Hyderabad: Man Got Cheated In Gay App - Sakshi
Sakshi News home page

గే యాప్‌లో ఛాటింగ్‌.. కొద్దిసేపట్లోనే పరిచయం.. ఇంటికి రమ్మని పిలిచి..

Published Fri, Aug 4 2023 6:26 AM | Last Updated on Fri, Aug 4 2023 10:55 AM

- - Sakshi

హైదరాబాద్‌: గే యాప్‌లో ఛాటింగ్‌ చేస్తుండగా హాయ్‌.. హాయ్‌.. అంటూ పలకరించుకున్నారు.. కొద్ది సేపటి లోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మా ఇంటికి రావాలంటూ అవతలి వ్యక్తి ఆహ్వానం మేరకు వెళ్లిన యువకుడిని కత్తితో బెదిరించి బ్రాస్లెట్‌తో పాటు నగదు లాక్కున్న సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–12 ప్రాంతానికి చెందిన యువకుడు(23) ఈ నెల 1న తన గే లకు సంబంధించి గ్లెండర్‌ యాప్‌లో చాటింగ్‌ చేస్తుండగా అవతలి వైపు నుంచి అఫ్రిది అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కాసేపు చాటింగ్‌ చేసుకున్న తరువాత తన గదికి రావాలంటూ ఆఫ్రిది లొకేషన్‌ పంపాడు. దీంతో సదరు యువకుడు ఆఫ్రిది గదికి వెళ్లగా కత్తి చూపించి న్యూడ్‌ వీడియోలు, ఫొటోలు తీశాడు.

బలవంతంగా అతడి చేతికి ఉన్న బ్రాస్లెట్‌తో పాటు గొలుసు, రూ. 2వేల నగదు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులు లాక్కున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అతడి భారి నుంచి తప్పించుకుని బయటపడిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు ఆఫ్రిదిని రౌడీషీటర్‌గా గుర్తించారు.

అదే తరహాలో మరో యువకుడిని..
నిందితుడు ఆఫ్రిది ఇదే తరహాలో మరో యువకుడిని బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12 భోళానగర్‌లోని తన గదికి రప్పించాడు. అనంతరం కత్తితో బెదిరించి దుస్తులు విప్పించి నగ్న దృశ్యాలు వీడియో తీయించాడు.

వీడియోలు ఎందుకు తీస్తున్నావంటూ నిలదీయగా అతడిపై దాడి చేయడమే కాకుండా తన స్నేహితుడు హరున్‌తో కలిసి దాడి చేసి రూ. 7వేల నగదు, బంగారు ఉంగరం లాక్కున్నాడు. ఫోన్‌ పే ద్వారా రూ. 20 వేలు మహ్మద్‌ ఉమర్‌ మొయినుద్దీన్‌ ఖాతాకు బదిలీ చేయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement