'నువ్వు చాలా అందంగా ఉంటావ్' | U.S. knew of actors' connections to Guzman before meeting, officials say | Sakshi
Sakshi News home page

'నువ్వు చాలా అందంగా ఉంటావ్'

Published Fri, Jan 15 2016 9:38 AM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

'నువ్వు చాలా అందంగా ఉంటావ్' - Sakshi

'నువ్వు చాలా అందంగా ఉంటావ్'

*బయటపడిన డ్రగ్ మాఫియా అధినేత గుజ్మాన్-నటి ఛాటింగ్ ముచ్చట్లు

మెక్సికో: జోక్విన్ ఎల్ చాపో గుజ్మాన్... ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా అధినేత. మెక్సికన్ డ్రగ్ మాఫియా చీకటి సామ్రాజ్యాన్ని తన కనుసన్నలతోనే శాసించగల ఈ కరుడుగట్టిన నేరగాడు ప్రముఖ మెక్సికన్ నటి కేట్ డెల్ కాస్టిలోను 'నువ్వు ప్రతి సందర్భంలోనూ ఎంతో అందంగా ఉంటావు' అని ప్రశంసించగా ఆమె మాత్రం 'నిన్ను కలవడం నా కల' అంటూ ఇద్దరు పరస్పరం ఒకరినొకరు పలకరించుకున్నారు. వీరిద్దరు ఈ విధంగా జరిపిన సంభాషణ చాటింగ్లను మిలీనియో అనే వార్తపత్రిక బుధవారం బయటపెట్టింది.

గతేడాది అక్టోబర్లో మెక్సికన్ అడవుల్లో వీరిద్దరితో పాటు మరో అమెరికన్ నటి సియాన్ పెన్తో సమావేశమైన ముందు, అనంతరం జరిపిన చాటింగ్లు నేడు ప్రపంచం ముంగిట బహిర్గతమయ్యాయి. ఈ సందేశాలు బయటకి పొక్కడంతో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలు కొత్త ఊహాగానాలకు తెర తీసాయి. గత జూలైలో అసాధారణంగా మెక్సికన్ జైలు నుంచి సొరంగం తవ్వి పారిపోయిన గుజ్మాన్కు సంబంధించి మళ్లీ వార్తలు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement