హైదరాబాద్: ఫిలింనగర్‌లోని మహాత్మాగాంధీ నగర్ వడ్డెర బస్తీలో మూడ్రోజుల క్రితం వంట గ్యాస్ లీకై దంపతులు ఒకరి తర్వాత ఒకరు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వీరి కుమారుడు గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. మహాత్మాగాంధీ నగర్ వడ్డెర బస్తీలో నివసించే మిర్యాల రమేష్.. ఇంట్లోని వంట గ్యాస్ లీకై న విషయాన్ని గ్రహించకుండా.. కరెంటు స్విచ్ వేయడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
కుటుంబ సభ్యులు మంటల్లో చిక్కుకొని గాయాలపాలయ్యారు. అదే రోజు రమేష్ మృతి చెందాడు. మరుసటి రోజు ఆయన భార్య శ్రీలత ఆస్పత్రిలో కన్నుమూసింది. తీవ్ర గాయాలపాలైన కుమారుడు హర్షవర్ధన్ గురువారం ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనతో వడ్డెర బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సోదరుడు మృతి చెందడంతో చెల్లెలు అనాథగా మారింది. ప్రస్తుతం ఈ బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment