హాయిగా నవ్వండి | Kajal Aggarwal chat with Tweeter Followers | Sakshi
Sakshi News home page

హాయిగా నవ్వండి

Sep 24 2019 12:24 AM | Updated on Sep 24 2019 12:24 AM

Kajal Aggarwal chat with Tweeter Followers - Sakshi

కాజల్‌ అగర్వాల్‌

నవ్వు మంచి మెడిసిన్‌ అంటుంటారు. ఆ మెడిసిన్‌ను ప్రతిరోజూ తీసుకోమంటున్నారు కాజల్‌ అగర్వాల్‌. తన ట్వీటర్‌ ఫాలోయర్స్‌ 30 లక్షలకు చేరుకున్న సందర్భంగా నెటిజన్లతో చాట్‌ చేశారు కాజల్‌. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘మీరు నవ్వినప్పుడు చాలా అందంగా ఉంటారు. అలా స్వచ్ఛంగా నవ్వడానికి మీ రహస్యం ఏమిటి?’ అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా, ‘‘మనలోని అంతరాత్మకు మన నవ్వు ఒక ప్రతిబింబమని నేను నమ్ముతాను.

నిజాయతీ గల నవ్వు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇతరులకు మన పట్ల సద్భావం కలిగేలా చేస్తుంది. నవ్వును ఓ అలవాటుగా మార్చుకోవడానికి రోజూ నవ్వుతూ  సంతోషంగా ఉండండి’’ అని బదులు ఇచ్చారు. ‘‘పెళ్లి వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వివాహ బంధానికి నేను రెడీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటాను’’ అని పెళ్లి గురించి ఓ ఫాలోయర్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ప్రస్తుతం ‘కాల్‌  సెంటర్, ఇండియన్‌ 2, ముంబై సాగ’ సినిమాలతో కాజల్‌ ఫుల్‌ బిజీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement