాల్లోని ఎల్కేజీ విద్యార్థులు సైతం కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లపై వేళ్లను టకటకలాడిస్తున్నారు. పాఠ్యాంశాలను తిరగేస్తారో లేదో కానీ ఫేస్బుక్లో అకౌంట్‌ని మాత్రం కచ్చితంగా ఫాలో అవుతుంటారు. ఈ విధానం చాలా సందర్భాల్లో ఎన్నో ఆన్లైన్ విజయాలకు, మరుగున పడిన నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు పనికి వస్తుంటే... మరి కొన్ని సందర్భాల్లో యువత ప్రాణాలను బలిగొంటోంది. పర్యవేక్షణ లోపం... ప్రస్తుతం నగరాల్లో చాలా మంది తల్లిదండ్రులు ఉద్యోగులుగా ఉంటున్నారు. దీంతో ఎప్పుడో పొద్దున వారు ఇంటినుంచి బయటపడితే తిరిగి ఏ రాత్రికో ఇంటికి చేరుతున్నారు. ఆ సమయంలో కూడా పని ఒత్తిళ్ల వల్ల, తాము లేని సమయంలో పిల్లలు ఏమి చేస్తున్నారు అనే విషయాలపై సక్రమంగా దృష్టి సారించలేకపోతున్నారని బెంగళూరుకు చెందిన మానసిక చికిత్స నిపుణురాలు నైనా వివరించారు. ఈ కారణంగానే పాఠశాలల్లో చదివే చిన్నారులు సైతం ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషన్ నెట్వర్కింగ్ సైట్లలో ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్ని ఒత్తిళ్లలో ఉన్నా... తాము లేని సందర్భంలో చిన్నారులు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని ప్రతి తల్లిదండ్రి గమనించి తీరాలని సూచించారు. ఒక వేళ పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే అందుకు సంబంధించిన కారణాలను అన్వేషించాలని అన్నారు. పిల్లలు ఎక్కువ సమయాన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో గడిపేస్తుంటే... దానివల్ల కలిగే నష్టాలను వారికి వివరించడం ద్వారా వారిని సరైన మార్గంలో నడిపించేందుకు వీలవుతుందని తెలిపారు. సైబర్ ఎడ్యుకేషన్ తప్పనిసరి కావాలి... అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ గురించి మాత్రమే కాక దానిని సరిగా వినియోగించుకోకపోతే కలిగే నష్టాలను కూడా పిల్లలకు పాఠశాలల్లో నేర్పాల్సిన అవసరం ఉందని, సైబర్ ఎడ్యుకేషన్‌ను కూడా సిలబస్‌లో చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సైబర్ వ్యవహారాల నిపుణులు మీరా చెబుతున్నారు. సైబర్ వ్యవహారాల్లో పాటించాల్సిన జాగ్రత్తలు తదితరాలను పిల్లలకు ఎప్పటికప్పుడు చెబుతూ ఉండాలని తెలిపారు. ‘18 ఏళ్ల వరకు పిల్లలు చాలా సున్నితమైన మనసుతో ఉంటారు. ఆ వయసులో వాళ్లు సోషల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించకపోవడమే ఎంతో మంచిది. అలా కాదని ఒక వేళ కంప్యూటర్‌కు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరిచయం చేయడంలో భాగంగా సోషల్ నెట్‌వర్క్‌ల గురించి కూడా చెప్పాల్సి వస్తే అందులో పాటించాల్సిన నియమాలను కూడా పాఠశాలు కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది’ అని చెప్పారు. జీవితాలను అంధకారం చేసిన ‘నెట్’ బెంగళూరుకు చెందిన మాలిని(23) నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసేది. ఫేస్బుక్ ద్వారా తనకు పరిచయమైన వ్యక్తితో స్నేహాన్ని పెంచుకొంది. ఆరు నెలల పాటు అతనితో స్నేహం చేసింది. అదే ప్రేమగా మారింది. అంతలో ఆ వ్యక్తి మాట మార్చాడు. ‘మా ఇంట్లో ఇదంతా తెలిస్తే పెద్ద గొడవవుతుంది. మన స్నేహాన్ని ఇంతటితో ఆపేద్దాం. ఇంకెప్పుడూ మనం కలవలేం’ అని ఫేస్బుక్లో మెసేజ్ పోస్ట్ చేశాడు. ఇంకేముంది ఆ విషయాన్ని జీర్ణించుకోలేని మాలిని సెప్టెంబర్ 21, 2012న తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో శ్రీరాజ్(24) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసేవాడు. ఫేస్బుక్లో ఓ అమ్మాయితో సరదాగా చాటింగ్ చేయడం ప్రారంభించాడు. అది కాస్తా స్నేహం, ప్రేమకు దారితీసింది. కొంత కాలం తర్వాత తనకు ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయిని ప్రత్యక్షంగా కలవాలనుకున్నాడు. తీరా ఆ అమ్మాయిని కలుసుకున్న తర్వాత ఫేస్బుక్లో ఆమె పొందుపరిచిన ఫొటో ఫేక్ ఫొటో అని అర్థమయింది. తాను ఎంతగానో నమ్మిన అమ్మాయి తనను మోసం చేసిందని భావించిన శ్రీరాజ్... మే 22, 2012న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. -
‘ఫేస్బుక్’ పెళ్లి బెడిసికొట్టింది...
చిగురుమామిడి, న్యూస్‌లైన్ : ఓ యువకుడి ‘ఫేస్బుక్’ పెళ్లి బెడిసికొట్టింది. తాను ఫేస్బుక్ చాటింగ్ ద్వారా ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతికి అంతకుముందే పెళ్లయి, ఇద్దరు పిల్లలున్నారని తెలిసి బిత్తరపోయాడు. పెళ్లయిన మరునాడే మొదటి భర్త వచ్చి ఆమెను తీసుకుపోవడంతో ఏం చేయా లో తోచని స్థితిలో పడ్డాడు. మండలంలోని లంబాడిపల్లికి చెందిన దాసరి కరుణాకర్ బీటెక్ పూర్తి చేశాడు. ఫేస్బుక్లో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన అక్షరశ్రీ(ఎంకాం)తో పరిచ యం ఏర్పడింది. చాటింగ్ ద్వారా ఆమెతో ప్రేమ లో పడ్డాడు. గత నెలలో ఇద్దరూ కలిసి తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీ తాపాళ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. ఆ మరుసటి రోజే ఆమె భర్త సుబ్బారెడ్డి, బంధువులు వచ్చి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసుల సహకారంతో అక్షరశ్రీని తీసుకెళ్లారు. ఆ తర్వాత వారానికే ఆమె కనిపించకుండాపోయింది. దీంతో వారు మళ్లీ ఇక్కడి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు కరుణాకర్‌ను విచారిస్తున్నట్లు సమాచారం. అక్షరశ్రీకి రూ. రెండు కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్సై కోటేశ్వర్‌ను సంప్రదించగా తన పరిధిలో లేదని సమాధానం దాటవేశారు.