Guzman
-
'నువ్వు చాలా అందంగా ఉంటావ్'
*బయటపడిన డ్రగ్ మాఫియా అధినేత గుజ్మాన్-నటి ఛాటింగ్ ముచ్చట్లు మెక్సికో: జోక్విన్ ఎల్ చాపో గుజ్మాన్... ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా అధినేత. మెక్సికన్ డ్రగ్ మాఫియా చీకటి సామ్రాజ్యాన్ని తన కనుసన్నలతోనే శాసించగల ఈ కరుడుగట్టిన నేరగాడు ప్రముఖ మెక్సికన్ నటి కేట్ డెల్ కాస్టిలోను 'నువ్వు ప్రతి సందర్భంలోనూ ఎంతో అందంగా ఉంటావు' అని ప్రశంసించగా ఆమె మాత్రం 'నిన్ను కలవడం నా కల' అంటూ ఇద్దరు పరస్పరం ఒకరినొకరు పలకరించుకున్నారు. వీరిద్దరు ఈ విధంగా జరిపిన సంభాషణ చాటింగ్‌లను మిలీనియో అనే వార్తపత్రిక బుధవారం బయటపెట్టింది. గతేడాది అక్టోబర్‌లో మెక్సికన్ అడవుల్లో వీరిద్దరితో పాటు మరో అమెరికన్ నటి సియాన్ పెన్‌తో సమావేశమైన ముందు, అనంతరం జరిపిన చాటింగ్‌లు నేడు ప్రపంచం ముంగిట బహిర్గతమయ్యాయి. ఈ సందేశాలు బయటకి పొక్కడంతో వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాలు కొత్త ఊహాగానాలకు తెర తీసాయి. గత జూలైలో అసాధారణంగా మెక్సికన్ జైలు నుంచి సొరంగం తవ్వి పారిపోయిన గుజ్మాన్‌కు సంబంధించి మళ్లీ వార్తలు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. -
‘లార్డ్ ఆఫ్ టన్నెల్స్’ ఆటకట్టు
మెక్సికో సిటీ: సొరంగాలు తవ్వి జైళ్ల నుంచి, గృహ నిర్బంధాల నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం, అమెరికా-మెక్సికో సరిహద్దు మీదుగా మత్తుపదార్థాలను స్మగ్లింగ్ చేయడంలో ఆరితేరిన డ్రగ్ డాన్ జొవాకిన్ లెల్ చాపో గుజ్మన్ ఆటకట్టయింది. ‘ది లార్డ్ ఆఫ్ టన్నెల్’గా పేరొందిన 58 ఏళ్ల గుజ్మన్ను మెక్సికో బలగాలు వెంటాడి వేటాడి ఎట్టకేలకు శుక్రవారం అరెస్ట్ చేశారు. గుజ్మన్ను అతని స్వస్థలమైన సినాలోవా రాష్ట్రంలో అదుపులోకి తీసుకున్నట్టు మెక్సికో అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీతో విజయగర్వంతో ప్రకటించారు. గుజ్మన్ గత ఏడాది జూలై 11న కట్టుదిట్టమైన భద్రత ఉండే అల్టిప్లానో జైలునుంచి అనూహ్యంగా తప్పించుకున్నాడు. తన సెల్‌లోని బాత్రూమ్లోంచి సొరంగం తవ్వి అందులోంచి తప్పించుకున్నాడు. భూమికి 10 అడుగుల కింద తవ్విన 1.5 కి.మీ పొడవైన సొరంగంలోని పట్టాలపైనుంచి మోటార్ సైకిల్‌పై మరీ తుర్రుమన్నాడు. అమెరికా, మెక్సికో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలాయనం తర్వాత గుజ్మన్ తనకు పట్టున్న సినలోవాకు వెళ్లాడు. అక్కడి గుజ్మన్ స్వగ్రామం లాటూనాలో అతని తల్లి నివసిస్తోంది. గత అక్టోబర్‌లో కొండప్రాంతంలో అతడు పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. గుట్టల్లో కిందపడిపోవడంతో ముఖానికి, కాలికి గాయాలయ్యాయి. తర్వాత శుక్రవారం లోస్ మోచిస్లో మెక్సికో మెరైన్లు, ఆర్మీ జవాన్లు పకడ్బందీ ఆపరేషన్ నిర్వహించి అతన్ని అరెస్టు చేశారు. అరెస్టుకు ముందు హోరాహోరీ కాల్పులు జరిగాయి. -
1.5 కి.మీ. సొరంగం తవ్వి జైలు నుంచి పరారీ!
మెక్సికో: మెక్సికో మాదక ద్రవ్యాల వ్యాపార చీకటి సామ్రాజ్యానికి అధినేత(డ్రగ్‌లార్డ్) జోయాక్విన్ ‘ఎల్ చాపో’ గుజ్మాన్(58) మళ్లీ జైలు నుంచి తప్పించుకున్నాడు. జైలు గది కిందుగా ఏకంగా 1.7 మీటర్ల వెడల్పుతో ఒకటిన్నర కిలోమీటర్ల దూరం సొరంగం తవ్వి అతడు దాని ద్వారా పరారయ్యాడు! నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి ఆ సొరంగం తెరుచుకుని ఉంది. మెక్సికో సిటీకి 90 కి.మీ. దూరంలోని ఆల్టిప్లానో జైలులో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నా శనివారం రాత్రి అందరి కళ్లుగప్పి అతడు అదృశ్యమయ్యాడు. ప్రభుత్వానికి ఇది పెద్ద సవాలుగా మారడంతో గుజ్మాన్ కోసం మెక్సికన్ పోలీసులు, సైనికులు భారీ స్థాయిలో గాలింపు జరుపుతున్నారు. గుజ్మాన్ జైలు నుంచి తప్పించుకోవడం 14 ఏళ్లలో ఇది రెండోసారి.