sunitha
-
అల్లు అర్జున్ను చూసి నేర్చుకోమని చెప్తా..: బాలీవుడ్ నటుడి భార్య
పుష్ప 2లో నటవిశ్వరూపం చూపించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌కు పూనకాలు తెప్పించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా చూశాక అల్లు అర్జున్‌కు పెద్ద అభిమాని అయిపోయానంటోంది బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవింద భార్య సునీత అహూజ.థియేటర్స్‌కు వెళ్లను, కానీ..తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీత మాట్లాడుతూ.. నేను పెద్దగా థియేటర్స్‌కు వెళ్లను. కానీ పుష్ప 2 సినిమా (Pushpa: The Rule) ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానని నా కుమారుడితో అన్నాను. అదే చేశాను కూడా! హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు కచ్చితంగా అల్లు అర్జున్ను కలుస్తాను. అతడు పడ్డ కష్టం సినిమాలో కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. సిక్స్ ప్యాక్ ఉందా? లేదా హ్యాండ్సమ్ లుక్స్‌తో ఉన్నాడా? అనేది ఇక్కడ విషయం కాదు. నా కుమారుడికీ అదే చెప్తాతన పనితనం తెలుస్తోంది. అతడిలా కష్టపడాలని నా కొడుక్కి కూడా ఎప్పుడూ చెప్తూ ఉంటాను అని పేర్కొంది. పుష్ప 2 సినిమా విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప: ద రైజ్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. అనసూయ భరద్వాజ్, సునీల్, జగపతిబాబు, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్రలు పోషించారు.చదవండి: ప్రభాస్ 'కల్కి' సినిమా.. అనంత శ్రీరామ్ సంచలన కామెంట్స్! -
భార్య మీద అనుమానంతో దుబాయ్ నుంచి వచ్చి...
కరీంనగర్ (మల్లాపూర్): అనుమానం పెనుభూతమై భార్యను గొంతు నొక్కి అతికిరాతకంగా చంపేశాడోభర్త. ఈ దారుణం మండలంలోని వెంకట్రావ్‌పేటలో బుధవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేంపల్లి గ్రామానికి చెందిన వెల్మల రమేశ్‌కు రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన సునీతతో 2015లో వివాహం జరిపించారు. వీరికి కూతురు ఆద్య (8), కుమారుడు జయసూర్య(6) సంతానం. కొంతకాలంగా వెంకట్రావ్‌పేటలో ఉంటున్నారు. రమేశ్ ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి వస్తున్నాడు. నెలక్రితం దుబాయ్ నుంచి వచ్చిన రమేశ్‌కు సునీత వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం కలిగింది. ఇదే విషయమై బుధవారం ఉదయం భార్యాభర్తలు గొడవపడ్డారు. దీంతో రమేశ్ క్షణికావేశంలో సునీత ముఖంపై బలంగా కొట్టాడు. గొంతు నులిమి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న సునీత కుటుంబసభ్యులు ఘటనాస్థలికి వెళ్లి బోరున విలపించారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్సై కిరణ్‌కుమార్ విచారణ చేపట్టారు. మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వర్రావు, కోరుట్ల సీఐ సురేష్‌బాబు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతురాలు తండ్రి మందల గంగరాజం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
తెలంగాణ కాంగ్రెస్‌లో ముసలం.. సునీతారావు సంచలన ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన వారికి న్యాయం జరగడం లేదన్నారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. కష్టపడిని వారిని పట్టించుకోవడం లేదని కామెంట్స్ చేశారు. గోషామహల్లో తనకు ఓడిపోయే సీటు ఇచ్చారని ఆరోపించారు.కాగా, సునీతా రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అమలు చేస్తున్న నారీ న్యాయ్ తెలంగాణలో జరగడం లేదు. అసెంబ్లీ టికెట్ వదులుకుంటే రూ.5కోట్లు ఇస్తానని బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ ఆఫర్ ఇచ్చాడు. అయినా నేను వదులుకోలేదు. ఓడిపోయే గోషామహల్ టికెట్ నాకు ఇచ్చారు. నాకు బీజేపీ, బీఆర్ఎస్ నుంచి టికెట్ ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. చివరకు బీజేపీ మహిళా అధ్యక్షురాలి పదవి కూడా ఇస్తానని చెప్పారు.. అయినా నేను పార్టీని వీడలేదు.ఇప్పుడు నన్ను అధ్యక్ష పదవి నుండి తప్పించాలని చూస్తున్నారు. కార్పొరేషన్ పదవులలో మహిళలకు అన్యాయం జరిగింది. పురుషులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. కష్టపడ్డ వారిని పట్టించుకోలేదు. మేము చేపట్టిన కార్యక్రమాలకు ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ రాలేదు. దీపాదాస్ మాకు టైమ్ ఇవ్వలేదు. మా ఫోన్ ఆమె లిఫ్ట్ చేయట్లేదు. ఈ విషయంలో కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ పెద్దలని కూడా కలిశాను. నేను చేసిన తప్పు ఏంటి?. ఎన్నికల్లో పోటీ చేయడం నా తప్పా?.మహిళ కాంగ్రెస్‌ను నడిపించడం అంత ఈజీ కాదు. కాంగ్రెస్ మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అల్కా లాంబ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. పార్టీలో కష్ట పడ్డవారికి కాకుండా వేరే వాళ్లకు అవకాశం ఇస్తే పోరాటం చేస్తాను. నేను అందరిని కలుపుకొనిపోయే వ్యక్తిని. అన్ని పదవులకు నేను అర్హురాలిని. మహిళలకు ఇక్కడ ప్రాధాన్యత లేదని ఏఐసీసీ ఇంచార్జ్ గురదీప్ సింగ్ సపర్ చెప్పారు. ఏ పదవి ఇచ్చినా చేపట్టడానికి నేను సిద్ధం. త్వరలో 33% మహిళ రిజర్వేషన్ అమలు చేస్తామని కేసీ వేణుగోపాల్, అల్కా లాంబ మాట ఇచ్చారు అంటూ కామెంట్స్ చేశారు. -
సునీతా విలియమ్స్ రాక ఎప్పుడు..? ‘మస్క్’ వైపు ‘నాసా’ చూపు
కాలిఫోర్నియా: ప్రముఖ ఏవియేషన్ కంపెనీ బోయింగ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలిందా.. ఏవియేషన్, స్పేస్‌టెక్ రంగాల్లో ఇప్పటికే అపఖ్యాతి మూటగట్టుకున్న కంపెనీ తాజాగా మరో పెద్ద సమస్య ఎదుర్కొంటోందా..? స్పేస్ టెక్నాలజీ రంగంలో ఈలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ బోయింగ్‌ను ఛాలెంజ్ చేస్తోందా..? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అవుననే చెబుతున్నాయి.ఇటీవలే భారత సంతతికి చెందినవ అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో మరో వ్యోమగామని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)కు తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సునీతా విలియమ్స్‌తో పాటు ఆమెతో వెళ్లిన మరో వ్యోమగామి భూమికి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.షెడ్యూల్ ప్రకారం వీరిరువురు జులై 2న తిరిగి భూమ్మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఐఎస్ఎస్కు అటాచ్ అయి ఉన్న స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకవుతున్నట్లు బోయింగ్‌తో పాటు నాసా గుర్తించాయి. ఈ కారణంగా స్టార్‌లైనర్‌లో సునీత తిరిగి రావడం మరింత ఆలస్యమవుతుందని నాసా భావిస్తోంది.దీంతో ఈలాన్ మస్క్‌కు స్పేస్ ఎక్స్‌కు చెందిన వ్యోమనౌక క్రూ డ్రాగన్‌లో సునీతతో పాటు మరో వ్యోమగామిని వెనక్కి రప్పించే అంశాన్ని నాసా పరిశీలిస్తోంది. అయితే ఈ విషయాన్ని బయటికి వెల్లడించడం లేదు. మార్చ్‌లో నలుగురు వ్యోమగాములను ఐఎస్ఎస్కు తీసుకువెళ్లిన క్రూ డ్రాగన్ అంతరిక్షంలో రెడీగా ఉంది.దీనిలో ఇద్దరు లేదా నలుగురు లేదా మరింతమందిని భూమ్మీదకు తీసుకువచ్చే వెసులుబాటు ఉంది. స్టార్‌లైనర్ మరమ్మతులు గనుక సమయానికి పూర్తి కాకపోతే మస్క్ క్రూ డ్రాగన్‌లోనే సునీత తిరిగి రావొచ్చు. ఇదే జరిగితే స్పేస్ వ్యోమగాముల ప్రయాణానికి సంబంధించి బోయింగ్‌పై మస్క్ స్పేస్ ఎక్స్ పైచేయి సాధించినట్లేనని చెబుతున్నారు. -
పుట్టినరోజున టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత అరుదైన ఘనత
టాలీవుడ్ లేడీ సింగర్స్ అనగానే కొన్నిపేర్లు గుర్తొస్తాయి. వాటిలో టాప్‌లో కచ్చితంగా సునీత పేరు ఉంటుంది. 'ఈ వేళలో నీవు' అనే పాటతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సునీత తన మధురమైన స్వరంతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.(ఇదీ చదవండి: యాంకర్ శ్రీముఖికి త్వరలో పెళ్లి? రివీల్ చేసిన 'జబర్దస్త్' కమెడియన్)సునీత పుట్టినరోజుని ఈమె అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా సింగర్ సునీత ఫాన్స్.. న్యూయార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లో సునీత వీడియోను ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు. ఇప్పటి వరకు అతికొద్ది మందికే ఈ అరుదైన అవకాశం లభించగా.. ఇప్పుడు సునీత కూడా ఆ జాబితాలో చేరారు.పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు సునీత ఇప్పటి వరకు పొందిన అవార్డులతో పాటు ఆమె సాధించిన పురస్కారాలతో కూడిన వీడియోను న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌లో ప్లే చేశారు. మే 12 తేదీన ప్రతి గంటకు 60సెకండ్ల పాటు ఈ వీడియో ప్రదర్శించడం విశేషం.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి కన్నుమూత.. నటుడు ఎమోషనల్ పోస్ట్) -
వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..
-
వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సునీత, సీబీఐ అధికారి రాంసింగ్‌కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. వీరు వేసిన క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.కేసు పూర్వపరాలేంటీ? మాజీ మంత్రి వివేకానంద రెడ్డికి పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి 2021 డిసెంబర్లో పులివెందుల కోర్టులో ఒక ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి కొందరు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి పేర్లు చెప్పాలంటూ సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ ఒత్తిడి చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ ఒత్తిడి చేశారని ఆరోపించారు. కృష్ణా రెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు 2023 డిసెంబర్ 8న విచారణ జరిపింది. కేసు నమోదు చేసి తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీత, రాంసింగ్‌పై కేసులు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ సునీత, ఆమె భర్త రాజశేఖర్, ఎస్పీ రామ్‌సింగ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.హైకోర్టు ఏం చెప్పింది?వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పెట్టిన కేసును కొట్టేయాలన్న సునీత, రాజశేఖర్ రెడ్డి, రాంసింగ్ వాదనలను ఏపీ హైకోర్టు అంగీకరించలేదు. వీరు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. చదవండి : నర్రెడ్డి సునీత, రాజశేఖర్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలుకృష్ణారెడ్డి ఏం చెబుతున్నారు? "వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత దంపతుల పాత్ర అనుమానస్పదంగా ఉంది. ఈ హత్య సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కుట్ర అని భావిస్తున్నాను. వారిద్దరితోపాటు శివప్రకాశ్‌రెడ్డిల తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా రెండో పెళ్లితోనే ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలని వివేకానందరెడ్డి భావించడంతో హత్య జరిగినట్టు భావిస్తున్నాను. వివేకా లెటర్‌ను దాచిపెట్టమని ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి స్వయంగా చెప్పారు. ఆ తర్వాత కూడా అబద్ధం చెప్పాలని సునీత, రాజశేఖర్‌రెడ్డి నన్ను వేధించారు. ఈ హత్యకు కారణం ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని నాపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు, సీబీఐ అధికారులు చిత్రహింసలకు గురిచేశారు. నేను అబద్ధం చెప్పకపోతే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందని సునీత అన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడం వెనుక పక్కా కుట్ర ఉంది. అవినాశ్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడం కోసం చివరి వరకూ వివేకా కృషి చేశారు" అని వివేకా పీఏ కృష్ణారెడ్డి వెల్లడించారు.చదవండి : వైఎస్ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఇంటర్వ్యూ పూర్తి పాఠం -
చంద్రబాబు ట్రాప్‌లో షర్మిల, సునీత
పులివెందుల/లింగాల: తన అక్కలైన షర్మిల, సునీతలు చంద్రబాబు ట్రాప్‌లోపడి తమపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి చెప్పారు. 2021 నుంచి వారిద్దరూ తనను మానసికంగా ఎంతో ఇబ్బందిపాల్జేశారన్నారు. చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ, ఎల్లో మీడియా ఏ స్క్రిప్ట్ ఇస్తే అది చదివి ఇష్టమొచ్చినట్లు నన్ను, జగనన్నను తిడుతున్నారని.. అయినా, వారిపట్ల తనకెలాంటి కోపంలేదని చెప్పారు. వైఎస్ వివేకాను హత్యచేశానన్న వ్యక్తిని వారు ప్రోత్సహిస్తున్నారని, అతడు పులివెందుల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నా.. అతడిని ఓడించాలని ఒక్కమాట కూడా అనడంలేదన్నారు. హంతకుడు అప్రూవర్‌గా మారడంతో అతడినే సోదరుడిగా భావిస్తున్నారన్నారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండల కేంద్రంలో అవినాశ్‌రెడ్డి రోడ్ షో, బస్టాండులో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..సభ్యతతో ప్రతి విమర్శలు చేయడంలేదు..వారిద్దరూ తనను ఎన్ని విమర్శలు చేసినా అదే రీతిలో తాను చేయగలను. కానీ, సభ్యత, సంస్కారాలవల్ల చేయడంలేదు. మా నాన్నను తప్పుడు ఆరోపణలతో 385 రోజులు జైల్లో పెట్టారు. ఎవరికీ ద్రోహం చేయలేదు, మనకెందుకీ శిక్ష అని అంటూ ఆయన బాధపడ్డారు. దేవుడి దయ, మీ ఆశీస్సులు ఉన్నంతవరకు మేం ఎప్పటికీ ప్రజల మధ్యనే ఉంటాం. ఇక దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిల మరణాలకు కారణం ఎవరు? ఎక్కడ కుట్ర జరిగింది? ఎవరికి మేలు చేసేందుకు ఇలాంటివి చేశారన్న నిజాలను ఎన్నివేల అడుగుల లోతున దాచిపెట్టి ఉన్నా బయటికి వస్తాయి. వారికి కడప కోర్టు జరిమానా..వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చి టీడీపీకి లబ్ధిచేకూర్చాలని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి టార్గెట్ ఇచ్చారు. ఎంతమంది కలిసి వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని, వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఏమీచేయలేరు. ఇక కొద్ది గంటలముందే కడప కోర్టు వీరుచేసే దుష్ప్రచారాలకు జరిమానా విధించింది. కేసు ట్రయిల్‌కు రాకముందే మీరెలా మాట్లాడతారని షర్మిలక్కకు, సునీతక్కకు, వారి సోదరుడు బీటెక్ రవికి రూ.10 వేలు జరిమానా విధించింది.న్యాయస్థానాలు కూడా వీరు చేసేది తప్పని చెబుతున్నాయి. వీరి టార్గెట్ కేవలం వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే. నా నిజాయితీని నూరు శాతం నిరూపించుకుంటా. ఇక ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లువేసి, వేయించి ఎమ్మెల్యే అభ్యర్థి వైఎస్ జగన్మోహన్రెడ్డిని, ఎంపీ అభ్యర్థినైన నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మా కష్టకాలంలో మీరు చూపిన ప్రేమ నేను జీవితాంతం మర్చిపోలేను. -
మా అక్కలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడతా: వైఎస్ అవినాష్
సాక్షి, వైఎస్సార్: టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. వీరితో పోరాడే శక్తిని ప్రజలే నాకు ఇస్తారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ప్రతీరోజు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుని పచ్చ మీడియాకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. 2021 తర్వాత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నోటికి ఎంత మాట వస్తే అంత వరకు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లు అలా మాట్లాడుతుంటే కోపం కంటే ఎక్కువగా బాధేస్తోంది. వాళ్లే నన్ను టార్గెట్ చేస్తున్నారు.రెండున్నరేళ్లు ఎవరూ మాట్లాడలేదు. వాచ్మెన్ రంగన్నకు నార్కో అనాలసిస్ టెస్ట్ చేసినా ఏమీ మాట్లాడలేదు. రెండున్నరేళ్ల తర్వాత రంగన్న మాట్లాడుతున్నాడు. ఓవైపు తానే చంపానని చెబుతున్న దస్తగిరి గురించి వీరద్దరూ ఏమీ అనడం లేదు. అతను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి బయట తిరుగుతున్నాడు. అన్నీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు మాటలు చెబుతున్నారు.వైఎస్ భాస్కర్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉండి ఏ పని కావాలన్నా చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టించారు. నా తప్పు లేకపోయినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా గట్టిగా నిలబడతాం. మీ అందరి మద్దతుతో గెలిచి తీరుతాను. ఇప్పుడు తిట్టిన వాళ్లే మళ్లీ క్షమాపణలు చెప్పాలి.. అది నేను వినాలి. వివేకం చిన్నాన్నను చంపిన వాస్తవం వెలుగులోకి వస్తుంది. ఈ కుట్రలు ఎవరో చేశారో తప్పకుండా బయటకు వస్తుంది.దివంగత వైఎస్సార్ తాను బ్రతికినంత కాలం.. టీడీపీ, ఈనాడుతో పోరాడారు. అటువంటి వారితో ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు. మీరు వాళ్ల వారసులా.. లేక వైఎస్సార్ వారసులా?. నన్ను కనుమరుగు చేయాలంటే దేవుడు ఒప్పుకోడు. మా అక్కలతో పోరాడే శక్తిని ప్రజలే ఇస్తారు. వైఎస్సార్సీపీ ఓట్లు చీల్చి టీడీపీకి లబ్ధి చేకూర్చాలనేది షర్మిలకు కాంగ్రెస్ పెట్టిన టాస్క్. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరిది నాటకమో.. ఎవరు నిజమో ప్రజలే నిర్ణయిస్తారు అని కామెంట్స్ చేశారు. -
నర్రెడ్డి సునీత, రాజశేఖర్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
పులివెందుల: నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి చాలా నీచంగా మాట్లాడుతున్నారని వైఎస్ వివేకానందరెడ్డి వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నర్రెడ్డి దంపతులు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినవనీ అబద్ధాలేనని తెలిపారు. కడుపుకు అన్నం తినేవాళ్లెవరూ ఇలా మాట్లాడరన్నారు. భార్యాభర్త రోజుకో అబద్ధపు స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారు. నర్రెడ్డి బ్రదర్స్ నాటకాలాడుతున్నారని చెప్పారు. వైఎస్ వివేకా రక్తపు వాంతులతో చనిపోయాడని తాను నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో చెప్పలేదన్నారు. రూము మొత్తం రక్తపు మరకలున్నాయని, తలపైన గాయం ఉందని, బాడీ మొత్తం రక్తంలో ఉందని, సైడు వాకిలి, బెడ్ రూము వాకిలి తెరచి ఉన్నాయని, ఏసీ ఆన్‌లో ఉందని చెప్పానని తెలిపారు. రక్తపు వాంతులని ఎర్ర గంగిరెడ్డి అనగా, ఇంత రక్తం ఉంటే వాంతులంటావేమిటని తాను ఆయనతో వాదించానన్నారు. అలాంటిది రాజశేఖర్‌రెడ్డికి రక్తపు వాంతులని ఎలా చెబుతానని అన్నారు. అలాగే తాను వైఎస్ వివేకా లెటర్‌ను దాచిపెట్టడానికి ప్రయత్నం చేశానన్నారని, అదీ అబద్ధమేనని తెలిపారు. లెటర్ గురించి తాను రాజశేఖర్‌రెడ్డికి ఫోన్లో చెప్పగా ఆయనే దాచమన్నారని చెప్పారు. పోలీసులతో సమస్య కదా అని తాను అంటే ఆ విషయం ఆయనే చూసుకుంటానని చెప్పారన్నారు.అవినాశ్‌రెడ్డి తనను మేనేజ్ చేశారనడం నిజం కాదన్నారు. నర్రెడ్డి దంపతులే తనను మేనేజ్ చేయాలని చూసి విఫలమయ్యారని చెప్పారు. లెటర్ దాచిపెట్టమని చెప్పిన వారిని కేసులో పెడతారని, కానీ వీరు అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకులతో కలిసి పోలీసులను మేనేజ్ చేసి తనను, మరో అమాయకుడైన ప్రకాష్‌ను కేసులో ఇరికించారన్నారు. తనది చిన్న ప్రాణం కాబట్టి ఇరికించారని, వారి కారణంగా తాను ఉద్యోగానికి 9 నెలలు సస్పెన్షన్‌కు గురయ్యానని, ప్రమోషన్, పాస్‌పోర్ట్ రెన్యువల్ ఆగిపోయాయన్నారు. తాను ఇప్పుడు 20 శాతం విషయాలే చెబుతున్నానని, మరలా మిగిలిన విషయాలు చెబుతానన్నారు.తాను వైఎస్ వివేకా దగ్గర 37 సంవత్సరాలు ఏ జీతం తీసుకోకుండా పని చేశానని తెలిపారు. వివేకాను తాను చూసుకున్నట్లు వారి ఇంట్లో వారు కూడా చూసుకోలేదన్నారు. వివేకా తన ముందరే ఎన్నోసార్లు వారిని ఛీ కొట్టారని తెలిపారు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్‌రెడ్డి వారి బావ వివేకా ద్వారా కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని, అయినా వారిలో ఆశ చావలేదన్నారు. వివేకా రెండో వివాహం కారణంగా వారికి ఆయనతో తీవ్ర మనస్పర్థలు వచ్చాయన్నారు. వివేకా రెండో భార్య షమీమ్ కుమారుడికి ఆస్తులు పోకుండా రాజకీయంగా వివేకా ద్వారా ఎదగాలని విఫలమై ఈ రోజు వేరేవారిపై నిందలు వేస్తున్నారన్నారు. గతంలో డ్రైవర్‌గా దస్తగిరిని తొలగిస్తేనే పులివెందుల వస్తానని వివేకాకు రాజశేఖర్ గట్టిగా చెప్పడంతో ఆయన తొలగించారన్నారు. ఇప్పుడు అదే దస్తగిరిని ముందర పెట్టుకుని వీరు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. రామ్‌సింగ్ చెప్పినట్లు వినాలని సునీత బెదిరించారుఓసారి సునీత దంపతులు తనను హైదరాబాద్‌కు పిలిపించుకొని, రామ్‌సింగ్ చెప్పినట్లు వికపోతే కేసులో ఇరుక్కుంటావని బెదిరించారన్నారు. తాను అబద్ధం చెప్పనని కరాఖండిగా చెప్పానన్నారు. ఆ సమయంలో కృష్ణారెడ్డి మన మాట వినకపోతే నువ్వు కేసులో ఇరుక్కుంటావని రాజశేఖర్‌తో సునీత అన్నారని చెప్పారు. దీనికి అర్థమేమిటో మీడియా సోదరులే ఆలోచించుకోవాలని అన్నారు. ఎప్పటికైనా ఈ కేసులో రాజశేఖర్ జైలుకు వెళ్లక తప్పదన్నారు.వారి ముగ్గురు పేర్లు చెప్పాలని రామ్‌సింగ్ కొట్టాడుఢిల్లీలో సీబీఐ అధికారి రామ్‌సింగ్ నెలరోజుల పాటు తనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడన్నారు. హత్యలో వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి హస్తం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని తీవ్రంగా కొట్టేవాడన్నారు. ఎంతకీ తాను ఒప్పుకోకపోవడంతో వదిలేశారన్నారు. ఆతర్వాత ఒకరోజు రామ్‌సింగ్ వాట్సప్ కాల్ చేసి తన కుమారుడిని తీసుకొని కడపకు రమ్మని చెప్పాడన్నారు.తామిద్దరం మరుసటిరోజు రామ్‌సింగ్ వద్దకు వెళ్లగా, వివేకా హత్యలో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డిల హస్తం ఉన్నట్లు చెప్పాలంటూ తన కుమారుడి ఎదుటే కట్టెతో కొట్టాడన్నారు. దస్తగిరి, రంగన్న చెప్పినట్లు విన్నారని, వారిని సేవ్ చేశామని, నువ్వు వినకపోతే కేసులో ఇరికిస్తామని చెప్పాడన్నారు. తన బెయిల్ రద్దు చేసి మళ్లీ జైలుకు పంపిస్తామని బెదిరించాడన్నారు. తాను అబద్ధం చెప్పనని గట్టిగా చెప్పడంతో పంపించేశాడన్నారు. కృష్ణారెడ్డి మాట వినలేదని సునీత దంపతులకు రామ్‌సింగ్ చెప్పగా.. తన కుమారుడితో వివాహం కుదుర్చుకున్న గుంటూరుకు చెందిన మా వియ్యంకుడికి సునీత ఫోన్ చేసి కృష్ణారెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేయిస్తామని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని, వివాహం రద్దు చేసుకోవాలని బెదిరించారని, దీంతో వారు భయపడి వివాహం రద్దు చేసుకున్నారని తెలిపారు.నాకేదైనా జరిగితే వారిదే బాధ్యతతనకు ఇప్పటికీ కొంతమంది నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వారి పేర్లు త్వరలో బయటపెడతానన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు ఏదైనా జరిగితే సునీత, రాజశేఖర్, శివప్రకాష్‌రెడ్డిలే బాధ్యులవుతారని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు స్పందించకపోవడంతో కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నానన్నారు. కేవలం రాజకీయ ఎదుగుదల కోసం సునీత దంపతులు అవినాశ్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని కృష్ణారెడ్డి తెలిపారు. -
సునీత, షర్మిలకు కొండా రాఘవరెడ్డి సవాల్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్ వివేకా హత్య కేసులో ఛార్జ్‌షీట్ తీసుకుని రండి.. బహిరంగ చర్చకు సిద్ధమా.. ఎక్కడికైనా వస్తానంటూ సునీత, షర్మిలకు వైఎస్సార్టీపీ మాజీ నేత కొండా రాఘవరెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 11 లోపు తన సవాల్‌పై స్పందించాలన్నారు.‘‘షర్మిల స్పష్టంగా తెలుసుకుని వాస్తవాలు మాట్లాడాలి. నాడు షర్మిలను పాదయాత్ర చేయమని ఎవరూ అడగలేదు. వైఎస్ సోదరి విమలమ్మ మీ వెంట ఎందుకు లేరు?. వైఎస్ సోదరులు సైతం మీకు మద్దతు ఇవ్వడం లేదు. వివేకా మృతి తర్వాత ఎన్నిసార్లు ఆయన సమాధి వద్దకు వెళ్లారు’ అంటూ కొండా రాఘవరెడ్డి ప్రశ్నించారు.‘‘షర్మిల దుర్మార్గపు పనులు చేస్తున్నారు కాబట్టే.. కుటుంబం నుంచి కూడా ఆమెకు మద్దతు లేదు. రూ.వెయ్యి కోట్ల పని చేయనందుకే షర్మిల వ్యతిరేకంగా మారింది. వైఎస్ పేరును చెడ్డగొట్టడానికి షర్మిల కుట్రలు చేస్తోంది. సీఎం జగన్, పొన్నవోలుపై షర్మిల వ్యాఖ్యలు సరికాదు. షర్మిల ప్రచారానికి స్పందన లేక ఫ్రస్ట్రేషన్‌కు గురవుతుంది. బాబు, పవన్ స్క్రిప్ట్ షర్మిల చదువుతుంది. వైఎస్ విజయమ్మ మాట పెడచెవిన పెట్టినప్పుడే షర్మిల అంశం ముగిసింది’’ అని కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు.‘‘షర్మిల మోసాలు, అక్రమాలు బయట పెట్టడానికి నేను ఒక్కడిని చాలు. తెలంగాణలో షర్మిల వందల కుటుంబాలను మోసం చేశారు. జగన్, షర్మిల పెళ్లికి చంద్రబాబును వైఎస్ పిలిచారన్నది అబద్ధం. బాబు ఆడుతున్న ఆటలో షర్మిల పాచిక అయింది. వైఎస్ జగన్‌కు అద్ధం చూపడం దుర్మార్గం. ఒకసారి ఇంటికి వెళ్లి ఆ అద్ధంలో మీ ముఖం చూసుకోండి. తెలంగాణలో ఏం మాట్లాడారు. ఏపీలో మాట్లాడారో ఒకసారి చూసుకోండి. షర్మిలకు పిచ్చి ముదిరి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది’’ అని కొండా రాఘవరెడ్డి మండిపడ్డారు. -
నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకా హత్య ఐదేళ్ల క్రితం జరిగితే ఇప్పుడెందుకు దాని గురించి ఇంతలా మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె సునీత, టీడీపీ నేత బీటెక్ రవిని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుకు ఎందుకు మసాలా జోడిస్తున్నారని నిలదీసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించింది. ఓవైపు కేసు విచారణలో ఉంటే నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడని ఎలా చెబుతారని నిలదీసింది. అలాగే హంతకుడిని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని ఎలా అంటారని ప్రశ్నించింది. ఇలా చెప్పడం తప్పు కాదా? నేరపూరిత చర్యల కిందకు రాదా? అని నిలదీసింది. అలాంటప్పుడు కడప కోర్టు అంత అత్యవసరంగా ఎందుకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని బీటెక్ రవి తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు ప్రశ్నించారు. దీనికి హైకోర్టు ఘాటుగా స్పందించింది. కోర్టును నిందించవద్దని హెచ్చరించింది. వివేకా హత్య గురించి మాట్లాడొద్దని, అలాగే తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారం చేయొద్దంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ బీటెక్ రవి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై వీలైనంత త్వరగా విచారణ ముగించాలని కడప జిల్లా కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 8లోపు నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది.తద్వారా కడప జిల్లా కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత, బీటెక్ రవి, షర్మిల దాఖలు చేసిన వ్యాజ్యాలను పరిష్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.వివేకా హత్య కేసుకు మసాలా ఎందుకు కలుపుతున్నారు..?ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారని ప్రశ్నించింది. అలా హంతకుడని చెప్పడం కోర్టు ధిక్కారమే అవుతుందని వైఎస్సార్సీపీ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. తిరిగి ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఫలానా వ్యక్తి (ముఖ్యమంత్రి) నిందితులను రక్షిస్తున్నారని ఎలా చెబుతారని నిలదీసింది. వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్ పబ్లిక్ డాక్యుమెంట్ అని, తాము మాట్లాడుతోంది అందులో అంశాలనేనని మురళీధరరావు చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ.. వివేకా హత్య కేసుకు ఎందుకు మసాలా కలుపుతున్నారని ప్రశ్నించింది. తాము అలాంటిదేమీ చేయడం లేదని గత ఎన్నికల్లో వివేకా హత్య కేసును నారాసుర రక్తచరిత్ర అంటూ ఎన్నికల్లో వాడుకున్నారన్నారు. అదే తాము మాట్లాడుతుంటే తప్పుపడుతున్నారన్నారు. సునీత తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నేతల వ్యాఖ్యలపై అభ్యంతరాలుంటే ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అలాంటిదేమీ చేయకుండా నేరుగా కోర్టులో వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ నెల 8 తేదీలోపు బీటెక్ రవి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం వెలువరించాలని కడప జిల్లా కోర్టును ఆదేశించింది.సునీత తదితరుల వ్యాజ్యాలకు విచారణార్హతే లేదు..వైఎస్సార్సీపీ తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ సునీత, తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ బీటెక్ రవి తదితరులు అక్కడే పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. వాటిపై కడప జిల్లా కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. మళ్లీ ఇదే అంశంపైనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, ఇది ఏమాత్రం సరికాదన్నారు. తాము పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని గడువు ఇవ్వాలని కోరారు. బీటెక్ రవి తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. వైఎస్సార్సీపీ పిటిషన్లో ప్రతివాదులుగా ఉన్న తమ వాదనలు వినకుండానే కడప జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. -
కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
సాక్షి, విజయవాడ: వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మాట్లాడకూడదంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడుతారని షర్మిల, బీటెక్ రవి, సునీతలను ప్రశ్నించింది. అలా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని పేర్కొంది. కేసు విచారణలో ఉండగానే ఒక వ్యక్తిని హంతకుడు అని ఎలా చెబుతారని ప్రశ్నించింది. హంతకుడు అనే ముద్ర ఎలా వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసింది. హతకుడ్ని ముఖ్యమంత్రి రక్షిస్తున్నారని ఎలా చెబుతారన్న హైకోర్టు అలా చెప్పటం తప్పు అని తెలిపింది.ఇలా చెప్పటం నేరపురితమైన చర్యలు కిందకు వస్తుంని పేర్కొంది. అయిదు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనపై ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని షర్మిల, బీటెక్ రవి, సునీతలను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. ఈ మేరకు వివేకా హత్యపై మాట్లాడకూడదు అంటూ కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. -
చంద్రబాబు చేతిలో షర్మిల రిమోట్ కంట్రోల్: వాసిరెడ్డి పద్మ
సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ ఫ్యామిలీపై షర్మిల విషం కక్కుతున్నారని వైఎస్సార్సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒకరి చేతిలోని రిమోట్‌లాగా జగన్ వ్యవహరిస్తారా? ఆ సంగతి మీకు తెలీదా? అంటూ దుయ్యబట్టారు.చంద్రబాబు జేబు బొమ్మలులాగా షర్మిల, సునీత మాట్లాడుతున్నారు. వ్యక్తిగతమైన ఎజెండాతో షర్మిల మాట్లాడుతున్నారు. అవినాష్‌రెడ్డికి సీటు ఇస్తే ఇంత విషం చిమ్మాలా?. వైఎస్సార్సీపీ ఓటు చీల్చటమే పనిగా షర్మిల పెట్టుకున్నారు. ఆమె టార్గెట్ వెనుక చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు చేతిలో రిమోట్ కంట్రోల్ షర్మిల’’ అంటూ వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు.‘‘ఎన్నో కోట్లమంది ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు. జగన్‌కి చెల్లెళ్లు అనే హోదా తప్ప షర్మిల, సునీతలకు ఈ రాష్ట్రంలో ఏముంది?. వారు మాట్లాడేవన్నీ ఎల్లో మీడియా హైలెట్ చేస్తోంది. వారం తర్వాత ఎల్లోమీడియా మీ ముఖాలను టీవీలో చూపించదు. ఆ సంగతి గుర్తు పెట్టుకోండి. ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఎల్లోమీడియా అసలు పట్టించుకోదు.షర్మిల, సునీత చూపుతున్న ఉన్మాదం వలన వారికే నష్టం’’ అని వాసిరెడ్డి పద్మ చెప్పారు.వైఎస్సార్‌కుటుంబం ఎటుపోయినా పర్లేదు అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. వివేకా పరువు నడిరోడ్డు మీద పెట్టారు. షర్మిలకి మెదడు పని చేస్తుందా?. కాంగ్రెస్ పార్టీ తప్పు లేదని ఇప్పుడు షర్మిల అనటం వెనుక కారణం ఏంటి?. వైఎస్సార్ పేరును ఎఫ్.ఐ.ఆర్.లో చేర్చారనే బాధతో లాయర్ సుధాకర్ రెడ్డి కేసు వేశారు. ఆ కేసులో వైఎస్సార్ పేరు ప్రస్తావన ఉందా?. అవినాష్‌కి సీటు ఇస్తే షర్మిలకు ఎందుకు అంత కోపం?. మీరు చెప్పినట్టు జగన్ వినలేదని చంద్రబాబు జేబులో బొమ్మలుగా మారుతారా?. జగన్ చెల్లెల్లు కాకపోతే అసలు షర్మిల, సునీతలను ఎవరు పట్టించుకుంటారు?’’ అని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. -
మీరా వైఎస్సార్ వారసులు ?..జగన్ స్ట్రాంగ్ కౌంటర్
-
కడప కోర్టు ఉత్తర్వుల రద్దు కోరుతూ పిటిషన్లు
సాక్షి, అమరావతి: సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నర్రెడ్డి సునీత, టీడీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) హైకోర్టును ఆశ్రయించారు. కడప జిల్లా కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వారు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి బీటెక్ రవి తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అత్యవసర విచారణ అవసరం లేదన్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరుపుతామంది. ఈ వ్యాజ్యం విచారణ నుంచి తాము తప్పుకుంటామని ధర్మాసనం మౌఖికంగా తెలిపింది. ‘మా వాదన వినలేదు’ కడప జిల్లా కోర్టు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, తమ వాదన వినకుండా ఏకపక్షంగా తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని బీటెక్ రవి, సునీత తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు. బాధితులు సూట్ దాఖలు చేయాల్సి ఉండగా.. పార్టీ తరఫున దాఖలు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదన్నారు. ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కావన్నారు. కడప కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా కడప కోర్టు తమ వాక్ స్వాతంత్య్రపు హక్కును నిరోధించిందని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. మధ్యంతర ఉత్తర్వుల పేరుతో జిల్లా కోర్టు తుది అభిప్రాయానికి వచ్చిందన్నారు. ఎన్నికల వేళ ప్రజాబాహుళ్యంలో ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలియచేసే హక్కు తమకు ఉందన్నారు. -
అంతా బాబు జట్టే.. పచ్చ కుట్రే..
సాక్షి, అమరావతి: ‘పచ్చ’ ముఠా ముసుగు పూర్తిగా తొలగిపోయింది. చంద్రబాబు, నర్రెడ్డి సునీత, షర్మిల, పవన్ కళ్యాణ్, లోకేశ్, పురందేశ్వరి, బీటెక్ రవి అంతా ఒకే తానులో ముక్కలని తేటతెల్లమైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వారికి కావాల్సింది రాజకీయ ప్రయోజనాలే తప్ప, అసలు హంతకులకు శిక్ష పడటం కాదన్న విషయం మరోసారి తేటతెల్లమైంది. వివేకాను రాజకీయంగా, ఆ తర్వాత భౌతికంగానూ తొలగించుకొన్న వారితో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటకాగుతున్నారన్న విభ్రాంతికర వాస్తవం మరోసారి సాక్ష్కాత్కరించింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున, ఈ కేసుపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్నందున ఈ ఉదంతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకూడదన్న పులివెందుల న్యాయస్థానం తీర్పును అందరూ శిరసావహిస్తారని భావించారు. కానీ, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేయడం పచ్చ కుట్రను బయటపెట్టంది. రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నేతగా ఉన్న వివేకానందరెడ్డిని తానే ఓడించానని చంద్రబాబు నమ్మిన బంటు సీఎం రమేష్ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు వివేకాను అంతమొందించే కుట్రకు ఎంత ముందుగా భూమికను సిద్ధం చేశారో అర్థమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వివేకా హత్యను రాజకీయంగా వాడుకోవడానికి చంద్రబాబు చాలా ముందుగానే స్క్రిప్టు సిద్ధం చేశారు. దస్తగిరి, సునీత, సౌభాగ్యమ్మ, షర్మిల.. ఇలా పలువురు పాత్రధారులు తెరపైకి వస్తూ వారికి ఇచ్చిన డైలాగులు చెబుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత మరింతగా విషం చిమ్మేందుకు తెగించారు. ఓటర్లను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడాలని, సామరస్యపూర్వక రాజకీయ వాతావరణంలో ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ భావించింది. పలు న్యాయస్థానాల్లో విచారణ సాగుతున్న ఈ హత్యపై ఎవరూ మాట్లాడటం సరైన విధానం కాదని కూడా అభిప్రాయపడింది. ఇదే అంశాన్ని విన్నవిస్తూ చంద్రబాబు, నర్రెడ్డి సునీత, షర్మిల, లోకేశ్, పవన్, పురందేశ్వరి, బీటెక్ రవిని ప్రతివాదులుగా చేరుస్తూ పులివెందుల న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్ వివేకా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకుండా కట్టడి చేయాలని కోరింది. ఈ పిటిషన్లో పేర్కొన్న అంశాలతో న్యాయస్థానం ఏకీభవించింది. వైఎస్ వివేకా హత్య కేసు గురించి ఎవరూ మాట్లాడవద్దని ఈ నెల 16న తీర్పునిచ్చింది. మంచి ఉద్దేశంతో న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు అడ్డగోలు రాజకీయ ప్రయోజనాలే లక్ష్యమైన చంద్రబాబు అండ్ కోకు మింగుడు పడలేదు. దీంతో పక్కా పన్నాగంతో మొదట సునీతతో ఈ తీర్పుపై అభ్యంతరం తెలిపారు. ఆమె హైకోర్టులో ఈ తీర్పును సవాల్ చేస్తారని అందరూ భావించారు. కానీ, పులివెందుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి హైకోర్టులో సవాల్ చేశారు. తీర్పుపై సునీత వెలిబుచ్చిన అభిప్రాయాలనే ఈ పిటిషన్లో ప్రస్తావించారు. తద్వారా అంతా చంద్రబాబు తానులో ముక్కలేనని స్పష్టం చేశారు. చంద్రబాబు కుట్రలో పాత్రధారుల ప్రవేశం ఇలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కొనే సత్తా లేక కుట్ర రాజకీయాలు చేస్తున్నానని చంద్రబాబు మరోసారి పరోక్షంగా చెప్పారు. 