సాక్షి, వైఎస్సార్: వివేకా హత్య కేసులో ఆయన ఏపీ కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. ఇక, విచారణ సందర్బంగా కృష్ణా రెడ్డి.. కీలక విషయాలను వెల్లడించారు. కృష్ణారెడ్డి.. ‘వివేకా హత్య జరిగిన రోజు ఉదయం 5:30 గంటలకే ఆయన ఇంటికి వెళ్లాను. ఇంటి వద్ద వాచ్‌మెన్ రంగన్న పడుకుని ఉండటం చూశాను. అప్పటికీ వివేకా తలుపులు తీయకపోవడంతో లోపలికి వెళ్లి చూశాను. ఆ సమయంలో బాత్‌రూమ్‌లో వివేకా రక్తపు మడుగులో పడి ఉన్నారు.
ఈ విషయం గురించి మొట్టమొదట సునీత భర్త రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పాను. అనంతరం, వివేకా పక్కనే ఉన్న లెటర్ చూసి మరోసారి రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడాను. దీంతో, లెటర్ విషయం ఎవరికీ చూపించవద్దని.. దాచిపెట్టమని ఆయన నాకు చెప్పారు. అందుకే వివేకా ఫోన్, లెటర్ మా ఇంట్లో దాచిపెట్టాను. ఇక, ఉదయం 6:30 గంటలకు వివేకా ఇంటికి వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చారు. బాత్‌రూమ్‌లో ఉన్న వివేకా డెడ్ బాడీ చూసి బయటకు వెళ్లిపోయారు. బాత్‌రూమ్ నుంచి వివేకా డెడ్‌బాడీని బయటకు తెచ్చే సమయంలో అవినాష్ రెడ్డి అక్కడ లేరు. వివేకా మృతదేహాన్ని క్లీన్‌చేసే సమయంలో కూడా అవినాష్ అక్కడ లేరు.
ఇది కూడా చదవండి: వివేకా హత్యకేసులో సాక్షి రంగన్నకు తీవ్ర అస్వస్తత
అయితే, బాత్‌రూమ్ గోడకు వివేకా తల బలంగా తగలడంతో చనిపోయారని ఎర్ర గంగిరెడ్డి చెప్పారు. కాగా, గంగిరెడ్డి చెప్పినప్పుడే నేను అనుమానించాను. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేద్దామంటే గంగిరెడ్డి వద్దన్నాడు. సీఐ చెప్పినట్టు కంప్లయింట్ రాసి పోలీసు స్టేషన్‌లో ఇవ్వమని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. రాజశేఖర్ రెడ్డి.. వివేకా ఇంటికి వచ్చాక ఫోన్, లెటర్ ఆయనకు అప్పగించాను. అదేరోజు నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. బెయిల్‌పై విడుదలయ్యాక నన్ను.. సునీత ఇంటికి పిలిచారు. సీబీఐ చెప్పినట్టు చేయ్.. లేదంటే ఇబ్బందులు తప్పవని సునీత.. నన్ను బెదిరించారు. సీబీఐ చెప్పినట్టు కృష్ణారెడ్డి వినకపోతే జైలుకు వెళ్తావంటూ సునీత హెచ్చరించింది. వివేకాకు చెందిన 200 ఎకరాల భూమి రాజశేఖర్ రెడ్డి కంపెనీ పేరుపై ఉన్నాయని’ తెలిపారు.
ఇది కూడా చదవండి: వివేకా కేసు: ఎంపీ అవినాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment