Krishna Reddy
-
టెట్‌పై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి కోరారు. స్కూల్ అసిస్టెంట్ (2ఏ) ఇంగ్లిష్ సబ్జెక్టులో ఎలాంటి పొరపాట్లు జరగలేదని, ఈ పేపర్లో పార్ట్–2లో మాతృభాష ఎంపిక పైనా తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులో తలెత్తిన సమస్యను పరిష్కరించకపోవడంతో పరీక్ష సమయంలో మాతృభాష స్థానంలో ఇంగ్లిష్ మాత్రమే వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.టెట్ ఎస్ఏ–2 ఇంగ్లిష్ పేపర్ రెండో సెక్షన్లో అభ్యర్థుల మాతృ భాషకు అనుగుణంగా తెలుగు, తమిళం, కన్నడ, ఒరియా తదితర భాషలు ఉంటాయని, అభ్యర్థి దరఖాస్తులో పేర్కొన్న భాషనే ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ ఇక్కడ మాతృభాషగా తెలుగు ఎంపిక చేసుకుంటే ఇంగ్లిష్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోందని, వాస్తవానికి అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదులు కూడా అందలేదని తెలిపారు. టెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి అనుసరించిన విధానాలనే ఇప్పుడూ అనుసరించామని కృష్ణారెడ్డి వివరించారు. -
అడ్డంగా నరుకుతా.. రెచ్చిపోయిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
సాక్షి, నెల్లూరు జిల్లా: అడ్డంగా నరుకుతా అంటూ సొంత పార్టీ నేతలపైనే కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రెచ్చిపోయారు. వార్డు ఇంఛార్జ్ స్థాయికి కూడా పనికిరాని కొందరు తనపై లోకేష్‌కి ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కావలి అడ్డాలో ఎక్కసెక్కాలు ఆడితే.. అడ్డంగా నరుకుతా అంటూ టీడీపీలోనే ప్రత్యర్థి వర్గానికి కావ్య వార్నింగ్ ఇచ్చేశారు. ఇటీవలే కావ్య కృష్ణారెడ్డిపై చంద్రబాబు, లోకేష్‌కు మాజీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయడు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: దురుద్దేశంతో మహాపచారంకాగా, ఇటీవల కావలి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే టపాసులు కాల్చిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దగదర్తి మండలంలో తన వర్గాన్ని కొందరు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని చంద్రబాబు,లోకేష్ వద్దే తేల్చుకుంటానని కార్యకర్తల సమావేశంలో మాలేపాటి వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానంటూ మాలేపాటి వ్యాఖ్యానించారు. -
కావలి ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరిపై యుద్ధం చేస్తా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఏకపక్ష వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. ఎమ్మెల్యే వైఖరిపై ఇకనుంచి ప్రత్యక్ష యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నాను. టీడీపీ నీది కాదని నన్ను అనే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. టీడీపీ కోసం పని చేస్తే నాపై 16 కేసులు పెట్టించారు. ఇప్పుడు కొత్తగా నాపై వంద కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా భయపడను. అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఎన్నికల సందర్భంగా చెప్పిన మాట తప్పి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఘోరాలపై పార్టీ అధిష్టానం విచారణ కమిటీ నియమించి నిజాలను గుర్తించాలి’ అని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తన నివాసంలో కార్యకర్తలతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అవలంబిస్తున్న వివాదాస్పదమైన, ఘర్షణ పూరిత విధానాలపై ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వీధుల్లో టాపాసులు కాల్చి సంబరాలు చేస్తున్న వ్యక్తులు ఈ రోజు టీడీపీలో పెత్తనం చేస్తున్నారని, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడినే అడుగుతున్నా.. అసలు టీడీపీ ఎటు పోతోంది? ఏమి జరుగుతుంది? కడుపు రగిలిపోతుంది. పార్టీ ఏమవుతోందో అర్థం కావడం లేదన్నారు. నీతి నిజాయతీతో రాజకీయాలు చేయాలే కాని, లాలూచీ రాజకీయాలు చేస్తే ఊరుకోను. కావలిలో టీడీపీకి ఏమీ లేదు అనే రోజుల్లో పార్టీ ఆఫీస్‌ను ఏర్పాటు చేశానన్నారు. టీడీపీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానన్నారు. పార్టీ కార్యక్రమాలు, ఆందోళనలు నుంచి చంద్రబాబు సభలు, లోకేశ్ యువగళం ఆరు రోజుల పాదయాత్రను విజయవంతంగా నిర్వహించడంలో తాను ఎంతో కష్టపడ్డానన్నారు. దుగ్గిరాల కరుణాకర్ అనే యువకుడు చనిపోతే రూ.20 లక్షలు టీడీపీ తరఫున అతని కుటుంబ సభ్యులకు తాను సహాయం అందజేశానన్నారు. నోరుందని నిందలు వేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడడం కాదని, నిరూపించాలని సవాల్ విసిరారు. టీడీపీలోకి రకరకాల వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. కానీ తాను మాత్రం టీడీపీనే అన్నారు. ఇక నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉండేందుకు క్రియాశీలకంగా ఉంటానన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బుచ్చిరెడ్డిపాళెం– దగదర్తి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు మళ్లీ రెండోసారి శంకుస్థాపన అంటూ హడావుడిగా చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. -
కావ్య కనుసైగలతో మాలేపాటిపై కేసుల నమోదు?
కావలి టీడీపీలో ఆధిపత్యం.. అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరింది. ‘ఏరు దాటే వరకు మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ చందానా సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు సాగిన ఐక్యతారాగం.. ఇప్పుడు శృతి తప్పింది. ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా, సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి ఎదురొడ్డి నిలిచిన నేతలనే టార్గెట్ చేయడం ఇప్పుడు ఆ పార్టీలో అగ్గి రాజుకుంది. అధికారంలోకి వచ్చామనే అహంకారంతో చెలరేగిపోయిన మాలేపాటి కుటుంబంపైనే కేసులు నమోదు చేయించడంతో జీర్ణించుకోక మానసిక క్షోభతో తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న పరిస్థితి చూస్తే టీడీపీలో అంతర్యుద్ధానికి అద్దం పడుతోంది.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి టీడీపీ అంటే బీద రవిచంద్ర.. మాలేపాటి సుబ్బానాయుడు. ఇది మొన్నటి వరకు ఉన్న పరిస్థితి. ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వెలువడ్డాయి. ఇంకా పరిపాలన గాడిలో పడలేదు. కానీ అప్పుడే టీడీపీలో రాజకీయ ముసలం మొదలైంది. ఆ పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి పార్టీ కాడి మోసే నేత లేని పరిస్థితుల్లో దగదర్తికి చెందిన మాలేపాటి సుబ్బానాయుడు రూ.కోట్లు ఖర్చు పెట్టుకుని ఉనికిని కాపాడుకుంటూ వచ్చాడు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అండతో అధిష్టానం ఆశీస్సులతో నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగారు. తానే కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ విస్తృత ప్రచారం చేసుకున్నాడు. అయితే రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో కావ్య కృష్ణారెడ్డి తెరపైకి రావడం, సార్వత్రిక ఎన్నికల్లో అధికారం మార్పు జరగడం చకాచకా జరిగిపోయాయి. ఈ క్రమం పార్టీకి విదేయుడిగా పని చేసిన సుబ్బానాయుడు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కావ్య కృష్ణారెడ్డి విజయంలో తనదైన పాత్ర పోషించారు.అయితే ఇప్పుడేం జరిగిందంటే..ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యాక కావ్య కృష్ణారెడ్డి విజయం సాధించిన తర్వాత టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విజయోత్సవాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలుచోట్ల వైఎస్సా ర్సీపీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు అనేక చోట్ల భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో మాలేపాటి సుబ్బానాయుడు తన స్వగ్రామమైన దగదర్తిలో ఈ నెల 9న టీడీపీకి చెందిన మాలేపాటి రవీంద్రనాయుడు, మాలేపాటి భాను, వడ్డే వినయ్, తాండ్రా కార్తీక్, తాండ్రా వెంకటేశ్వర్లు తదితరులు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు మారెళ్ల వెంకటేశ్వర్లు ఇంటి ప్రహరీని జేసీబీతో ధ్వంసం చేశారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు దగదర్తి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాలేపాటి సుబ్బానాయుడు, భాను, గోపాల్, సూరయ్య, వినయ్ తదితరులు జేసీబీతో తమ ఇంటి ప్రహరీని కూల్చి వేశారని, అడ్డుకోబోయిన తన కోడలు, తనను దుర్భాషలాడుతూ దాడి చేయబోయారని దగదర్తికి చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారు అయిన కాండ్రా కామేశ్వరమ్మ టీడీపీ నేతలపై మరో ఫిర్యాదు చేశారు. ‘నీ కొడుకు శ్రీనివాసులు ఎక్కడున్నా వెతికి చంపేస్తామంటూ’ తమపై దాడి చేయబోగా వారి నుంచి తప్పించుకొని పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.మాలేపాటికి షాక్ ఇచ్చిన కావ్యమాలేపాటి అండ్ గ్యాంగ్ సాగించిన అరాచకంపై తన మండలంలోనే తమపై కేసులు నమోదు కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన మాలేపాటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మాపై కేసులు పెడుతుంటే..చూస్తూ ఊరుకుంటావా? అంటూ ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో కావ్య కూడా గట్టిగానే తిరిగి ప్రశ్నలు సంధించడంతో ఇద్దరి మధ్య వాగ్యువాదం తారస్థాయికి చేరింది. ‘ఎవర్ని అడిగి గోడలు కూల్చారు.. ఎవరిని అడిగి విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేశారంటూ’ కావ్య నిలదీశారంట. ఎన్నికల ముందు నుంచి మాలేపాటి ఆర్థికంగా తనను వేధించిన విషయాలను మనస్సులో పెట్టుకున్న కావ్య ఒక్కొక్కటిగా కడిగిపారేయడంతో సుబ్బానాయుడు తీవ్ర ఫ్రస్ట్రేషన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడిని కుటుంబ సభ్యులు చైన్నెలోని ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై పెట్టి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది. ప్రస్తుతంలో ఐసీయూలో కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.కావ్య వైఖరితోనే ఈ పరిస్థితి.. కావ్య కృష్ణారెడ్డి ఉద్దేశ పూర్వకంగానే మాలేపాటిపై కేసులు పెట్టించి.. ఆయన్ను తీవ్రంగా అవమానించడంతో పాటు వేధింపులకు గురిచేయడం కారణంగానే మాలేపాటి చావుబతుకుల్లో ఉన్నాడని ఆయన బంధువులు, అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. టీడీపీ ప్రారంభం నుంచి వీరవిధేయులుగా ఉన్న తమను కాదని, ధన బలంతో పార్టీ టికెట్ చేజిక్కించుకొని ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి తమను ఇంతగా కించపరచడాన్ని మాలేపాటి వర్గీయులు ఏ మాత్రం సహించబోమని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో అసలైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాలేపాటికి అండగా నిలవాలని అంతర్గతంగా జోరుగా చర్చ జరుగుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కావలి టీడీపీలో రెండు రాజకీయ కుంపట్లు ఏర్పడి మరింత సంక్షోభావానికి దారి తీయవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కావ్య కృష్ణారెడ్డి వైఖరిపై బీద రవిచంద్ర కూడా కక్కలేక.. మింగలేక రగిలిపోతున్నట్లు సమాచారం. మాలేపాటి విషయంలో కావ్య వ్యవహరిస్తున్నట్లు తీరు, పార్టీ పరిస్థితిపై లోకేశ్ వద్ద పంచాయితీ పెట్టన్నట్లు తెలుస్తోంది. -
నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి లు చెప్పేవి అన్ని అబద్ధాలే..
-
నర్రెడ్డి సునీత, రాజశేఖర్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు
పులివెందుల: నర్రెడ్డి సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి చాలా నీచంగా మాట్లాడుతున్నారని వైఎస్ వివేకానందరెడ్డి వద్ద పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నర్రెడ్డి దంపతులు ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినవనీ అబద్ధాలేనని తెలిపారు. కడుపుకు అన్నం తినేవాళ్లెవరూ ఇలా మాట్లాడరన్నారు. భార్యాభర్త రోజుకో అబద్ధపు స్టేట్మెంట్లు ఇస్తున్నారన్నారు. నర్రెడ్డి బ్రదర్స్ నాటకాలాడుతున్నారని చెప్పారు. వైఎస్ వివేకా రక్తపు వాంతులతో చనిపోయాడని తాను నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితో చెప్పలేదన్నారు. రూము మొత్తం రక్తపు మరకలున్నాయని, తలపైన గాయం ఉందని, బాడీ మొత్తం రక్తంలో ఉందని, సైడు వాకిలి, బెడ్ రూము వాకిలి తెరచి ఉన్నాయని, ఏసీ ఆన్‌లో ఉందని చెప్పానని తెలిపారు. రక్తపు వాంతులని ఎర్ర గంగిరెడ్డి అనగా, ఇంత రక్తం ఉంటే వాంతులంటావేమిటని తాను ఆయనతో వాదించానన్నారు. అలాంటిది రాజశేఖర్‌రెడ్డికి రక్తపు వాంతులని ఎలా చెబుతానని అన్నారు. అలాగే తాను వైఎస్ వివేకా లెటర్‌ను దాచిపెట్టడానికి ప్రయత్నం చేశానన్నారని, అదీ అబద్ధమేనని తెలిపారు. లెటర్ గురించి తాను రాజశేఖర్‌రెడ్డికి ఫోన్లో చెప్పగా ఆయనే దాచమన్నారని చెప్పారు. పోలీసులతో సమస్య కదా అని తాను అంటే ఆ విషయం ఆయనే చూసుకుంటానని చెప్పారన్నారు.అవినాశ్‌రెడ్డి తనను మేనేజ్ చేశారనడం నిజం కాదన్నారు. నర్రెడ్డి దంపతులే తనను మేనేజ్ చేయాలని చూసి విఫలమయ్యారని చెప్పారు. లెటర్ దాచిపెట్టమని చెప్పిన వారిని కేసులో పెడతారని, కానీ వీరు అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న టీడీపీ నాయకులతో కలిసి పోలీసులను మేనేజ్ చేసి తనను, మరో అమాయకుడైన ప్రకాష్‌ను కేసులో ఇరికించారన్నారు. తనది చిన్న ప్రాణం కాబట్టి ఇరికించారని, వారి కారణంగా తాను ఉద్యోగానికి 9 నెలలు సస్పెన్షన్‌కు గురయ్యానని, ప్రమోషన్, పాస్‌పోర్ట్ రెన్యువల్ ఆగిపోయాయన్నారు. తాను ఇప్పుడు 20 శాతం విషయాలే చెబుతున్నానని, మరలా మిగిలిన విషయాలు చెబుతానన్నారు.తాను వైఎస్ వివేకా దగ్గర 37 సంవత్సరాలు ఏ జీతం తీసుకోకుండా పని చేశానని తెలిపారు. వివేకాను తాను చూసుకున్నట్లు వారి ఇంట్లో వారు కూడా చూసుకోలేదన్నారు. వివేకా తన ముందరే ఎన్నోసార్లు వారిని ఛీ కొట్టారని తెలిపారు. నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, శివప్రకాష్‌రెడ్డి వారి బావ వివేకా ద్వారా కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని, అయినా వారిలో ఆశ చావలేదన్నారు. వివేకా రెండో వివాహం కారణంగా వారికి ఆయనతో తీవ్ర మనస్పర్థలు వచ్చాయన్నారు. వివేకా రెండో భార్య షమీమ్ కుమారుడికి ఆస్తులు పోకుండా రాజకీయంగా వివేకా ద్వారా ఎదగాలని విఫలమై ఈ రోజు వేరేవారిపై నిందలు వేస్తున్నారన్నారు. గతంలో డ్రైవర్‌గా దస్తగిరిని తొలగిస్తేనే పులివెందుల వస్తానని వివేకాకు రాజశేఖర్ గట్టిగా చెప్పడంతో ఆయన తొలగించారన్నారు. ఇప్పుడు అదే దస్తగిరిని ముందర పెట్టుకుని వీరు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. రామ్‌సింగ్ చెప్పినట్లు వినాలని సునీత బెదిరించారుఓసారి సునీత దంపతులు తనను హైదరాబాద్‌కు పిలిపించుకొని, రామ్‌సింగ్ చెప్పినట్లు వికపోతే కేసులో ఇరుక్కుంటావని బెదిరించారన్నారు. తాను అబద్ధం చెప్పనని కరాఖండిగా చెప్పానన్నారు. ఆ సమయంలో కృష్ణారెడ్డి మన మాట వినకపోతే నువ్వు కేసులో ఇరుక్కుంటావని రాజశేఖర్‌తో సునీత అన్నారని చెప్పారు. దీనికి అర్థమేమిటో మీడియా సోదరులే ఆలోచించుకోవాలని అన్నారు. ఎప్పటికైనా ఈ కేసులో రాజశేఖర్ జైలుకు వెళ్లక తప్పదన్నారు.వారి ముగ్గురు పేర్లు చెప్పాలని రామ్‌సింగ్ కొట్టాడుఢిల్లీలో సీబీఐ అధికారి రామ్‌సింగ్ నెలరోజుల పాటు తనను తీవ్ర చిత్రహింసలకు గురిచేశాడన్నారు. హత్యలో వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి హస్తం ఉన్నట్లు సాక్ష్యం చెప్పాలని తీవ్రంగా కొట్టేవాడన్నారు. ఎంతకీ తాను ఒప్పుకోకపోవడంతో వదిలేశారన్నారు. ఆతర్వాత ఒకరోజు రామ్‌సింగ్ వాట్సప్ కాల్ చేసి తన కుమారుడిని తీసుకొని కడపకు రమ్మని చెప్పాడన్నారు.తామిద్దరం మరుసటిరోజు రామ్‌సింగ్ వద్దకు వెళ్లగా, వివేకా హత్యలో అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డిల హస్తం ఉన్నట్లు చెప్పాలంటూ తన కుమారుడి ఎదుటే కట్టెతో కొట్టాడన్నారు. దస్తగిరి, రంగన్న చెప్పినట్లు విన్నారని, వారిని సేవ్ చేశామని, నువ్వు వినకపోతే కేసులో ఇరికిస్తామని చెప్పాడన్నారు. తన బెయిల్ రద్దు చేసి మళ్లీ జైలుకు పంపిస్తామని బెదిరించాడన్నారు. తాను అబద్ధం చెప్పనని గట్టిగా చెప్పడంతో పంపించేశాడన్నారు. కృష్ణారెడ్డి మాట వినలేదని సునీత దంపతులకు రామ్‌సింగ్ చెప్పగా.. తన కుమారుడితో వివాహం కుదుర్చుకున్న గుంటూరుకు చెందిన మా వియ్యంకుడికి సునీత ఫోన్ చేసి కృష్ణారెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేయిస్తామని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని, వివాహం రద్దు చేసుకోవాలని బెదిరించారని, దీంతో వారు భయపడి వివాహం రద్దు చేసుకున్నారని తెలిపారు.నాకేదైనా జరిగితే వారిదే బాధ్యతతనకు ఇప్పటికీ కొంతమంది నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వారి పేర్లు త్వరలో బయటపెడతానన్నారు. తన ప్రాణానికి ముప్పు ఉందని, తనకు ఏదైనా జరిగితే సునీత, రాజశేఖర్, శివప్రకాష్‌రెడ్డిలే బాధ్యులవుతారని చెప్పారు. ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు స్పందించకపోవడంతో కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నానన్నారు. కేవలం రాజకీయ ఎదుగుదల కోసం సునీత దంపతులు అవినాశ్‌రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని కృష్ణారెడ్డి తెలిపారు. -
నల్లగొండ..నెగ్గేదెవరు?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లా. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలుకొని సాగునీటి కోసం బ్యాలెట్ యుద్ధం, తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంత్‌చారి ఇలా.. ఎందులో చూసినా నల్లగొండ జిల్లాది ప్రత్యేకస్థానం. 1940లోనే తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తే, 1952 తర్వాత జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నుంచి ఎన్నికైన రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్ భవనాన్నే ప్రారంభించారు.అలాంటి నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో 1952 నుంచి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 7 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, ఆరుసార్లు కమ్యూనిస్టు పార్టీ, రెండుసార్లు టీడీపీ, ఒకసారి తెలంగాణ ప్రజాసమితి, పీడీఎఫ్ పార్టీల అభ్యర్థులు విజయం సాధించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, బొమ్మగాని ధర్మబిక్షం నల్లగొండ నుంచే ప్రాతినిధ్యం వహించగా, భీంరెడ్డి నర్సింహారెడ్డి రద్దయిన మిర్యాలగూడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. అదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలిచిన సూదిని జైపాల్‌రెడ్డి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. కేంద్రమంత్రి కూడా అయ్యారు.సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న నల్లగొండపై క్రమంగా కాంగ్రెస్ పైచేయి సాధించింది. గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీనే నల్లగొండలో గెలుపొందింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో, తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 2014, 2019లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుందూరు రఘువీర్‌రెడ్డిని గెలిపించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది.నాలుగోసారి కూడా తామే నల్లగొండలో పాగా వేసే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ ఇన్చార్జ్గా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నీ తానై వ్యవహరిస్తుండగా, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను పక్కన పడేసిందంటూ విమర్శిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.బోణీ కొట్టేందుకు బీఆర్ఎస్బీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలో ఉంది. అయినా 2014, 2019 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోలేకపోయింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విజయం సాధించినా, ఆ తర్వాత నాలుగు నెలలకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అడ్డు కోలేకపోయింది. ఉమ్మడి జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్య ర్థులే విజయం సాధించారు. అదే తరహాలో ప్రస్తుత ఎన్నికల్లో నల్లగొండ బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తారన్న ధీమాతో ముందుకు సాగుతోంది.కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని 13 పథ కాల్లో కొన్ని కూడా అమలు చేయడం లేదంటూ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండలో భారీ సభ నిర్వహించడం, ఆ తర్వాత తుంగతుర్తి, సూర్యాపేట నియోజక వర్గాల్లోనూ ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. ఇటీవల మిర్యాలగూడ, సూర్యాపేటలో బస్సు యాత్ర నిర్వహించారు. జిల్లా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నీ తానై ఈ ఎన్నికల్లో వ్యవహరిస్తున్నారు.మోదీ చరిష్మా, పాలకుల వైఫల్యాలే గెలిపిస్తాయంటున్న బీజేపీనల్లగొండ పార్లమెంట్ స్థానం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ అభ్యర్థి విజయం సాధించలేదు. అప్పట్లో ఓరుగంటి రాములు ఎంపీగా పోటీ చేసి గట్టిపోటీ ఇచ్చారు. ఆ తర్వాత ఇంద్రసేనారెడ్డి లాంటి పెద్ద నాయకులు పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. ప్రస్తుతం దేశంలో మోదీ చరిష్మా కొనసాగుతోంది. రామమందిర నిర్మాణం చేపట్టడం, అక్కడ తలంబ్రాల బియ్యం ఇంటింటికి పంపిణీ చేయడం హిందువుల్లో బీజేపీ వైపు మళ్లారన్న ధీమాతో బీజేపీ ఉంది.ప్రధానంగా యువత అంతా మోదీ ఆకర్షణలో ఉన్నారని, ఆ మోదీ చరి ష్మాతోనే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజ యం సాధించాలన్న ఉద్దేశంతో బీజేపీ ముందుకు సాగుతోంది. ప్రధానంగా గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం వంద రోజుల పాలనలో వైఫల్యాలను ప్రచార అస్త్రాలుగా చేసుకొని, కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈనెల 6వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నల్లగొండలో ప్రచారం చేయబోతున్నారు.ముగ్గురూ కొత్త వారే..నల్లగొండ ఎంపీ సెగ్మెంట్లో ఈసారి ముగ్గురు కొత్త అభ్యర్థులే బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. ఆయన తండ్రి, మాజీ మంత్రి జానారెడ్డి అండదండలతోనే రాజకీయాల్లోకి వచ్చారు. బీఆర్ఎస్ కూడా కొత్త అభ్యర్థినే పోటీలోకి దింపింది. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చింది. ఈయన కూడా ఎక్కడా పోటీ చేయలేదు. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. ఆయన 2018లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున అదే సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.ప్రభావితం చేసే అంశాలు∗ రైతులు, సాగునీరు, ప్రాజెక్టులే అన్ని పార్టీలకు ప్రధాన ప్రచార అస్త్రాలు∗ ఎంపీ సెగ్మెంట్లో 7 లక్షల మంది రైతులు ఉన్నారు. వారి ఓట్లే కీలకం∗ నాగార్జునసాగర్ ప్రాజెక్టు కేఆర్ఎంబీకి అప్పగింతపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర విమర్శలు∗ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎస్ఎల్బీసీ సొరంగమార్గం పూర్తి చేయకపోవడం∗ నెల్లికల్లు లిఫ్ట్, బ్రాహ్మణవెల్లెంల, డిండి తదితర పెండింగ్ ప్రాజెక్టులు2019 ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు లభించిన ఓట్లునలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) 5,26,028 (44.73 శాతం)వేమిరెడ్డి నర్సింహారెడ్డి (టీఆర్ఎస్) 5,00,346 (42.55 శాతం)గార్లపాటి జితేంద్రకుమార్ (బీజేపీ) 52,709 (4.48 శాతం)అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల వివరాలు ఇలా..నియోజకవర్గం పురుషులు స్త్రీలుదేవరకొండ(ఎస్టీ) 1,31,659 1,30,392 నాగార్జునసాగర్ 1,15,710 1,20,464 మిర్యాలగూడ 1,15,543 1,20,299హుజూర్నగర్ 1,21,667 1,29,164 కోదాడ 1,19,068 1,25,878 సూర్యాపేట 1,18,770 1,24,893నల్లగొండ 1,21,079 1,27,766మొత్తం 8,43,496 8,78,856 -
ఆయన నమ్మరు.. ఆయన్ను నమ్మరు
కావ్య ఎంట్రీతో కావలిలో టీడీపీ గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. కావ్య కృష్ణారెడ్డి అభ్యర్థిత్వంతో టీడీపీ భవితవ్యం తేలిపోయింది. చంద్రబాబు కావలిలో నిర్వహించిన ప్రజాగళం సభతో అది ప్రస్ఫుటమైంది. కావ్యను టీడీపీ కేడర్ ఆది నుంచి వ్యతిరేకిస్తున్న తరుణంలో ఆయన తన క్వారీల్లో పని చేసే సిబ్బందితో సొంత దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తనను వ్యతిరేకిస్తున్నారనే కారణంతో టీడీపీ వీరాభిమానులను సైతం కావ్య పక్కన పెట్టేశారు. టీడీపీకి మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ నేతలను సైతం దూరంగా ఉంచారు. ఎన్నికల కార్యాచరణలో వీరిని దూరంగా పెట్టి.. తన గుమాస్తాల చేతికే పెత్తనమంతా కట్టబెట్టారు. ఖర్చులకు సైతం డబ్బులివ్వకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్ కావ్యను పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలే చంద్రబాబు సభకు జనసమీకరణకు కూటమి నేతలు ముఖం చాటేయడంతో ప్రజాగళం అట్టర్ ఫ్లాప్ అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కావలి: టీడీపీ కావలి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఏక్ నిరంజన్‌గా మిగిలిపోయాడు. ఆయన నేతలను నమ్మడం లేదు. నేతలు ఆయన్ను నమ్మడం లేదు. కావ్య అభ్యర్థత్వాన్ని టీడీపీ నేతలు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. టికెట్ రేస్‌లో పోటీపడి చివరకు సీటు దక్కించుకున్నాడు. అయితే ఎన్నికల కార్యాచరణలో తన గెలుపు కంటే.. తన వద్ద ఉండే డబ్బు కోసమే పని చేస్తారనే ఆలోచనతో సొంత పార్టీ నేతలనే కాదు.. మిత్రపక్షాలను సైతం దూరం పెట్టేశాడు. తన వద్ద పని చేసే ఉద్యోగులు, దగ్గరి బంధువులతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పార్టీ నిర్ణయాన్ని కాదనలేక సర్దుకుపోదామని ప్రయత్నించినా మిత్ర పక్షాలకు, పార్టీ కేడర్‌కు కావ్య వర్గం నుంచి ప్రతి రోజూ అవమానాలు ఎదురవుతుండటంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. కావ్య శిబిరంలో కలవరం టీడీపీ అధినేత చంద్రబాబు కావలిలో నిర్వహించిన ప్రజాగళం సభ అట్టర్‌ఫ్లాప్ కావడంతో కావ్య శిబిరంలో కలవరం మొదలైంది. ముందుగానే ప్రజాగళం షెడ్యూల్ ప్రకటించినప్పటికీ జన సమీకరణ చేయడంలో చతికిల పడ్డారు. జన సమీకరణ పేరుతో డబ్బులు తినేస్తారనే భావనతో కావ్య ప్రజాగళం బహిరంగ సభకు సంబంధించిన బాధ్యతలను కార్యకర్తలు, నాయకులను కాదని తన క్వారీల్లో పని చేసే గుమాస్తాలకు, తన దగ్గరి బంధువులకు అప్పగించారు. తమపై నమ్మకం లేక గుమాస్తాలకు బాధ్యతలు అప్పగించిన వ్యక్తి కోసం తాము ఎందుకు పని చేయాలంటూ సొంత పార్టీ కేడర్‌తో పాటు మిత్రపక్షాలు బీజేపీ, జనసేన సైతం ముఖం చాటేశారు. కావ్య అహంకార వైఖరితో ఇప్పటికే నియోజకవర్గంలో బీద రవిచంద్ర వర్గీయులు, మాలేపాటి వర్గీయులు పారీ్టకి దూరదూరంగా ఉంటున్నారు. ఎవరూ సహకారం అందించకపోవడంతో తన దళాలను రంగంలోకి దింపి జన సమీకరణకు సిద్ధమయ్యారు. అసలే టీడీపీ సభలంటే జనం ముఖం చాటేస్తున్నారు. చంద్రబాబు హెలికాప్టర్ దిగినా.. జనం లేకపోవడంతో గంటా పది నిమిషాలు హెలిప్యాడ్‌లో ఉన్న బస్సులోనే పడిగాపులు పడ్డారు. ఎట్టకేలకు వెయ్యి.. రెండు వేల మందిని సభా స్థలికి చేర్చడంతో, రద్దీగా ఉండే ట్రంక్‌రోడ్‌లో జనం వచ్చే జనం, పోయే జనం పోగుకావడంతో సభ వద్దకు చంద్రబాబు వచ్చారు. ఆయన మాట్లాడుతుండగానే జనం పొలోమని వెళ్లిపోవడంతో అసహనంతో సభను అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. ప్రజాగళం ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ఆగ్రహంతో వెళ్లిన చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఆందోళన నెలకొంది. మిత్రపక్షాలకు దక్కని ప్రాధాన్యం టీడీపీ మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన నాయకులను కూడా కావ్య కృష్ణారెడ్డి చిన్నచూపు చూస్తున్నారని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తాజాగా ప్రజాగళం సభలో జనసేన ఊసే లేకపోవడంతో పవన్ అభిమానులకు మింగుడు పడటం లేదు. బీజేపీ నాయకులను కూడా పట్టించుకోలేదు. కావలి పట్టణ బీజేపీ అధ్యక్షుడి సహా సీనియర్ నాయకులంతా కూడా ప్రజాగళంలో జనాల మధ్య సాధారణ కార్యకర్తల్లా ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో బీజేపీ, జనసేన నాయకులు కూడా కావ్యకు మద్దతు తెలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. దొంగల్లా చూస్తున్నారని... 40 ఏళ్ల నుంచి పార్టీ కోసమే పని చేస్తున్నాం. పైసా ఆశించకుండా అభిమానంతో పార్టీ జెండా మోస్తున్నాం. కొత్తగా వచ్చిన కావ్య కృష్ణారెడ్డి మమ్మల్ని దొంగల్లా చూస్తున్నాడు. ప్రచార ఖర్చులకు అడిగినా కూడా అనుమానిస్తూ తన గుమాస్తాలకు లెక్కలు చెప్పమంటున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఇంత వరకూ చూడలేదు. ఇలాంటి అనుమానపు వ్యక్తి ఉన్న పారీ్టలో కొనసాగడం మా వల్ల కాదంటూ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నందమూరి అభిమానులు, సీనియర్ నాయకులు పారీ్టకి, కావ్యకు దండం పెట్టి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇదే బాటలో మరికొంత మంది సీనియర్ నాయకులు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. -
అనపర్తిలో ఆగ్రహ జ్వాల! స్పందించని బాబు తీరు..
తూర్పుగోదావరి: నోటి దగ్గర కూడు లాగేసుకుంటే ఎలా ఉంటుంది? చిన్న పిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసేసుకుంటే వారికి ఎంత కోపం వస్తుంది? సరిగ్గా అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో అనపర్తి నుంచి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం ఆరంభించారు. తదనంతర పరిణామాల్లో టీడీపీ, జనసేనకు బీజేపీతో పొత్తు కుదిరింది. చంద్రబాబు వెళ్లి బీజేపీ నేతలతో బేరసారాలు సాగించడమే కాకుండా.. వారడిగిన స్థాయిలో సీట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అనపర్తి సీటును బీజేపీకి సమర్పించుకున్నారు. దీంతో తాజాగా ఇక్కడి నుంచి విపక్ష కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన ములగపాటి శివరామకృష్ణంరాజు పేరు ప్రకటించారు. కనీసం రామకృష్ణారెడ్డికి మాటమాత్రంగా కూడా ఈ విషయం చెప్పలేదు. ఈ పరిణామాలు అనపర్తి టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. రామకృష్ణారెడ్డికి ఇచ్చినట్టే ఇచ్చి టికెట్టు లాగేసుకోవడంతో వారు భగ్గుమంటున్నారు. నాలుగు రోజులుగా రచ్చ వాస్తవానికి అనపర్తి టికెట్టుపై నియోజకవర్గ టీడీపీలో నాలుగు రోజులుగా రచ్చ జరుగుతోంది. ఈ సీటును బీజేపీకి కేటాయిస్తున్నారంటూ వార్తలు రావడంతో కొద్ది రోజులుగా టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. దీనిపై అధిష్టానం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకూ ఎన్నికల ప్రచారం చేయవద్దంటూ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను వారు అడ్డుకున్నారు. తొలిగా బిక్కవోలు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రామకృష్ణారెడ్డిని ప్రచారం చేయవద్దంటూ నిలిపివేశారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులకు రాజీనామాలు చేస్తూ సోమవారం రాజమహేంద్రవరంలో ఉన్న టీడీపీ జోన్–2 కో ఆర్డినేటర్ రావు వెంకట సుజయ కృష్ణ రంగారావుకు లేఖలు అందజేశారు. అలాగే మంగళవారం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ధర్నా చేశారు. బుధవారం పెదపూడిలో నిరసన చేపట్టారు. అదే రోజు సాయంత్రం బీజేపీ అభ్యర్థిగా శివరామ కృష్ణంరాజు పేరు ప్రకటించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అదే రోజు రాత్రి ఇద్దరు యువకులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిని రామకృష్ణారెడ్డి వారించారు. ఈ క్రమంలో రామవరంలోని ఆయన నివాసానికి టీడీపీ శ్రేణులు గురువారం పెద్ద ఎత్తున చేరుకున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికై నా టీడీపీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసి, రామకృష్ణారెడ్డికే టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నలభై సంవత్సరాలుగా నియోజకవర్గంలో టీడీపీని మోస్తున్న నల్లమిల్లి కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కట్టప్ప రాజకీయాలు చేయద్దంటూ చంద్రబాబును తీవ్రంగా దూషించారు. టీడీపీ ఎన్నికల ప్రచార కరపత్రాలు, పార్టీ జెండాలను కుప్పగా పోసి తగులబెట్టారు. వారిని రామకృష్ణారెడ్డి వారించారు. నియోజకవర్గంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఇన్నాళ్లూ తాను పడిన కష్టం నిష్ప్రయోజనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తిరిగి ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు తగు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇంత తంతు జరుగుతున్నప్పటికీ చంద్రబాబు కానీ, ఇతర పెద్దలు కానీ స్పందించకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఇంటి ముందు నిరసన తెలపండి అనపర్తి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి దిగజారుడు రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం కేటాయించకపోతే ఆ పార్టీ శ్రేణులు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలే తప్ప, రామవరంలో చేస్తే ఉపయోగమేమిటని, ఇది హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విలేకర్లతో మాట్లాడుతున్న ఏఎంసీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి పొత్తుల్లో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే సీటు బీజేపీకి కేటాయించడం ఆయా పార్టీల అంతర్గత వ్యవహారమని, చంద్రబాబు నిర్ణయమని అన్నారు. తనకు టికెట్టు రాకుండా స్థానిక వైఎస్సార్ సీపీ కుట్రలు చేస్తోందని రామకృష్ణారెడ్డి ఆరోపించడం.. ఆడలేక మద్దెల ఓడు సామెతను గుర్తు చేస్తోందని విమర్శించారు. రాజకీయంగా తనకు తగిలే ఎదురు దెబ్బను వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ఆపాదించడం రామకృష్ణారెడ్డికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. తనకు టికెట్టు రాకుండా వైఎస్సార్ సీపీ నేతలు రూ.20 కోట్లకు బేరసారాలు నడిపారంటూ ఆయన పేర్కొనడం విడ్డూరంగా ఉందని, ఎవరైనా అధిక మొత్తంలో నగదు ముట్టజెపితే అమ్ముడుపోయే స్థితిలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారా అని కృష్ణారెడ్డి ప్రశ్నించారు. మూడేళ్ల కిందట బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో చేసిన అసత్య ప్రమాణం, ఇటీవల అనపర్తి గ్రామ దేవత శ్రీ వీరుళ్లమ్మ అమ్మవారికి సంబంధించి అవహేళనగా మాట్లాడిన ఫలితమే నేడు రామకృష్ణారెడ్డికి పట్టిన దుస్థితి అని చెప్పారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని కర్మఫలాలు అనుభవించక తప్పదని కృష్ణారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ వారా కుమారి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చిర్ల వీర రాఘవరెడ్డి కూడా పాల్గొన్నారు. ఇవి చదవండి: బాబు పొత్తు ధర్మం చిత్తు చిత్తు? -
వివేకా హత్య.. సునీత దంపతుల కుట్రే!
సాక్షి, అమరావతి: ‘వైఎస్ వివేకానందరెడ్డిని ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డే హత్య చేయించి ఉండొచ్చు. ఈ హత్య వెనుకనున్న ఏదో విషయాన్ని దాచిపెట్టాలని వారు ప్రయత్నిస్తున్నారు. వివేకం సార్ రెండో పెళ్లితో ఆ ఇంట్లో తలెత్తిన ఆస్తి గొడవలకు ఆయన హత్యకు ఏదైనా సంబంధం ఉందా.. అనిపిస్తోంది. కూతురు, అల్లుడు, పెద్ద బావమరిదే ఈ దారుణానికి తెగించి ఉండొచ్చు’.. అని వైఎస్ వివేకానందరెడ్డి పీఏగా చేసిన ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. ‘వివేకానందరెడ్డి రాసిన లెటర్ పోలీసులకు వెంటనే ఇచ్చేసి ఉంటే దర్యాప్తు సక్రమంగా సాగేది. కానీ, ఆ లెటర్‌ను దాచిపెట్టమని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఎందుకు చెప్పారు? ఈ కేసుతో సంబంధంలేని ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిల పేర్లు చెప్పాలని నన్ను ఎందుకు బెదిరించారు? నేను అబద్ధం చెప్పకపోతే తన భర్త రాజశేఖర్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’ అని సునీత ఎందుకు అన్నారని కూడా ఆయన వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేకానందరెడ్డిని పాశవికంగా హత్య చేశానన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం ఏమిటీ? అతను చెప్పే కట్టుకథలను పట్టుకుని సీబీఐ దర్యాప్తు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి చివరివరకు కూడా వైఎస్ జగన్‌ను సీఎం చేయడానికి, వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడానికే కృషిచేశారని ఆయన స్పష్టంచేశారు. వివేకాకు పీఏగా దాదాపు 37ఏళ్ల పాటు పనిచేసిన కృష్ణారెడ్డి.. ఆయనకు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తునిగా గుర్తింపు పొందారు. ఆయన కుటుంబ వ్యవహారాలతో సహా అన్ని విషయాలు సమగ్రంగా తెలిసిన వ్యక్తి. 2019, మార్చి 15 ఉదయం వివేకానందరెడ్డి మృతిచెందిన విషయాన్ని కృష్ణారెడ్డే మొదటగా గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో పోలీసులు, తరువాత సీబీఐ అధికారుల చేతిలో చిత్రహింసలకు గురైన బాధితుడు కూడా కృష్ణారెడ్డే. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించిన అన్ని పరిణామాలను సమీపం నుంచి పరిశీలిస్తున్న కీలకవ్యక్తి అయిన కృష్ణారెడ్డి ‘సాక్షి’కి ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. సాక్షి: 2019, మార్చి 15న ఏ సమయంలో మీరు వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లారు? కృష్ణారెడ్డి: రోజూ వెళ్లినట్లే ఆ రోజు కూడా ఉ.5.30కే వివేకం సార్ ఇంటికి వెళ్లాను. ఇంట్లో లైట్‌వేసి లేదు. అంటే సారు ఇంకా నిద్ర నుంచి లేవలేదని అనుకున్నా. బయట లైట్ దగ్గర కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉన్నా. కాసేపటి తరువాత సౌభాగ్యమ్మకు ఫోన్‌చేసి సార్ ఇంకా నిద్ర లేవలేదు.. మీరు ఫోన్‌చేసి నిద్ర లేపుతారా అని అడిగాను. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి ఉంటారు.. కాసేపు నిద్రపోనీ అని ఆమె చెప్పారు. కాసేపటికే వంట మనిషి లక్ష్మమ్మను ఆమె కొడుకు ప్రకాశ్ తన బైక్ మీద తీసుకొచ్చాడు. ఆలస్యమైంది కిటికీ వద్దకు వెళ్లి సారును నిద్రలేపు అని చెప్పాను. ఆ సమయంలో వాచ్మెన్ రంగన్న మెయిన్ డోర్ ముందర నిద్రపోతూ ఉన్నాడు. లక్ష్మమ్మ వచ్చేసరికి రంగన్న నిద్రలేచి ఉత్తరం వైపు ఉన్న పార్కు వైపు వెళ్లాడు. ఇంతలో ‘సార్ పడిపోయాడు’ అని అరుచుకుంటూ రంగన్న వచ్చాడు. మేము ఆ వైపు పరిగెత్తి వెళ్లాం. ఇంటికి ఉత్తరం వైపు ఉన్న తలుపు తెరచి ఉంది. లోపలికి వెళ్లి చూస్తే సార్ హాల్లోగానీ బెడ్రూమ్లోగానీ లేరు. అక్కడ రక్తపు మరకలు ఉన్నాయి. బాత్రూమ్లో చూస్తే వివేకం సార్ రక్తపుమడుగులో పడి ఉన్నారు. నేను సార్ చేయిపట్టుకుని నాడి చూశాను. నాడి కొట్టుకోవడంలేదు. ఆయన చనిపోయారని నిర్ధారించుకున్నా. సాక్షి: ఆ వెంటనే మీరు ఏం చేశారు? కృష్ణారెడ్డి: నేను వెంటనే సార్ అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఫోన్ చేసి చెప్పాను. బావ మనకు లేరు.. ఎవరో ఏదో చేశారు. రక్తపు మడుగులో ఉన్నారు. తల మీద గాయం ఉంది అని చెప్పాను. సరే అని ఆయన ఫోన్ పెట్టేశారు. నేను 6.15కు కాల్ చేశాను. నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి నాతో 47 సెకన్లు మాట్లాడి ఫోన్ పెట్టేశారు. ఆ తరువాత సార్ పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డికి కాల్ చేశాను. కానీ, ఆయన ఫోన్ కలవలేదు. నాకు సౌభాగ్యమ్మ ఫోన్ నుంచి కాల్ వచి్చంది. నేను మేడంకు కూడా విషయం చెప్పాను. సాక్షి: ఆ తరువాత ఏం జరిగింది? కృష్ణారెడ్డి: నేను, ప్రకాశ్ అక్కడ ఉండగా వీల్ చెయిర్ దగ్గర లెటర్ దొరికింది. ఆ లెటర్ చదివాను. తన మాజీ డ్రైవర్ తనను చంపినట్లు వివేకం సార్ ఆ లెటర్లో రాసి ఉంది. ఇంతలో సౌభాగ్యమ్మ నాకు ఫోన్ చేశారు. అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి ఫోన్ ఇమ్మన్నాను. ఆమె ఆయనకు ఫోన్ ఇస్తే ఆ లెటర్లో రాసింది చదివి వినిపించాను. ఆ లెటర్‌ను దాచిపెట్టు. ఎవరికి చెప్పొద్దు.. అని రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. లెటర్ గురించి పోలీసులకు చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది కదా అని అన్నాను. ఏం ఇబ్బంది అవ్వదు.. మేం చూసుకుంటాం.. ఆ లెటర్ జాగ్రత్తగా దాచిపెట్టు అని ఆయన చెప్పారు. దాంతో ఆ లెటర్ విషయం పోలీసులకుగానీ ఎవరికీగానీ చెప్పలేదు. వంట మనిషి లక్ష్మమ్మ కొడుకు ప్రకాశ్‌కు ఆ లెటర్ ఇచ్చి మా ఇంట్లో ఇచ్చి రమ్మన్నాను. ఇంతలో రాజశేఖరరెడ్డి మళ్లీ నాకు ఫోన్ చేశారు. అప్పటికే సీఐ శంకరయ్య వచ్చారని చెప్పాను. ఆయన నా ఫోన్‌తో సీఐ శంకరయ్యతో మాట్లాడారు. తరువాత శంకరయ్య చెప్పినట్లుగా పోలీసు కంప్లైంట్ ఇవ్వమని రాజశేఖరరెడ్డి నాతో చెప్పారు. నేను అలానే చేశాను. సాక్షి: ఆ లెటర్ అప్పుడే పోలీసులకు ఇచ్చేసి ఉంటే ఈ కేసు దర్యాప్తు వేరే విధంగా ఉండేది కదా? కృష్ణారెడ్డి: ఆ లెటర్ అప్పుడే పోలీసులకు ఇచ్చి ఉంటే కేసు దర్యాప్తు సరైన విధంగా జరిగేది. కానీ, నాకు ఇష్టంలేకపోయినా రాజశేఖరరెడ్డి చెప్పడంతోనే ఆ లెటర్‌ను దాచి ఉంచాల్సి వచి్చంది. సాక్షి: మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు? కృష్ణారెడ్డి: నన్ను పోలీసులు ఎందుకు అరెస్టుచేశారో నాకే తెలీదు. లెటర్ దాచిపెట్టమని రాజశేఖరరెడ్డి చెప్పాడు. పోలీసులతో ఇబ్బంది వస్తుందని చెప్పినా తాను చూసుకుంటానని లెటర్ దాచి పెట్టమన్నాడు. టీడీపీ ప్రభుత్వం ఒత్తిడో.. వీళ్లు వాళ్లూ లాలూచీ అయి కృష్ణారెడ్డిని అరెస్టుచేయిస్తే సరిపోతుందని అనుకున్నారో తెలీదు. సాక్షి: మిమ్మల్ని అరెస్టు చేశాక ఏం జరిగింది? కృష్ణారెడ్డి: నన్ను అదేరోజు సాయంత్రం పోలీసులు అరెస్టుచేసి డీటీసీలో 13 రోజులపాటు ఉంచారు. బాగా కొట్టారు. రాజశేఖర్‌రెడ్డి చేశాడా.. శివశంకర్‌రెడ్డి చేసి ఉంటాడా చెప్పు అని తీవ్రంగా కొట్టారు. నాకు తెలీదని ఎంత చెప్పినా వినిపించుకోలేదు. సాక్షి: పోలీసులకు ముందు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి మీద అనుమానం కలిగిందా? కృష్ణారెడ్డి: పోలీసులు ముందు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డినే అనుమానించారు. వివేకం సార్‌ను ఆయనే హత్య చేయించి ఉంటాడా అని అడిగారు. నాకేమీ తెలీదని చెప్పాను. పోలీసులు కొట్టడంతో దాదాపు ఏడాదిపాటు నా చేతితో ఏమీ పట్టుకోలేకపోయాను. సాక్షి: లెటర్‌ను దాచి పెట్టమన్న రాజశేఖర్‌రెడ్డిని ఎందుకు ప్రశి్నంచరు అని మీరు పోలీసులను అడగలేదా? కృష్ణారెడ్డి: పోలీసులు నన్ను కొడుతూ ఉంటే నేనేం మాట్లాడను. నా మాట వాళ్లు వినిపించుకుంటే కదా. సాక్షి: రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు ఎందుకు విచారించలేదు? కృష్ణారెడ్డి: ఎందుకు విచారించలేదో మరి. సీబీఐ వాళ్లకు కూడా అదే విషయం చెప్పాను. కానీ, వాళ్లు కూడా పట్టించుకోలేదు. వాళ్ల మధ్య ఏం ఒప్పందం ఉందో తెలీదు. సాక్షి: ఎంపీ అవినాశ్‌రెడ్డి సీఐ శంకరయ్యను బెదిరించారనే ఆరోపణ కూడా ఉంది కదా? కృష్ణారెడ్డి: సీఐ శంకరయ్య పక్కనే నేనున్నా. ఆయన్ని ఎవరూ బెదిరించనే లేదు. సాక్షి: సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టిన తరువాత ఎంపీ అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పమని మీ మీద ఒత్తిడి వచి్చందా? కృష్ణారెడ్డి: ఎంపీ అవినాశ్, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని రాంసింగ్ నన్ను బాగా వేధించారు. వాళ్లిద్దరూ నన్ను బెదిరించారని చెప్పమన్నారు. అలాంటిదేమీ లేదని నేను చెప్పడంతో నన్ను బాగా కొట్టారు. ఉన్నది ఉన్నట్లు చెబుతాగానీ అబద్ధం చెప్పనని నేను అంటే మరింత గట్టిగా కొట్టేవారు. కొట్టినా చంపినా నాకు తెలిసింది ఇంతే అని చెప్పాను. సాక్షి: ఎంపీ అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లను ఇరికించాలని సీబీఐ అధికారి రాంసింగ్ ఎందుకు భావించారు? కృష్ణారెడ్డి: సునీత, రాజశేఖరరెడ్డితో రాంసింగ్ ఏం కమిట్ అయ్యారో.. వాళ్లద్దరి పేర్లు చెప్పాలనే వేధించారు. సాక్షి: సీబీఐ అధికారి రాంసింగ్ మీతో ఎలా వ్యవహరించారు? కృష్ణారెడ్డి: ఒకరోజు రాంసింగ్ ఫోన్‌చేశారు. తాము చెప్పినట్లు విన్నారు కాబట్టే రంగన్న, దస్తగిరిలను రక్షించాం. నేను కూడా చెప్పినట్లు వింటే రక్షిస్తామన్నారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్‌కు నా పిల్లలతో రమ్మని చెప్పారు. ఆ విషయాన్ని రాజశేఖర్‌రెడ్డికి చెబితే రాంసింగ్ చెప్పినట్లు చేయమన్నారు. మా ఇద్దరు కొడుకులతో సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్‌కు వెళ్లాం. వాళ్లు చెప్పినట్లు వినకపోతే జైలుకు పంపిస్తామని బెదిరించారు. తాము పెద్దపెద్ద వాళ్లనే జైలుకు పంపాం.. నువ్వెంత అని అన్నారు. నాకు తెలిసిందే చెబుతా తప్పా మీరు చెప్పమన్నట్లు అబద్ధం చెప్పలేనని నేను అన్నా. దాంతో కర్ర తీసుకుని నా కొడుకుల ముందే దాదాపు 20 సార్లు తీవ్రంగా కొట్టారు. సాక్షి: మీ అబ్బాయి పెళ్లిని చెడగొట్టారు అంటారు.. కృష్ణారెడ్డి: మేం సెంట్రల్ జైలు గెస్ట్‌హౌస్ నుంచి ఇంటికి వచి్చన మర్నాడే మా అబ్బాయికి సంబంధం కుదిరిన వారి నుంచి ఫోన్ వచి్చంది. పెళ్లి సంబంధం రద్దు చేసుకుంటున్నామని చెప్పారు. నా మీద కేసు ఉంది.. నేను జైలుకు వెళ్లాను.. మా ఆస్తులన్నీ తీసేసుకుంటామని సునీత, రాజశేఖర్‌రెడ్డి వారికి ఫోన్‌చేసి చెప్పారట. వాళ్లను హైదరాబాద్ పిలిపించుకుని మరీ బెదిరించి పెళ్లి సంబంధం రద్దుచేసుకునేలా చేశారు. వాళ్లు చెప్పినట్లు వినాలని నన్ను ఒప్పించేందుకు సునీత, రాజశేఖర్‌రెడ్డి అలా చేశారు. ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం కుదురుతుందని నేను వారికి లొంగలేదు. సాక్షి: మీరు రాంసింగ్ మీద ఫిర్యాదు చేశారు కదా? కృష్ణారెడ్డి: నేను ఎంతమందితో చిత్రవధలకు గురయ్యేది. టీడీపీ ప్రభుత్వంలో ముందు పోలీసులు కొట్టారు. సునీత, రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్ పిలిపించుకుని బెదిరించారు. మా అబ్బాయి పెళ్లి సంబంధం చెడగొట్టారు. సీబీఐ అధికారి రాంసింగ్ నన్ను కడపలో కొట్టారు. ఢిల్లీ పిలిపించుకుని గొడ్డును బాదినట్లు కొట్టారు. ఇక ఎంతమందితో దెబ్బలు తినాలి.. అందుకే ఎస్పీకి ఫిర్యాదు చేశాను. నాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించాలని కోరాను. పులివెందుల కోర్టులో కూడా పిటిషన్ వేశాను. సాక్షి: వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని ఎంపీ అవినాశ్‌రెడ్డి చెప్పారని ఒక ఆరోపణ వచి్చంది. ఆయన అలా చెప్పారా? కృష్ణారెడ్డి: ఆ మాటే వినలేదు. అసలు ఆ విషయం ఎలా బయటకు వచి్చందో కూడా నాకు తెలీదు. సాక్షి: దస్తగిరి ఎలాంటి వ్యక్తి? కృష్ణారెడ్డి: దస్తగిరి డ్రైవర్‌గా ఉండేవాడు. ప్రవర్తన సరిగా లేదని తీసేశారు. వివేకం సార్‌ను ముసలోడా అనేవాడు. డ్యాన్స్ చేసేవాడు.. వెక్కిరించేవాడు. దాంతో సౌభాగ్యమ్మ అతనిని పని నుంచి తీసేశారు. అతని ఇంట్లో వాళ్లు వచ్చి బాధపడితే సౌభాగ్యమ్మను ఒప్పించి మళ్లీ పనిలో పెట్టించాను. కానీ, ఆ తరువాత దస్తగిరి మరింత మారిపోయాడు. వివేకం సార్ షమీమ్ ఇంటికి వెళ్లాలంటే ఇతనే డ్రైవర్. దాంతో దస్తగిరికే ఆయన ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చేవారు. దస్తగిరి డబ్బు మనిషి. సాక్షి: హత్య ప్రదేశంలో సాక్ష్యాధారాలను చెరిపేయాలని ఎంపీ అవినాశ్‌రెడ్డి మీతో చెప్పారని కొందరు ఆరోపిస్తున్నారు? దీనిపై ఏమంటారు? కృష్ణారెడ్డి: అసలు వివేకం సార్ మృతదేహాన్ని బాత్రూమ్ నుంచి తీసుకువచి్చనప్పుడు ఎంపీ అవినాశ్‌రెడ్డి అక్కడ లేనేలేరు. అక్కడ సాక్ష్యాలను చెరిపి వేయించింది ఎర్ర గంగిరెడ్డే. ఎంపీ అవినాశ్‌రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే ఆ ఆరోపణలు చేస్తున్నట్లుగా ఉంది. అక్కడ తుడిపించి వేసింది గంగిరెడ్డే. అక్కడున్న అందరూ అది చూశారు. సాక్షి: సీబీఐ అధికారులు పిలిస్తే మీరు ఢిల్లీ వెళ్లారు కదా.. అక్కడ ఏం జరిగింది? కృష్ణారెడ్డి: సీఐబీ అధికారులు నోటీసు ఇస్తే ఢిల్లీ వెళ్లాను. నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి చెప్పే వెళ్లాను. నన్ను ఢిల్లీలో నెలరోజులు ఉంచి తీవ్రంగా వేధించారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని అక్కడ కూడా రాంసింగే వేధించారు. నాకు తెలిసింది ఇప్పటికే చెప్పాను. లెటర్ దాచి పెట్టడమే నేను చేసిన తప్పు.. అది కూడా రాజశేఖర్‌రెడ్డి చెబితేనే చేశాను.. అంతకుమించి నాకేమీ తెలీదని చెప్పాను. దాంతో వాళ్లు నన్ను కొట్టేవారు. రోజూ రాత్రి సునీత, రాజశేఖర్‌రెడ్డి ఫోన్ చేసేవారు. నన్ను తీవ్రంగా కొడుతున్నారని వారికి నేను చెప్పేవాడిని.. నెల రోజులవుతోందని చెప్పినా వారు పట్టించుకోలేదు. సాక్షి: మామా అల్లుళ్ల మధ్య సంబంధాలు ఎలా ఉండేవి? కృష్ణారెడ్డి: నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి మీద వివేకం సార్‌కు మంచి అభిప్రాయంలేదు. అల్లుడు కాబట్టి తప్పదు కదా. ఆయన మీద సార్ తరచూ కోప్పడేవారు. ఆ కుటుంబంలో ఏం జరుగుతోందో నాకు తెలీదు. కానీ, అల్లుడి మీద సార్ గట్టిగా అరుస్తూ ఉండేవారు. వివేకం సార్ రెండో భార్య షమీమ్ విషయంలోనే వాళ్ల మధ్య గొడవలు జరిగేవి. సాక్షి: వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ కుటుంబంలో గొడవలు జరిగేవా? కృష్ణారెడ్డి: షమీమ్ అనే ఆవిడను వివేకం సార్ రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ కుటుంబంలో గొడవలు జరిగేవి. ఒకరోజు సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి కలిసి వివేకం సార్‌తో గొడవ పడ్డారు. తాను షమీమ్‌ను పెళ్లి చేసుకోవడమే కాదు ఆమెతో తనకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడని సార్ చెప్పారు. ఆ ఇద్దరి బాధ్యతతోపాటు ఆమెకున్న ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేయడం కూడా తన బాధ్యతేనని అన్నారు. సాక్షి: సునీత ఎందుకు అంతగా కేకలు వేశారు? కృష్ణారెడ్డి: నా మీద సునీత కోపంతో అరుస్తూ ఉంటే రాజశేఖర్‌రెడ్డి ఆమెను సముదాయించేందుకు యత్నించారు. ‘ఈ కేసు విషయంలో కృష్ణారెడ్డి సహకరించకపోతే రాజశేఖర్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుంది’ అని సునీత ఆయనతో అంది. నాకేమీ అర్థం కాలేదు. వివేకం సార్ హత్యలో వీళ్ల పాత్ర ఉందేమోనని మొదటిసారి అనిపించింది. అంటే నాతో అబద్ధం చెప్పించి వేరెవరినో నాశనం చేయాలని సునీత భావిస్తోందని అర్థమైంది. సాక్షి: వివేకానందరెడ్డిని ఎవరు చంపి ఉంటారు? మీతో ఎందుకు అబద్ధం చెప్పించాలని చూస్తున్నారు? కృష్ణారెడ్డి: ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని సునీత, రాజశేఖర్‌రెడ్డి ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థంకావడంలేదు. నాతో ఒక అబద్ధం చెప్పించాలని ప్రయత్నిస్తున్నారంటే.. దాని వెనుక వాళ్లకేదో ఉద్దేశం ఉండే ఉంటుంది. ఎవర్నో కాపాడేందుకు.. ఏదో నిజాన్ని దాచేందుకే వాళ్లిద్దరూ ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. సీబీఐ అధికారి రాంసింగ్ కూడా నాతో అబద్ధాలు చెప్పాలని ఎందుకు పట్టుబట్టారో తెలీడంలేదు. కేసు దర్యాప్తు సక్రమంగా సాగితేనే వాస్తవాలు బయటకొస్తాయి. కానీ, సీబీఐ తీరు సక్రమంగాలేదు. అదే బాధేస్తోంది. సాక్షి: చివరగా.. వివేకా హత్య గురించి ఏమంటారు? కృష్ణారెడ్డి: జరుగుతున్నదంతా చూస్తే.. సునీత, రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డిల మీదే అనుమానం కలుగుతోంది. వీళ్లే వివేకం సార్‌ను ఏమైనా చేసి మరొకరి మీద నింద వేయాలని చూస్తున్నారా అనిపిస్తోంది. ఆస్తి గొడవలు, షమీమ్ విషయం.. ఆస్తి వేరొకరికి పోతుందనే చేశారా అనిపిస్తోంది. ఎందుకంటే అబద్ధం చెప్పమని నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఎవరైనా నిజం చెప్పాలని అంటారు. కానీ, అబద్ధం చెప్పమని వీళ్లు ఎందుకు అంటున్నారన్నది చూడాలి. అందుకే వివేకం సార్‌ను వీళ్లే ఏమైనా చేశారనిపిస్తోంది. నేను అబద్ధం చెప్పకపోతే తన భర్త రాజశేఖర్‌రెడ్డి జైలుకు పోతారని కూడా సునీత నా ముందే అంది. -
వివేకా, సునీతమ్మకు మాటల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో.. సునీతా దంపతులపై ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నర్రెడ్డి సునీత యెల్లో మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేయగా.. సాక్షితో కృష్ణారెడ్డి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో కృష్ణారెడ్డి పలు నిజాల్ని పంచుకున్నారు. ‘‘వివేకానందరెడ్డితో నాది 35 ఏళ్ల అనుబంధం. ఆయన హత్య గురించి ముందు నాకే తెలిసింది. వెంటనే ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఫోన్ చేశాను. వివేకాను ఎవరో ఏదో చేశారని స్పష్టంగా చెప్పాను. అయితే.. లెటర్ విషయం ఎవరికీ చెప్పొద్దని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి నాతో అన్నారు. అలాగే ఈ కేసులో అసలు గుండెపోటు కోణం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా నాకు తెలియదు. .. వివేకా హత్య జరిగిన రోజే నన్ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్, సునీతా దంపతులు నన్ను బెదిరించారు. తాము చెప్పిన పేర్లు సీబీఐ ముందు చెప్పాలని నన్ను ఒత్తిడి చేశారు. వివేకా కేసులో అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలన్నారు. నానా హింసలకు గురి చేశారు. లేదంటే జైలుకు పంపిస్తామన్నారు. .. వివేకానందరెడ్డి, సునీతమ్మ చాలాకాలంగా మాట్లాడుకోలేదు. వివేకా రెండో వివాహం విషయంలో గొడవలు జరిగాయి. రెండో భార్య షమీమ్ కొడుకును వారసుడిగా చేస్తారనే వివేకా చెక్ పవర్ తొలగించారు. వివేకానందరెడ్డికి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డిపై మంచి అభిప్రాయం లేదు. అల్లుడిపై ఆయన ఎప్పుడూ కోపంగానే ఉండేవారు అని తెలిపారాయన. -
Watch: తండ్రి హత్య కేసులో కూతురు చెప్పని నిజాలు!
-
Watch: తండ్రి హత్య కేసులో కూతురు చెప్పని నిజాలివే..
-
అక్రమ మైనింగ్ తో వేల కోట్లు నొక్కేసిన కావలి టిడిపి ఇన్ ఛార్జ్ కృష్ణారెడ్డి
-
అడ్డదారుల్లో కోట్లు ఆర్జించాడు.. డబ్బు సంచులతో సీటు కొనుగోలు!
టీడీపీ కావలి సీటు విషయంలో ఆ పార్టీ అధిష్టానం చివరకు క్యాష్ వైపే మొగ్గు చూపింది. కావ్య కృష్ణారెడ్డికే జై కొట్టి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించింది. పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచి డబ్బుసంచుల వైపు చూడడంతో దీనిని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. దశాబ్దాల నుంచి కావలిలో టీడీపీని కాపు కాసిన బీద రవిచంద్ర మాట కూడా చెల్లుబాటు కాలేదు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడికి సైతం మొండిచేయి చూపడంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి టీడీపీ ఇన్చార్జిగా కావ్య కృష్ణారెడ్డి (దగుమాటి వెంకట కృష్ణారెడ్డి)ని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. స్థానికుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా అభ్యర్థి ప్రకటన చేయడంపై క్యాడర్ మండిపడుతోంది. బీద రవిచంద్ర దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఆ కుటుంబానికే పార్టీ ప్రాధాన్యత ఇవ్వడంతో వారే అన్నీ తామై నడిపించేవారు. కానీ ఈ దఫా బీద రవించంద్ర, ఆయన సతీమణిని ఎన్నికల బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగినా స్థానికంగా పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో తన ప్రధాన అనుచరుడిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడిని ఇన్చార్జిగా నియామకం చేయించారు. కష్టకాలంలో మాలేపాటి పార్టీ కోసం నిలబడ్డారు. గత టీడీపీ హయాంలో అడ్డగోలుగా దోపిడీ చేసిన సొమ్ములో కాస్త కరిగించేలా చేశారు. చివరకు ఎన్నికల సమయంలో మాలేపాటికి టికెట్ ఇప్పించే ప్రయత్నంలో బీద మాట చెల్లుబాటు కాకపోవడంతో మిన్నకుండిపోవాల్సివచ్చింది. కావ్య వర్సెస్ బీద కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీలోకి ఎంట్రీ ఇవ్వకముందే బీద రవిచంద్రతో అమీతుమీకి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. డబ్బు సంచులతో పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని టికెట్ ఖరారు చేయించుకుని వచ్చిన కావ్య కావలిలో హడావుడి చేశారు. బీదకు వ్యతిరేక వర్గాన్ని కూడదీయడంతోపాటు ఇకపై బీద మాట వినాల్సిన అవసరం లేదని, అంతా తన కనుసన్నల్లోనే జరుగుతుందనే సంకేతాలను కూడా ఆ పార్టీ కార్యకర్తల్లోకి పంపారు. కావ్య కృష్ణారెడ్డి ముందుగానే పార్టీ ఫండ్ పేరుతో రూ.కోటి విరాళం ఇచ్చారు. అంతేకాక ఏకంగా రూ.20 కోట్లు పార్టీ ఫండ్ కింద జమ చేసి మరో రూ.50 కోట్లు ఇచ్చే దానికై నా సిద్ధంగా ఉన్నానని సంకేతం పంపి లోకేశ్ వద్ద మార్కులు కొట్టేసి టికెట్ ఖరారు చేయించుకున్నారని తెలుస్తోంది. అడ్డదారులు తొక్కుతూ.. సుమారు పాతికేళ్ల క్రితం కామర్స్ అధ్యాపకుడిగా ఉన్న కావ్య కృష్ణారెడ్డి తాను నివాసం ఉండే ఇంటికి అద్దె చెల్లించలేని స్థితి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రూ.వేల కోట్లకు అధిపతి అయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి అడ్డదారులు తొక్కుతూ అతి తక్కువ కాలంలోనే మైనింగ్ డాన్‌గా ఎదిగారు. అడ్డగోలుగా ఎదిగిన కావ్య కృష్ణారెడ్డి అందించిన డబ్బు సంచులకు సాగిలపడిన టీడీపీ ఆయనకు కావలి సీటు ఖరారు చేయడంపై ఆ పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పదవి పేరుతో ముంచేసి.. మండలస్థాయి నేతగా ఉన్న తనను కావలి నియోజకవర్గ ఇన్చార్జి పదవి పేరుతో ముంచేశారని మాలేపాటి సుబ్బానాయుడు తన అంతరంగీకుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. గత టీడీపీ హయాంలో అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన మాలేపాటిని కావలి సీటు పేరుతో బీద ఊరించి అతని చేత ఖర్చు పెట్టించారని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అతనిని నట్టేట ముంచారని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
హంతకులు ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
-
కృష్ణారెడ్డిని గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి చంపిన టీడీపీ నేతలు
-
మోదీ నాయకత్వాన్ని బలపర్చాలి: బండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నారైలు ఎన్నికలప్పుడు భారతదేశానికి వచ్చి ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలప రచాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ(అఫ్ బీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్నియ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడటం తప్ప అభివృద్ధి చేసిందేమీలేదని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేస్తామని కేంద్ర హోంమంత్రి ప్రకటించడంపై తెలంగాణ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. కార్యక్రమంలో అఫ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు అనుగుల కృష్ణారెడ్డి, తెలంగాణ అఫ్–బీజేపీ కన్వినర్ విలాస్‌రెడ్డి, సంతోష్ రెడ్డి, తుమ్మల శ్రీకాంత్‌రెడ్డి, యంజాల వంశీ, కట్టా ప్రదీప్‌రెడ్డి, మధుకర్, సముద్రాల గోపి, అమెరికన్ తెలుగు అసోసియేషన్, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్, మన అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇతర తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్మెంట్.. డాక్టర్‌బాబు సందడి
ఈ మధ్య సెలబ్రిటీలు పెళ్లి, నిశ్చాతార్థం లాంటి వాటితో బిజీ అయిపోతున్నారు. ఈ మధ్య సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె రూట్ లోనే ప్రముఖ తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ వేడుకలో డాక్టర్‌బాబు.. అదేనండి నిరూపమ్ తోపాటు పలువురు సందడి చేశారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?) తెలుగు ప్రేక్షకులు సినిమాలని ఎంత ఆదరిస్తారో.. సీరియల్స్‌ని అంతకంటే ఎక్కువగా చూసేస్తుంటారు. అలా ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన ముద్దమందారం, ముత్యమంత ముద్దు లాంటి సీరియల్స్‌తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కృష్ణా రెడ్డి ప్రస్తుతం పలు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. ఇప్పుడు అతడు స్వాతి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. బహుశా ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా ఉండొచ్చు. ఈ వేడుకలో పలువురు సీరియల్ స్టార్స్ సందడి చేసి, కొత్త జంటని ఆశీర్వాదించారు. (ఇదీ చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!) -
అసంతృప్తి ఆగేనా.. అభ్యర్థి గెలిచేనా?
హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి.. అది దక్కని ఆశావహులు అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థుల విజయానికి కృషి చేస్తారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టికెట్ నీకా? నాకా ? అన్నట్లు పోరాడిన వారు తమకు దక్కని టికెట్ ఇతరులకు దక్కితే వారితో కలిసి పనిచేయడం అసాధ్యమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధిష్టానం మాట కాదనలేక కలిసి పని చేయగలమని తలాడించినప్పటికీ, నిజంగా క్షేత్రస్థాయిలో ఏమేరకు పని చేయగలరన్నది వేచి చూడాల్సిందే. ఉదాహరణకు ఉప్పల్ అభ్యర్థికి టికెట్ రాకుండా చివరి నిమిషం వరకు ప్రయత్నం చేసిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రస్తుత ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఎన్నికల్లో బండారి లక్ష్మారెడ్డి గెలుపు కోసం పనిచేయగలరా? అని స్థానికులే ప్రశ్నిస్తున్నారు. అలాగే.. అంబర్‌పేటలో టికెట్ కోసం ప్రయత్నించిన ఎడ్ల సుధాకర్, కాలేరు వెంకటేశ్‌కు టికెట్ ఇవ్వొద్దని బ్యానర్లు కట్టి డిమాండ్ చేసిన తాజా, మాజీ కార్పొరేటర్లు, తదితరులు ఆయన విజయానికి పనిచేస్తారా? అనే సందేహాలున్నాయి. ముషీరాబాద్‌లో ఎమ్మెన్ శ్రీనివాసరావు, ఆయన అనుయాయులు ముఠాగోపాల్ కోసం పనిచేస్తారా? అనేది అంతుచిక్కడం లేదు. కంటోన్మెంట్‌లోనూ టికెట్ కోసం కడదాకా పోరాడిన గజ్జెల నగేష్, మన్నె క్రిశాంక్, శ్రీగణేశ్ లాస్యనందితకు సహకరించగలరా అన్నది సందేహాస్పదమే. వీరిలో శ్రీగణేశ్ ఇప్పటికే ఇండిపెండెంట్‌గానైనా సరే పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మహేశ్వరం టికెట్ రాని పక్షంలో తీగల కృష్ణారెడ్డి పార్టీ మారతారని ఎప్పటినుంచో వినిపిస్తోంది. ఎల్బీనగర్ నుంచి ముద్దగోని రామ్మోహన్‌గౌడ్, రాజేంద్రనగర్ టికెట్ కోసం ప్రయత్నించిన ఎంపీ రంజిత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి, శేరిలింగంపల్లిలో టికెట్ తనకే వస్తుందని భావించిన బండి రమేశ్ తదితరులు ఎంపికై న అభ్యర్థుల కోసం ఏమేరకు కృషి చేస్తారో చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో టికెట్ దక్కించుకున్న వారు అసంతృప్తులను తమ దారికి తెచ్చుకోగలరా.. వారి నడుమ సఖ్యత సాధ్యమేనా.. అన్నది కాలమే తేల్చనుంది. -
నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి చెబుతున్నది తప్పు: వివేకా పీఏ కృష్ణారెడ్డి
సాక్షి, కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సీబీఐ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇక, ఈ కేసును ఏళ్ల తరబడి విచారించిన సీబీఐ ఏకంగా ముగ్గురు విచారణాధికారులను నియమించింది. తొలి చార్జిషీటు దాఖలు చేసేందుకు ఏకంగా 474 రోజులు తీసుకుంది. మరోవైపు ఈ కేసు విషయంలో వివేకా పీఏగా పనిచేసిన కృష్టారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వివేకా హత్య కేసులో నాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడటం సరికాదు. శివశంకర్ రెడ్డి మా ఇంట్లో ఉన్నట్టు చెబుతున్నది అవాస్తవమని ఖండించారు. ఇది కూడా చదవండి: వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్’ సంచలన కథనం -
లోకేశ్ యాత్రలో బీద జ్యోతి ఎంట్రీతో అయోమయం
కావలి టీడీపీ ఆది నుంచి చుక్కాని లేని నావలా ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే కావలిలో గెలిచింది. జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఒకసారి, తర్వాత మరోసారి మాత్రమే అత్తెసరు ఓట్లతో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి ఆ పార్టీ రాజకీయ కల్లోలాన్ని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో పార్టీని నడిపించేందుకు బీద రవిచంద్ర రాజకీయ డ్రామాకు తెర తీశారు. నాలుగేళ్లుగా పార్టీని నడిపించేందుకు మాలేపాటిని వాడుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపి పార్టీకి ఫండ్ ఇప్పించి కావ్యను ఊరించారు. చివరికి రవిచంద్ర భార్య జ్యోతిని ఎంట్రీ చేయించి ట్విస్ట్ ఇచ్చాడు. తాజా పరిణామాలు ఆ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. నేటి లోకేశ్ బహిరంగ సభకు జన సమీకరణపై అయోమయం నెలకొంది. నెల్లూరు: ఉనికి కోల్పోయిన టీడీపీని బతికించాలని లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రతో కావలిలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి కనిపిస్తోంది. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో బీద సోదరులు రాజకీయంగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు. టీడీపీలో బీద మస్తాన్‌రావు అండతో ఆయన సోదరుడు బీద రవిచంద్ర రాజకీయంగా ఎదిగాడు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీ విజయాలను తన విజయాలుగా భ్రమింపచేశారు. 2009లో బీద మస్తాన్‌రావు ఎమ్మెల్యే అయినప్పటికీ వ్యాపార వ్యవహారాల్లో తలమునకలై ఉండడంతో బీద రవిచంద్ర కావలిలో షాడో ఎమ్మెల్యేగా హడావుడి చేశాడు. ఆ సమయంలోనే రవిచంద్ర నియోజకవర్గంలో తన కోటరీని సృష్టించుకున్నాడు. కావలి టికెట్‌పై ఆశలు పెంచుకుని 2014 ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేశాడు. అయితే టికెట్ తన సోదరుడు బీద మస్తాన్‌రావుకే ఇవ్వడంతో పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని హామీ ఇవ్వడంతో మిన్నకుండిపోయాడు. ఆ ఎన్నికల్లో బీద మస్తాన్‌రావు ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా తన సతీమణిని బరిలోకి దింపాలని తెరవెనుక రాజకీయం నెరిపినా.. చివరికి మస్తాన్‌రావు తన పలుకుబడి ఉపయోగించి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిని బరిలోకి దింపడంతో రవిచంద్ర ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత బీద మస్తాన్‌రావు, విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీకి దూరం కావడంతో కావలి బాధ్యతలను రవిచంద్రకు అప్పగించారు. 2019లో ఓటమి తర్వాత.. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడం, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ఈ దశలో పార్టీని నడిపించేందుకు మాలేపాటిని కావలి నియోజవకర్గ ఇన్చార్జిగా నియమించి రాబోయే ఎన్నికల్లో టికెట్ నీదేనంటూ నాలుగేళ్లుగా వాడుకున్నాడు. అయినప్పటికీ పెత్తనమంతా బీద తన చెప్పు చేతుల్లోనే పెట్టుకున్నాడు. కావ్యకు టికెట్ ఆశలు తన జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కాకపోయినా.. కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిని అనిపించుకోవాలని తహతహలాడుతున్న దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ( కావ్య కృష్ణారెడ్డి) ఈ పార్టీ.. ఆ పార్టీ అని తేడా అన్ని పార్టీల్లో ప్రయత్నించారు. ఇతను అయితే పార్టీకి ఉపయోగపడుతాడు.. చివరి వరకు వాడుకోవచ్చునని పార్టీ పెద్దలతో మాట్లాడించి అతనికి టికెట్ ఆశలు రేపాడు. దీంతో కావ్య కృష్ణారెడ్డి చేత పార్టీకి మహానాడులో ఫండ్ ఇప్పించాడు. కావలి టికెట్ తనకే అంటూ ఇటు మాలేపాటి, అటు కావ్య ఇద్దరూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నా.. అధిష్టానం నుంచి ఎటువంటి స్పష్టత లేదు. యువగళంలో బీద సతీమణి ఎంట్రీ ట్విస్ట్ కావలిలో లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేయడానికి రవిచంద్ర పెట్టిన సమావేశంలో మాలేపాటి సుబ్బానాయుడు అంతా భారం తనపైనే వేయాలని, ఏ ఒక్కరిని భాగస్వామ్యం చేయొద్దని ఖరాఖండిగా చెప్పారు. లోకేశ్ పాదయాత్ర ఏర్పాట్లు, ఖర్చు అంతా కూడా మాలేపాటి చూసుకుంటారు, ఎవరూ ఎక్కడా జోక్యం చేసుకోవద్దని నాయకులకు చెప్పేశాడు. దీంతో వీరిద్దరూ సైలెంట్ అయిపోయారు. లోకేశ్ యాత్ర కావలి నియోజకవర్గంలోకి అడుగుపెట్టే సమయానికి కాలు బాధతో రెస్ట్‌లో ఉన్న బీద తన సతీమణి జ్యోతిని ఎంట్రీ చేయించారు. లోకేశ్ యాత్రలో ఆమె అంతా తానై వ్యవహరిస్తుండడంతో అంతా అయోమయం నెలకొంది. గతంలోనే తన సతీమణికి టికెట్ ఇప్పించుకోవాలని చూశారు. కావ్య, పసుపులేటి కేవలం టికెట్ ఇస్తేనే ఉంటారు.. లేదంటే బయటకు పోతారు. కానీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రవిచంద్రను కాదని మరెవరికి టికెట్వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తన సతీమణిని రంగంలోకి దింపడానికే యువగళంలో బీద జ్యోతిని ఎంట్రీ ఇప్పించాడని ప్రచారం. అయితే సోమవారం కావలిలో లోకేశ్ బహిరంగ సభకు జన సమీకరణకు ఉత్సాహంగా ఉన్న నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. నేటి లోకేశ్ సభ పరిస్థితిపై అయోమయం నెలకొంది. -
మైనింగ్ డాన్ కావ్య కృష్ణారెడ్డికి ముకుతాడు
పాతికేళ్ల క్రితం అతనో కామర్స్ అధ్యాపకుడు. తాను ఉండే ఇంటికి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి.. జలదంకి ఎంపీపీగా ఎన్నికై మైనింగ్ డాన్‌గా ఎదిగాడు. రియల్ ఎస్టేట్ నుంచి క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి అడ్డదారులు తొక్కుతూ అతి తక్కువ కాలంలోనే వేల కోట్లకు అధిపతి అయ్యాడు. ఆయనే గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ యజమాని డీవీ కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి. ఇన్నాళ్లు తెరచాటుగా సాగిస్తున్న అతని అవినీతి బాగోతం ఇటీవల సమాచారహక్కు చట్టంతో బయటపడింది. ‘స్పందన’ ఫిర్యాదుతో వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వం అతని అక్రమాలపై విచారణ జరిపి రూ.140 కోట్ల జరిమానా విధించి ఆ మైనింగ్ డాన్ దురాగతాలకు ముకుతాడు వేసింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జలదంకి మండలానికి చెందిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ యజమాని డీవీ కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి 2008లో రోడ్డు మెటల్ పేరుతో లీజుకు తీసుకున్న క్వారీలే అడ్డాగా సమీపంలోని అనధికార భూముల్లో మెటల్ తవ్వేసి వందల కోట్ల రూపాయల దోపిడీకి తెరతీశాడు. పదేళ్ల కాలపరిమితికి లీజుకు తీసుకుని గడువు ముగిసి ఐదేళ్లు దాటిపోయినా యథేచ్ఛగా మైనింగ్ చేస్తున్నాడు. క్వారీ మైనింగ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్లు, కూలీల నివాసాలు, పెట్రోల్ బంకుల వంటివి ఏర్పాటు చేశాడు. అక్రమాలను తరచి చూస్తే.. గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరు మీద డీవీ కృష్ణారెడ్డి, డి.కవిత పేరుతో జలదంకి మండలం గట్టుపల్లిలో సర్వేనంబర్ 1015లో 9.47 ఎకరాల భూమిని రోడ్డు మెటల్ తవ్వకానికి పదేళ్ల కాలపరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్ లీజు హక్కులు పొందాడు. అదే మండలం అన్నవరంలో సర్వేనంబర్ 851/2పీలో 5.36 ఎకరాల భూమిని రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరుతో రోడ్డు మెటల్ తవ్వకానికి 10 ఏళ్ల కాలపరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్ లీజు హక్కులు పొందాడు. అయితే గట్టుపల్లి క్వారీలో టన్ను మెటల్ కూడా తవ్వకుండా అక్కడే క్రషర్లు, పెట్రోల్ బంకు, కూలీల నివాస భవనాలు, కార్యాలయం వంటివి ఏర్పాటు చేశాడు. అయితే ఈ క్వారీ నుంచి 28 వేల క్యూబిక్ మీటర్ల మెటల్ రవాణాకు పర్మిట్లు జారీ చేయడం గమనార్హం. ఈ క్వారీకి సంబంధించి పదేళ్ల లీజు కాలపరిమితి 2018 ఫిబ్రవరి 25వ తేదీ నాటికే పూర్తయితే 15 ఏళ్ల లీజు కాలపరిమితి పెంచమని ప్రతిపాదిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది మైనింగ్‌శాఖ వద్ద పరిశీలనలో ఉండడంతో ఆ లీజు కొనసాగుతూనే ఉంది. గట్టుపల్లి క్వారీ పక్కనే ఉన్న ఇతరుల భూములు, ప్రభుత్వ భూముల్లో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్‌ను అక్రమంగా తవ్వేసినట్లు ఇటీవల మైనింగ్‌శాఖ తనిఖీల్లో బట్టబయలైంది. అన్నవరం క్వారీకి లీజు గడువు పెంచమనే అభ్యర్థనను కూడా మైనింగ్ శాఖ తిరస్కరించింది. అన్నవరం క్వారీతోపాటు పక్కనే ఉన్న భూముల్లో కూడా అక్రమంగా మైనింగ్ చేపట్టి 5 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్‌ను తవ్వేసినట్లు వెలుగుచూసింది. ఈ క్వారీ లీజు గడువు ముగిసినప్పటికీ గత ఐదేళ్లుగా గట్టుపల్లి క్వారీ పరి్మట్తోనే విచ్చలవిడిగా మైనింగ్ చేపట్టాడు. మొత్తంగా 12 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్‌ను అక్రమంగా తవి్వనట్లు మైనింగ్ శాఖ లెక్కలు తేల్చింది. అక్రమంగా తవ్వేసిన మెటల్ విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.200 కోట్లు ఉంటుందని, మార్కెట్ ధర ప్రకారం రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. కావ్య కృష్ణారెడ్డి అక్రమాలపై స్థానికులు సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా సదరు వ్యక్తులు ‘స్పందన’లో ఫిర్యాదు చేయడంతో అక్రమాల బాగోతం బయటపడింది. కరెంట్ బిల్లు ఆధారంగా.. గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్, రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరుతో తీసుకున్న లీజు క్వారీల్లో అక్రమ మైనింగ్ జరగలేదని తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. క్రషర్లకు వినియోగించిన కరెంట్ బిల్లుల ఆధారంగా లెక్కలు తీయగా, 89 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగించినట్లు తేలింది. టన్ను మెటల్ ప్రాసెస్ చేయడానికి 2.5 యూనిట్లు ఖర్చవుతుందని, ఆ మేరకు 12 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్‌ను అక్రమంగా తవ్వేసినట్లు నిర్ధారించారు. చితికిన ప్రాణాలు అక్రమ మైనింగ్ వాహనాల కింద పడి పదేళ్ల కాలంలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. నిత్యం వందలాది వాహనాల్లో రోడ్మెటల్ నుంచి పెద్ద బండరాళ్లు, కంకర, మట్టి లాంటి సహజ వనరులను లూటీ చేశారు. ఈ అక్రమ రవాణా వాహనాల కిందపడి పలువురు ప్రాణాలు కోల్పోయినా ఎలాంటి కేసులు లేకుండా భయపెట్టి రాజీచేసి పంపించేవారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనధికార బ్లాస్టింగ్లు చేస్తూ ఊరినే వణికిస్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులను ప్రలోభపెట్టి.. అక్రమ మైనింగ్‌కు స్థానిక రెవెన్యూ, పోలీస్, మైనింగ్‌శాఖల సహకారం ఉన్నట్లు ఆ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అనుమతి లేని అక్రమ మైనింగ్‌పై ఎన్నోమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించిన దాఖలాలు లేవని చెబుతున్నారు. ఈ అక్రమాల గురించి ప్రశ్నించిన వారిపై దాడులు చేయించడంతోపాటు ఇళ్లకు వెళ్లి బెదిరించేవారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా మధ్యస్తం చేసి పంపేవారని స్థానికులు పేర్కొంటున్నారు. గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లతో.. డీవీ కృష్ణారెడ్డి అక్రమాల దందా ఈనాటి కాదు. కొన్నేళ్ల క్రితమే నెల్లూరు పెన్నానది, నాయుడుపేటలోని స్వర్ణముఖి నదీతీరంలో గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లు ఏర్పాట్లు చేసి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఈ యూనిట్‌కు కంకర, సిమెంట్ కొనుగోలు చేసినా.. ఇసుకను మాత్రం నదీ తీరాల్లోనిదే వాడినట్లు సమాచారం. ఈ రెండు ప్లాంట్ల నుంచి నిత్యం వందల ట్యాంకర్ల కాంక్రీట్ మిక్సింగ్ వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. గతంలో ఇసుక ఉచితంగా ఉండడంతో రూపాయి ఖర్చు లేకుండా నదీతీరాలను తవ్వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీ అమలు చేసి ధర నిర్ణయించింది. అయితే గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లలో ఈ నాలుగేళ్లలో ఎంత ఇసుక వినియోగించారు.. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే వివరాలను పరిశీలిస్తే అందులోని అక్రమాలు కూడా బట్టబయలయ్యే అవకాశం ఉంది. ఈ రెండు క్రషర్ల వద్ద కరెంట్ వినియోగాన్ని లెక్కిస్తే మరికొన్ని నిజాలు కూడా వెలుగుచూసే అవకాశం ఉంది. అక్రమాలపై తొమ్మిదేళ్లుగా పోరాటం గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్ యజమాని డీవీ కృష్ణారెడ్డి ఎన్నో ఏళ్లుగా సహజ వనరులను దోచుకుంటున్నాడు. అక్రమ మైనింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించాడు. మా గట్టుపల్లి పంచాయతీలో సహజ వనరులు దోచుకుంటున్నా ఒక్క రూపాయి కూడా పంచాయతీకి సీనరేజ్ చెల్లించేవాడు కాదు. అతని అక్రమాలపై తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తున్నా. అక్రమాలను ప్రశ్నించినందుకు మా కుటుంబంపై దాడులు చేయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నా తొమ్మిదేళ్ల పోరాటానికి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం మద్దతుగా నిలిచింది. విచారణ జరిపి జరిమానా విధించడం ద్వారా అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్టపడింది. – గుమ్మలపాటి సుబ్బారావు, ఉప సర్పంచ్, గట్టుపల్లి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ ద్వారా గట్టుపల్లి పంచాయతీలో దోపిడీ చేస్తున్నారు. అనుమతు లు లేకుండా సహజ వనరులను దోచుకుంటున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గ్రామస్తులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మైనింగ్ అక్రమాలపై చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. – దివి నరేంద్రచౌదరి, గట్టుపల్లి, జలదంకి మండలం -
నర్రెడ్డి సోదరులు చెప్పినట్టే చేశా: కృష్ణ రెడ్డి
-
నర్రెడ్డి సోదరులు చెప్పినట్టే చేశా: వివేకా పీఏ కృష్ణారెడ్డి
సాక్షి ప్రతినిధి, కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందాక ఆయన అల్లుడు.. బావమరిది నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, అతని సోదరుడు నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డిలు చెప్పినట్టే చేశానని వివేకా పీఏ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పెద్దోళ్లు కనుక వారు చెప్పినట్టే చేయాల్సి వచ్చిందన్నారు. ‘వారు చెప్పినట్లు చేయకపోతే నువ్వు కూడా జైలుకు వెళ్తావు’ అని వివేకా కుమార్తె సునీతమ్మ కూడా చెప్పడంతో వారి సూచనల మేరకు నడుచుకున్నానని పునరుద్ఘాటించారు. వివేకా మృతదేహాన్ని చూడగానే తనకొచ్చిన సందేహాలన్నింటినీ వారికి స్పష్టంగా వివరించానని, అయినా వారి మార్గనిర్దేశం మేరకే వ్యవహరించానని ఇటీవల ఆయన ఓ టీవీ చానల్(ఎన్టీవీ)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి ఘటన అనంతర పరిస్థితిని పూసగచ్చినట్లు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. రోజూలాగే ఆ రోజూ వెళ్లాను నేను 30 ఏళ్లకు పైగా వివేకా సార్ వద్ద పని చేస్తున్నాను. ప్రతిరోజు 5.30 గంటలకు సార్ ఇంటికి వెళ్లే అలవాటు. ఆ రోజు కూడా అలాగే వెళ్లాను. ఆయన నిద్ర లేచి ఉంటే హాలులో లైట్ వేస్తారు. వాచ్మెన్ రంగన్న పడుకొని ఉన్నాడు. సార్ ఇంకా లేవలేదని బయటికి వచ్చి, వీధిదీపం కింద ఐదు నిమిషాలు ఆంధ్రజ్యోతి పేపర్ తిరగేశాను. వివేకా సతీమణి సౌభాగ్యమ్మకు ఫోన్ చేశాను. ‘సార్ లేట్‌గా వచ్చి ఉంటాడులే.. కొద్దిసేపు పడుకోని’ అని ఆమె సూచించారు. తిరిగి పేపర్ చదువుతుండగా.. వంట మనిషి లక్ష్మి, ఆమె కుమారుడు వచ్చారు. సార్ ఇంకా లేవలేదా? అని అడిగారు. ‘రాత్రి లేట్‌గా వచ్చి ఉంటారు.. లేప వద్దని మేడమ్ చెప్పింది’ అని చెప్పాను. కొద్ది సేపటి తర్వాత.. సార్ లేవకపోతే లేపాలి కదా.. మళ్లీ ఎందుకు లేపలేదు.. అని అరుస్తారని వంటమనిషి లక్ష్మిని బెడ్ రూమ్ సైడుకు వెళ్లి పిలవాలని చెప్పాను. లక్ష్మి బెడ్రూము వద్దకు వెళ్లి పిలిచి వచ్చే సమయంలో వాచ్మెన్ రంగన్న లేచి.. బెడ్‌షీట్‌ను సందులో పెట్టి ఉత్తరం వైపు ఉండే గార్డెన్ వైపు వెళ్లిపోయాడు. అంతలోనే వాచ్మెన్ రంగన్న పరుగెత్తుకుంటూ వచ్చి సార్ పడిపోయాడని చెప్పాడు. నేను వంటమనిషి కుమారుడు ప్రకాశ్ నార్త్ సైడ్ వాకిలి గుండా లోపలికి పరుగెత్తాము. లోపలికి వెళ్లి చూస్తే అంతా రక్తమే ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బెడ్ రూం అంతా రక్తం. భయం వేసింది. ఏసీ, లైట్ ఆన్‌లో ఉంది. సార్ మాత్రం బెడ్‌పై లేడు. బాత్రూములో పడిపోయి ఉన్నాడు. నాడి పట్టుకుని చూశా. తలపై గాయం కనిపిస్తోంది. నాతోపాటు ఉన్న ప్రకాశ్‌తో మన సార్ మనకు లేడని చెప్పా. బయటికి వచ్చి వివేకా సార్ అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేశాను. ‘బావ ఇక మనకు లేడు. ఎవరో ఏదో చేశారు. ఏదో జరిగింది. తలపై గాయం కనిపిస్తోంది. ఇల్లంతా రక్తం ఉంది’ అని చెప్పాను. తర్వాత ఆయన సోదరుడు శివప్రకాశ్‌రెడ్డికి కూడా అదే చెప్పాను. తర్వాత కొద్ది సేపటికి వైఎస్ వివేకా మొబైల్ సోఫాలో కనిపించింది. సైలెంట్లో ఉంది. ఏదో ఫోన్ రావడంతో రింగ్ అవుతున్నట్లు గుర్తించి, జేబులో పెట్టుకున్నాను. బెడ్ ముందు ఉన్న వీల్ చైర్ ముందు ఓ పేపరు పడి ఉంది. ప్రకాశ్, నేను దాన్ని ఓపెన్ చేసి చూశాము. అందులో సార్ రాసిన మ్యాటర్ ఉంది. ఆ లెటర్లో అక్షరాలు అంత క్లియర్‌గా లేవు. బాగా పరిశీలిస్తే ‘డ్రైవర్ ప్రసాద్ నిన్న డ్యూటీకి త్వరగా రమ్మన్నందుకు నన్ను కొట్టి చంపాడు. మీరు డ్రైవర్ ప్రసాద్‌ను వదిలి పెట్టవద్దు’ అని రెండుసార్లు రాసి ఉంది. కింద వైఎస్ వివేకా అని ఉంది. లెటర్‌ను ఎవరికీ చూపించొద్దన్నారు ఆ లెటర్ విషయం వెంటనే అల్లుడు రాజశేఖరరెడ్డికి తెలియజేశాను. ‘ఆ లెటర్‌ను జాగ్రత్తగా దాచి పెట్టు.. ఎవరికీ చూపించవద్దు’ అన్నాడు. నేను పోలీసులతో ప్రాబ్లమ్ అవుతుంది కదా అని అడగాను. ‘అదంతా నేను వచ్చిన తర్వాత మాట్లాడతా. నీకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. నేను వచ్చాక పోలీసులకు ఇస్తాను. అప్పటి దాకా దాచి పెట్టు’ అని చెప్పాడు. ఈ విషయంగా శివప్రకాశ్‌రెడ్డికి కూడా తెలియజేసి.. నాకు దిక్కుతోచడం లేదని చెప్పాను. తర్వాత కొద్ది సేపటికి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి వచ్చాడు. నేనే ఆయన్ను లోపలికి పిలుచుకుని వెళ్లాను. అవినాశ్ రెడ్డితోపాటు శివశంకర్‌రెడ్డి, సురేంద్రనాథ్‌రెడ్డి మరి కొంత మంది ఉన్నారు. తర్వాత అవినాశ్‌రెడ్డి సార్ బయటికి వచ్చి లాన్లో ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ తర్వాత వైఎస్ అవినాష్‌రెడ్డి చిన్నాన్న, పెద్దనాన్న, కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు అక్కడికి వచ్చారు. నేను రంగన్న పిలిచి దబాయిస్తే, రాత్రి దోశలు తిని నిద్రయానని చెప్పాడు. పోలీసులకు చెప్పేద్దామంటే వినలేదు గుండెపోటు విషయం ఎవరు ఎలా చెప్పారో తెలియదు. లెటర్, రక్తాన్ని బట్టి వైఎస్ వివేకాను ఎవరో ఏదో చేశారని నేను భావించాను. కొద్ది సేపటికి సీఐ శంకరయ్య, ఎర్రగంగిరెడ్డి వచ్చారు. ఎర్ర గంగిరెడ్డి రావడంతోటే బ్లడ్ వాంటింగ్ చేసుకున్నాడని చెప్పాడు. బాత్రూములో గోడకు ఆరు, ఏడు అడుగులు రక్తం చిమ్మిందని చెప్పగా.. బేసిన్‌కు తల కొట్టుకుని రక్తం వచ్చి ఉంటుందిలే అన్నాడు. ఈ విషయంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామా అంటే ఏం అవసరం లేదులే అన్నాడు. ఎర్రగంగిరెడ్డి ఇలా చెబుతున్నాడని నేను నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి చెప్పాను. పక్కన సీఐ ఉన్నాడని మాట్లాడాలని ఫోన్ సీఐకి ఇచ్చాను. వాళ్లిద్దరు మాట్లాడుకున్నారు. రాజశేఖరరెడ్డి స్టేషన్లో కంఫ్లైంట్ రాసివ్వాలని సూచించారు. కొద్దిసేపటికి ఎర్రగంగిరెడ్డి.. కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాకు ‘లక్షుమ్మను రమ్మను.. బక్కెట్‌తో నీళ్లు తీసుకుని ఇదంతా క్లీన్ చేయాలి’ అని చెప్పాడు. లక్షుమ్మ సగం క్లీన్ చేసి.. కళ్లు తిరుగుతున్నాయని చెప్పి వెళ్లిపోయింది. తర్వాత తన వద్ద పనిచేసే పిల్లలు రాజశేఖర్, ట్యాంకర్ బాషాతో ఇనాయితుల్లా క్లీన్ చేయించారు. సార్ డెడ్‌బాడీ బాత్రూము నుంచి తేవడానికి ఎర్రగంగిరెడ్డితో కలిసి నలుగురు వెళ్లారు. తర్వాత అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు బాగా కొట్టారు అవినాష్‌రెడ్డి ఉదయాన్నే వచ్చి వెళ్లాడు.. మళ్లీ రాలేదు. రక్తం శుభ్రం చేసే సమయంలో ఆయన లేరు. నేను సీఐ చెప్పినట్లు కంప్లైంట్ రాసిచ్చి ఆస్పత్రికి వెళ్లాను. అక్కడి నుంచి ఇంటికి వెళ్లి.. నా భార్యను తీసుకొచ్చి పోస్టుమార్టం రూమ్ వద్ద సార్‌ను చూపించాను. తర్వాత సార్ డెడ్ బాడీని ఇంటి వద్దకు తెచ్చారు. అప్పుడు లెటర్‌ను నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చాను. తర్వాత 15 నిమిషాలకు ఆ లెటర్‌ను ఎస్పీకి అందజేశానని, నీకు ఇబ్బంది లేదని రాజశేఖర్‌రెడ్డి చెప్పాడు. సాయంత్రం 4 – 4.30 గంటల ప్రాంతంలో నన్ను పోలీసులు తీసుకు వెళ్లి జేఎన్టీయూ గెస్ట్‌హౌస్‌లో పెట్టారు. అక్కడి నుంచి నాతోపాటు మరికొందరిని వేముల పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం కడప డీటీసీకి తీసుకెళ్లి 13 రోజులు పెట్టుకుని అందరినీ కొట్టారు. తర్వాత నాతోపాటు ప్రకాశ్, ఎర్రగంగిరెడ్డిని ముద్దాయిలుగా చూపిస్తూ రిమాండ్‌కు తరలించారు. మూడు నెలలు జైలులోనే ఉన్నాం. మద్యమధ్యలో సునీతమ్మ, రాజశేఖర్‌రెడ్డి వచ్చి మాట్లాడిపోయే వారు. మేము బయటికి వచ్చిన కొద్దిరోజుల తర్వాత కేసు సీబీకి బదిలీ చేశారు. తర్వాత సునీత, రాజశేఖరరెడ్డి.. సీబీఐకి సహకరించాలని చెప్పేవారు. అప్పటి నుంచి సీబీఐ అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్లి వచ్చాం. సీబీఐ వాళ్లూ కొడతారనుకోలేదు సీబీఐ వాళ్లు ఢిల్లీకి రావాలని చెప్పారని నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి తెలియజేశాను. వెళ్లమని చెప్పి.. టికెట్ ఆయనే తీసిచ్చాడు. వారికి సహకరించాలని సూచించాడు. ఢిల్లీలో వాళ్లు నెల రోజులు పెట్టుకున్నారు. మధ్యలో రాంసింగ్ వచ్చి ‘నేను చెప్పినట్లు చెబుతావా? లేదా? వైఎస్ అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలు మిమ్మల్ని మ్యానేజ్ చేశారు. ఆ విషయం మీరు చెప్పడం లేదు. మేము చెప్పినట్లు చెప్పకపోతే జైలుకు పంపుతాం’ అని బెదిరిస్తూ కొట్టేవారు. సీబీఐ అధికారులు ఇలా కొడతారని ఊహించలేదు. నెల తర్వాత నన్ను పంపించేశారు. ఆ తర్వాత నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీతలు నన్ను హైదరాబాదుకు రమ్మని పిలిచారు. అక్కడికి వెళ్లాక ‘నువ్వు రాంసింగ్ సార్ ఎలా చెబితే అలా చేయాలి. లేకపోతే ఇబ్బందుల్లో పడతావు, నువ్వు సహకరిస్తే నిన్ను సేవ్ చేస్తాం. ఇదొక్కటే మార్గం’ అని చెప్పారు. మధ్యమద్యలో నర్రెడ్డి రాజశేఖరరెడ్డి.. అవినాశ్ మ్యానేజ్ చేశాడని చెప్పమన్నారు. నిజం చెబితే కొడతారేంటి? ‘దస్తగిరి, రంగన్నలు మేము చెప్పినట్లు విన్నారు. నువ్వు కూడా చెప్పినట్లు వింటే సేవ్ చేస్తా’ అని రాంసింగ్ తెలిపారు. తెల్లవారగానే నీ ఇద్దరు కుమారులతో కలిసి కడపలోని కేంద్ర కారాగార గెస్ట్‌హౌస్‌కు రావాలని సూచించారు. నేను ఈ విషయం నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పగా, వెళ్లాలని సూచించాడు. హైదరాబాదులోని పిల్లలను పిలిచించి ఉదయం 11 గంటలకు వారితో కలిసి వెళ్లాను. మేము చెప్పినట్లుగా సహకరించాలని కోరారు. ఇందుకు నేను మరోమారు అభ్యంతరం చెబుతూ.. నాకు తెలిసిన విషయాలన్నీ చెబుతానని చెప్పాను. దాంతో ఆయన కట్టె తీసుకుని నన్ను కొట్టాడు. నిజం చెబితే కొడతారా? అంటూ మా పిల్లలు అడ్డుతగిలారు. సాయంత్రం వరకు నన్ను అక్కడే పెట్టుకుని బూతులు తిట్టి పంపారు. మళ్లీ పిలిచి నప్పుడు కూడా ఇలాగే మాట్లాడితే నీ కథ ఉంటాదని హెచ్చరించారు. చెప్పినట్లు వినలేదని పెళ్లి ఆపించేశారు అప్పటికి వారం రోజుల్లో నా చిన్న కుమారుడి పెళ్లి. సీబీఐ వాళ్లకు నేను సహకరించలేదని నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, సునీతకు కోపం వచ్చింది. వారు పెళ్లి కుమార్తె వారికి ఫోన్ చేసి ‘కృష్ణారెడ్డి హత్య కేసులో ఉన్నాడు. వైఎస్ అవినాష్‌రెడ్డికి సహకరించాడు. త్వరలో ఆస్తులు స్వాధీనం చేసుకుంటారు. ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోండి’ అని ఫోన్ చేసి చెప్పారు. నాకు విషయం తెలిసి నేను నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి వద్దకు వెళ్లగా సరైన స్పందన లేదు. పెళ్లి క్యాన్సిల్ అయితే కానీ అని నేను నిజాన్ని నిర్భయంగా చెప్పాలని భావించాను. ఆ తర్వాత నా కుమారుడు అమెరికా వెళ్లాడు. నేను ప్రాణ రక్షణ కల్పించాలని ఎస్పీకి వినతి పత్రం ఇవ్వబోతే ఆయన తీసుకోలేదు. అందుకే పులివెందుల కోర్టులో ప్రైవేటు కంప్లైంట్ వేశాను. దాని గురించి ఇప్పటివరకు అతీగతీ లేదు. నా పాస్‌పోర్టు రెన్యూవల్ కాకుండా ఆగిపోయింది. నా ప్రమోషన్ ఆగిపోయింది., నా కుమారుడు పెళ్లి ఆగిపోయింది. నేను వివేకాకు సేవ చేసినందుకు ఇస్తామన్న ఐదు ఎకరాల భూమి ఇవ్వలేదు. ఇలా అన్ని విధాలా నాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు సీబీఐ కొత్త బృందం వచ్చింది. వారికి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను. పారదర్శకంగా విచారణ జరిగితే అసలు దోషులెవరన్నది తెలుస్తుంది. వివేకాకు హైదరాబాద్, పులివెందుల, కడపల 200 ఎకరాలకు పైగా భూమి ఉంది. ఆ ఆస్తులన్నీ దాదాపు కంపెనీ పేరుపైనే ఉండేవి. అలాగైతే జైలుకెళ్లేది నువ్వేనని భర్తకు సునీత హెచ్చరిక అవినాశ్ నన్ను మేనేజ్ చేయడం ఏమిటని అప్పుడే గట్టిగా వ్యతిరేకించాను. అప్పుడు సునీత నాపై ఫైర్ అవుతూ ‘నువ్వు ఏమనుకుంటున్నావు.. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు’ అని హెచ్చరించారు. రాజశేఖరరెడ్డి నన్ను సముదాయించేలా భుజం తట్టాడు. నేను ఉన్నది ఉన్నట్లు చెబుతానన్నాను. ఆ సమయంలో సునీత.. రాజశేఖరరెడ్డిని ఉద్దేశించి నేను సహకరించకపోతే నర్రెడ్డి జైలుకు వెళ్తాడని చెప్పింది. ఆయనతో ఆమె అలా ఎందుకు అన్నాదో నాకు అప్పట్లో అర్థం కాలేదు. తర్వాత కొద్ది రోజులకు రాత్రి వేళ సీబీఐ అధికారి రాంసింగ్ నా సెల్‌కు మిస్డ్ కాల్ ఇచ్చారు. తర్వాత మా అబ్బాయితో ఫోన్ చేయించి (రాంసింగ్‌కు తెలుగు రానందున) మాట్లాడించాను.