2019 మార్చి 15న వివేకా హత్యకు గురైన వెంటనే వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యంగా అప్పటి సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రచారంలోకి తీసుకువచ్చిన కట్టుకథను ప్రజలు ఆ ఎన్నికల్లో తిప్పికొట్టారు. ఎన్నికల తరువాత చంద్రబాబు రూటు మార్చారు. తాము చేసిన నిరాధార ఆరోపణలనే వైఎస్ వివేకా కుటుంబ సభ్యులతో చెప్పించే సరికొత్త డ్రామాకు తెరతీశారు. ముందుగా వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతతో మూడేళ్లకుపైగా డ్రామా నడిపించారు. ఆ తరువాత బాబు స్క్రిప్ట్ ప్రకారమే షర్మిలను రాష్ట్ర రాజకీయ తెరపైకి తెచ్చారు. సునీత చేస్తున్న నిరాధార ఆరోపణలనే షర్మిల కూడా వినిపిస్తున్నారు. ఇటీవల వివేకా సతీమణి సౌభాగ్యమ్మనూ తెరపైకి తెచ్చారు. వివేకా వర్ధంతి కార్యక్రమంలో సౌభాగ్యమ్మ, సునీత, షర్మిలతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఒకే వేదికపై ఆశీనులయ్యారు. వారందరి ప్రసంగాలు ఒకే రాజకీయ లక్ష్యంతో సాగడం గమనార్హం. తాజాగా పులివెందుల కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సునీత, బీటెక్ రవి ఒకేలా చంద్రబాబు పాటనే పాడారు. వివేకా శత్రువులు, హంతకులతోనే జట్టు కట్టిన సునీత దంపతులు వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తీరు మొదటి నుంచి అత్యంత వివాదాస్పదంగా, సందేహాస్పదంగా ఉంది. వివేకాను 2017లో రాజకీయంగా వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్సీగా ఓడించిన బీటెక్ రవి తదితరులతో వారు సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. 2017లో వైఎస్సార్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పూర్తి మెజార్టీ ఉంది. అయినప్పటికీ, వైఎస్సార్సీపీ అభ్యర్థి వివేకాను అప్పటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణ రెడ్డి కుట్రపూరితంగా ఓడించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేసి బీటెక్ రవిని గెలిపించారు. వివేకాను కుట్రతో ఓడించిన ఇదే బ్యాచ్‌తో సౌభాగ్యమ్మ, సునీత దంపతులు నాలుగేళ్లుగా సన్నిహితంగా ఉండటం వివాదాస్పదంగా మారింది. సునీత ఇటీవల మీడియా సమావేశంలోనూ చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, మహాసేన రాజేశ్ తదితరులకు కృతజ్ఞతలు తెలపడం గమనార్హం. మరోవైపు వివేకాను కిరాతకంగా నరికి హత్య చేశానన్న దస్తగిరితోనూ సఖ్యతతో ఉండటం విభ్రాంతి కలిగిస్తోంది. హత్య జరిగిన రోజునా సందేహాస్పదంగా.. వైఎస్ వివేకా హత్య అనంతరం ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా గుండెపోటుతో చనిపోయారనే ప్రచారం వెనుక సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు. 2019 మార్చి 15న ఉదయం వివేకా తలపై తీవ్ర గాయాలతో మృతిచెందారని ఆయన పీఏ కృష్ణారెడ్డి మొదటగా గుర్తించారు. ఆ వెంటనే వివేకా సతీమణి, కుమార్తె, అల్లుడికి సమాచారం ఇచ్చారు. రక్తపు మడుగులో ఉన్న వివేకా మృతదేహం ఫొటోలు తీసి వాట్సాప్ చేశారు. అయినప్పటికీ ఆయన పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి అప్పటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ఆదినారాయణరెడ్డికి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పారు. అదే విషయాన్ని ఆదినారాయణ రెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంతో వివేకా గుండెపోటుతో మరణించారనే అసత్య సమాచారం బయటకు వచ్చింది. ఇక వివేకా రాసిన లేఖను బయటపెట్టవద్దని పీఏ కృష్ణారెడ్డిని ఆదేశించడం ద్వారా గుండెపోటుతో మరణించారన్న ప్రచారాన్ని ఆయన కుమార్తె, అల్లుడు కొనసాగించారు. ఆ లేఖను వెంటనే పోలీసులకు అప్పగించమని వారు చెప్పి ఉంటే వివేకాని హత్య చేశారన్న విషయం వెంటనే అందరికీ తెలిసేది. కానీ ఆ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి లేఖ, సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. లేఖను వారు ఎందుకు గోప్యంగా ఉంచారన్నది ఈ కేసులో కీలక అంశం. వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారనే ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఆ లేఖను బయట పెట్టకూడదని వారు నిర్ణయించారా అన్నది ఇక్కడ అందరికీ కలిగే సందేహం. -
పచ్చకుట్రలో పావులు
-
సమాంతర కోర్టులు నడుపుతున్న షర్మిల, సునీత
-
వివేకా హత్యపై దుష్ప్రచారం ఆపండి
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిలపైన దుష్ప్రచారం చేయొద్దని కడప జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తదితరులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డిల పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు తేల్చిచెప్పింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి మాట్లాడొద్దని సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడే మాట్లాడాలని కుండబద్దలు కొట్టింది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలని హెచ్చరించింది. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్, షర్మిల, సునీత తదితరులు తాము చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల నుంచి తొలగించాలని ఆదేశించింది. వీరు సీఎం వైఎస్ జగన్, వైఎస్ అవినాశ్‌రెడ్డిలపై దుష్ప్రచారం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు తెలిపింది. రాజకీయంగా మైలేజీ కోసమే దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలు, మీడియా పబ్లిక్ కోర్టుగా అవతరించి న్యాయపాలనలో జోక్యం చేసుకుంటున్నాయని కడప జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు కడప ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి.శ్రీదేవి రెండు రోజుల క్రితం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలు, వక్రీకరణలు ఆపండి.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ధ్రువీకరణ కాని ఆరోపణలతో, వక్రీకరణలతో వ్యక్తిగత దాడులు, విమర్శలు చేయడం మానాలని కాంగ్రెస్, టీడీపీ, జనసేన నేతలను, వారి పార్టీల క్యాడర్‌ను కడప జిల్లా కోర్టు ఆదేశించింది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉందని కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ఆరోపిస్తూ మీడియా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని ఆయా పార్టీల అధినేతలను, అనుచరులకు కోర్టు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. అవినాశ్‌రెడ్డిని వైఎస్ జగన్ రక్షిస్తున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆపాలని తేల్చిచెప్పింది. వ్యక్తిగత విమర్శలు మాని తమ పార్టీల ఎజెండాలపైన, ఇతర పార్టీల వైఫల్యాలపైన దృష్టి సారించాలని వారికి కోర్టు హితవు పలికింది. వివేకా హత్య కేసులో జగన్ నిందితుడు కాదన్న విషయాన్ని గుర్తెరగాలంది. రాజకీయ మైలేజీ కోసమే జగన్, అవినాశ్‌లపై.. షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులు వ్యాఖ్యలు చేశారంది. ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా పరువు నష్టం కలిగించేవేనని తేల్చిచెప్పింది. అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి.. వాదనలు విన్న జిల్లా జడ్జి శ్రీదేవి పిటిషనర్ వాదనలతో ఏకీభవించారు. వాక్ స్వాతంత్య్రం సహేతుక పరిమితులకు లోబడి ఉంటుందన్న సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఓ వ్యక్తి ప్రతిష్టను, మంచితనాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం ఆ స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ‘వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్తుతం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా షర్మిల, చంద్రబాబు, లోకేశ్ ప్రజల ముందు వైఎస్సార్సీపీ, దాని అధినేత వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తదితరులపై తప్పుడు, పరువు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారనేందుకు, అసభ్యంగా పరిహాసం చేస్తున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. వారి మాటలను, వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాలు పదే పదే ప్రచురించాయి, ప్రసారం చేశాయి. ముఖ్యంగా అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా పేర్కొన్నారు. ఆయనను సీఎం జగన్ రక్షిస్తున్నారని పేర్కొన్నాయి.’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇతరులు సొంత తీర్పులివ్వరాదు.. ‘పౌర హక్కుల దురాక్రమణను నిరోధించడానికి, నిందితుల హక్కులను కాపాడేందుకు, మీడియా ప్రవర్తనకు అడ్డుకట్ట వేసేందుకు న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించే విషయంలో సరైన నిబంధనలు లేవు. ఓ వ్యక్తి అరెస్ట్ సమయంలో అతడిని దోషిగా నిర్ధారించే ట్రెండే ప్రస్తుతం కొనసాగుతోంది. రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు, మీడియా ఉన్నది ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకే తప్ప, తమ ఇష్టాఇష్టాలకు అనుగుణంగా తీర్పులు ఇచ్చేందుకు ఎంతమాత్రం కాదు. ప్రస్తుత కేసులో ఈ కోర్టు ముందుంచిన డాక్యుమెంట్లు, వీడియోలు, పత్రికా కథనాలను విశ్లేషిస్తే.. బహిరంగంగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆయనను వైఎస్ జగన్ రక్షిస్తున్నట్లు కూడా ప్రచారం చేస్తున్నారు. ఓ కేసు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నప్పుడు.. ఎవరూ కూడా తమ సొంత తీర్పులు ఇవ్వడానికి వీల్లేదు. ఆ అధికారం ఎవరికీ లేదు. అలాంటి కేసులో ఉన్న వ్యక్తిని తమ ఇష్టానుసారం హంతకుడిగా, దోషిగా ప్రకటించడానికి వీల్లేదు. నిష్పాక్షిక ట్రయల్ నిర్వహించి నిందితుడిని దోషిగా నిర్ధారించేంత వరకు ఆ వ్యక్తి అమాయకుడే అన్నది న్యాయ సూత్రం. ఓ వ్యక్తి నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్పైన మాత్రమే ఉంది. పెండింగ్‌లో ఉన్న కేసు గురించి మూడో వ్యక్తి ఎవరూ కూడా తమ తప్పుడు ప్రయోజనాల కోసం బహిరంగంగా మాట్లాడటం, వ్యాఖ్యలు చేయడం, తీర్పులిచ్చేయడానికి ఎంతమాత్రం వీల్లేదు’ అని జడ్జి శ్రీదేవి తేల్చిచెప్పారు. తప్పుడు ప్రచారంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చంద్రబాబు ప్రోద్భలంతో వైఎస్ వివేకా హత్యపై షర్మిల, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, సునీత తదితరుల దుష్ప్రచారంపై విసిగిపోయిన వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి దిగింది. తమ పార్టీతో పాటు సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డి, తదితరులపై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా షర్మిల, చంద్రబాబు, సునీతలను నిరోధించాలంటూ కడప జిల్లా కోర్టులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి.శ్రీదేవి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున ఎం.నాగిరెడ్డి, కె.ఎస్.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు, షర్మిల, సునీత తదితరులు చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన డాక్యుమెంట్లను, తప్పుడు ఆరోపణల వీడియోలను న్యాయవాదులు కోర్టు ముందుంచారు. కోర్టు ప్రొసీడింగ్స్‌లో మీడియా, రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయి ‘రాజకీయ పార్టీలు మీడియా ద్వారా పబ్లిక్ కోర్టుగా అవతరించాయి. అటు మీడియా, ఇటు రాజకీయ పార్టీలు సొంతంగా దర్యాప్తు చేసేస్తున్నాయి. తద్వారా కోర్టు ప్రొసీడింగ్స్‌లో జోక్యం చేసుకుంటున్నాయి. నిందితుడు, దోషికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విస్మరించాయి. దోషిగా నిర్ధారణ అయ్యేవరకు నిరపరాధే అనే సూత్రాన్ని కూడా పట్టించుకోవడం లేదు. కోర్టులు కేసును విచారణకు స్వీకరించడానికి ముందే నిందితులకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలుస్తున్నాయి. ఇది ప్రజలపై, జడ్జీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తత్ఫలితంగా అమాయకుడైన నిందితుడిని నేరస్తుడిగా చూడాల్సి వస్తోంది. నిందితుల హక్కులు, స్వేచ్ఛను పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదు. ట్రయల్‌కు ముందు ఓ అనుమానితుడు, నిందితుడు విషయంలో మీడియా సాగించే పరిమితికి మించిన ప్రతికూల ప్రచారం ట్రయల్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తద్వారా అతడే నేరం చేశాడని భావించాల్సి వస్తోంది. ఇలా చేయడం న్యాయ పాలనలో జోక్యం చేసుకోవడమే అవుతుంది’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దుష్ప్రచారాన్ని ఆపండి.. ఎన్నికల ప్రచారంలో షర్మిల తదితరులు వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డిని సీఎం జగన్ కాపాడుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. అవినాశ్‌రెడ్డిని ఏకంగా హంతకుడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ప్రకటనలు, వ్యాఖ్యలు చేస్తున్నారని నివేదించారు. చంద్రబాబు కూడా ప్రొద్దుటూరు సభలో వివేకాను హత్య చేసిన వ్యక్తిని ఎంపీగా నిలబెట్టారంటూ దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇక లోకేశ్ అయితే నేరుగా ముఖ్యమంత్రి జగనే తన బాబాయి వివేకాను హత్య చేశారని ఆరోపించారన్నారు. పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ తదితరులు కూడా ఇలాగే దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. వివేకా హత్య కేసు సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో జగన్, అవినాశ్, వైఎస్సార్సీపీపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆయా పార్టీల అధినేతలను, క్యాడర్‌ను నిరోధించాలన్నారు. రాజకీయ మైలేజీ కోసమే సీఎం జగన్, అవినాశ్‌పై వ్యాఖ్యలు.. ‘ప్రస్తుత కేసులో షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్, బీటెక్ రవి వారి రాజకీయ మైలేజీ కోసం వైఎస్సార్సీపీపై, వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో జగన్ ఎన్నడూ కూడా నిందితుడు కాదు. కాబట్టి వివేకాను జగన్ చంపారంటూ ప్రజలందరి ముందు లోకేశ్ చేసిన ప్రకటన పరువు నష్టం కలిగించేదే. సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుంటూ.. ఈ కోర్టు ఈ కేసులో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఉత్తర్వుల వల్ల షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులకు ఎలాంటి నష్టం వాటిల్లదు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుంటే వైఎస్సార్సీపీ, జగన్, అవినాశ్ రెడ్డిలకు తీరని నష్టం కలుగుతుంది. ఇదే సమయంలో షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులు పదే పదే పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తారు. ఎన్నికల వేళ ఇది వైఎస్సార్సీపీ, ఎన్నికల్లో పోటీ చేసే ఆ పార్టీ అభ్యర్థులకు తీరని నష్టం కలిగిస్తుంది. అందుకే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ఈ కేసులో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించా’ అని జిల్లా జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
మహానటి.. సునీత.. వివేకా రెండో వివాహం గురించే తెలియదట
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి.. షమీమ్ అనే మహిళను పెళ్లి చేసుకోవడం, ఆమెతో ఒక కుమారుడిని కూడా కనడం వల్లే ఆయన కుటుంబంలో విభేదాలు చెలరేగి.. హత్యకు దారితీశాయని ఊరువాడా కోడై కూస్తున్నా.. వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత మాత్రం తన తండ్రి రెండో వివాహం గురించి తనకు తెలియదని చెబుతుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ‘వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్నారట కదా.. ఆమెతో ఆయనకు ఓ కుమారుడు ఉన్నాడట కదా.. అందుకే మీ కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయంట కదా’ అని కొద్దిరోజుల క్రితం నర్రెడ్డి సునీత హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక మీడియా ప్రతినిధి ఆమెను ప్రశ్నించారు. దీనికి ఆమె తన రెండు భుజాలు ఎగురవేస్తూ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.. ‘ఐ డోంట్ నో (నాకు తెలియదు)’ అని. నిజంగానే వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్న విషయం సునీతకు తెలీదా అంటే ఎందుకు తెలీదు...పూర్తిగా తెలుసు అనే సమాధానమే వస్తోంది. షమీమ్ అనే ముస్లిం మహిళను వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకున్న విషయం బహిరంగ రహస్యం. షమీమ్‌ను వివేకా 2010లో ముస్లిం సంప్రదాయం ప్రకారం రెండో వివాహం చేసుకున్నారు. వారిద్దరికీ 2014లో ఓ కుమారుడు జన్మించారు. ఆ కుమారుడికి షెహెన్ షా అనే పేరు కూడా పెట్టారు. వివేకా తన రెండో భార్య షమీమ్, కుమారుడు షెహెన్ షాతో కలసి ఉన్న ఫొటోలు, వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి. వివేకా రెండో వివాహం వల్లే ఆయన కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. తన రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇస్తానని.. తన కుమారుడిని రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని వివేకా చెప్పారు. దీంతో ఉలిక్కిపడ్డ వివేకా అల్లుడు, సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆస్తి వారసత్వం తనకే దక్కాలని, రాజకీయ వారసత్వం తనకే దక్కాలని వివేకా పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పట్టు బట్టారు. ఆ విభేదాలతోనే వివేకా మొదటి భార్య సౌభాగ్యమ్మ పులివెందులను వదిలేసి హైదరాబాద్‌లో కుమార్తె సునీత నివాసంలో ఉండేవారు. ఇక సునీత.. షమీమ్‌ను తీవ్రంగా దూషిస్తూ వాట్సాప్ సందేశాలు పంపారు. ఆ విషయాన్ని కూడా షమీమ్.. వివేకా దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయాలను షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోనూస్పష్టంగా పేర్కొన్నారు. షమీమ్ తన వాంగ్మూంలో వెల్లడించిన విషయాలు ఇవీ.. రెండో పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు.. వివేకా రెండో పెళ్లిని ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. సునీత ఏకంగా షమీమ్‌కు ఫోన్ చేసి తీవ్రంగా బెదిరించారు. శివప్రకాశ్‌రెడ్డి కూడా షమీమ్ బావకు ఫోన్ చేసి తీవ్రంగా దూషించడంతో ఆయన కుటుంబం పులివెందుల వదిలివెళ్లిపోయింది. ఆ విషయం తెలిసి వివేకా తీవ్ర ఆగ్రహంతో శివప్రకాశ్‌రెడ్డి కాలర్ పట్టుకుని నిలదీశారు. షమీమ్‌ను తాను రెండో పెళ్లి చేసుకున్నానని.. ఆమె తన భార్యని స్పష్టం చేశారు. ఆస్తి, రాజకీయ వారసత్వం కోసమే కక్ష గట్టారు.. 2013 నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డిల నుంచి షమీమ్‌కు వేధింపులు తీవ్రమయ్యాయి. 2014లో వివేకా, షమీమ్‌లకు బాబు పుట్టాడు. ఆ బాబుకు షెహెన్ షా అనే పేరుపెట్టి ఆస్తిలో వాటా ఇస్తాననడంతోపాటు తన రాజకీయ వారసుడిగా ప్రకటిస్తానని కూడా వివేకా చెప్పారు. వివేకా మొదటి భార్యకు కుమారుడు లేకపోవడంతో ఆయన ఆస్తికి ఏకైక వారసుడిని కావాలని అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి భావించారు. ఆయన రాజకీయ వారసుడిని కావాలని నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి పట్టుదలగా ఉండేవారు. దీంతో వారిద్దరూ వివేకానందరెడ్డిపై కక్ష గట్టారు. బైరటీస్ గనులు ఉన్న నాలుగు ఎకరాల భూమిని షమీమ్ కుమారుడి పేరున రాయాలని వివేకా భావించారు. కానీ అందుకు సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ నాలుగు ఎకరాల భూమిని శివప్రకాశ్‌రెడ్డి తన పేరున రాయించేసుకున్నారు. అంతేకాకుండా వివేకా అప్పటికే షమీమ్‌కు ఇచ్చిన ఓ ఇంటి పత్రాలను కూడా బలవంతంగా శివప్రకాశ్‌రెడ్డి తీసేసుకున్నారు. షమీమ్‌ను దూషించిన సునీత సునీత.. వివేకా రెండో భార్య షమీమ్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ఆమెను తీవ్రంగా దూషించారు. సునీత తనను ఎలా దూషించిందీ చెబుతూ షమీమ్.. వివేకాకు వాట్సాప్ సందేశాలు పంపారు. వివేకా హత్య కేసును దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ఆ వాట్సాప్ చాటింగ్‌లను అప్పట్లోనే వెలికి తీశారు కూడా. అయినా సరే తన తండ్రి వివేకా రెండో వివాహం గురించి తనకు తెలీయదని సునీత చెప్పడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. వివేకా హత్య కేసు వెనుక ఉన్న కుట్రను బయటకు రాకుండా చేసేందుకే ఆమె ఇలా అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నది స్పష్టమవుతోంది. ఒంటరి అయిన వివేకా.. వివేకానందరెడ్డిని ఆయన మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది శివ ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా వేధించారు. కుటుంబానికి చెందిన కంపెనీలలో డైరెక్టర్‌గా ఆయనకు ఉన్న చెక్ పవర్‌ను తొలగించారు. ఆయన్ని ఒంటరిగా పులివెందులలో విడిచిపెట్టి కుటుంబసభ్యులు అందరూ హైదరాబాద్‌లో ఉండేవారు. దీంతో రోజువారి ఖర్చులకు కూడా ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పులు తీర్చడానికి హైదరాబాద్ మణికొండలో ఉన్న తన ఇంటిని కూడా 2018లో విక్రయించారు. -
బయటపడ్డ వివేక హత్య వెనుక అసలు కారణం...వీడియోతో బుక్కయిన సునీత
-
ఇదంతా సీబీఐ, సునీత ఆడుతున్న డ్రామా
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సునీతక్క చెబుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి చెప్పారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు శాస్త్రీయ విధానంలో కాకుండా, పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని అన్నారు. ఇదంతా దస్తగిరిని అడ్డం పెట్టుకొని, హియర్ సే ఎవిడెన్స్ అంటూ సీబీఐ, సునీత తదితరులు కలిసి ఆడుతున్న డ్రామా అని స్పష్టం చేశారు. ఎంపీ అవినాశ్ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. అసలు దస్తగిరి అప్రూవర్‌గా మారకముందే ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. ‘వివేకా హత్య జరిగిన 40 రోజుల తర్వాత దస్తగిరి సీబీఐ ముందు వాంగ్మూలమిస్తూ అతనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలి. కానీ, సీబీఐ అతన్ని అరెస్టు చేయలేదు. పైగా, అతనికి ముందస్తు బెయిలు వచ్చేలా సీబీఐ, సునీత సహకరించారు. 2021 అక్టోబరు 21న కోర్టులో దస్తగిరి ముందస్తు బెయిల్ పిటిషన్ వేస్తే సీబీఐ అభ్యంతరం లేదని చెప్పింది. సునీత అభ్యంతరం చెప్పలేదు. ముందస్తు బెయిల్ వచ్చేంత వరకూ వేచి ఉండి, ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని తీసుకొచ్చారు. ఐపీసీ 306(4)ఏ ప్రకారం అప్రూవర్ అయితే కోర్టులో విచారణ అయ్యే వరకు బెయిల్ రాదు. కాబట్టే బెయిల్ వచ్చిన తర్వాత 306 (4)బి ప్రకారం అప్రూవర్‌గా మార్చారు. ఇక అతను జైలుకెళ్లే అవకాశం లేదు. సీబీఐ, సునీత ఈ విధానాన్ని వాడుకున్నారు. ఒకవేళ హంతకుడినని ఒప్పుకొన్న అతన్ని అరెస్టు చేసి ఉంటే జీవిత కాలం బెయిల్ వచ్చి ఉండేది కాదు. అందుకే హంతకుడినని ఒప్పుకొన్న దస్తగిరి ఒక్క రోజు కూడా జైలులో ఉండకుండా అతనికి ముందస్తు బెయిలు వచ్చేలా సహకరించి, ఆ తర్వాత అప్రూవర్ వ్యవహారాన్ని బయటకు తెచ్చారు. ఇక జీవిత కాలం ఈ కేసులో అతని అరెస్టు ఉండదని హామీ ఇచ్చి, ఈ ప్రయోజనాన్ని కల్పించినందుకు వారికి కావల్సిన పేర్లను అతనితో చెప్పించుకున్నారు. ఇదంతా డ్రామా కాదా?’ అని అవినాశ్ ప్రశ్నించారు. దస్తగిరి హియర్ సే ఎవిడెన్స్ అంటూ అప్పటి దర్యాప్తు అధికారి రామ్‌సింగ్, సునీత కలిసి కట్టుకథ అల్లారని, అందువల్లే తన తండ్రి చేయని నేరానికి ఏడాదిగా జైల్లో మగ్గుతున్నారని, రెండున్నరేళ్లు శివశంకర్‌రెడ్డి జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలిపారు. గూగుల్ టేకౌట్‌కు కచ్చితత్వం ఉండదని గూగులే వెల్లడించిందని, అయినా దాని ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేస్తున్నారని ప్రశ్నించారు. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మేన్ రంగన్న నలుగురి పేర్లు చెప్పినప్పటికీ, వారిని దర్యాప్తు అధికారి అరెస్టు చేయలేదని, కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపి వాస్తవాలు రాబట్టలేదని తెలిపారు. సునీత అప్పుడొకలా.. ఇప్పుడొకలా.. వివేకా హత్యపై నర్రెడ్డి సునీత మొదట్లో ఒకలా, ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నారని అవినాశ్ అన్నారు. ‘2020 జూలై 20న సీబీఐకి సునీత వాంగ్మూలమిస్తూ ఆమె భర్త సెల్ఫోన్లో వివేకా రాసిన డెత్ నోట్ ఫోటో చూపించారని, అందులో మా తండ్రి డ్రైవర్ ప్రసాద్‌ను డ్యూటీకి త్వరగా రమ్మన్నానని చచ్చేలా కొట్టాడని, ఈ లెటర్ రాసేందుకు చాలా కష్టపడ్డానని, డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టవద్దని రాసి ఉన్నట్లు చెప్పింది. 2020 ఆగస్టు 27న లెటర్ గురించి ఏమీ తెలియదని, ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ చూపించారని చెబుతోంది. ఇలా నెలలోనే ఎందుకు మాట మార్చింది? హత్య జరిగిన 10 రోజులకు నాన్నగారు అవినాశ్‌ను ఎంపీని చేసేందుకు, జగనన్నను సీఎంను చేసేందుకు ఏమేమి చేయాల్నో అంతా చేశారని సునీత చెప్పింది. ఈరోజు హత్యకు ఎంపీ టికెట్ మోటివ్ అని చెబుతున్నారు. నాలుగేళ్ల తర్వాత 2023 మే31న సీబీఐ దగ్గరికి వెళ్లి అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెప్పమంటే అలా చెప్పానంది. అప్పటికే 13 సార్లు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన సునీత ఏనాడూ ఈ విషయాన్ని చెప్పలేదు. అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పమంటే.. ఇప్పుడు చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణా చెప్పమంటే చెబుతున్నారా’ అని అన్నారు. శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేస్తేనే వెళ్లాను ‘ఆ రోజు జమ్మలమడుగు వెళ్తున్న నాకు వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేశారు. వివేకా చనిపోయినట్లు చెప్పి విలపించారు. వెంటనే ఇంటికెళ్లమన్నారు. నేను వెళ్లి డెడ్‌బాడీని చూసి బయటకు వచ్చేశాను. సీఐకి ఫోన్ చేసి త్వరగా రమ్మన్నాను. డెత్ నోట్లో ఉన్న వాస్తవ విషయాన్ని చెప్పకుండా ఘటన స్థలంలోకి నన్ను వెళ్లమని ఎందుకు చెప్పారు? లెటర్లో ఉన్న విషయం తెలిసిన వెంటనే నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు పోలీసులకు చెప్పలేదు? ఇంక థర్డ్ పర్సన్ ఫోన్‌కాల్ కోసం వెయిటింగ్ ఎక్కడ? శివప్రకాష్‌రెడ్డి థర్డ్ పర్సనా? వివేకా చివరి రెండేళ్లు డబ్బు కోసం చాలా ఇబ్బందులు పడ్డారని పని మనుషులు వాంగ్మూలమిచ్చారు. ఆస్తి ఆమ్మే అవకాశం లేదు. చెక్ పవర్ రద్దు చేశారు. రెండో భార్య షమీమ్, అమె కుమారుడి కోసం ఇబ్బందులు పడ్డారు. డబ్బు కోసం డైమండ్స్, సెటిల్మెంట్లు అంటూ తిరగడం ఆరంభించారు’ అని తెలిపారు. మా ఇద్దర్నీ గెలిపించాలని వివేకా పిలుపు ‘నేను చేసే ప్రతి కార్యక్రమాన్నీ వివేకా బలపర్చేవారు. 2014లో వేంపల్లెలో వీధి వీధీ తిరుగుతూ జగన్నను సీఎం చేయాలని, నన్ను ఎంపీగా గెలిపించాలని కోరారు. 2019ఎన్నికల్లో చివరిరోజు కూడా ఇంటింటా ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకాను ఓడించామని చెబుతున్నారు. 854 మంది ఓటర్లలో ఒక్కరినైనా సీబీఐ విచారించిందా? మీకంటే చిన్నోడినైన నాపైన ఎందుకింత ద్వేషం’ అని ప్రశ్నించారు. వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలే ఆరోజు రాత్రి అంతా నేను ఫోన్ వాడినట్లు సునీత చెబుతోంది. నేను ఆరోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేచాను. ఫోన్ నెట్ ఆన్‌లో ఉంటే మేసేజ్‌లు వస్తుంటాయి. నానుంచి ఎవరికీ మెసేజ్ కానీ, ఫోన్‌కాల్ కానీ వెళ్లలేదు. ఎర్ర గంగిరెడ్డి నుంచి నాకు ఎలాంటి మేసేజ్ రాలేదు. అంటే వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలే. ఎవరెన్ని అబద్దాలు చెప్పినా న్యాయమే గెలుస్తుంది. సీబీఐ ఎప్పటికైనా లెంపలేసుకోక తప్పదు. నాకు న్యాయస్థానాలపై నమ్మకం, గౌరవం ఉంది. షర్మిల, సునీత ఆరోపణలను ప్రజలు విశ్వసించరు. తాను బీజేపీకిలోకి వెళ్తాననడం ‘జోక్ ఆఫ్ ది సెంచురీ’ అని ఓ విలేకరి ప్రశ్నకు సమా«ధానంగా అవినాశ్ రెడ్డి చెప్పారు. హార్ట్ ఎటాక్ అన్నది సునీత కుటుంబం చేసిన ప్రచారమే ‘హార్ట్ ఎటాక్ అన్న విషయం సునీత కుటుంబం నుంచే ప్రచారమైంది. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సైతం అదే రోజు మీడియాతో మాట్లాడుతూ హార్ట్ ఎటాక్‌తో వివేకానందరెడ్డి చనిపోయినట్లు శివప్రకాష్‌రెడ్డి చెప్పినట్లుగా తెలిపారు. అదే విషయాన్ని వీడియో ద్వారా వివరించారు. హార్ట్ ఎటాక్ అని ఫిర్యాదు చేయాలని పీఏ కృష్ణారెడ్డికి చెప్పినట్లు సునీత చెప్పారు. డెత్‌నోట్ చదివాక కూడా హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పారు’ అని ప్రశ్నించారు. -
Viveka case : ఇవిగో ఆధారాలు.. ఇప్పుడేం చెబుతావు సునీత? అవినాష్ ప్రశ్నలు
సాక్షి, కడప: వివేకా కూతురు సునీత ఏ రకంగా అబద్దాల ప్రచారం చేస్తుందో.. పూర్తి వివరాలు, ఆధారాలతో బయటపెట్టారు. ఇష్టానుసారంగా బురద జల్లి.. కేసు విచారణను పక్కదోవ పట్టించేలా సునీత ఏ రకంగా ప్రయత్నిస్తుందో కడప ఎంపీ అవినాష్ రెడ్డి వివరించారు. ఈ కేసులో మాట్లాడకూడదని భావించినా.. రోజురోజుకి పెరుగుతున్న అబద్దాలను, అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ వివరణ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఆయన వెల్లడించిన అంశాల్లో అతి ముఖ్యమైన అంశాలు చూద్దాం. పాయింట్ 1 : పన్నింటి రాజశేఖర్‌ను బయటకెందుకు పంపించారు? వివేకా ఇంట్లో పని చేసే వ్యక్తి పన్నింటి రాజశేఖర్. హత్యకు ఒక రోజు ముందు పన్నింటి రాజశేఖర్‌కు సౌభాగ్యమ్మ ఫోన్ చేసింది. సిబిఐ విచారణలో పన్నింటి రాజశేఖర్‌ను సుదీర్ఘంగా విచారించారు. లిఖితపూర్వకంగా పన్నింటి ఇచ్చిన స్టేట్మెంట్ను అవినాష్ చదివి వినిపించారు. పన్నింటి రాజశేఖర్‌ను సిబిఐ వాళ్లు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు.. ప్రశ్న, సమాధానాలు ఇలా ఉన్నాయి సిబిఐ : నీకు సెలవు ఎవరు మంజూరు చేశారు? పన్నింటి రాజశేఖర్ : నాకు సౌభాగ్యమ్మ సెలవు ఇచ్చింది సిబిఐ : నీవు సెలవుపై వెళ్లాలని ఎవరైనా ఒత్తిడి తెచ్చారా? పన్నింటి రాజశేఖర్ : నాకు రెండు, మూడు సార్లు సౌభాగ్యమ్మ, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఫోన్ చేశారు, తక్షణం నువ్వు కాణిపాకం వెళ్లాలని ఒత్తిడి తెచ్చారు. సరేనని నేను సెలవు తీసుకున్నా.. పన్నింటి రాజశేఖర్ : సునీల్ యాదవ్, ఉమా శంకర్, గంగిరెడ్డి ముగ్గురు కూడా వివేకానందరెడ్డికి చాలా క్లోజ్. చనిపోక ముందు వివేకాతో కలిసి ప్రయాణాలు చేసేవారు. వాళ్లకు వివేకాతో ఎంత సాన్నిహిత్యం ఉందంటే.. అంతా కలిసి తరచుగా అంటే రెండు మూడు రోజులకోసారి టేబుల్ మీద కూర్చుని భోజనాలు చేసేవారు. రెండు రోజుల ముందు కూడా వివేకాతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. అవినాష్ అభ్యంతరం : ఇంట్లో ఉన్న పన్నింటి రాజశేఖర్‌ను నర్రెడ్డి రాజశేఖర్, సౌభాగ్యమ్మ (తమ్ముడు, అక్క) ఎందుకు బయటకు పంపించారు? కాణిపాకం వెళ్లమని ఎందుకు ఒత్తిడి తెచ్చారు? వివేకానందరెడ్డికి సునీల్ యాదవ్, ఉమాశంకర్, గంగిరెడ్డి తెలియదని సునీత ఎందుకు ప్రకటనలు చేస్తోంది? ఇంట్లో కలిసి కూర్చుని బ్రేక్ ఫాస్ట్ చేసే సాన్నిహిత్యం ఉందని పని వాళ్లంతా చెబుతుండగా.. సునీత ఎందుకు మాట మారుస్తోంది? --- పాయింట్ 2 : గుండెపోటు థియరీ ఎక్కడినుంచి వచ్చింది? గుండెపోటు థియరీ గురించి సునీతతో చాలా మాట్లాడుతోంది. అసలు ఈ థియరీ ఎక్కడి నుంచి మొదలయింది. దీని గురించి వివరంగా మాట్లాడుదాం. సిట్‌కు సునీత ఇచ్చిన స్టేట్మెంట్లో స్పష్టంగా ఏమని పేర్కొన్నారంటే..! "మాకు ఉదయం కృష్ణారెడ్డి ఫోన్ చేశాడు, ఇంట్లోకి వెళ్లగానే ఏం జరిగిందో చెప్పాడు. మా నాన్న డెడ్‌బాడీ బాత్రూంలో పడి ఉంది. మా నాన్న ఒంటిపై గాయాలున్నాయని చెప్పాడు, అయితే మా నాన్నకు గతంలో గుండె సమస్య ఉంది, బహుశా గుండె పోటు వచ్చి బాత్రూంలో కింద పడి మా నాన్నకు గాయాలయ్యాయేమో అని ఊహించి ఆ విధంగా ఫిర్యాదు చేయమని కృష్ణారెడ్డికి మేం సూచించాం" అని నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి తాము ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. ఇది నేను చెప్పిన విషయం కాదు. సిట్‌కు సునీత ఇచ్చిన స్టేట్మెంట్. అంటే కృష్ణారెడ్డితో ఏమేం మాట్లాడారో సునీత ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే పూర్తిగా అర్థమవుతుంది. పైగా ఘటన జరిగిన వారంలోపు అంటే.. ఆలస్యం కాకుండా బయటికొచ్చే విషయాలు పక్కగా ఉంటాయని ఢిల్లీలో ప్రెస్ మీట్లో చెప్పింది సునీత. అవినాష్ పాయింట్ : గుండెపోటు కాదు, శరీరం మీద గాయాలున్నాయన్న విషయం సునీతకు అందరికంటే ముందే.. కృష్ణారెడ్డి ఫోన్ చేయగానే తెలిసింది. అయినా సునీత మధ్యాహ్నం వరకు ఈ విషయాన్ని బయటపెట్టలేదు. హైదరాబాద్ నుంచి సునీత, నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సౌభాగ్యమ్మ.. అంతా బయల్దేరి కలిసి వచ్చారు. అక్కడ లెటర్ ఉందని తెలిసి, దాన్ని దాచి పెట్టమని చెప్పి, వివేక హత్యకు గురయ్యాడన్న విసయాన్ని దాచిపెట్టింది సునీత. అందరికంటే ముందు డెడ్‌బాడీ ఫోటోలు కూడా తెప్పించుకున్నారు, అయినా పోలీసులకు చెప్పలేదు. ఉద్దేశపూర్వకంగా అసలు నిజాలను దాచిపెట్టింది సునీత, ఆమె భర్త. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం.. ఏంటంటే.. నన్ను ఇరికించే కుట్ర జరిగిందని. శివప్రకాష్ రెడ్డి..అంటే వివేకా సొంత బావమరింది నేను ఉదయం లేచి రాజకీయ పర్యటన కోసం బయటకు వెళ్తోంటే.. నాకు ఫోన్ చేసి ఏం చెప్పినాడంటే.. "బావ చనిపోయాడు.. అర్జంటుగా ఇంటికి వెళ్లాలని చెప్పాడు". అదే విషయం నేను నా వాంగ్మూలంలో చెప్పాను. నేను అదుర్తాతో వివేకానంద ఇంటికి వెళ్లగానే అక్కడ తేడా ఉందన్న విషయాన్ని గమనించి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను. అనుమానం ఉందని చెప్పాను. మరి ఉదయమే హత్య అని తెలిసినా.. సునీత గానీ, నర్రెడ్డి గానీ, శివప్రకాష్ రెడ్డి గానీ.. పోలీసులకు ఎందుకు చెప్పలేదు? పైగా ఏమి తెలియనట్టు నాకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లాలని ఎందుకు చెప్పినట్టు? మీరు ఇదే అంశంలో టిడిపి నేత ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన ప్రకటన చూడాలి (వీడియో క్లిప్ ప్లే చేసి వినిపించారు) సిట్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఆదినారాయణ ఏమన్నాడంటే... "మార్చి 15 నాడు నేను విజయవాడలో ఉన్నప్పుడు వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేసినాడు, గుండెపోటుతో చనిపోయాడని నాకు చెప్పినాడు, ఆ రోజు మా కజిన్, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి కూడా నాతో ఉన్నాడు. ఎందుకని నేను అడిగినప్పుడు.. ఎక్కువగా సిగరేట్లు తాగుతాడని, గుండె పోటు వచ్చి స్టంట్ కూడా వేశారని చెప్పాడు. అదే విషయాన్ని నేను మీడియాకు చెప్పాను. నన్ను దర్యాప్తులో నీకు పరమేశ్వర్ రెడ్డి తెలుసా? అంటూ రకరకాల ప్రశ్నలు వేశారు." అవినాష్ పాయింట్ : గుండెపోటు అన్న తప్పుడు ప్రచారాన్ని ప్రారంభించిందెవరు? ఎక్కడి నుంచి మొదలయ్యిందో ఈ ఆధారాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. --- పాయింట్ 3 : ఎంపీ టికెట్ కోసం హత్య చేశారని తప్పుడు ప్రచారం అటు సునీత, ఇటు షర్మిల.. హఠాత్తుగా రాజకీయాలను తీసుకొచ్చారు. ఏంటంటే.. కడప ఎంపీ టికెట్ కోసం హత్య జరిగిందట. ఎంపీ టికెట్ మోటివ్ అన్న దాంట్లో నిజమెంత? ఒక్కసారి జరిగిన ఘటనలను మీరే చూడండి. "తాను చనిపోయే చివరి క్షణం వరకు నా కోసం ప్రచారం చేశారు, మూడు గంటల ర్యాలీ సభలో వివేకా మాట్లాడారు. అవినాష్‌ను గెలిపించమని పది సార్లు చెప్పారు. అంతెందుకు సునీత కూడా ఢిల్లీలో ఏం మాట్లాడారు..? అవినాష్ గెలుపు కోసం వివేకా ప్రచారం చేశాడని చెప్పింది." మరి.. అప్పటికే ఎంపీ టికెట్‌ను నాకు కేటాయించారు. 2019 టికెట్ ఒక్కటే కాదు.. 2014లోనూ నేను ఎంపీగా గెలిచాను. నా కోసం వివేకానంద ప్రచారం కూడా చేశారు. మరి ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం హత్య జరిగింది అని ఎలా చెబుతారు? పైగా అప్పుడు మీ నాన్నకు ప్రత్యర్థి బీటెక్ రవి ఇప్పుడు మీకు సన్నిహితుడు అవుతాడా? మీ నాన్న మీద అక్రమంగా, అనైతికంగా గెలిచిన బీటెక్ రవి కాకుండా.. మా మీద బురద వేస్తున్నారా? కనీసం అవగాహనతో మాట్లాడుతున్నారా? మీ కోసం ఎన్నో ఎన్నికల్లో కష్టపడితే మాపై ఆరోపణలు చేస్తారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లేసిన ఏ ఒక్కరినీ సిబిఐ ఎందుకు ప్రశ్నించలేదు? సిబిఐ దర్యాప్తులో ఇన్ని లోపాలుంటాయా? ఇక సునీత, సిబిఐ చాలా మందితో తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించారు. ఇంకా చాలా ప్రయత్నాలు జరిగాయి. లక్ష్మీదేవమ్మ, జగదీష్ రెడ్డి, లక్ష్మీ దేవి కొడుకుతో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే ప్రయత్నాలు చేశారు. శశికళ & కోతో కూడా తప్పుడు వాంగ్మూలాలు తీసుకునే ప్రయత్నాలు చేశారు. అవినాష్ రెడ్డి పేరు చెప్పాలని ఒత్తిడి తెచ్చారు. ఆ రోజు గేటు దగ్గర ఇప్పకుంట్ల వాసి ఒకరు ఉంటే.. ఆయన ఇంటికి సునీత, రాజశేఖర్ వెళ్లారు. "మా నాన్న దగ్గరి వాడివి, సిబిఐ దగ్గర వాంగ్మూలం ఇవ్వాలి, మేం చెప్పినట్టు మాత్రమే నువ్వు చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారు, ఏం చెప్పారంటే.. అవినాష్ గుండెపోటు అని చెప్పమన్నాడని నువ్వు చెప్పాలి" అని ఒత్తిడి తెచ్చారు. అవినాష్ పాయింట్ : సునీత లాంటి వాళ్లు దస్తగిరి లాంటి వారిని కూడా అప్రూవర్‌గా చేయగలరు, ఇందులో చంద్రబాబు కుట్ర, కుతంత్రాలు కావొచ్చు, అందులో భాగంగానే పస లేని విమర్శలు, కనికట్టు చేసే అబద్దాలు ఉన్నాయి. రాజకీయంగా దీన్ని ముడిపెట్టి అవినాష్‌ను లక్ష్యంగా చేసుకునేందుకు ఇంత కుట్ర చేస్తారా? గుండెపోటు అని ప్రచారం మొదలెట్టిన వాళ్లు... దాన్ని నా మీద రుద్దుతారా? పైగా ఇంటింటికి వెళ్లి నేను చెప్పమన్నారంటూ ఒత్తిడి తెస్తారా? ఈ కేసులో కోర్టులమీద నమ్మకం ఉందని, చంద్రబాబు, బీజేపీలోని టిడిపి పెద్దలు దీని వెనక ఉన్నారని విమర్శించారు అవినాష్. చంద్రబాబు చేతిలో పావులుగా మారి నన్ను, మా నాన్నను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రీన్విచ్ మీన్టైంకు ఇండియన్ స్టాండర్డ్ టైంకు తేడా లేకుండా తప్పుడు ప్రకటనలు చేసిన సిబిఐ.. తర్వాత నాలుక కర్చుకుని హైకోర్టులో కౌంటర్ వేసిన విషయాన్ని గుర్తు చేశారు. READ THIS ARTICLE IN ENGLISH : YS Avinash Reddy’s Sensational Comments on Sunitha in YS Viveka’s Murder ఎంపీ అవినాష్ ప్రెస్మీట్లో ముఖ్యాంశాలు -
నిజం దాచి పెట్టింది సునీతే.. అసత్య ప్రచారం చేస్తోంది సునీతే